Pyongyang
-
నేడు ఉత్తర కొరియాకు పుతిన్
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. కిమ్ ఆహా్వనం మేరకు పుతిన్ మంగళ, బుధవారాల్లో తమ దేశంలో పర్యటించనున్నట్టు కొరియన్ సెంట్రల్ అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనను ఇరు దేశాలు ««ధ్రువీకరించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించడం సంచలనమైంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రమైన దాడులు చేస్తుండటంతో రష్యాకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని, అందుకు బదులుగా రష్యా నుంచి అణు సాంకేతికతను పొందుతోందని దక్షిణ కొరియాతోపాటు అమెరికా ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. ఉత్తర కొరియాతో ఆయుధ వాణిజ్యం చేస్తే యూఎన్ తీర్మానాలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి. అయితే, ఉత్తర కొరియా, రష్యా ఈ కథనాలను ఖండించాయి. కాగా, రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో పర్యటించడం 24 ఏళ్లలో ఇది ప్రథమం. పుతిన్ మొదటిసారి జూలై 2000లో ఉత్తర కొరియాలో పర్యటించారు. మొదటి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, అప్పుడు ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌తో సమావేశమయ్యారు. పుతిన్ కోసం విలాసవంతమైన వేడుక 1991లో సోవియట్ పతనం తర్వాత ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు బలహీనపడ్డాయి. కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా 2019లో రష్యాలోని తూర్పు నౌకాశ్రయం వ్లాడివోస్టాక్‌లో పుతిన్‌తో సమావేశమయ్యారు. మళ్లీ పుతిన్, కిమ్‌లు ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పుతిన్.. కిమ్‌కు హై–ఎండ్ ఆరస్సెనాట్ కారును పంపారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపేందుకు పుతిన్ కోసం విలాసవంతమైన వేడుకను కిమ్ సిద్ధం చేస్తున్నారు. రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఒక చౌరస్తాలో భారీ కవాతు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయని ఓ న్యూస్ వెబ్సైట్ విశ్లేíÙంచింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత పుతిన్‌ను స్వాగతించే దేశాలు తక్కువగా ఉన్నా.. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన కిమ్ విజయం అంటున్నారు ఉత్తరకొరియా రాజకీయ విశ్లేషకులు. మాస్కోతో ఆర్థిక, ఇతర సహకారాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. -
North korea: ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు
ప్యాంగ్యాంగ్: దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని ప్రకటించిన ఉత్తర కొరియా వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా ఆ దేశం మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. దానిపై నుంచి 240ఎమ్ఎమ్ బాలిస్టిక్ రాకెట్ లాంచర్ షెల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంటట్రోల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఈ పరీక్ష కీలకం కానుందని నార్త్ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. జనవరిలోనూ పొరుగు దేశం దక్షిణ కొరియా సరిహద్దులోని ఓ ఐలాండ్‌లో ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించింది ఉత్తర కొరియా. దక్షిణ కొరియా తమపై దాడికి దిగితే ఆ దేశాన్నే లేకుండా చేస్తామని ఇటీవలే ఉత్తర కొరియా నియంతా కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి.. కాల్చేసే కాంతి పుంజం -
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు. కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్‌లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్‌తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. రైలులోనే ఎందుకు? గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్‌లో పుతిన్‌తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్‌కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. -
అణు క్షిపణులతో ఉత్తరకొరియా పరేడ్
సియోల్: ఉత్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించింది. గురువారం సాయంత్రం రాజధాని ప్యాంగ్యాంగ్లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ వీటిని తిలకించారు. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రష్యాతో బంధం మరింత బలోపేతమైందని చాటేందుకే కిమ్ పరేడ్‌ను వేదికగా మార్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత పేరుతో ప్యాంగాంగ్‌లో ఉన్న కిమ్–2 సంగ్ స్వే్కర్లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి లి హొంగ్జోంగ్లతో కలిసి ప్రదర్శనను కిమ్ వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సైనిక కవాతు మధ్య యుద్ధ ట్యాంకులు, భారీ ఖండాంతర క్షిపణు(ఐసీబీఎం)లతో కూడిన ట్రక్కులు కదులుతుండగా ముగ్గురూ చేతులు ఊపుతున్న ఫొటోలను అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ శుక్రవారం విడుదల చేసింది. కిమ్ ప్రసంగించిందీ లేనిదీ వెల్లడించలేదు. క్షిపణి వ్యవస్థలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నిఘా, అటాక్ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ఈ ఐసీబీఎంలన్నీ రష్యా డిజైన్ల ఆధారంగా తయారైనవేనని విశ్లేషకులు అంటున్నారు. -
అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే..
ప్యోంగ్ యాంగ్: శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న మాటను నిజం చేస్తూ అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా నార్త్ కొరియాతో చేతులు కలిపాయి. నార్త్ కొరియా విక్టరీ డే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆహ్వానం మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా ప్రతినిధుల బృందంతో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జిబిషన్ పెరేడ్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నిషేధించబడిన క్షిపణులను ప్రతినిధి బృందానికి చూపించారు. ఈ సందర్భాంగా రష్యా, చైనా, నార్త్ కొరియా మధ్య ఏర్పడ్డ కొత్త స్నేహాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కిమ్ జోంగ్. అమెరికాతో శత్రుత్వం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ నిషేధించిన ఈ క్షిపణులను ప్రదర్శించి బలప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రూపంలో కిమ్ జోంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్ జోంగ్ కూడా తమ దేశానికి మిలటరీ ప్రతినిధులను పంపినందుకు రష్యా అధ్యక్షుడికి కృతఙ్ఞతలు తెలిపారు. కిమ్ జొంగ్ మాట్లాడుతూ.. మిలటరీ ప్రతినిధుల పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సంప్రదాయ సంబంధాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఒకే రకమైన ఆలోచనలతో రెండు దేశాల సార్వభౌమత్వం, అభివృద్ధి లక్ష్యంగా సామ్రాజ్యవాదుల కలయిక అంతర్జాతీయ శాంతి, సమన్యాయం నెలకొల్పే దిశగా ఫలప్రదంగా జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన రష్యా సైన్యం పైనా, ప్రజలపైన అపార నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ కూడా తమ సంతోషసన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ఈ మూడు దేశాలు అమెరికాకు గట్టి సంకేతాలనే పంపాయి. కానీ ఎక్కడా ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం ఇది కూడా చదవండి: ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే -
కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..?
ప్యోంగ్ యాంగ్: అమెరికాకు చెందిన సైనికుడు అక్రమంగా నార్త్ కొరియాలోకి చొరబడ్డాడన్న కారణంతో అతడిని బంధించింది అక్కడి సైన్యం. దీంతో నార్త్ కొరియా చెర నుండి అమెరికా సైనికుడు అసలు బయటపడతాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా అమెరికాకు చెందినవారు 18 మంది నార్త్ కొరియాలో బందీలుగా ఉన్నారు. కానీ అందులో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారంతా రెండు నెలల్లోనే విడుదలయ్యారు. ఎవరీ ట్రావిస్ కింగ్? అమెరికా సైనికుడు ట్రావిస్ కింగ్(23) విస్కాన్సిన్లో అమెరికా దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం 2021 జనవరిలో యూఎస్ ఆర్మీలో చేరిన కింగ్ కొన్ని నెలల క్రితం దక్షిణ కొరియాలో కూడా ఇలాగే అక్రమంగా చొరబడ్డాడు. రెండు నెలల పాటు అక్కడ జైలు జీవితం గడిపిన తర్వాత అతడిని టెక్సాస్ తిరిగి పంపించేయాలని నిర్ణయించాయి దక్షిణకొరియా వర్గాలు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అప్పటికే అమెరికా సైన్యం నుండి బహిష్కరించబడిన ట్రావిస్ కింగ్ వారి నుండి ఎలాగో తప్పించుకుని ఉభయ కొరియాలకు మధ్యలో పన్ముంజోన్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుండి ఉత్తర కొరియా చేరుకొని అక్కడ కోమ్ జోంగ్ బలగాలకు పట్టుబడ్డాడు. అతడు ఎందుకిలా దేశాటన చేస్తున్నాడన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. తిరిగొచ్చేనా? పెంటగాన్ వర్గాలు అసలు ట్రావిస్ నార్త్ కొరియా ఎందుకు వెళ్లాడన్న కోణం నుండి దర్యాప్తు ప్రారంభించింది. మరో పక్క ప్యోంగ్ యాంగ్, పెంటగాన్ వర్గాల నుంచి చర్చలకు పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది. అసలే అమెరికా ఉత్తర కొరియ మధ్య పచ్చగాడి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో అసలు అమెరికా సైనికుడిని వారు విడిచి పెడతారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ట్రావిస్ కింగ్ తల్లి కూడా తన కుమారుడు అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానని, వాడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కూడా అమెరికా నుండి 18 మంది నార్త్ కొరియాలోకి అక్రమంగా చొరబడగా వారిలో చార్లెస్ రాబర్ట్ జెన్కిన్స్ మినహాయిస్తే మిగతా వారందరిని రెండు నెలలలోపే తిరిగి పంపించేసింది. చార్లెస్ జెన్కిన్స్ ను మాత్రం 1965 లో అదుపులోకి తీసుకుని 2004లో విడుదల చేసింది. ఇది కూడా చదవండి: తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక -
ఆక్రమిత ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. చైనా చర్యల నేపథ్యంలో దేశ రక్షణ ప్రయోజనాలు సంపూర్ణంగా పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్‌లో భాగమేనన్నారు. చైనా ఇలాంటి వక్ర చర్యలకు బదులు ఘర్షణాత్మక అంశాలపై భారత్‌తో నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. -
20 రోజుల తర్వాత కనిపించిన కిమ్
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగార నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్ యో జోంగ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. -
ట్రంప్-కిమ్ పంచాయితీ..భారత్ పెద్దరికం
ప్యోంగ్యాంగ్: అగ్రరాజ్యం అమెరికా, తూర్పుఆసియా దేశం ఉత్తరకొరియాల మధ్య పంచాయితీ తీర్చడానికి భారత్ పెద్దరికం వహించనుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈమేరకు బుధవారం ప్యోంగ్యాంగ్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చరిత్రాత్మక భేటీపై నీలినీడలు కమ్ముకున్నవేళ భారత మంత్రి పర్యటన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సింగ్ ఎందుకు వెళ్ళారు?: అణ్వస్త్రాల నిరాయుధీకరణకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించిన కిమ్.. వైరిపక్షాలతో చర్చలకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించడం, జూన్ 12న సింగపూర్‌లో ట్రంప్-కిమ్ భేటీకి రంగం సిద్ధం కావడం తెలిసిందే. అంతలోనే అనూహ్యంగా ప్లేటు ఫిరాయించిన కిమ్.. సదరు చర్చలు ఏకపక్షంగా, కొరియాకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి కీలక దశలో చర్చల ప్రక్రియను నిలిపేయడం సరికాదని నచ్చజెప్పేందుకే భారత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపు తీర్మానంపై భారత్ సైతం సంతకం చేసినప్పటికీ.. మిగతాదేశాల మాదిరి దౌత్యసంబంధాలను మాత్రం తెంచుకోలేదు. ప్యోంగ్యాంగ్లో ఇప్పటికీ భారత దౌత్యకార్యాలయం కొనసాగుతున్నది. 2015లో ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించారు కూడా. ఉత్తరకొరియాతో సుహృద్భావ సంబంధాల నేపథ్యంలోనే భారత్.. ‘ట్రంప్-కిమ్‌ల చర్చ’ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కిమ్‌తో మాట్లాడుతారా?: ప్యోంగ్యాంగ్కు వచ్చిన భారత మంత్రికి ఉత్తరకొరియా మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ట్రంప్-కిమ్‌ల భేటీకి మార్గం సుగమమం చేయాలన్న లక్ష్యంతోనే ఆయన కొరియా ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు. అయితే, అధినేత కిమ్ జాంగ్‌తో వీకే సింగ్ మాట్లాడుతారా, లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
‘ఉత్తర కొరియా రెచ్చగొట్టొద్దు.. చర్చలకు రా’
వాషింగ్టన్: ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మానుకుంటే మంచిదని అమెరికా హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలే తప్ప రెచ్చగొట్టే చర్యలకు దిగితే మంచిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెంటగాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అంతర్జాతీయ ఒప్పందాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఉత్తర కొరియా సీరియస్‌గా చర్చలకు రావాలి. అసుస్థిర పరిస్థితులు కల్పించే యత్నాలు, రెచ్చగొట్టే చర్యలు ఆపేయాలి. ఉత్తర కొరియా చట్ట విరుద్ధంగా చేస్తున్న క్షిపణుల కార్యక్రమాలు అమెరికా జాతీయ భద్రతకు బెదిరింపుగానే భావిస్తున్నాం. ఈ విషయంలో ఇంతకంటే ముందుకు పోవడం మంచిది కాదు’ అని పెంటగాన్ స్పష్టం చేసింది. అమెరికా యుద్ధ నౌకను ఒకే దెబ్బకు ముంచి వేస్తామంటూ ఉత్తర కొరియా ప్రకటించిన మరుసటి రోజే అమెరికా ఇలా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సమస్య కొలిక్కి.. నామ్ మృతదేహం అప్పగింత
-
సమస్య కొలిక్కి.. నామ్ మృతదేహం అప్పగింత
కౌలాలంపూర్: ఎట్టకేలకు ఉత్తర కొరియా మలేషియాల మధ్య తాజాగా తలెత్తిన సమస్య తీరింది. ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి దాదాపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పరిచిన సమస్యను తీర్చుకున్నాయి. మలేషియా ఎయిర్‌పోర్ట్‌లో హత్యకు గురైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మృతదేహాన్ని తిరిగి ఉత్తర కొరియాకు మలేషియా అప్పగించింది. దీంతో ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న తొమ్మిదిమంది మలేషియా రాయభార కార్యాలయానికి చెందినవారు తిరిగి కౌలాలంపూర్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం నామ్ మృతదేహాం కొరియా చేరుకునే క్రమంలో ఉందని, తమ దేశ పౌరులు సురక్షితంగా తిరిగొచ్చారని మలేషియా అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. నామ్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య కీలక పరిణామాలు సంభవించాయి. ఇరు దేశాల రాయబారులను బహిష్కరించుకోవడంతోపాటు తమ దేశాల పౌరులు పరస్పర దేశాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా ట్రావెల్ బ్యాన్ కూడా విధించుకున్నాయి. అయితే ఎట్టేకేలకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ఉత్తర కొరియాతో చర్చలు జరిపిన తర్వాత ఇరు దేశాల మధ్య విధించుకున్న బ్యాన్ ను ఎత్తేశారు. కిమ్ జాంగ్ నామ్ మృతదేహాన్ని పంపించారు. ఉత్తరకొరియాలోని మలేషియా రాయబార కార్యాలయానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు, ఓ చిన్నారి, ముగ్గురు చిన్నారులు తిరిగి శుక్రవారం ఉదయం కౌలాలంపూర్‌లో అడుగుపెట్టడంతో కొంత ఉద్వేగభరితమైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. -
కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే !
-
షాకింగ్: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే!
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్‌ను మలేషియాలోని విమానాశ్రయంలో దారుణంగా చంపిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగుచూసింది. అనూహ్యరీతిలో ఒక మహిళ నామ్‌పై వెనుక నుంచి దాడిచేసి.. ముఖానికి వేగంగా పనిచేసే విషాన్ని పూయడంతో ఆయన చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెల్లని దుస్తులు ధరించిన మహిళ వెనుక నుంచి నామ్ ముఖాన్ని పట్టుకొని.. ఏదో పూస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను జపాన్‌కు చెందిన ఫుజి టీవీ విడుదల చేసింది. నామ్‌పై దాడి దృశ్యాలను ఎయిర్‌పోర్టు సీసీ టీవీ కెమెరాలు రెండు కోణాలలో చిత్రీకరించినట్టు ఈ వీడియోను బట్టి తెలుస్తున్నది. దాడి చేసిన వెంటనే ఆ మహిళ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ వీడియోలో కనిపిస్తున్నది. మహిళ దాడితో తడబడుతూ.. తన ముఖాన్ని తుడుచుకుంటూ నామ్ అక్కడి నుంచి కదిలి పోలీసుల సహకారం తీసుకున్నాడు. అనంతరం విమానాశ్రయంలో ఉన్న చికిత్ర కేంద్రానికి వెళ్లాడని ఈ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, మహిళలు తన ముఖానికి ఏదో ద్రవాన్ని పూశారని దాడి తర్వాత నామ్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు ఫిర్యాదు చేశారని పోలీసులు ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. మకావ్ వెళ్లేందుకు గత సోమవారం కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో కిమ్ జాంగ్ నామ్‌పై మహిళలు విషప్రయోగంతో దాడి చేశారు. నాటకీయ ఫక్కీలో జరిగిన ఆయన హత్య వెనుక ఉత్తర కొరియా హస్తమున్నట్టు తాజాగా మలేషియా జరిపిన దర్యాప్తులో వెలుగుచూసిందని దక్షిణకొరియా తెలిపింది. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ సాక్షిగా జరిగిన ఈ హత్యతో ఉత్తరకొరియా-మలేషియా మధ్య దౌత్య ఉద్రిక్తతలు తీవ్రస్తాయికి చేరాయి. ఈ హత్య కేసులో ఒక ఉత్తర కొరియా మహిళను అరెస్టు చేశామని, మరో నలుగురు ఆ దేశ పౌరుల కోసం గాలిస్తున్నామని మలేషియా పోలీసులు తెలిపారు. నామ్ హత్య జరిగినరోజే ఆ నలుగురు దేశాన్ని విడిచిపోయారని పోలీసులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా పేర్కొంది. నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన నామ్ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన నామ్‌ను అతని తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సవతి సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు అన్న కారణంతోనే నామ్‌ను మహిళతో కిమ్ హత్య చేయించి ఉంటాడని అనుమానాలు వస్తుండగా.. ఈ హత్య వెనుక ఉత్తరకొరియా హస్తముందని తాజా దర్యాప్తులో తేలడం గమనార్హం. -
సవతి సోదరుడిని చంపించింది కిమ్మే!
హత్య వెనుక ఉత్తర కొరియా హస్తముంది ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్య కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తమున్నట్టు తాజాగా మలేషియా జరిపిన దర్యాప్తులో వెలుగుచూసిందని దక్షిణకొరియా తెలిపింది. కౌలాలంపూర్ ప్రధాన విమానాశ్రయంలో గత సోమవారం కిమ్ జాంగ్ నామ్ విషప్రయోగం ద్వారా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఒక ఉత్తర కొరియా వ్యక్తిని అరెస్టు చేశామని, మరో నలుగురు ఆ దేశ పౌరుల కోసం గాలిస్తున్నామని మలేషియా పోలీసులు తెలిపారు. నామ్ హత్య జరిగినరోజే ఆ నలుగురు దేశాన్ని విడిచిపోయారని పోలీసులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా పేర్కొంది. నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన నామ్ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన నామ్‌ను అతని తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సవతి సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు అన్న కారణంతోనే నామ్‌ను మహిళతో కిమ్ హత్య చేయించి ఉంటాడని అనుమానాలు వస్తుండగా.. ఈ హత్య వెనుక ఉత్తరకొరియా హస్తముందని తాజా దర్యాప్తులో తేలడం గమనార్హం. -
ఈసారి మూడు బాలిస్టిక్ క్షిపణులు పేల్చింది
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా తన అణు పరీక్షలు క్షిపణుల రూపంలో చేస్తూనే ఉంది. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తు లెక్కచేయకుండా దిక్కార తీరుతో ముందుకెళ్తూనే ఉంది. మంగళవారం మూడు స్వల్ప దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ అణు క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణి కొరియా అధికారులు చెప్పారు. స్కడ్ సీ టైప్ క్షిపణులను తమ దేశంలోని వాంజున్ అనే ప్రాంతం నుంచి ఉదయం 5.45 నుంచి 6.05గంటల మధ్యలో పరీక్షించినట్లు వెల్లడించారు. ఇవి నేరుగా 500 నుంచి 600 కిలో మీటర్లు ప్రయాణించి తూర్పు సముద్రంలోని లక్ష్యాలను ఢీకొట్టి సముద్రం పడినట్లు తెలిపింది. అంటే, ఈ క్షిపణులతో కూడా నేరుగా దక్షిణ కొరియాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియా దాడులు చేయవచ్చన్నమాట. ఇరు దేశాల మధ్య టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్)ను విస్తరించుకోవాలని అమెరికా, దక్షిణ కొరియాల మధ్య ఒప్పందం జరిగిన ఆరు రోజులకే ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. -
ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లపై నిషేధం
ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లతోపాటు శత్రుదేశాలకు చెందిన అన్ని వెబ్ సైట్లపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తరకొరియా ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసింది. కమ్యూనిస్ట్ దేశం చైనాలాగే ఇప్పటికే ఉత్తర కొరియాలోనూ ఇంటర్నెట్ పై సెన్సార్షిప్ కొనసాగుతోంది. నిషేధంపై కొద్ది రోజుల కిందటే యూజర్లకు హెచ్చరికలు పంపారు. అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలమేరకు పోస్ట్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ శాఖ శుక్రవారం నిషేధం ఉత్తర్వులను వెల్లడించింది. దాదాపు రెండున్నర కోట్ల జనాభా కలిగిన ఉత్తర కొరియాలో కేవలం 20 లక్షల మందికి మాత్రమే మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నవ్యక్తులు, ప్రముఖ ఇంజనీర్లు, కొద్ది మంది డాక్టర్లు.. ఇలా అవసరమైనవారికి మాత్రమే మొబైల్ వాడుకునే అవకాశాన్ని కల్పించింది అక్కడి ప్రభుత్వం! విదేశీయిలెవరైనా ఆదేశానికి వెళితే ప్రభుత్వం ఇచ్చే సిమ్ కార్డు ద్వారా మాత్రమే త్రీజీ సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇకపై విదేశీయులకు కూడా ఇంటర్నెట్ సేవలు అందిచబోమని ఉత్తరకోరియా స్పష్టం చేసింది. నిషేధిత వెబ్ సైట్లలో దక్షిణ కోరియాకు చెందిన అన్ని సైట్లు, అమెరికాకు చెందిన ప్రధాన సైట్లు ఉన్నాయి. నిషేధం ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత ఇవ్వని సర్కారు.. 'కొద్దికాలం వరకు నిషేధం కొనసాగుతుంది'అని చెప్పింది. -
జగడాల మారి కొరియా మరో పనిచేసింది
ప్యాంగ్ యాంగ్: జగడాల ఉత్తర కొరియా మరో రెచ్చగొట్టే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బహుళ అణురాకెట్లను ప్రయోగించగల వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని పరీక్షించేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పచ్చజెండా కూడా ఊపారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక న్యూస్ ఎజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది. కొత్తగా లార్జ్ మల్టీ రాకెట్ లాంచర్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు, అధికారులకు ఉన్ పొగడ్తల్లో ముంచెత్తారని పేర్కొంది. దీనిని వెంటనే పరీక్షించి చూడాలని కూడా ఆయన స్పష్టం చేసినట్లు వెల్లడించింది. 'కొరియా ప్రజల సైన్యం వ్యూహాత్మక బలన్నా వృద్ధి చేసుకొని శత్రువును ఎప్పుడంటే అప్పుడే ఢీకొనే స్థాయిలో ఉండేందుకు కొత్తగా రూపొందించిన ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది' అని ఆర్మీ అధికారులు చెప్పినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. కాగా, ఈ అంశాన్ని దక్షిణ కొరియా, అమెరికా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మేనమామను వేటకుక్కలతో చంపించిన ఉ.కొరియా నియంత
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన మేనమామ జంగ్ సాంగ్ థీక్ (67)కు అత్యంత పాశవికమైన మరణ శిక్షను అమలు చేశాడు. ఒకటి.. రెండు కాదు సుమారు 120 వేట కుక్కలతో కరిపించి కిరాతకంగా హతమార్చడమే గాక, ఆ దృశ్యాలను ఉన్ ప్రత్యక్షంగా తిలకించినట్టు చైనా పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. థీక్తో పాటు ఆయన ఐదుగురు అనుచరులను ఒంటిపై నూలుపోగు లేకుండా బోనులోకి నెట్టేసి.. వారిపైకి ఆకలితో ఉన్న 120 వేట కుక్కలను వదిలేశారని.. అవి వారిని వెంటాడి.. వేటాడి పీక్కుతిన్నాయని.. ఈ ఆటవిక శిక్షా కాండ సుమారు గంటకుపైగా సాగిందని చైనా పత్రిక వెన్ వెయ్ పో ఉటంకించింది. ఈ పాశవికమైన శిక్షను ‘క్వాన్ జ్యూ’ లేదా వేట కుక్కలతో అమలు చేసే శిక్షగా పిలుస్తారని ఆ పత్రిక వెల్లడించింది. డిసెంబర్ 12న థీక్కు మరణ శిక్ష అమలు చేసినట్టు ఉత్తర కొరియా ప్రభుత్వం వెల్లడించింది. జోంగ్ ఇల్ అనంతరం 2011లో చిన్నవయసులో అధికారంలోకి వచ్చిన జోంగ్ ఉన్‌కు థీక్ సహాయంగా ఉంటూ ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో పట్టు సాధించాడు. అయితే ఆ తరువాత అధికారాన్ని తానే చేజిక్కుంచుకునేందుకు కుట్ర చేశాడని, దేశ ద్రోహానికి, అవినీతికి పాల్పడ్డాడనే నేరంపై మరణ శిక్ష విధించారు.