ప్యోంగ్ యాంగ్: అమెరికాకు చెందిన సైనికుడు అక్రమంగా నార్త్ కొరియాలోకి చొరబడ్డాడన్న కారణంతో అతడిని బంధించింది అక్కడి సైన్యం. దీంతో నార్త్ కొరియా చెర నుండి అమెరికా సైనికుడు అసలు బయటపడతాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా అమెరికాకు చెందినవారు 18 మంది నార్త్ కొరియాలో బందీలుగా ఉన్నారు. కానీ అందులో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారంతా రెండు నెలల్లోనే విడుదలయ్యారు.
ఎవరీ ట్రావిస్ కింగ్?
అమెరికా సైనికుడు ట్రావిస్ కింగ్(23) విస్కాన్సిన్లో అమెరికా దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం 2021 జనవరిలో యూఎస్ ఆర్మీలో చేరిన కింగ్ కొన్ని నెలల క్రితం దక్షిణ కొరియాలో కూడా ఇలాగే అక్రమంగా చొరబడ్డాడు. రెండు నెలల పాటు అక్కడ జైలు జీవితం గడిపిన తర్వాత అతడిని టెక్సాస్ తిరిగి పంపించేయాలని నిర్ణయించాయి దక్షిణకొరియా వర్గాలు.
కానీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అప్పటికే అమెరికా సైన్యం నుండి బహిష్కరించబడిన ట్రావిస్ కింగ్ వారి నుండి ఎలాగో తప్పించుకుని ఉభయ కొరియాలకు మధ్యలో పన్ముంజోన్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుండి ఉత్తర కొరియా చేరుకొని అక్కడ కోమ్ జోంగ్ బలగాలకు పట్టుబడ్డాడు. అతడు ఎందుకిలా దేశాటన చేస్తున్నాడన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు.
తిరిగొచ్చేనా?
పెంటగాన్ వర్గాలు అసలు ట్రావిస్ నార్త్ కొరియా ఎందుకు వెళ్లాడన్న కోణం నుండి దర్యాప్తు ప్రారంభించింది. మరో పక్క ప్యోంగ్ యాంగ్, పెంటగాన్ వర్గాల నుంచి చర్చలకు పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది. అసలే అమెరికా ఉత్తర కొరియ మధ్య పచ్చగాడి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో అసలు అమెరికా సైనికుడిని వారు విడిచి పెడతారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ట్రావిస్ కింగ్ తల్లి కూడా తన కుమారుడు అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానని, వాడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గతంలో కూడా అమెరికా నుండి 18 మంది నార్త్ కొరియాలోకి అక్రమంగా చొరబడగా వారిలో చార్లెస్ రాబర్ట్ జెన్కిన్స్ మినహాయిస్తే మిగతా వారందరిని రెండు నెలలలోపే తిరిగి పంపించేసింది. చార్లెస్ జెన్కిన్స్ ను మాత్రం 1965 లో అదుపులోకి తీసుకుని 2004లో విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక
Comments
Please login to add a commentAdd a comment