
ఢిల్లీ/హెల్సింకి : ఫిన్‌లాండ్‌లో భారత రాయబారిగా రవీష్ కుమార్‌ను భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1995 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అయిన రవీష్ కుమార్.. ప్రస్తుతం విదేశాంగమంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. 2017 జూలై నుంచి 2020 ఏప్రిల్ వరకు విదేశీమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా ఉన్న రవీష్ కుమార్.. ఈ సమయంలో అతి సున్నితమైన బాలాకోట్ స్ట్రైక్స్‌తోపాటు జమ్ముకశ్మీర్ పునర్వవస్థీకరణ, ఎన్నార్సీపై భారతదేశం యొక్క విధానాన్ని ప్రపంచానికి విడమరిచి చెప్పారు.
('అంకుల్.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు')
అంతకుముందు ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కౌన్సిల్ జనరల్‌గా కూడా సేవలందించారు. జకర్తాతో పాటు థింపూ, లండన్‌లోని ఇండియన్ మిషన్‌లో పనిచేశారు. 25 ఏండ్ల ఐఎఫ్‌ఎస్ సర్వీసు కలిగివున్న రవీష్ కుమార్.. ప్రస్తుతం ఫిన్లాండ్‌లో భారత రాయబారిగా ఉన్న వాణిరావు స్థానంలో నియమితులయ్యారు. ఫిన్‌లాండ్‌లో భారత్‌కు చెందిన దాదాపు 35 కంపెనీలు ఐటీ, ఆరోగ్యం, ఆతిథ్యం, ఆటోమోటీవ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టగా.. ఫిన్‌లాండ్‌కు చెందిన దాదాపు 100 సంస్థలు భారత్‌లో విద్యుత్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ రంగాలలో పెట్టుబడులు పెట్టాయి.(అన్‌లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు)
Comments
Please login to add a commentAdd a comment