rocket launchers
-
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
North korea: ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు
ప్యాంగ్యాంగ్: దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని ప్రకటించిన ఉత్తర కొరియా వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా ఆ దేశం మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. దానిపై నుంచి 240ఎమ్ఎమ్ బాలిస్టిక్ రాకెట్ లాంచర్ షెల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంటట్రోల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఈ పరీక్ష కీలకం కానుందని నార్త్ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. జనవరిలోనూ పొరుగు దేశం దక్షిణ కొరియా సరిహద్దులోని ఓ ఐలాండ్‌లో ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించింది ఉత్తర కొరియా. దక్షిణ కొరియా తమపై దాడికి దిగితే ఆ దేశాన్నే లేకుండా చేస్తామని ఇటీవలే ఉత్తర కొరియా నియంతా కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి.. కాల్చేసే కాంతి పుంజం -
రూ.225 కోట్ల నిధులు సమీకరించిన స్కైరూట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫండ్‌రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది. రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది. -
పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా?
ఇస్లామాబాద్: శనివారం తెల్లవారు జామున సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి "మరి మాతా" హిందూ దేవాలయాన్ని కూల్చిన 24 గంటలు గడవక ముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సింధ్ ప్రావిన్సులో కొందరు దుండగులు హిందువులు నివసించే కాష్మోర్ ప్రాంతంలో అక్కడి హిందూ సమాజం నిర్మించుకున్న దేవాలయం పైనా చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీదా రాకెట్ లాంఛర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని కాష్మోర్-కందకోట్ ఎస్.ఎస్.పీ ఇర్ఫాన్ సమ్మో తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానిక హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తామని ఈ సందర్బంగా సమ్మో అభయమిచ్చారు. ఈ దేవాలయంలో బాగ్రి సమాజానికి చెందిన వారంతా ఏడాదికి ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటామని, ఆలయంపై ఈ విధంగా దాడి చేయడం పిరికి చర్య అని అన్నారు బాగ్రి సమాజానికి చెందిన డాక్టర్ సురేష్. దుండగులు ఫైర్ చేసిన చాలా రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవవడంతో ప్రాణనష్టం జరగలేదని లేకుంటే మరింత విధ్వంసం జరిగి ఉండేదని ఆయన తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారతీయ యువకుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినందుకు ప్రతీకారంగా కాష్మోర్-ఘోట్కీ నదీతీరాన ఉండే కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: బంపరాఫర్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లభ్యం.. -
ONEWEB: ఇస్రో కీర్తి కిరీటంలో... మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 36 వన్‌వెబ్ ఇండియా–2 ఇంటర్నెట్ సమాచార ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అత్యంత బరువైన ఎల్వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్ వాటిని తీసుకుని ఆదివారం ఉదయం 9.00 గంటలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్ ఎర్త్ లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్ 23న తొలి బ్యాచ్‌లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం తెలిసిందే. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ఇస్రో స్థాయి పెరిగింది: చైర్మన్ సోమనాథ్ ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు పరస్పరం అలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘‘ఇది టీం వర్క్. ప్రపంచంలోనే అద్భుతమైన విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలను పెంచినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనది. దీనివల్ల ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఊపులో పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ద్వారా ఏప్రిల్‌లో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1తో పాటు మరో నాలుగు ప్రయోగాలు చేసే అవకాశముంది’’ అని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలకు ఎల్వీఎం3 రాకెట్ ఎంతో ఉపయోగకారి అని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డి.రాధాకృష్ణన్, మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ చెప్పారు. ఆత్మనిర్భరతకు తార్కాణం ప్రధాని మోదీ అభినందనలు వన్‌వెబ్ ఇండియా–2 ప్రయోగం దిగ్విజయం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘‘వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అంతర్జాతీయంగా భారత్ పై చేయిని ఈ ప్రయోగం మరింత దృఢపరిచింది. ఆత్మనిర్భరత స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్‌తో దాడి..
పంజాబ్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్ తరణ్‌లో ఉన్న సర్హాలి పోలీస్ స్టేషన్ భవనంపై జరిగింది. తెల్లవారుజామున 1 గంటకు దాడి జరిగిందని, భవనానికి స్వల్ప నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాకెట్ లాంచర్ రకం ఆయుధం మొదట స్తంభాన్ని ఢీ కొట్టి ఆపై పోలీస్ స్టేషన్‌ను తాకినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్లో మరణిస్తున్నట్లు భావిస్తున్న ఖలిస్తాని ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా స్వస్థలం కూడా సర్హాలినే. రిండా నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కి చెందిన సభ్యుడు. అతనిపై ఈ ఏడాది మేలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై ఆర్పీజీ దాడితో సహా పలు ఉగ్రవాద కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి సూత్రధారిని పోలీసులు శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..) -
వచ్చేవారమే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్
న్యూఢిల్లీ: భారత్‌లో అంతరిక్ష ప్రయోగాల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ ప్రయోగాన్ని వచ్చేవారమే చేపట్టబోతున్నారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12–16 తేదీల మధ్య ఈ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మొత్తం ప్రయోగానికి ‘ప్రారంభ్ మిషన్’ అని నామకరణం చేశారు. విక్రమ్–ఎస్ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. విక్రమ్–ఎస్ రాకెట్ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్ సైతం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు. ‘ఇన్–స్పేస్’ క్లియరెన్స్ దేశంలో అంతరిక్ష సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఇన్–స్పేస్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ప్రైవేట్ విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగానికి ఇన్–స్పేస్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ లభించింది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 12–16 మధ్య ప్రయోగం చేపట్టే వీలున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రతినిధి శిరీష్ పల్లికొండ మంగళవారం తెలిపారు. ప్రారంభ్ మిషన్‌ను ఆరంభిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ తేదీని ఖరారు చేస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్‌కుమార్ చందన వెల్లడించారు. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ -
Rocket Launcher: జాలర్ల వలలో రాకెట్ లాంచర్
టీ.నగర్: సముద్రంలో చేపలు పడుతున్న జాలర్ల వలలో శనివారం రాకెట్ లాంచర్ చిక్కుకుంది. నాగపట్నం జిల్లా సెరుదూరుకు చెందిన శబరినాథన్ పడవలో నలుగురు జాలర్లు శుక్రవారం సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. వీరు వేదారణ్యం తూర్పు దిశగా శనివారం సుమారు ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పడుతుండగా రాకెట్ లాంచర్ దొరికింది. దీనిగురించి జాలర్లు వేలాంగన్ని కోస్ట్‌గార్డ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: తప్పిన ముప్పు: హిందూ మహాసముద్రంలో రాకెట్ శకలాలు -
వరుస రాకెట్ దాడులతో వణికిన కాబూల్
కాబూల్: ఆప్గానిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం ఉదయం వరుస రాకెట్ లాంఛర్ దాడులతో వణికిపోయింది. వరుసగా 23 రాకెట్లు దూసుకొచ్చాయని ఆప్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్ అరియాన్ ధృవీకరించారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మంది పౌరులు మృతి చెందినట్లు, 31 మంది గాయపడ్డట్లు తారిఖ్ ప్రకటించారు. ఈ దాడికి తాలిబన్లు కారణం అని ఆయన ఆరోపించారు. కాబూల్ లోని సెంట్రల్,ఉత్తర ప్రాంతాలలో దాడి జరిగింది. ఈ ప్రదేశం అత్యంత భద్రత కలిగిన గ్రీన్ జోన్. అక్కడ విదేశీ రాయబార కార్యాలయాలు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. దాడి అనంతరం కూలిన భవనాలు, పగిలిన కిటీకీలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం ఈ దాడి చేసింది తాలిబన్లు అని ప్రకటించగా, తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముబాహిద్ ఖండించాడు. గత కొంతకాలంగా కాబూల్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. కొన్ని వారాల క్రితం రెండు యూనివర్శిటీపై దాడి జరిగింది. అటు తరువాత జరిగిన మరో దాడిలో దాదాపుగా 50 మంది ప్రజలను కాల్చి చంపారు. ప్రతిసారి దాడులు చేసింది తాలిబన్లు లేదా వారు పోషిస్తున్నజిహద్ శక్తులేనని ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. తాలిబన్లు మాత్రం దాడులు చేస్తోందని మా సంస్థలు కాదని, ఇలా చేసే వారు మా పేరును వాడుకుంటున్నారని చెప్తుతున్నారు. మేము ప్రజలపై దాడులు చేయమని అంటున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆప్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ జరుగుతుందని,దానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసామని, దానికే కట్టుబడి ఉన్నామని తాలిబన్లు వాదిస్తున్నారు. కాగా, ఇటీవల విద్యాసంస్థలపై దాడులు చేసింది భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అని తనకు తానే ప్రకటించుకుంది. ఈ రోజు(శనివారం) దాడి చేసింది పాకిస్థాన్ ప్రేరిత ఉగ్ర సంస్థ హక్కానీ నెట్వర్క్ అని తాలిబన్ ప్రకటించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లోఉగ్రవాదుల చేసిన మారణహోమం తాలుకూ వివరాలను ప్రకటించారు. తాలిబాన్లు 53 ఆత్మాహుతి దాడులు,1,250 పేలుళ్లు జరిపారని అందులో 1,210 మంది పౌరులు మరణించగా, 2,500 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ ప్రకటించారు. మరోవైపు శనివారం ఉదయం రెండు చిన్న "స్టిక్కీ బాంబు" పేలుళ్లు సంభవించాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. వీటిలో ఒకటి పోలీసు కారును ఢీకొట్టింది ఈ దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
ఎందుకు భయపెడతారు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత వాసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మండిపడ్డారు. ఇప్పుడు రాకెట్ లాంచర్ల ప్రస్తావన ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. వాటి పేరుతో సచివాలయ నిర్మాణ వ్యయ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారన్నారు. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని రేపు ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డం పెట్టుకోడానికి మొట్టమొదటగా ఆయన రాకెట్ లాంచర్లతో ప్రారంభించడం దారుణమని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇదే ముఖ్యమంత్రి, తాను గెలవగానే టీడీపీ కేడర్‌ను ఉద్దేశిస్తూ.. తాను పదేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పారని, తెలంగాణలో టీడీపీని గెలిపించి విజయవాడ వెళ్తానన్నారని.. కానీ గట్టిగా రెండేళ్లు కూడా పూర్తిచేయకుండానే హడావుడిగా విజయవాడకు ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజానికి ఆయన రాష్ట్రంలో ఉండే రాష్ట్రాన్ని పాలించడం తమకూ సంతోషకరమేనని.. అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. కానీ.. కుర్చీలు, ఫ్యాన్లకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో అప్పుడే ఎందుకు తాత్కాలిక భవనాలకు వెళ్లారని ప్రజలకు అనుమానంగా ఉందని చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో తెలంగాణ పోలీసుల నుంచి ముప్పు ఉంటుందన్న భయంతోనే వచ్చేశారని తెలిపారు. సింగపూర్, టోక్యో, చైనా అన్నీ కడతామన్న సీఎం.. కనీసం తాత్కాలిక భవనాన్ని నిర్మించడం మంచిదేనని.. కానీ ప్రతీదీ అశుభంగా ఎందుకు చేస్తున్నారని పార్థసారథి ప్రశ్నించారు. ఇక చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేసిన సంతకాలలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలుకాలేదని పార్థసారథి గుర్తుచేశారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, బెల్టు షాపులనిర్మూలన, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా అందరికీ మినరల్ వాటర్ సరఫరా చేసే సంతకం.. వాటిలో ఏదైనా ప్రజలకు సంతృప్తికరంగా జరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి అప్రూవ్ చేశామంటున్నారని.. ఇప్పటికైనా ఒక్క మహిళకైనా ఒక్క రూపాయి ఆమె చేతిలో పడిందని నిరూపిస్తే వాళ్లు వేసే శిక్ష అనుభవించడానికి తాను సిద్ధమని సవాలు చేశారు. మరోవైపు నల్లధనం గురించి చంద్రబాబు మాట్లాడటం చూస్తే దేశంలో ప్రజలంతా విస్తుపోతున్నారు. దేశంలోనే అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి కలిగినది ఏపీ అని సర్వే సంస్థలు చెప్పిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన అక్రమ ఆదాయ వెల్లడి పథకం గురించి ఆయన మాట్లాడారని, ఏ ప్రాంతం నుంచి ఎంత నల్లడబ్బు వచ్చిందన్న విషయాన్ని తాము చెప్పబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే పట్టించుకోవద్దని చెప్పారని అన్నారు. కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఇంత డబ్బు వచ్చిందని, అది కూడా ఒకే వ్యక్తి, ఒకే సంస్థ పదివేల కోట్లు వెల్లడించిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు. తప్పుడు, దొంగ ప్రచారాలు చేస్తున్నారా.. మీవాళ్ల ద్వారా తెలుసుకుని ప్రచారం చేస్తున్నారా అని అడిగారు. ఇలా ముఖ్యమంత్రి 'ఒక వ్యక్తి' అంటూ ముందురోజు మాట్లాడతారని.. మర్నాడు జగన్ పదివేల కోట్లు వెల్లడించాని కేబినెట్లో మంత్రులు ఆరోపిస్తారని పార్థసారథి అన్నారు. ఇలా పథకం ప్రకారం జగన్ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లుకు నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే.. కనీసం ఒక శాతమైనా నిజాయితీ ఉందని అనుకుంటే.. తమ సవాలు స్వీకరించాలన్నారు. ఈ పదివేల కోట్ల రూపాయలు ఎవరు వెల్లడించారో ఆధారాలతో సహా బయటపెట్టాలని పార్టీ తరఫున సవాలు చేస్తున్నామన్నారు. -
ఎందుకు భయపెడతారు?