
టీ.నగర్: సముద్రంలో చేపలు పడుతున్న జాలర్ల వలలో శనివారం రాకెట్ లాంచర్ చిక్కుకుంది. నాగపట్నం జిల్లా సెరుదూరుకు చెందిన శబరినాథన్ పడవలో నలుగురు జాలర్లు శుక్రవారం సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. వీరు వేదారణ్యం తూర్పు దిశగా శనివారం సుమారు ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పడుతుండగా రాకెట్ లాంచర్ దొరికింది. దీనిగురించి జాలర్లు వేలాంగన్ని కోస్ట్‌గార్డ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: తప్పిన ముప్పు: హిందూ మహాసముద్రంలో రాకెట్ శకలాలు