Ministry of Foreign Affairs
-
తానే దిద్దుకున్న బతుకు చిత్రం
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.బతుకు బడి రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్లు చేసి జీతం పెంచుకుంది.కష్టాల పాఠాలురషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.విజేత లక్ష్యం రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్. ఇకిగాయ్ నేర్పించింది ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సౌదీలో తొలి మద్యం దుకాణం
రియాద్: మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కాహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్‌ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. రియాద్‌లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్‌ను మరి కొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. -
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది..
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో కూడిన మూడో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా, 274 మంది ప్రయాణికులతో నాలుగో విమానం సాయంత్రం వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో ఎయిరిండియా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమా నాల్లో 435 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. తాజా తరలింపుతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో స్వదేశానికి వచ్చిన భారతీయుల సంఖ్య 900 దాటింది. -
ఖతర్ మధ్యవర్తిత్వం
దోహా: ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల మారి్పడికి, వీలైతే పోరుకు తెర దించేందుకు ఖతర్ రంగంలోకి దిగింది. హమాస్ చెరపట్టిన మహిళలు, పిల్లలను విడిపించేందుకు ముందుకొచి్చంది. బదులుగా ఇజ్రాయెలీ జైళ్లలో బందీలుగా ఉన్న 36 మంది మహిళలు, పిల్లలను విడుదల చేయాలని ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే హమాస్ తో మాట్లాడుతున్నట్టు ఖతర్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా సాయం కూడా తీసుకుంటున్నట్టు చెప్పింది. ‘‘చర్చల్లో పురోగతి ఉంది. పోరుకు తెర పడి శాంతి నెలకొనాలని, బందీలు విడుదల కావాలని మా ప్రయత్నం’’ అని వివరించింది. ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులూ జరగడం లేదని పేర్కొంది. -
ఆక్రమిత ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. చైనా చర్యల నేపథ్యంలో దేశ రక్షణ ప్రయోజనాలు సంపూర్ణంగా పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్‌లో భాగమేనన్నారు. చైనా ఇలాంటి వక్ర చర్యలకు బదులు ఘర్షణాత్మక అంశాలపై భారత్‌తో నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. -
బహ్రెయిన్ నుంచి క్షేమంగా తిరిగొస్తున్న వలస కార్మికులు
సాక్షి, అమరావతి: బహ్రెయిన్‌లో ఎన్హెచ్ఎస్ సంస్థలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 33 మందిని బహ్రెయిన్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు భోజనం, వసతి, స్వస్థలాలకు రవాణా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది కార్మికులను వెనక్కి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎన్హెచ్ఎస్ సంస్థ దాష్టీకాలు భరించలేక ఇబ్బందులు పడుతూ అక్కడ ఇరుక్కుపోయిన కార్మికుల విషయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లగానే.. ఆయన తక్షణం స్పందించినట్టు తెలిపారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెప్టెంబర్ 13న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. దీనిపై విదేశాంగ శాఖ తక్షణం స్పందించడంతో కార్మికులను స్వదేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. -
బ్రిక్స్ సదస్సుకు మోదీ అధ్యక్షత
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సుకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. 9న వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సులో భారత్ నుంచి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పాల్గొననున్నారు. ‘అంతర్గత సహకారం’ అనే అంశం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్ వ్యవహారం కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ వ్యాఖ్యానించారు. -
భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ జలాల పరిధి విషయంలో భారత వాదనను సవాలు చేస్తూ, భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, ఈ వారం లక్షద్వీప్ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ను నిర్వహించామని అమెరికా ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సముద్ర జలాల విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లం ఘించడం సరికాదని యూఎస్‌కు స్పష్టం చేసింది. దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్), కాంటినెంటల్ జోన్ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ’కి వ్యతిరేకమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్’లో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత దేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్చను, హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించింది. సముద్ర జలాల పరిధిపై భారత వాదనను సవాలు చేస్తూ, అంతర్జాతీయ నిబంధనల మేరకు లక్షద్వీప్‌కు పశ్చిమంగా 130 నాటికల్ మైళ్ల దూరంలో, భారత ఈఈజెడ్ పరిధిలో ఎఫ్‌ఓఎన్‌ఓపీ నిర్వహించామని పేర్కొంది. దీనిపై అమెరికాకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్కా సంధి వరకు అమెరికా నౌక ఆపరేషన్స్ జరిపింది. ఈ విషయంపై భారత అభ్యంతరాలను అమెరికా ప్రభుత్వానికి దౌత్య మార్గాల ద్వారా వెల్లడించాం’ అని శుక్రవారం భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ ఈఈజెడ్ పరిధిలో ఇతర దేశాలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరి అన్న భారత వాదనను అమెరికా కొట్టివేస్తోంది. -
గల్ఫ్ వెళ్లే కార్మికులకు కేంద్రం షాక్!
మోర్తాడ్ (బాల్కొండ) : అవ్వ పెట్టదు అడుక్కు తిననివ్వదు.. అన్నట్లుగా ఉంది వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక దేశం విడిచి గల్ఫ్‌కు వలస వెళుతున్న మన కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన విదేశాంగ శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారత కార్మికుల శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వాలకు సూచించాల్సిన మన విదేశాంగ శాఖ, కార్మికులకు నష్టం కలిగించేలా ఉత్తర్వులను జారీ చేసిందని చెబుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ దేశాలకు సంబంధించి కార్మికుల ఇమ్మిగ్రేషన్ విధానంలో కనీస వేతనాల కుదింపుపై అక్కడి ప్రభుత్వాలకు భారత్ సమ్మతి తెలిపిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు గత సెపె్టంబర్ 8న ఒక ఉత్తర్వును, అదే నెలలో 21వ తేదీన మరో ఉత్తర్వును విదేశాంగ శాఖ జారీ చేసిందని చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లోనే ఈ ఉత్తర్వులు వెలువడినా గల్ఫ్ దేశాలకు ఇటీవలే మళ్లీ కార్మికుల వలసలు ప్రారంభం కావడంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో విదేశాంగ శాఖ ఉత్తర్వుల విషయం తెలిసిందని కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికులకు కనీస వేతనాన్ని కుదించవచ్చని విదేశాంగ శాఖ ఆయా ప్రభుత్వాలకు ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కె.ఆర్. సురేశ్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన మిగతా ఎంపీలు కూడా దీనిపై దృష్టిసారించాలని ఆయన కోరారు. ఖతర్, బహ్రెయిన్, ఒమన్, యునైటెడ్ అర బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు నెలకు 200 అమెరికన్ డాలర్ల వేతనం.. అంటే మన కరెన్సీలో దాదా పు రూ.15 వేలు కార్మికులకు చెల్లించవచ్చని విదేశాంగ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొందని చెబుతున్నారు. అలాగే కువైట్‌లో పనిచేసే కార్మికులకు 245 డాలర్లు, సౌదీ అరేబియాలో పని చేసేవారికి 324 డాలర్ల వేతనం చెల్లించవచ్చ ని మన విదేశాంగ శాఖ అమోదం తెలిపిందని అంటున్నారు. అయితే ఇదింకా ఎక్కువ ఉండాలని కార్మికులు చెబుతున్నారు. ఖతర్‌లో పనిచేసే వలస కార్మికులకు కనీసంగా 1,300 రియాళ్ల వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆయా కంపెనీలకు నిర్దేశించగా మన విదేశాంగ శాఖ దానిని దృష్టిలో ఉంచుకోకుండా తక్కువ వేతనానికే భారతీయ కార్మికులు పనిచేస్తారని హామీ ఇచ్చిందని తెలుస్తోంది. యూఏఈలో కార్మికులకు నెలకు రూ.16వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. విదేశాంగ శాఖ ఉత్తర్వులతో ఆ వేతనం తగ్గుతుందని అంటున్నారు. కార్మిక, కర్షకుల కష్టంతోనే దేశపురోగతి క్యాపిటలిస్టులతో దేశాభివృద్ధి జరగడం లేదని, కార్మికుల, కర్షకుల కష్టంతోనే పురోగతి సాధిస్తోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘ఆలిండియా కన్వెన్షన్ ఫర్ దళిత్ రైట్స్ అండ్ ఎగైనెస్ట్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్’ కార్యక్రమం జరిగింది. సదస్సుని బెజవాడ విల్సన్ ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో రైతులను, శ్రామికులను చిన్నచూపుతో చూస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 58.9 శాతం దళితులు ఇప్పటికీ భూమి లేకుండా రైతు కూలీలుగా జీవనాన్ని వెళ్లదీస్తున్నారన్నారు. దేశం లో సామాజిక, కుల వివక్షకు బీజేపీ వంటి హిందూత్వ పార్టీలే ప్రధాన కారణమని విమర్శించారు. పేదరికం కారణంగా దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంక ట్ వాపోయారు. కార్యక్రమంలో హన్నన్ మొల్ల (ఏఐకేఎస్), ఏఐఏడబ్ల్యూయూ నేత విక్రమ్ సింగ్, తెలంగాణ కార్మిక సంఘం నేత ఐలయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు, గుల్జార్‌సింగ్ గోరియా (బీకేఎంయూ), అసిత్ గంగూలీ (ఎస్కేఎస్), సంజయ్ శర్మ (ఏఐఏఆర్ఎల్ఏ), సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఫిన్లాండ్లో భారత రాయబారిగా రవీష్ కుమార్
ఢిల్లీ/హెల్సింకి : ఫిన్లాండ్లో భారత రాయబారిగా రవీష్ కుమార్‌ను భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1995 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అయిన రవీష్ కుమార్.. ప్రస్తుతం విదేశాంగమంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. 2017 జూలై నుంచి 2020 ఏప్రిల్ వరకు విదేశీమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా ఉన్న రవీష్ కుమార్.. ఈ సమయంలో అతి సున్నితమైన బాలాకోట్ స్ట్రైక్స్‌తోపాటు జమ్ముకశ్మీర్ పునర్వవస్థీకరణ, ఎన్నార్సీపై భారతదేశం యొక్క విధానాన్ని ప్రపంచానికి విడమరిచి చెప్పారు. ('అంకుల్.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు') అంతకుముందు ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కౌన్సిల్ జనరల్‌గా కూడా సేవలందించారు. జకర్తాతో పాటు థింపూ, లండన్‌లోని ఇండియన్ మిషన్‌లో పనిచేశారు. 25 ఏండ్ల ఐఎఫ్ఎస్ సర్వీసు కలిగివున్న రవీష్ కుమార్.. ప్రస్తుతం ఫిన్లాండ్లో భారత రాయబారిగా ఉన్న వాణిరావు స్థానంలో నియమితులయ్యారు. ఫిన్లాండ్లో భారత్‌కు చెందిన దాదాపు 35 కంపెనీలు ఐటీ, ఆరోగ్యం, ఆతిథ్యం, ఆటోమోటీవ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టగా.. ఫిన్లాండ్కు చెందిన దాదాపు 100 సంస్థలు భారత్‌లో విద్యుత్, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ రంగాలలో పెట్టుబడులు పెట్టాయి.(అన్‌లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు) -
మాటలన్నీ తూటాలే!
సుష్మా స్వరాజ్ నిలుచుంటే నిండా ఐదగుడుల ఎత్తు కూడా ఉండరు. ఒక అంగుళం తక్కువే ఉంటారు. కానీ రాజకీయాల్లో, వ్యక్తిత్వంలో ఆమె శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారు. 67 ఏళ్ల వయసులో... దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ప్రజా జీవితంలోనే!!. 1970లలో హరియాణా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం... అంచెలంచెలుగా ఆమెను విదేశాంగ మంత్రి స్థాయికి చేర్చింది. సుష్మా రాజకీయ మూలాలు కుటుంబం నుంచే మొదలయ్యాయని చెప్పాలి. తల్లిదండ్రులు వాస్తవంగా పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రాంతంలో పుట్టినా... దేశ విభజన సమయంలో హరియాణాకు వచ్చేశారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆరెస్సెస్ కార్యకర్త. సుష్మ కూడా చదువుకునేటప్పుడే అఖిలభారత విద్యార్థి పరిషత్‌లో చేరారు. ఎమర్జెన్సీ తరవాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో ఆమె తొలిసారి ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 52 రోజులు మాత్రమే కొనసాగినా.. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన ముద్రవేశారు. సినిమాలకు ఊపిరి... 1999లో వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిగా ఉన్నపుడు సుష్మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణానికి పరిశ్రమ స్థాయి కల్పించారు. దీంతో సినిమాలకు బ్యాంకు రుణాలు తీసుకోవటం సులభమయింది. అప్పటిదాకా ఫైనాన్స్ కోసం అండర్‌వరల్డ్‌పై భారీగా ఆధారపడిన సినిమా రంగం... ఈ నిర్ణయంతో కొత్త టర్న్ తీసుకుంది. ఫైనాన్షియల్ కంపెనీలు ఈ రంగంలోకి రావటానికి మార్గం సుగమమయింది. ‘డిజిటల్ డిప్లొమసీ’.... 2014 నుంచీ సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఆమె సమాచారాన్ని అందరికీ చేరవేయటానికి సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ను ప్రధాన వేదికగా చేసుకున్నారు. ప్రతి అంశాన్నీ ట్వీట్ చేయటంతో ఆమెకు ట్విటర్లో ఏకంగా 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఎవరైనా సహాయం అడిగితే ట్విటర్ ద్వారా వెంటనే స్పందించేవారు. ఏ సమయంలోనైనా ట్విటర్లో అందుబాటులో ఉండే నేతగా సామాజిక మాధ్యమాల్లో ఆమెకు పేరుంది. అందుకే వాషింగ్టన్ పోస్ట్ ఈమెకు ‘సూపర్ మామ్’ ట్యాగ్ కూడా తగిలించింది. ప్రజా జీవితంలోనే నాలుగు దశాబ్దాలు పుట్టిన తేదీ: ఫిబ్రవరి 14, 1952 తల్లిదండ్రులు: హర్దేవ్ శర్మ, లక్ష్మీదేవి పుట్టినూరు: హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్ చదువు: బీఏ – సనాతన్ ధర్మ కాలేజి, అంబాలా ఎల్ఎల్బీ – పంజాబ్ యూనివర్సిటీ భర్త: స్వరాజ్ కౌశల్ (1975లో వివాహం) సంతానం: ఒక కుమార్తె వృత్తి: సుప్రీంకోర్టు లాయర్ రాజకీయం: మూడుసార్లు ఎమ్మెల్యే. ఏడు సార్లు ఎంపీ (1990, 2000, 2006లో రాజ్యసభ, 1996, 1998, 2009, 2014లో లోక్‌సభ) - భర్త స్వరాజ్ కౌశల్ పిన్న వయస్సులోనే గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించగా, హరియాణా కేబినెట్లో (1977– 82, 1987–90) అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా సుష్మా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈ దంపతులు విశిష్ట జంటగా లిమ్కాబుక్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. - ఢిల్లీ ముఖ్యమంత్రిగా అక్టోబర్ 13, 1998 నుంచి డిసెంబర్ 3, 1998 వరకు పనిచేశారు. - 1998లో కేంద్ర సమాచార, ప్రసార, టెలికమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా ఉన్నారు. - 2000– 20003 సంవత్సరాల్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖలకు మంత్రిగా - 2003–2004 కాలంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. - 2009లో లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. - 2014– 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. - పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎస్సీసీ ఉత్తమ కేడెట్‌గా, ఉత్తమ విద్యార్థినిగా మూడేళ్లపాటు ఎంపికయి గోల్డ్ మెడల్ సాధించారు. వివిధ స్థాయీసంఘాలు, పార్లమెంట్ కమిటీల్లో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు. హరియాణా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్‌గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు. -
మరో 8 నగరాల్లో ఈ–వీసాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా నగరాలకు చెందిన పర్యాటకులకు బయో మెట్రిక్ విధానంలో ఈ–వీసా మంజూరు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ 8 నగరాల్లో ఒట్టావా (కెనడా), సెయింట్ పీటర్స్బర్గ్, వ్లాడివోస్తక్ (రష్యా), మ్యూనిచ్ (జర్మనీ), బ్రస్సెల్స్ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్ (హంగేరి), జగ్రీబ్ (క్రొయేషియా) ఉన్నాయి. ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్ వివరాలు ఇస్తే చాలు ఈ–వీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ–వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
ప్రధాని మోదీకి శాంతి పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కరాన్ని ప్రకటించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి గాను ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. ఈమేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ.. ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్’ చేశారని సియోల్ శాంతి పురస్కార కమిటీ వెల్లడించినట్లు రవీష్ తెలిపారు. ప్రధాని సియోల్ శాంతి పురస్కారాన్ని అందుకోబోయే తేదీ త్వరలో వెల్లడిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని అవార్డు కమిటీ తెలిపింది. 1990లో 24వ ఒలింపిక్ క్రీడలను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ అవార్డు అందుకోనున్న పద్నాలుగో వ్యక్తి మోదీ. ఆయనకంటే ముందు యూఎన్ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వంటి ప్రముఖులకు ఈ అవార్డు ఇచ్చారు. కాగా, సియోల్ శాంతి పురస్కారం ప్రకటించడం పట్ల చాలా ఆనందంగా ఉందని మోదీ తెలిపారు. దక్షిణకొరియాతో భారత్‌కు ఉన్న మెరుగైన భాగస్వామ్య ఒప్పందాల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. -
స్పష్టమైన ఆధారాలున్నాయ్
-
స్పష్టమైన ఆధారాలున్నాయ్
- సైనికుల తలలు నరకడంపై పాక్‌కు భారత్ స్పష్టీకరణ - పాక్ ఆర్మీ కమాండర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ: భారత సైనికుల తలలను పాకిస్తాన్ సైనికులే నరికారనడానికి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఆర్మీ కమాండర్లపై చర్యలు తీసుకోవాలని పాక్‌ను భారత్ కోరింది. ఈ ఘటనను ‘తీవ్రమైన కవ్వింపు చర్య’గా భారత్ పరిగణిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. నియంత్రణ రేఖ కృష్ణ ఘాటీ వద్ద సేకరించిన రక్తపు నమూనాలు మృతిచెందిన భారత సైనికుల రక్తంతో సరిపోలు తున్నాయన్నారు. ఢిల్లీలో పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను విదేశాంగ కార్యదర్శి జెశంకర్ బుధవారం పిలిపించి నిరసన తెలిపారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను అందజేయడంతో పాటు ఈ అమానుష కాండకు పాల్పడిన పాక్ సైనిక సిబ్బందిపై, ఆర్మీ కమాం డర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జైశంకర్ డిమాండ్ చేశారు. హంతకులు ముమ్మాటికే పాక్ నుంచి వచ్చిన వారేనని పాక్ రాయబారికి వివరించినట్టు కూడా విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, పాక్ సైనికుల చేతిలో హత్యకు గురైన బీఎస్ఎఫ్ సైనికుడు ప్రేమ్ సాగర్ అంత్య క్రియలు ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం తికంపూర్లో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైనికుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
జాధవ్ జాడ తెలియదు
ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం: విదేశాంగ శాఖ న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ వ్యవహారంలో ఇరుదేశాలు పట్టు వీడటం లేదు. ఆయన్ని రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించగా, జాధవ్ మరణ శిక్ష విషయంలో రాజీ పడకూడదని పాక్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. జాధవ్ అమాయకుడని,ఆయన పాక్‌లో ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. జాధవ్‌ను స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు. జాధవ్‌కు న్యాయం చేయడానికి భారత్ ఎంతవరకైనా వెళ్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. రాజీ ఉండదు: పాక్ సైనిక ఉన్నతాధికారులు జాధవ్‌కు ఉరిశిక్షపై వెనక్కి తగ్గకూడదని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయన్ని ఉరితీస్తే ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత్ చేసిన హెచ్చరికలను పెడచెవిన పెడుతూ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గురువారం రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా నేతృత్వంలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలిటరీ మీడియా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది. స్పందించలేం: ఐరాస జాధవ్‌కు పాక్ మరణశిక్ష విధించడంపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితి నిరాకరించింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, పాక్‌లకు సూచించింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. -
అన్నీ విద్వేష దాడులు కావు
- విదేశాల్లో భారతీయుల మృతిపై అప్రమత్తంగా ఉన్నాం - హెచ్1బీ వీసాలపై ఆంక్షలతో అమెరికాకు నష్టమే: సుష్మ న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులపై జరిగిన దాడులు, మరణాలన్నింటినీ విద్వేష చర్యలుగా పరిగణించకూడదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. అమెరికాలో ఇటీవల భారతీయులపై వరుసదాడులపై రాజ్యసభలో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు సుష్మ సమాధానమిస్తూ.. విదేశాల్లో భారతీయుల మరణాలపై ఎంతో అప్రమత్తంగా ఉన్నామని, ప్రభుత్వం వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. దాడులపై అమెరికా అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని, విద్వేష కోణంలోనూ విచారణ కొనసాగుతుందన్నారు. కేసు పురో గతిపై అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని చెప్పారు. కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై స్పందిస్తూ.. నిందితుడ్ని తర్వాతి రోజే పట్టుకున్నారని, అయితే కెంట్‌లో దీప్ రాయ్‌పై దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. దీప్ రాయ్ కేసు విద్వేష చర్యా? కాదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఆ కేసులో ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలిపారు. హర్నీష్ పటేల్ పై దాడిని అమెరికన్ పోలీసులు దోపిడీగా తేల్చారని సుష్మ పేర్కొన్నారు. మరో రెండు కేసుల వివరాల్ని వెల్లడిస్తూ.. ఒక కేసులో న్యూజెర్సీలో ఉన్న బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడానని, అది విద్వేష చర్య కాదని వ్యక్తిగత, కుటుంబ అంశంమని వారు తెలిపారన్నారు. మరో కేసు కూడా విద్వేష చర్య కాదని అమెరికా అధికారులు తేల్చారని సుష్మ వెల్లడించారు. అమెరికాలో భారతీయుల హత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందన్న ప్రతిపక్షాల వాదనను ఖండించారు. విదేశాల్లో మరణించే ప్రతీ భారతీయుడి వివరాలు విదేశాంగ శాఖ వద్ద ఉన్నాయని, ఆయా వ్యక్తుల కుటుంబాలతో మాట్లాడుతున్నామని చెప్పారు. 1.5 లక్షల భారతీయులకు ఉద్యోగ వీసాలు 2016 నాటికి అమెరికాలో 1.5 లక్షల మంది భారతీయులకు ఉద్యోగ వీసాలు జారీచేశారని, అందులో 1.26 లక్షలు హెచ్1బీ వీసాలేనని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు చెప్పారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సమాచారం మేరకు దాదాపు 5.4 లక్షల మంది ఎన్నారైలకు గ్రీన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. గోయల్, సింధియా మధ్య వాగ్వాదం దేశంలో విద్యుత్ పరిస్థితిపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని సింధియా లేవనెత్తుతూ.. ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చినా ఇంతవరకూ 7 కోట్ల గృహాలకు విద్యుత్ సరఫరా లేదన్నారు. సింధియా ఆరోపణల్ని గోయల్ ఖండిస్తూ.. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనితీరును సింధియా బయటపెట్టారని విమర్శించారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని చెప్పారు. లక్షన్నర మందికి ఉపాధి హెచ్1బీ వీసాలపై ఆంక్షలు పెడితే భారత్‌కే కాకుండా అమెరికాకు నష్టమేనని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. హెచ్1బీ పరస్పర ప్రయోజన భాగస్వామ్యంగా ఆమె అభివర్ణించారు. భారత ఐటీ కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాల్ని కల్పించడమే కాకుండా ఆ దేశ ఆర్థిక రంగానికి సాయం చేస్తున్నారని చెప్పారు. అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు కొల్లగొడుతున్నారన్న వాదనలో వాస్తవం లేదని, భారతీయ కంపెనీలే అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని సభకు వెల్లడించారు. భారతీయ కంపెనీలు 1.56 లక్షల మంది అమెరికన్లకు ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతో పాటు, 4.11 లక్షల మందికి అనుబంధ ఉద్యోగావకాశాలు కల్పించాయని చెప్పారు. 2011 నుంచి 2015 మధ్యలో భారతీయ కంపెనీలు అమెరికాలో రూ. 13,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయని, అలాగే 1.32 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. సోషల్ సెక్యూరిటీ కోసం భారతీయ ఉద్యోగులు రూ. 45,500 కోట్లు చెల్లించారని చెప్పారు. భారత్‌లోని అమెరికన్ కంపెనీలు ఏటా 1.81 లక్షల కోట్ల ఆర్జిస్తున్నాయని వెల్లడించారు. -
కెనడా హైకమిషనర్‌గా వికాస్ స్వరూప్
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ కెనడాలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రçస్తుతం అదనపు కార్యదర్శి హోదాలో కొనసాగుతున్న ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ , ఇరాన్ డివిజన్ లో ఉమ్మడి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న గోపాల్ బాగ్లే స్వరూప్ స్థానంలో విదేశాంగ శాఖ నూతన అధికార ప్రతినిధిగా నియమితులవుతారు. 1986 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన స్వరూప్ విదేశాంగ శాఖ సేవలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువచేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన రాసిన తొలి నవల ‘క్యూ అండ్ ఏ’ను ఆస్కార్ అవార్డు గెలుపొందిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంగా తీశారు. -
‘సెప్టెంబర్ 25 లోపు తిరిగొచ్చేయండి’
న్యూఢిల్లీ: సౌదీ లో ఉద్యోగాలు కోల్పోయిన భారత కార్మికులంతా సెప్టెంబర్ 25 లోపు స్వదేశానికి తిరిగి రావాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కోరారు. అలాంటి వారు ఎలాంటి చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తరువాత వచ్చే వారు బస, తిరుగు ప్రయాణం వంటి ఏర్పాట్లు సొంతంగా చేసుకోవాల్సి ఉంటుందని సుష్మా తన ట్విటర్లో స్పష్టం చేశారు. సౌదీలో కంపెనీలు మూసివేయడంతో వేల మంది భారత కార్మికులు ఉద్యోగాలు పోయి, పాత బకాయిలు రాక అక్కడ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంకా అక్కడ వేచివుండటంలో అర్థం లేదని, వెంటనే స్వదేశానికి వచ్చేయాలని కార్మికులకు సుష్మ విజ్ఞప్తి చేశారు. -
మాల్యా పాస్‌పోర్టు రద్దు
► రుణ ఎగవేత కేసుల నేపథ్యంలో విదేశాంగ శాఖ నిర్ణయం ► డిపోర్టేషన్‌కు చర్యలు వేగవంతం! న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల రుణ ఎగవేత కేసుల్లో చిక్కుకుని దేశం విడిచిపోయిన విజయ్ మాల్యా పాస్ట్‌పోర్టును ఆదివారం భారత్ రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను వెనక్కిరప్పించే(డిపోర్టేషన్) ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఐడీబీఐ బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ముంబై కోర్టు మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా.. దీనికి మూడుసార్లు కూడా నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఈడీ విదేశాంగ శాఖను కోరింది. దీంతో ఈ నెల 15న విదేశాంగ శాఖ మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాస్‌పోర్టును ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసును కూడా జారీచేసింది. దీనికి మాల్యా ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో చివరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ చెప్పారు. రుణ ఎగవేత కేసులు చుట్టుముట్టడంతో మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, రూ.900 కోట్ల ఐడీబీఐ రుణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు(డిపోర్టేషన్) ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ మాల్యా డిపోర్టేషన్‌కు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైతే.. మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ సర్కారు.. బ్రిటన్ ప్రభుత్వ సహకారాన్ని కోరనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు రద్దు, ముంబై కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా మాల్యా డిపోర్టేషన్‌ను భారత్ కోరనుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టు రద్దవటంతో విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం అవుతుందని.. తప్పకుండా భారత్‌కు రావాల్సిందేననేది విదేశాంగ శాఖ వర్గాల వాదన. కాగా, ఇప్పుడు మాల్యా తనను బ్రిటన్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా బ్రిటిష్ అధికారులను సంప్రదించే అవకాశం ఉంది. అదేవిధంగా పాస్‌పోర్టు రద్దును సవాలు చేస్తూ భారత్‌లోని కోర్టులను కూడా ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. రుణ ఎగవేత, మోసపూరిత కుట్ర, మనీలాండరింగ్ వంటి ఆరోపణలకు సంబంధించి ఈడీతోపాటు సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ ఇతరత్రా దర్యాప్తు సంస్థలు కూడా మాల్యాపై విచారణ జరుపుతున్నాయి. యూకే ఓటర్ల జాబితాలో మాల్యా... రుణ ఎగవేత కేసుల కారణంగా బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన మాల్యా... అక్కడి పౌరుడిగా ఓటర్ల లిస్టులో కూడా ఉన్నారు. భారత్ నుంచి తానేమీ పరారైపోలేదని.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ వాదిస్తున్న మాల్యా.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని టెవిన్ గ్రామంలో ఉన్న మూడంతస్తుల భవంతి(లేడీవాక్)ని ప్రస్తుతం తన అధికారిక అడ్రస్‌గా ధ్రువీకరించినట్లు సండేటైమ్స్ పత్రిక పేర్కొంది. ఉత్తర లండన్ నుంచి గంటన్నర ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చని తెలిపింది. కాగా, ఇక్కడున్న తన చిరునామా సమాచారాన్ని భారతీయ అధికారులకు కూడా తెలియజేసినట్లు మాల్యా చెప్పారని సండేటైమ్స్ వెల్లడించింది. బ్రిటిష్ ఫార్ములా వన్ చాంపియన్ లెవిస్ హామిల్టన్ తండ్రి వద్దనుంచి మాల్యా ఈ భవంతిని 11.5 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశారు. విదేశీ మూలాలున్న తన కంపెనీ ద్వారా ఆయన ఈ ప్రాపర్టీని దక్కించుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. -
పాకిస్తాన్‌కు ఆహ్వానం లేదు
ఐఎఫ్ఆర్పై సమాచారం మాత్రమే ఇచ్చిన కేంద్రం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్ఆర్ -2016)లో పాకిస్తాన్ పాల్గొనడం లేదు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌ను ఆహ్వానించలేదు. నౌకాదళ పాటవాన్ని ప్రదర్శించడంతోపాటు ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ఐఎఫ్ఆర్-2016కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు నిర్వహించే ఐఎఫ్ఆర్లో దాదాపు 60 దేశాలు పాల్గొననున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చైనా, రష్యా, ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలతోపాటు ఆగ్నేయాసియా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. వ్యూహాత్మక కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌ను ఐఎఫ్ఆర్కు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఐఎఫ్ఆర్ నిర్వహిస్తున్నట్లు విదేశాంగ శాఖ పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశానికి కొన్ని నెలల క్రితమే లాంఛనప్రాయంగా సమాచారం ఇచ్చింది. ఎందుకంటే ఐఎఫ్ఆర్లో భాగంగా దేశ సముద్ర జలాల్లో యుద్ధ నౌకల కదలికలు, విన్యాసాలు ఉంటాయి. దీనిపై పొరుగు దేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే పాకిస్తాన్‌కు ఐఎఫ్ఆర్కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. -
మీరు జారీ చేసిన వీసాలే!
వాటిని గౌరవించాలంటూ అమెరికాకు విదేశాంగ శాఖ విజ్ఞపి సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపుతుండడంపై బుధవారం భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘వారికి వీసాలను జారీ చేసింది మీ కాన్సులేట్లు, ఎంబసీలే.. ఆ వీసాలను గౌరవించాలి’ అని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. వ్యాపార, పర్యాటక, పని వీసాలపై వెళ్తున్నవారినీ వెనక్కి పంపుతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీల్లోనే కాకుండా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులనూ వెనక్కి పంపుతున్నారంది. అలాగే, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తున్న విద్యార్థులు అవసరమైన అన్ని అధికారిక ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచిస్తూ బుధవారం మరో ప్రకటన జారీ చేసింది. కాగా, కాలిఫోర్నియాలోని రెండు వర్సిటీలను నిషేధిత జాబితాలో ఉంచడంతో వాటిలో చేరిన భారతీయ విద్యార్థులను మాత్రమే వెనక్కుపంపడం లేదని అమెరికా భారత్‌కు స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ విచారణలో.. వీసాల్లో ఉన్న వివరాలకు, విద్యార్థులు ఇస్తున్న సమాచారానికి పొంతన లేనట్లుగా తేలుతున్నందువల్లనే వారిని దేశంలోకి అనుమతించడం లేదని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు భారత విదేశాంగ కార్యాలయానికి తెలిపారు. ఈ నేపథ్యంలో.. అమెరికా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవాలనుకునే విద్యార్ధులు అన్ని విషయాలన లోతుగా అధ్యయనం చేశాకే ముందుకు వెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది. స్టడీ ప్లాన్, వసతి, ఆర్ధిక సహాయం తదితర అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తమ వెంట తీసుకెళ్లాలని, ఇంటర్వ్యూ సమయంలో ఈ పత్రాల్ని ఇమిగ్రేషన్ అధికారులకు అందచేయాలని సూచించింది. అలాగే, ఇతర వీసాలపై అమెరికా వెళ్తున్నవారు కూడా యూఎస్‌లో ఎక్కడ ఉండబోతున్నారు?, స్పాన్సర్షిప్, ఆర్థికపరమైన మద్దతు. తదితర వివరాలున్న డాక్యుమెంట్స్‌ను విధిగా వెంట తీసుకువెళ్లాలని సూచించింది. భారత్ విజ్ఞప్తి.. ‘మా విద్యార్థులకు వీసాలను జారీ చేసింది మీ కాన్సులేట్లు, ఎంబసీలే.. ఆ వీసాలను గౌరవించాల్సిన అవసరముంది. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులనే కాకుండా వేరే యూనివర్సిటీల్లో చేరిన వారిని కూడా వెనక్కు పంపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వ్యాపార, పర్యాటక, పని వీసాలపై వెళ్తున్నవారిని సైతం వెనక్కి పంపుతున్నారు’. అమెరికా వివరణ.. ‘కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీలను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో పెట్టిన కారణంగా.. వాటిలో చేరిన భారతీయ విద్యార్థులను మాత్రమే వెనక్కుపంపడం లేదు. ఇమిగ్రేషన్ విచారణ సందర్భంగా వీసాలో ఉన్న వివరాలకు, విద్యార్థులు ఇస్తున్న సమాచారానికి పొంతన లేనట్లుగా తేలుతున్నందువల్లనే వారిని దేశంలోకి అనుమతించడం లేదు’. -
గల్ఫ్‌కు వలస వెళ్లకుండా చట్టం
♦ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఐటీ మంత్రి కేటీఆర్ ♦ ఇంటి పనుల కోసం వెళ్తున్న మహిళలకు ఇబ్బందులు ♦ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి ♦ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మంత్రి భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఇళ్లలో పనుల కోసం మహిళలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లకుండా చట్టాలను సవరించాలని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు వలసల నిషేధ చట్టాన్ని తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కేంద్రానికి తెలిపినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన తెలంగాణ యువత, మహిళలు పడుతున్న ఇబ్బందులను శుక్రవారమిక్కడ మంత్రి కేటీఆర్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘గల్ఫ్ దేశాల్లో తెలంగాణవాసుల ఇబ్బందులను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి. వారి కష్టాలకు బాధ్యులైనవారిపై కఠినంగా వ్యవహరించాలి. సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో వసూలు చేసిన సొమ్ము ను గల్ఫ్ వాసుల సంక్షేమానికి వినియోగించాలి. ఆ దేశాలకు వలస వెళ్లే వారి వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలి. దీంతో వివిధ వీసాలపై వెళ్లేవారు నిర్దిష్ట కాల పరిమితిలోగా వెనక్కి రాకుంటే వారి సమాచారం తెలుస్తుంది. ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించేందుకు కూడా ఆ వివరాలు దోహదపడతాయి’’ అని కేటీఆర్ చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములుగా చేసి ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి సమీక్ష చేయాలని కేంద్రానికి విన్నవించినట్లు తెలిపారు. అధికారులతో జరిపిన సమావేశంలో ఎంపీ వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, గల్ఫ్ బాధిత మహిళలు ఉన్నారు. ఏపీ మహిళల గోడు వివరించిన మంత్రి రావెల గల్ఫ్‌లో ఏపీ బాధిత మహిళల గోడును ఆ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులకు వివరించారు. తెలుగు మహిళలు గల్ఫ్ దేశాల్లో కష్టాలు పడటం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఉద్యోగాల పేరిట గల్ఫ్ దేశాలకు తరలిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే వలసలు ఆగుతాయన్నారు. అవసరమైతే ఉపాధి కోసం ప్రభుత్వమే గల్ఫ్ దేశాలకు పంపే అవకాశాలను పరిశీలించాలన్నారు. గల్ఫ్ బాధిత మహిళలను వారి సొంత ప్రాంతాలకు తరలించడానికి నిధిని ఏర్పాటు చేసి, ఆయా మహిళల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. -
26న భారత్‌కు గీత
న్యూఢిల్లీ: ఏడేళ్ల వయసులో పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్లో పదిహేనేళ్లుగా ఉంటున్న మూగ, చెవిటి అమ్మాయి గీత ఈ నెల 26న భారత్‌కు రానుంది. పాక్‌లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థలోని ఐదుగురు సభ్యులు ఆమెతో రానున్నారు. ఆ సభ్యులను ప్రభుత్వ అతిథులుగా భావించి గౌరవమర్యాదలు చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. -
సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 4 నుంచి 2016-17 బడ్జెట్‌పై వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపనుంది. తొలిగా వాణిజ్య, టైక్స్‌టైల్, విదేశీ వ్యవహారాల శాఖలతో ప్రారంభం కానున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు సెప్టెంబర్ 28న ముగుస్తాయి. ఈ సంప్రదింపుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానంగా 2016-17 బడ్జెట్ వ్యయ ప్రతిపాదనలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది. సంప్రదింపుల్లో భాగంగా పలు ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు వ్యయ ప్రతిపాదనలు తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందిస్తాయి. -
‘లలిత్ వీసాపై సమాచారం ఇవ్వలేం’
న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వీసాకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద దాఖలైన దరఖాస్తును విదేశాంగ శాఖ తిరస్కరించింది. దరఖాస్తులోని 1-3 ప్రశ్నలు ఆర్టీఐ పరిధిలోకి రావని, 4-7 ప్రశ్నలకు సమాచారం తమ దగ్గర లేదంటూ సమాధానమిచ్చింది. దరఖాస్తును పాస్‌పోర్ట్ కాన్సులర్, ఆర్థిక, హోం శాఖలకు పంపిస్తామంది. హరియాణాకు చెందిన రాయో దాఖలుచేసిన ఈ దరఖాస్తులోని ప్రశ్నలు ఇవీ.. 1. లలిత్ పాస్‌పోర్టును పునరుద్ధరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లరాదని ఎవరు నిర్ణయించారు. 2. లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు మానవతా దృక్పథంతో సాయం చేయాలనుకున్న సుష్మ ఆయనను లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకోమని ఎందుకు సూచించలేదు? 3. తాత్కాలిక ట్రావెల్ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఆయనను భారత్‌కు తిరిగి రావాలని సుష్మ ఎందుకు షరతు విధించలేదు? 4. బ్రిటన్‌లో లలిత్ ఆశ్రయంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందా? 5. లలిత్‌కు తాజా వీసా అందిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ జారీ చేసిన సమన్లు అందించేందుకు తీసుకున్న చర్యలేంటి? 6. పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరిన ఈడీ ఆ విషయంపై కోర్టును సంప్రదించిందా? 7. భారత్‌కు తిరిగొస్తే తన ప్రాణాలకు ముప్పుంటుందన్న లలిత్ వాదనపై ప్రభుత్వ స్పందన ఏమిటి?. -
ఇక ఆన్లైన్లో పాస్‌పోర్టు విచారణ
మోర్తాడ్ : పాస్‌పోర్టు పొందాలనుకునే దరఖాస్తు దారుడికి ఇక ఇబ్బందులు తొలగనున్నాయి. విదేశాంగ శాఖ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల పాస్‌పోర్టు విచారణ ఇక నుంచి ఆన్లైన్లోనే పూర్తి కానుంది. గతంలో మా దిరిగా పాస్‌పోర్టు విచారణకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం లేదు. కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్టు విచారణకు సంబంధించిన తంతు పూర్తి కానుంది. దీంతో దరఖాస్తుదారుడికి పాస్‌పోర్టు కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించిన వివరాలను స్పెషల్ బ్రాంచ్ అధికారులు పరిశీలించి తమకు ప్రభుత్వం అందించిన ఐ ప్యాడ్ ద్వారా విచారణ ఆంశాలను ఆన్లైన్లో పాస్‌పోర్టు కార్యాలయానికి పంపాల్సి ఉంది. జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ప్రభుత్వం అందించిన ఐ ప్యాడ్లను అందజేశారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడే ఫోటో తీసుకుని వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. ఆన్లైన్లో పొందుపరిచిన వెంటనే ఉన్నతాధికారులు వివరాలను పరిశీలించి ఆమోదం తెలపడమా లేక పెండింగ్‌లో ఉంచడమా తేల్చుతారు. వివరాలు అన్ని సక్రమంగా ఉంటే మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు తయారుకానుంది. మాన్యువల్ పద్ధతిలో విచారణ జరపడం వల్ల కాలయాపన ఎక్కువగా జరిగేది. ఒక్కోసారి పాస్‌పోర్టు చేతికి అందడానికి మూడు నెలల సమయం పట్టేది. ఇప్పుడు అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఎలాంటి వివాదం లేకుంటే కేవలం పదిహేను రోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందుతుంది. ఠాణాలకు ఐ ప్యాడ్లు... స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఐ ప్యాడ్లను అందించిన విధంగానే ప్రభుత్వం పోలీసు స్టేషన్లకు ఐ ప్యాడ్లను సరఫరా చేసింది. ఠాణాల పరిధిలో చోటు చేసుకునే సంఘటనలను, విచారణకు సంబంధించిన వివరాలు, రాస్తారోకో,ధర్నా తదితర సంఘటనలను ఈ ఐ ప్యాడ్‌లో రికార్డు చేయడానికి ప్రభుత్వం ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు కేటాయించింది. ఐ ప్యాడ్లను ఎస్హెచ్ఓ అధీనంలో ఉం చుతారు. ఐ ప్యాడ్లను వినియోగించడం వల్ల పోలీసులకు సంబంధించిన సేవ లు పారదర్శకంగా జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. -
త్వరలో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లను జారీ చేయాలని విదేశాంగ శాఖ యోచిస్తోంది. పూర్తిస్థాయిలో సాంకేతిక వ్యవస్థను రూపొందించుకుని, పాస్‌పోర్ట్‌ల తయారీకి వివిధ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2015 సంవత్సరానికల్లా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్టు విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు లేకుండా చేయడమే ఈ-పాస్‌పోర్ట్‌ల లక్ష్యమని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను తమ శాఖ వెల్లడిస్తుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు ఇలా ఉంటాయి వేలిముద్రలతో కూడిన చిప్‌ను పాస్‌పోర్ట్‌లో అమర్చుతారు. పాస్‌పోర్ట్‌లోని రెండో పేజీలో డిజిటల్ సంతకం, షేడెడ్ ఫొటోగ్రఫీ, ఐరిస్ (కంటిపాప) ముద్ర తదితరాలు ఉంటాయి. వేలిముద్రలతో కూడిన చిప్‌ను కవర్ పేజీ లేదా చివరి కవర్లో అమర్చుతారు. బయోమెట్రిక్, ఐరిస్, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కాబట్టి నకిలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావుండదు. ఎయిర్‌పోర్ట్‌లో చిప్‌తో కూడిన ఆధారాలను పరిశీలించాకే అనుమతిస్తారు.ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్‌లను కూడా ఈ-పాస్‌పోర్ట్‌లుగా మార్చే ఆలోచన కూడా ఉంది.