జగడాల మారి కొరియా మరో పనిచేసింది | North Korea leader guides test firing of large-caliber multiple rocket launcher | Sakshi
Sakshi News home page

జగడాల మారి కొరియా మరో పనిచేసింది

Published Tue, Mar 22 2016 9:32 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

జగడాల మారి కొరియా మరో పనిచేసింది - Sakshi

జగడాల మారి కొరియా మరో పనిచేసింది

ప్యాంగ్ యాంగ్: జగడాల ఉత్తర కొరియా మరో రెచ్చగొట్టే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బహుళ అణురాకెట్లను ప్రయోగించగల వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని పరీక్షించేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పచ్చజెండా కూడా ఊపారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక న్యూస్ ఎజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది. కొత్తగా లార్జ్ మల్టీ రాకెట్ లాంచర్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు, అధికారులకు ఉన్ పొగడ్తల్లో ముంచెత్తారని పేర్కొంది.

దీనిని వెంటనే పరీక్షించి చూడాలని కూడా ఆయన స్పష్టం చేసినట్లు వెల్లడించింది. 'కొరియా ప్రజల సైన్యం వ్యూహాత్మక బలన్నా వృద్ధి చేసుకొని శత్రువును ఎప్పుడంటే అప్పుడే ఢీకొనే స్థాయిలో ఉండేందుకు కొత్తగా రూపొందించిన ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది' అని ఆర్మీ అధికారులు చెప్పినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. కాగా, ఈ అంశాన్ని దక్షిణ కొరియా, అమెరికా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement