North korea: ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు | North Korea Tests Multiple Rocket Launcher System | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు.. మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ టెస్ట్‌ సక్సెస్‌

Published Mon, Feb 12 2024 8:02 AM | Last Updated on Mon, Feb 12 2024 11:30 AM

North Korea Tests Multiple Rocket Launcher System - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని ప్రకటించిన ఉత్తర కొరియా వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా ఆ దేశం మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థను పరీక్షించింది. దానిపై నుంచి 240ఎమ్‌ఎమ్‌ బాలిస్టిక్‌ రాకెట్‌  లాంచర్‌ షెల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

షెల్‌ అండ్‌ బాలిస్టిక్‌ కంటట్రోల్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఈ పరీక్ష కీలకం కానుందని నార్త్‌ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. జనవరిలోనూ పొరుగు దేశం దక్షిణ కొరియా సరిహద్దులోని ఓ ఐలాండ్‌లో ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించింది ఉత్తర కొరియా.

దక్షిణ కొరియా తమపై దాడికి దిగితే ఆ దేశాన్నే లేకుండా చేస్తామని ఇటీవలే ఉత్తర కొరియా నియంతా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడం చర్చనీయాంశమవుతోంది.

ఇదీ చదవండి.. కాల్చేసే కాంతి పుంజం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement