bridge constrction
-
మాట నిలబెట్టుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
మాట ఇవ్వడం.. మరచిపోవడం.. ప్రజలు గుర్తు చేసినా పట్టించుకోకపోవడం.. ఎన్నికల సమయంలో మళ్లీ అదే మాట ఇవ్వడం.. ఓట్లు అభ్యరి్థంచడం.. కొందరు ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. అయితే ఇందుకు భిన్నంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇచ్చిన మాటమీద నిలబడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల ‘దారి’్రద్యాన్ని తొలగించారు. ఆయా ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధాలకు ‘వారధి’ వేశారు. దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు(అర్బన్): వర్షాకాలం వచ్చిందంటే వారిలో వణుకు ప్రారంభమయ్యేది. ఊరి సమీపంలోని వాగు పొంగితే సమీప గ్రామాలకు రాకపోకలు ఆగిపోయేవి. పంట పొలాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అరోగ్యం బాగాలేకపోయి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలన్నా నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది.. ఈ దుస్థితిని ఆ గ్రామ ప్రజలు ఎందరికో వివరించారు. చూద్దాం.. చేద్దాం అన్నారు తప్పితే చిత్తశుద్ధితో ఎవరూ ప్రయత్నం చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పత్తికొండ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగాటి శ్రీదేవి.. గ్రామ ప్రజల కష్టాన్ని విన్నారు. తాను గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. రూ. 6.62 కోట్ల ఖర్చు పత్తికొండ మండలం దూదేకొండ – కొత్తపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగుపై లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.62 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులు మంజూరయ్యాయి. దీంతో ఈ రెండు గ్రామాలను కలుపుతూ ఉన్న మట్టి రోడ్డును పూర్తిగా తవ్వేసి, రోడ్డు మ«ధ్యలో ఉన్న వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జికి రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును వేశారు. బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు శ్లాబ్‌లను పూర్తి చేసి రోడ్డుకు అవసరమైన ప్రాంతాల్లో 10 కల్వర్టులను (మోరీలు) నిర్మించారు. ఈ బ్రిడ్జీ, రోడ్డు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో దూదేకొండ నుంచి కొత్తపల్లి మీదుగా పులికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సులభమైంది. పెరగనున్న రవాణా సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు జాతీయ, జిల్లా రహదారులను అభివృద్ధి చేస్తూనే, మరో వైపు పల్లె రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ) నిధులతో జిల్లాలోని పలు రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో రూ.30 కోట్ల వ్యయంతో పత్తికొండ నియోజకవర్గంలోని దూదేకొండ – కొత్తపల్లి, కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల హంద్రీ నదిపై బ్రిడ్జీల నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే ఒక బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరో రోడ్డు, బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు బ్రిడ్జీలు పూర్తి అయితే పది గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల్లో బ్రిడ్జీలను నిర్మించాలనే ప్రజల కోరికను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ బ్రిడ్జీలకు మోక్షం లభించింది. మరో రెండు వంతెనలకు రూ.8.10 కోట్లతో అంచనాలు పత్తికొండ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు వంతెనల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీర్లు రూ.8.10 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈఏడాది జూన్ 1వ తేదిన పత్తికొండకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ రెండు వంతెనల అంశాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తీసుకువెళ్లారు. అందుకు ముఖ్యమంత్రి వెంటనే సమ్మతించిన నేపథ్యంలో పీఆర్ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.70 లక్షలతో కంభాలపాడు – కోయిలకొండ మార్గంలో లోలెవెల్ వంతెన, కృష్ణగిరి మండలం గోకులపాడులో రూ.7.40 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణాలకు త్వరలోనే మంజూరు ఉత్తర్వులు వెలువడనున్నాయి. హంద్రీ నదిపై సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు హంద్రీ నదిపై వేగంగా బ్రిడ్జి పనులు కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న హంద్రీ నదిపై రూ.24.12 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పియర్స్ పనులు పూర్తి అయ్యాయి. పియర్ క్యాప్స్, హెడ్ హారŠమ్స్ పూర్తి చేసిన అనంతరం శ్లాబ్ వేయనున్నారు. నిరీ్ణత సమయంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ... హంద్రీ నదికి ఇటు పక్క ఉన్న కృష్ణగిరి మండలంలోని బీ ఎర్రబాడు, మన్నేకుంట, ఎస్‌హెచ్ ఎర్రగుడి, కొత్తపల్లి, రామక్రిష్ణాపురం, మల్లాపురం తదితర గ్రామాల ప్రజలకు ఉన్న రాకపోకల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పైగా ఈ మండలంలోని కంభాలపాడు, ఎరుకులచెర్వు తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రమైన కర్నూలుకు వచ్చేందుకు 15 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 330 మీటర్ల పొడవుతో బ్రిడ్జి, 5.9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఈ పనులను నిరీ్ణత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. -
ఆర్టీసీ క్రాస్ రోడ్డు రూట్ లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం
-
అది భారత ఆర్మీ సత్తా.. రికార్డులు బద్దలు కొట్టారు
Army reconstructed two bridges.. ఇండియన్ ఆర్మీ తమ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పారు. అమర్నాథ్ యాత్రలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా భారత ఆర్మీ అద్భుతం సృష్టించింది. దీంతో, ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కరోనా తర్వాత ఎంతో వైభవంగా అమర్నాథ్ యాత్రలో భక్తులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ మార్పుల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య బల్తాల్ వద్ద కాళీమాతా ఆలయ సమీపంలోని నది ప్రవాహం వద్ద కొండచరియలు విరిగిపడి యాత్రా మార్గంలో వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో, రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సంచలనం సృష్టించింది. బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అమర్నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా చేశారు. దీంతో ఆర్మీ అందరిచేత శభాష్ అనుపించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "#Chinarwarriors to the Rescue - #AmarnathYatra." On 01 Jul, 02 bridges near Brarimarg on #Baltal Axis were damaged by landslides. #ChinarCorps mobilised assets & reconstructed the bridges overnight for resumption of route & avoiding an over 4 hour detour by #Yatris.@adgpi https://t.co/AwdxMAyKSs pic.twitter.com/DUQnjWAHTG — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 2, 2022 ఇది కూడా చదవండి: అన్నాడీఎంకే వర్గపోరులో మరో ట్విస్ట్.. పన్నీరు సెల్వానికి షాక్! -
చైనా దూకుడు.. భారత్‌కు పొంచి ఉన్న పెను ముప్పు!
డ్రాగన్ కంట్రీ చైనా.. ఎప్పుడూ భారత్ విషయంలో కవ్వింపులకు పాల్పడుతూనే ఉంటుంది. భారత సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హియాలయాల పొడవునా చైనా నిర్మాణాలు చేపడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, లడఖ్ సమీపంలో చైనా మరో వంతెన నిర్మిస్తున్న విషయం శాటిలైట్ ఫొటోల ద్వారా బహిర్గతమైంది. ఈ విషయాన్ని అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్‌గా ఉన్న ఛార్లెస్ ఏ ఫ్లిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా దూకుడు పట్ల భారత్‌ను ఆయన హెచ్చరించారు. లడఖ్‌లో జరుగుతున్న నిర్మాణాలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఉన్నట్లు ఆయన ఆరోపించారు. చాలా ఆందోళనకర రీతిలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చైనా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన చార్లెస్.. చైనా తన మిలిటరీ వనరులు అన్నింటినీ పెంచుకుంటుందని అన్నారు. చైనా కదలికలు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజకరంకాదన్నారు. చైనా విధానాలు హిమాలయ సరిహద్దులో చాలా ఆందోళనకరీతిలో ఉన్నాయని తెలిపారు. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ వాళ్లు నిర్మిస్తున్న కట్టడాలు ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, చైనా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అమెరికా సైనిక జనరల్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు. #China builds a defence infrastructure in #Ladakh to frighten India! @TheTechOutlook https://t.co/tAH8GgZxHQ — The Tech Outlook (@TheTechOutlook) June 8, 2022 ఇది కూడా చదవండి: ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు -
చైనా వక్రబుద్ధి?.. మరో అక్రమ వంతెన నిర్మాణం
చైనా తన వక్రబుద్ధిని మరో సారి ప్రదర్శించింది. భారత్‌ను ఎలాగైనా దెబ్బకొట్టేందుకు దొంగ ప్రయత్రాలు చేస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాంగాంగ్ సరస్సుపై ఖుర్నాక్ వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది. తాజాగా ఈ బ్రిడ్జ్‌ను దగ్గరలోని సైనిక స్థావరానికి అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. ఖుర్నాక్ సమీపంలో గతేడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి డ్రాగన్ వంతెన నిర్మాణం ప్రారంభించింది. ఇది ఏప్రిల్ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. 1962 నుంచి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మించింది. ఇది వరకే ఈ వంతెన నిర్మాణంపై.. ‘భారత ప్రభుత్వం ఈ అక్రమ ఆక్రమణను ఎప్పటికీ అంగీకరించలేదు’ అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో తెలిపారు. పాంగాంగ్ సరస్సు సమీపంలోని కీలక స్థానాలపై నియంత్రణ సాధించడం కోసం చైనా ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఆగస్టు 2020 నాటి పరిస్థితి ఎదురైనప్పుడు భారత సాయుధ బలగాలు ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలో భాగంగా ఈ వంతెన నిర్మాణమని చేపట్టింది. దీంతో స్పంగూర్ సరస్సు వద్దనున్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది. చదవండి: PM Modi-PM Danish: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ Further developments to the new Chinese bridge at #PangongTso, recent imagery shows roadworks have begun (as mapped in the quoted tweet) to join the bridge most likely to Rutog, giving #China's PLA troops in the area quicker connectivity through the terrain https://t.co/xLDhDTefvL pic.twitter.com/ELwWr6xE1N — Damien Symon (@detresfa_) May 2, 2022 Incase you're still wondering why the new bridge at #PangongTso matters, here's an explainer on its implications & potential advantages it holds for #China's troops in the area, very likely a lesson learnt from #India's maneuvers at Rezang La in 2020 https://t.co/wsQwQuHQT9 pic.twitter.com/xoAzkWIhqY — Damien Symon (@detresfa_) January 4, 2022 -
ఆక్రమిత ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. చైనా చర్యల నేపథ్యంలో దేశ రక్షణ ప్రయోజనాలు సంపూర్ణంగా పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్‌లో భాగమేనన్నారు. చైనా ఇలాంటి వక్ర చర్యలకు బదులు ఘర్షణాత్మక అంశాలపై భారత్‌తో నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. -
కొడుకుపై ప్రేమ: 2 వంతెనలు నిర్మిస్తోన్న తల్లి
కొందరి ఆత్మీయతలు, అనురాగాలు.. ఆదర్శాలుగా మారి చరిత్రలో నిలిచిపోతాయి. ఎంతో మంది జీవితాలను నిలబెడతాయి. అందుకు చైనాకు చెందిన మిస్సెస్ మెంగ్ ఓ నిదర్శనం. హెనెన్ ప్రావిన్స్ నివాసి అయిన ఆమె తన కొడుకుపై ప్రేమతో.. ఏకంగా 154,000 యువన్ (రూ.1.10 కోట్లు) ఖర్చు పెట్టి రోడ్డు దాటడానికి 2 వంతెనలు నిర్మిస్తోంది. ఎందుకంటే కొడుకు స్కూల్‌కి వెళ్లివచ్చే మార్గం.. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. దాన్ని దాటేందుకు కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బేకర్స్ లాంటి జాగ్రత్తలేమీ లేవు. పైగా ఆ రోడ్డంతా ఎప్పుడూ నీళ్లతో నిండి ఉంటుంది. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆమే స్వయంగా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపట్టింది. అధికారుల వద్ద అనుమతి తీసుకుంది. ప్రస్తుతం ఒక వంతెన పూర్తి కాగా, మరొకటి పునాది స్థాయిలో ఉంది. ఆ బ్రిడ్జ్‌కి ‘విజ్డమ్ బ్రిడ్జ్’ (వివేకమైన వంతెన) అని పేరు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ నా కొడుకు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకూ టెన్షనగా గడిపేదాన్ని. ఇప్పుడు నిశ్చింతగా ఉంది. నేను చచ్చిపోయేలోపు బోలెడంత డబ్బు పోగేసుకోవాలని కానీ, నా కొడుక్కోసం తరగనంత ఆస్తి కూడబెట్టాలని కానీ నాకు లేవు. అందుకే ఈ పని చేయగలిగాను’ అని తేల్చింది. అమ్మ మమతను చూపించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న నెటిజనులు ఆమెకు సలాం కొడుతున్నారు. కొడుకు గురించి ఆమె చేసిన మంచిపని.. మిగతా పిల్లలకూ ఉపయోగపడుతుందని, వాళ్లంతా ఆమెకు రుణపడి ఉండాలని అంటున్నారు. చదవండి: మగ స్నేహితులనే తోడిపెళ్లికూతుళ్లుగా మార్చేసింది -
గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం
చైనా కంటగింపునకు, గల్వాన్ ఘటనకు ప్రధాన కారణమైన గల్వాన్ వంతెన నిర్మాణాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. గల్వాన్ ఘటనతో ఏమాత్రం వెనుకంజ వేయని భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం.. ఆర్మీ కంబాట్ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘గల్వాన్ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి’ అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఆ పనులను ఏకబిగిన 72 గంటల పాటు కొనసాగించి, గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు. వంతెనపై రెండు గంటలపాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు. జూన్ 15వ తేదీన రెండు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన ‘పెట్రోల్ పాయింట్ 14’కు ఈ వంతెన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ(ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలున్న) వంతెనపై ఫిరంగి దళ వాహనాలతోపాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. (చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం) వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఈ వంతెనతో దర్బాక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్ కాపాడుకోగలదు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్ నది పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ ఇంజనీర్ల సాయంతో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్వో) తలపెట్టిన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు.. చైనా ఎన్ని కుట్రలు పన్నినా కొనసాగుతాయని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. (చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..) -
బ్రిడ్జి ప్రారంభించేదెప్పుడో..?
సాక్షి, మానకొండూర్: మండలంలోని వేగురుపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామాల వద్ద మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్న ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ వంతెనకు ఇరువైపుల భూ సేకరణ చేపట్టి రహదారి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ అ«ధికారులు భూ సేకరణ చేపట్టలేదు. వంతెనకు ఒక వైపే భూ సేకరణ పనులు నామమాత్రంగా చేపట్టినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. వంతెనకు మరోవైపు భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా, అ«ధికారులు మాత్రం అటువైపుగా దృష్టి సారించక పోవడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేక పోతోందని వాహనదారులు ఇరు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే బ్రిడ్జి పనులు పూర్తి వేగురుపల్లి–నీరుకుల మధ్య మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులో మట్టి పోసి వాగును దాటే వారు. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోవడం వలన మళ్లీ అక్కడక్కడ మట్టి పోసి అనేక ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించేవారు. తొలిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి మాట నిలుపుకున్నారు. వంతెన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేయించారు. 2016 జనవరి 2న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు వేగవంతంగా చేశారు. 15 ఫిల్లర్లు, 2 అపార్టుమెంట్లు ప్రధాన పనులను త్వరితగతిన పూర్తి చేశారు. ఫిల్లర్లపై గడ్డర్స్, డక్ స్లాబ్ పనులు కూడా చేశారు. 640 మీటర్ల మేర చేపట్టే ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఉపయోగంలోకి రాకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. భూ సేకరణలో జాప్యం వంతెనకు ఇరువైపుల రైతుల నుంచి భూ సేకరణ చేపట్టి రెండు కిలోమీటర్లకు పైగా కాంట్రాక్టర్ తారు రోడ్డు వేయాల్సి ఉంది. మానకొండూర్ మండలం వేగురుపల్లి వైపు అధికారులు భూ సేకరణ చేపట్టిన పూర్తిస్థాయిలో జరుపలేదని తెలుస్తోంది. కొద్దిదూరం మాత్రమే భూ సేకరణ చేపట్టి మట్టి పనులు చేశారు. పంట పొలాల్లో మట్టి పోసి రహదారి ఏర్పాటు చేసి తారు వేయాల్సి ఉంది. ప్రస్తుతం పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇరుకుల్ల వైపు భూ సేకరణ పనులు ఇంత వరకూ చేపట్టనేలేదు. వేగురుపల్లి వైపు కిలోమీటరు మేర పనులు చేపట్టాల్సి ఉండగా, ఇరుకుల్ల వైపు కిలోమీటరుపైగా పనులు చేపట్టాల్సి ఉంది. భూ సేకరణ త్వరగా చేపట్టితేనే ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. వంతెనకు ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి వంతెనపై రాకపోకలను ప్రారంభించాలని ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు. -
నాలుగేళ్లుగా నత్తనడకే..!
భద్రాచలంటౌన్: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వారికి ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకునే కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అయితే పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో నాలుగేళ్లు కావస్తున్నా ఇంకా పిల్లర్ల నిర్మాణమే పూర్తి కాలేదు. 1964లో గోదావరిపై మొదట వారధి నిర్మించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడి శా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రాకపోకలకు భద్రాచలం కీలకంగా మారింది. దీంతో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా రెండో వంతెన నిర్మించాలని ప్రభుత్వం యోచించింది. 2015లో శంకుస్థాపన.. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2015 ఏప్రిల్ 1న కేంద్రమంతి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి శంకుస్థాపన చేశారు. రూ.90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేయగా, రూ.65 కోట్లకు ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోదావరి వంతెనకు సమానంగా దాని పక్కనే 36 పిల్లర్లతో పనులు చేపట్టారు. ఇంకా కొన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి కాలేదు. గోదావరిలో నీరు ఉండడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు గోదావరికి మూడుసార్లు వరదలు వచ్చాయి. కాగా సాంకేతిక సమస్య సైతం జాప్యానికి కారణమవుతోంది. సారపాక వైపు నుంచి గోదావరి నదిపై నిర్మించిన రెండు పిల్లర్లను సాంకేతిక సమస్యలతో కూల్చివేశారు. అయితే ఈ మార్గంలో పిల్లర్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొంత పురోగతిలో ఉ న్నప్పటికీ.. భద్రాచలం నుంచి ప్రారంభించిన పిల్లర్ల నిర్మాణం లో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంది. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల బాధ్యతా రాహిత్యంతో ప్రయాణీకులకు క ష్టాలు తప్పడం లేదు. ఇక్కడ కొ న్ని పిల్లర్లు ఇంకా పునాది దశలో నే ఉన్నాయి. రెండో వంతెన పనులను నేషనల్ హైవేస్ ద్వారా కేంద్రప్రభుత్వం పనులు చేపడుతున్నందున జాప్యం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పూర్తయిన పిల్లర్లపై ట్రాక్ బెడ్ పనులు... సారపాక నుంచి భద్రాచలం వైపు రెండో వంతెన పనుల్లో 18 పిల్లర్లు పూర్తి కాగా, 11 పిల్లర్లపై ట్రాక్ బెడ్ పనులు చేపట్టారు. అయితే భద్రాచలం నుంచి సారపాక వెళ్లే వంతెన పనుల్లోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రాంతంలో రాళ్లు ఎక్కువగా ఉండడం కూడా పనుల జాప్యానికి కారణమవుతోంది. ప్రస్తుతం ఎండాకాలంలో గోదావరిలో నీటిమట్టం 4 నుంచి 5 అడుగుల మధ్యనే ఉంటుంది. జూన్‌లోపు పనులను వీలైనంత వరకు పూర్తి చేస్తే బాగుంటుందని స్థానికులు అంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అప్పుడు మళ్లీ జాప్యం జరుగుతుందని చెపుతున్నారు. పనుల వేగవంతానికి చర్యలు కొన్ని సాంకేతిక కారణాలతో వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతున్న మాట నిజమే. భద్రాచలం వైపు ఎక్కువగా రాళ్లు ఉండడం, ఈ ప్రాంతంలోనే ప్రవాహం ఉండడంతో పిల్లర్ల నిర్మాణం ఆలస్యమైంది. పనులు వేగంగా చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నాం. గతేడాది నుంచి కొంత వేగంగానే సాగుతున్నాయి. మరో ఏడాది గడువు పెంచిన నేపథ్యంలో ఈ వ్యవధిలోనే పనులు పూర్తయ్యేలా కృషి చేస్తాం. ఇప్పటికే రెండు భారీ క్రేన్లు కూడా తెప్పించాం. రెండు, మూడు నెలల్లో పనులు చాలా వరకు పూర్తవుతాయి. –శైలజ, నేషనల్ హైవే డీఈ -
గంగానదిపై భారీ వంతెనకు క్లియరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : అలహాబాద్‌లో గంగా నదిపై రూ 1948 కోట్లతో పది కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్‌లోని ఫపమూ వద్ద రూ 1948 కోట్లతో ఆరు లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపిందని రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిసెంబర్ 2021 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో ప్రస్తుత రెండు వరుసల వంతెనపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయని ఓ ప్రకటనలో తెలిపింది. అలహాబాద్‌లో జరిగే కుంభమేళా, అర్థ కుంభ్ ఇతర కార్యక్రమాల్లో ట్రాఫిక్ రద్దీని సైతం ఈ ప్రాజెక్టుతో అధిగమించవచ్చని పేర్కొంది. మధ్యప్రదేశ్ నుంచి లక్నో, ఫైజాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు కూడా ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కార్మికులకు దాదాపు 9.2 లక్షల పనిదినాలు కల్పించవచ్చని పేర్కొంది. అలహాబాద్ నుంచి ఫరక్కా వరకూ గంగానదిపై 2014 వరకూ కేవలం 13 వంతెనలే ఉండగా, ఇప్పుడు అదనంగా 20 వంతెనల నిర్మాణం చేపట్టామని, వీటిలో 5 వంతెనలను ఇప్పటికే ప్రారంభించగా ఏడు వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపింది. -
అలుపెరగని పోరు!
వంతెన నిర్మాణం చేపట్టి రహదారి కష్టాలు తీర్చాలని వాల్తేరుతోపాటు పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారంతో 400 రోజులు పూర్తి కానున్నాయి. సంతకవిటి మండలం బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని వాల్తేరు గ్రామంలో ప్రజలు దీక్షబూనారు. నెలల తరబడి దీక్షలు కొనసాగుతున్నా టీడీపీ సర్కార్ ఏమాత్రం స్పందించడం లేదు. ఎంతో కీలకమైన ప్రజా సమస్య పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. కేవలం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతోనే ఎంతో కీలకమైన సమస్యను పాలక పక్షం పట్టించుకోవడం లేదని జనం భావిస్తున్నారు. రాజాం: బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం చేపడితే 30 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. అయితే అది ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని 30 గ్రామాలు ఘోషిస్తున్నాయి. వంతెన నిర్మాణం చేపట్టాలని నినదిస్తున్నాయి. రోజుకు 30 మందికి తక్కువ కాకుండా నిరసన దీక్షలను సైతం చేస్తున్నారు. అలుపెరగకుండా.. వాల్తేరు గ్రామంలో బలసలరేవు వంతెన నిర్మాణం నిమిత్తం గతేడాది ఫిబ్రవరి నెలలో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 400 రోజుకు చేరుకుంటున్నాయి. వాల్తేరు గ్రామ సమీపంలో బలసలరేవు వద్ద నుంచి నాగావళి నదిపై రెండో వైపున ఉన్న ఇసుకలపేట వరకూ వంతెన నిర్మాణం నిమి త్తం చేపడుతున్న ఈ దీక్షలకు విశేషస్పందన లభిస్తుంది. వాల్తేరు, పనసపేట, జీఎన్‌పురం, బూరాడపేట, హొంజరాం, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, అప్పలఅగ్రహారం, జానకీపురం, మండాకురిటి తదితర 30 గ్రామాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, యువతతో పాటు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాల నేతలు, ఇతర జిల్లాలకు చెందిన ప్రజా సంఘాల నేతలు గత కొన్ని నెలలుగా వంతెన నిమిత్తం పోరాడుతున్నారు. ఒకరిద్దరితో ప్రారంభమైన దీక్షలు మండు వేసవిలోనూ, భోరున కురిసే వర్షంలోనూ, గజగజలాడించే చలికాలంలో కూడా కొనసాగుతూ వచ్చింది. వందలాదిమందిని సాధనకమిటీలో చేర్చుకుంది. ఆ హామీలు నిలబెట్టుకోకపోవడంతో.. వాల్తేరు వద్ద బలసలరేవు వంతెన నిర్మాణం అనేది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీనే. ఇక్కడ వంతెన నిర్మాణం నిమిత్తం సోయిల్ టెస్టు చేశారు. వంతెన నిర్మాణం కోసం 1999లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రూ. 19 కోట్లు నిధులు కూడా మంజూరు చేసినట్లు జీవోను విడుదల చేశారు. అయితే వంతెనకు సంబంధించి నిధులు విడుదల, టెండర్ల ప్రక్రియను ఖరారును మాత్రం అప్పట్లో వేగవంతం చేయలేదు. అనంతరం నాలుగేళ్లు గడిపేసిన టీడీపీ సర్కారు 2004లో ఓడిపోవడంతో తప్పించుకుంది. టీడీపీ నాయకులు కూడా పూర్తిగా మరిచిపోయారు. నాలుగేళ్ల క్రితం మరో సారి అధికారం చేపట్టన టీడీపీ గతంలో ఇచ్చిన వంతెన హామీ విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. అలాగే బలసలరేవు వద్ద నిర్మించాల్సిన వంతెనను వేరే ప్రాంతానికి తరలించడానికి అధికార పార్టీ నాయకుడొకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంతకవిటి ప్రజలు మండిపడుతున్నారు. న్యాయపరంగా తమ ప్రాంతం వద్ద నిర్మించాల్సిన వంతెనను ఇక్కడ కట్టితీరాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల సమయంలో వంతెన నిర్మిస్తామని హామీనిచ్చి..అధికారంలోకి వచ్చాక విస్మరించడం టీడీపీకి తగదని ప్రజలంటున్నారు. వంతెన నిర్మిస్తే.. 30 గ్రామాలకు లబ్ధి వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మిస్తే 30 గ్రామాలకు చెందిన ప్రజలకు రహదారి కష్టాలు తప్పుతాయి. సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, రేగిడి, రాజాం ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు ఆమదాలవలసతో పాటు నరసన్నపేట హైవేకు చేరుకునేందుకు మార్గం సుగుమం అవుతుంది. ప్రధానంగా వాల్తేరు పరిసర ప్రాంతాల్లో నాగావళి నదిపై 30 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా వంతెన లేకపోవడంతో వర్షా కాలంలో ప్రజలు రవాణా కష్టాలుపడుతున్నారు. వంతెన ఉంటే ఆర్థిక, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని ఈ ప్రాంత వాసలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారనే అసూయతోనే.. వాల్తేరు గ్రామం పక్కనే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి స్వగ్రామం కావలి గ్రామం ఉంది. గత 399 రోజులుగా ఇక్కడ వంతెన నిర్మాణం నిమిత్తం పోరాటం జరుగుతున్నా ఆమె పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరో వైపు టీడీపీ ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. వంతెన నిర్మించాల్సిన ఈ ప్రాంతం రాజాం నియోజకవర్గంలో ఉండడం, ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కంబాల జోగులు వ్యవహరిస్తుండడంతో అధికారపక్ష స్పందించడం లేదు. ఎంతో ప్రాధాన్యం ఉన్న వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందనే విమర్శలు వస్తున్నాయి. పట్టించుకోవడంలేదు 399 రోజులుగా వంతెన నిర్మాణ దీక్షలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టనట్లు ఉండడం శోచనీయం. టీడీపీ ఇచ్చిన మాట తప్పింది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు. గురుగుబెల్లి పూర్ణారావు, వ్యాపారి, వాల్తేరు. చీమ కుట్టినట్లు కూడా లేదు వంతెన నిర్మాణం నిమిత్తం ఎంతో మంది పేదలు, ఉద్యోగులు దీక్షలు చేస్తున్నారు. విసుగులేకుండా నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాలేదు. సర్కారుకు ఇంతమొండి వైఖరి తగదు. గురుగుబెల్లి సన్యాసిరావు, వాల్తేరు. వెనక్కితగ్గేదిలేదు వాల్తేరు వద్ద వంతెన ఎంతో అవసరం. ఎన్నో గ్రామాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. చాలా మంది దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా దీక్షను నిలుపుదలచేయడం. -గురుగుబెల్లి స్వామినాయుడు, వైఎస్సార్సీపీ కన్వీనర్, సంతకవిటి మండలం. అసెంబ్లీలో ప్రస్తావించినా.. వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన ఎంతో అవసరం. వంతెన నిర్మాణానికి గతంలో టీడీపీ నిధులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నేత వంతెన దీక్షను అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. ఇక్కడ వంతెన నిర్మాణ ఆవశ్యకతను అసెంబ్లీలో కూడా ప్రస్తావించాం. అయినా సర్కారుపట్టించుకో లేదు. -కంబాల జోగులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాజాం. -
నత్తనడకన వంతెన నిర్మాణం
ఉప్పొంగిన సండ్రవాగు కొట్టుకుపోయిన ప్రత్యామ్నాయ దారి పెరిగిన రవాణా దూరం సిరిసిల్ల రూరల్ : బద్దెనపల్లి గ్రామ సమీపంలోని సండ్రవాగుపై చేపట్టిన వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. బ్రిడ్జితోపాటు సమీపంలో కల్వర్టు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో రూ.1.75కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఫిబ్రవరిలోనే పనులు ప్రారంభించారు. 2017 జనవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయడంలో శ్రద్ధ చూపడంలేదు. దీంతో వంతెన ప్రస్తుతం పిల్లర్ల దశకే చేరింది. వంతెన పనులు జరుగుతున్నందున రాకపోకలు సాఫీగా సాగేందుకు పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మించారు. కానీ, నెలరోజుల క్రితం కురిసిన వర్షాలతో వచ్చిన వరదలతో అది కొట్టుకుపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సండ్రవాగు ఉప్పొంగడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే రామన్నపల్లి, బస్వాపూర్, బాలమల్లుపల్లి గ్రామస్తులకు రవాణా భారం పెరిగింది. వీరు సుమారు పది కిలోమీటర్ల అదనంగా ప్రయాణం చేసి నేరెళ్ల మీదుగా సిరిసిల్లకు చేరుకోవాల్సి వస్తోంది. కడుపునొప్పి వచ్చినా, కాలు గుంజినా పది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేస్తేనే సిరిసిల్లలోని ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉంది. బ్రిడ్జి పూర్తయితే çసుమారు ఆరు కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. ఈ విషయంపై కాంట్రాక్టర్‌ను సంప్రదించగా.. డైవర్షన్ రోడ్డు ఓసారి నిర్మించామని, వరద ఉధృతికి అది కొట్టుకుపోయిందని, మరోసారి నిర్మించేందుకు సంబంధిత శాఖ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అయినా, త్వరలోనే తాత్కాలిక రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. తిప్పలైతంది – పూర్మాణి మల్లారెడ్డి, గ్రామస్తుడు, బస్వాపూర్ వంతెన కాడ తాత్కాలిక రోడ్డు వేస్తే బాగుంటుంది. వాగుల నీళ్లున్నయ్. ఆటోలు, బస్సులు మా ఊరికి రావడంలేదు. నేరెళ్ల నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం జేస్తేనే సిరిసిల్ల చేరుకోవచ్చు. తాత్కాలిక రోడ్డు వేయిస్తాం – రమేశ్, ఏఈ, పంచాయతీరాజ్ బద్దెనపల్లి వంతెన వద్ద నిర్మించిన తాత్కాలిక రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. వర్షపునీరు వెళ్లేందుకు వీలుగా పైపులు ఏర్పాటు చేసి మరోసారి ప్రత్యామ్నా రోడ్డు నిర్మించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.