
26న భారత్‌కు గీత
న్యూఢిల్లీ: ఏడేళ్ల వయసులో పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లో పదిహేనేళ్లుగా ఉంటున్న మూగ, చెవిటి అమ్మాయి గీత ఈ నెల 26న భారత్‌కు రానుంది. పాక్‌లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థలోని ఐదుగురు సభ్యులు ఆమెతో రానున్నారు. ఆ సభ్యులను ప్రభుత్వ అతిథులుగా భావించి గౌరవమర్యాదలు చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.