న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. చైనా చర్యల నేపథ్యంలో దేశ రక్షణ ప్రయోజనాలు సంపూర్ణంగా పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్‌లో భాగమేనన్నారు. చైనా ఇలాంటి వక్ర చర్యలకు బదులు ఘర్షణాత్మక అంశాలపై భారత్‌తో నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment