ambassador
-
Mahakumbh-2025: అంబాసిడర్ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన
జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేళాకు దేశ విదేశాల నుండి స్వామీజీలు, బాబాల రాక మొదలయ్యింది. వీరిలో కొందరు బాబాలు అక్కడి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇదేకోవలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు అంబాసిడర్బాబా.మధ్యప్రదేశ్ నుంచి అత్యంత పురాతన అంబాసిడర్ కారులో వచ్చిన ఒక బాబా.. అంబాసిడర్ బాబా(Ambassador Baba)గా పేరొందారు. ఆయనను ఇక్కడివారు ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. ఈ బాబా 52 ఏళ్ల క్రితం నాటి అంబాసిడర్ కారులో నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఆయన తనకు తాను అంబాసిడర్ బాబా అని పేరు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ అంబాసిడర్ బాబా ఎవరనే మూలాల్లోకి వెళితే.. ఈయన అసలు పేరు మహంత్ రాజగిరి. ఈయన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు తరలి వచ్చారు. కుంభమేళా తరహాలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయన తన ఉనికిని చాటుకుంటారు. మహంత్ రాజగిరి తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఒక్క అంబాసిడర్ కారును మాత్రమే తన వద్ద ఉంచుకున్నారు.అంబాసిడర్ బాబా కొన్ని దశాబ్ధాలుగా ఈ కారులోనే నివసిస్తున్నారు. ఈ కారును ఆయన 35 ఏళ్ల క్రితం విరాళం(Donation)గా అందుకున్నారు. అప్పటి నుంచి మహంత్ రాజగిరి ఈ కారునే తన నివాసంగా చేసుకున్నారు. ఆయన ఈ అంబాసిడర్ కారుకు కాషాయ రంగు పెయింట్ వేయించారు. ఈ అంబాసిడర్ కారు 1972 మోడల్. అంబాసిడర్ బాబా గతంలో నాలుగు కుంభమేళాలకు ఈ కారులోనే హాజరయ్యారు. ఆయన ఈ కారులోనే తినడం, పడుకోవడం చేస్తుంటారు. ఈ కారు తనకు అమ్మలాంటిదని అంబాసిడర్ బాబా తెలిపారు. ప్రయాగ్‌రాజ్ వచ్చిన ఆయన సంగమనగరి(Sangamnagari)లో ఒక గుడిసెలో బసచేస్తున్నారు. ఆ గుడిసె ముందర తన అంబాసిడర్ కారును నిలిపివుంచారు. ఈ కారులోనే కూర్చుని ఆయన ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘డిజిటల్ మహాకుంభ్’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత -
దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా సానియా మీర్జా.. ఫొటోలు చూశారా?
-
అప్రమత్తంగా ఉందాం... కాపాడుకుందాం
‘‘సైబర్ నేరస్తులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం అప్రమత్తంగా ఉండి, మనల్ని మనం కాపాడుకోవాలి’’ అంటున్నారు రష్మికా మందన్నా. గత నవంబరులో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. బ్రిటిష్–ఇండియన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ శరీరానికి రష్మికా ముఖాన్ని పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ వీడియో రష్మికతో పాటు చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత కూడా పలువురు తారల ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి.కాగా, తన గురించి వచ్చిన డీప్‌ఫేక్ వీడియో గురించి స్పందిస్తూ... ‘‘నేను స్కూల్లో, లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కొని ఉండగలనా? అని ఊహించుకుంటేనే భయంగా ఉంది’’ అని రష్మిక అప్పట్లో ట్వీట్ చేశారు. అలాగే ‘‘అందరం కలిసి ఈ ధోరణికొక విరుగుడు కనిపెడదాం’’ అని మహిళలకు పిలుపునిచ్చారు కూడా. ఇప్పుడా పిలుపునకు ఒక సాధికారత లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సి)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం రష్మికా మందన్నాని నియమించింది. కేంద్ర హోమ్ మంత్రి ఆధ్వర్యంలో ఈ కో ఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. రష్మికా మందన్నాని రాయబారిగా ఎంపిక చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సైబర్ సేఫ్టీ జాతీయ ప్రచారోద్యమ రాయబారిగా తాను నియమితమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పేర్కొని, ఓ వీడియో విడుదల చేశారు రష్మిక. ఆ వీడియోలో ‘‘మనం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. సైబర్ క్రైమ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది. దాని ప్రభావం ఎంత ఉంటుందో స్వయంగా అనుభవించిన వ్యక్తిగా మన ఆన్లైన్ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మనందరం కలిసి మన కోసం, భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన సైబర్ స్పేస్‌ని రూపొందించుకుందాం. సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువమందికి అవగాహన కల్పించి, రక్షించాలని అనుకుంటున్నాను.సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇక దాదాపు ఏడాది క్రితం (నవంబరు 6) రష్మిక సైబర్ క్రైమ్ బాధితురాలు... ఏడాది తిరక్క ముందే ప్రజల్ని బాధితులు కానివ్వకుండా జాగృతం చేయనున్న సైబర్ యోధురాలు. ఇదిలా ఉంటే... కెరీర్ పరంగా ‘దేవదాస్’ (2018) చిత్రంలో ఇన్స్పెక్టర్ పూజగా నటించారు‡రష్మిక. తెరపై తన బాధ్యతను నిర్వర్తించడానికి కృషి చేశారు. ఇప్పుడు నిజ జీవితంలో సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్‌గా తన బాధ్యతను చాలా సిన్సియర్‌గా నిర్వర్తించాలని బలంగా నిర్ణయించుకున్నారు. -
భారతీయ సినిమా తరఫున అంతర్జాతీయ వేడుకకు అతిథిగా చెర్రీ..
-
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఇందులో స్కేల్ మోడల్ అంబాసిడర్ కారు ఉంది.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేస్తూ.. నేను ఈ ప్రతాప్ బోస్ నుంచి ఓ గిఫ్ట్ అందుకున్నారు. నా పాతకాలపు జ్ఞాపకాల్లో ఎప్పటికీ అంబాసిడర్ గుర్తుండిపోతుంది.భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. దేశంలో ఈ కారుకు విడదీయలేని బంధం ఉంది. కాబట్టి ఇది అమరత్వం పొందేదుకు ఖచ్చితంగా అర్హమైనది. మనదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ స్కేల్ మోడల్‌ను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న విశాల్ బింద్రేకి ధన్యవాదాలు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Received a cool gift today from @BosePratap The Ambassador will never fade from the memories of someone of my vintage. What an old warhorse it was. An inextricable part of the old Indian landscape. So it deserves to be immortalised through such scale models. And kudos to… pic.twitter.com/wkO4gO2lC7— anand mahindra (@anandmahindra) June 15, 2024 -
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
2014 నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా కపూర్ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్స్ట్రువల్ హైజీన్ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా నియామకం అయిన కరీనా కపూర్‌లో ఫ్యాషన్ డిజైనర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్ సృజనాత్మకమైన డిజైనర్ కూడా. క్లాతింగ్ రిటైలర్ ‘గ్లోబస్’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్‌తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కరీనా కపూర్ వాయిస్‌తో ఈ పుస్తకం ఆడియో బుక్‌గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్ అయింది. రుజుత దివాకర్‌తో కలిసి న్యూట్రిషన్‌కు సంబంధించి ‘ది ఇండియన్ ఫుడ్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ రైట్’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్పై వచ్చిన ‘గర్ల్ రైజింగ్’ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌కు వాయిస్–వోవర్ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్స్ (సీఎఫ్ఎస్ఎస్) యాకేజీని లాంచ్ చేసింది. చత్తీస్‌ఘడ్‌లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వీక్ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు, పాఠాలు బాగా చెప్పే టీచర్లకు పురస్కారాలు అందజేసింది. మెన్స్ట్రువల్ హైజీన్‌పై యూనిసెఫ్ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్ కేర్‌కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహించింది. మదర్స్ డే సందర్భంగా యూనిసెఫ్ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్ ఇమ్యునైజేషన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్ అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్.‘కరీనా కపూర్ ఎక్స్లెంట్ కమ్యూనికేటర్’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్. చిన్న విజయం చాలు... పెద్ద సంతోషానికిసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్ మొదలైంది. ఆ రేస్‌లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్ హెల్త్ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్ -
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
ఢిల్లీ: యూనీసెఫ్ ఇండియా (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) తన కొత్త జాతీయ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ 'కరీనా కపూర్'ను ప్రకటించింది. 2014 నుంచి యునిసెఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్న ఈమె ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.కరీనా ఇంతకు ముందు యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా పనిచేశారు. కాగా ఇప్పుడు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు భారత జాతీయ రాయబారిగా యునిసెఫ్‌తో నా అనుబంధాన్ని కొనసాగించడం నాకు గౌరవంగా ఉంది కరీనా పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు బాల్యం, సమానమైన అవకాశం, భవిష్యత్తు అవసరం అని ఆమె పేర్కొన్నారు.#WATCH | Delhi: Actress Kareena Kapoor Khan appointed as UNICEF India's National Ambassador. pic.twitter.com/tglRjOtyPU— ANI (@ANI) May 4, 2024 -
సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!
సాధారణంగా అంబాసిడర్‌గా సిని సెలబ్రెటీలు లేదా స్పోర్ట్స్ స్టార్లు, ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్లనే పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ సాధారణ యువతి వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ అంబాసిడర్ అయ్యింది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఆమెనే అంబాసిడర్‌గా నియమించింది? ఆమె ప్రత్యేకత ఏంటీ అంటే.. అమ్మమ్మ స్పూర్తితోనే.. ఆ యువతి పేరు లహరీబాయి మధ్యప్రదేశ్‌లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవవైవిధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వారు తమకుండే మౌఖిక సంప్రదాయాల ద్వారా తమ నైపుణ్యాలను ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగేలా ప్రొత్సహిస్తారు. ఇక లహరీ మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందింది. ఆమె తన బామ్మ మాటలతో స్ఫూర్తిపొందింది. కనుమరుగవుతున్న మిల్లెట్ ధాన్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. లమరీ 18 ఏళ్ల వయస్సు నుంచే విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉండటం విశేషం. స్కూల్ ముఖమే చూడకపోయినా.. ఇక లహరీబాయి ఇల్లు మిల్లెట్స్‌తో అలంకరించినట్లుగా ఇంటిపైకప్పుడు వేలాడుతుంటాయి. అస్సలు పాఠశాల ముఖమే చూడని గిరిజన మహిళ ఈ విత్తనాల గొప్పతనం గురిచి తెలసుకుని వాటిని సంరక్షించాలని భావించడం నిజంగా స్ఫూర్తి దాయకం. ఇక ఈ మిల్లెట్‌ల్లో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంలో తోడ్పడుతుంది. ఏకంగా 150 రకాలకు పైనే.. ఇక లహరీబాయి ప్రస్తుత వయసు 27 ఏళ్లు. ఆమె 1ఆ ఏళ్ల నుంచి ఈ మిల్లెట్స్ సేకరణ ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు దాదాపు 150 రకాలకుపైనే మిల్లెట్స్ సేకరించింది. కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా మరియు చేనాతో సహా 150కిపైగా ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్ లహరీబాయి వద్ద ఉండటం విశేషం. ఐతే చాలా రకాల మిల్లెట్స్ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెబుతుంది లహరీబాయి. విత్తనాల సేకరణ కోసం.. ఇక ఎవరైనా మిల్లెట్స్ సాగు చేస్తే.. లహరీ బాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుందట. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి కిలోన్నర తీసుకుంటుంది. మరి కొందరు మాత్రం ఆమెకు కొంతభాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని చెబుతున్న లహరీబాయిని చూస్తే నిజంగా వాటి ప్రాముఖ్యతను అందురు గుర్తించేలా, బావితరాలకు అందిచాలనే లక్ష్యం కనిపిస్తుంది ఆ ఆసక్తి ఆమెను అంబాసిడర్‌గా.. లహరీబాయి మిల్లెట్స్ సేకరణ, సంరక్షణ పట్ల ఆమె కనబరుస్తున్న ఆసక్తిన, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను మిల్లెట్స్ అంబాసిడర్ గా నియమించింది. భారత ప్రభుత్వం దేశాన్నిమిల్లెట్‌సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్‌గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది . ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్న ఈ మిల్లెట్స్ అంతరించిపోకుండా సంరక్షింపబడతాయన్న ఉద్దేశ్యంతో సెలబ్రెటీలను కూడా కాదని, ఆ గిరిజ యువతిని అంబాసిడర్‌గా నియమించింది. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, చేస్తున్న పట్ల సరైన అవగాహన నిబద్ధతతో కృషి చేస్తే దేశమే గుర్తించి మెచ్చుకునే మనిషిగా పేరుతెచ్చుకోవచ్చని ఈ గిరిజన యువతి ప్రూవ్ చేసింది కదూ..! (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
కమెడియన్ శ్రద్ధా జైన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
శ్రద్ధగా నవ్విస్తుంది! శ్రద్ధా జైన్.‘శ్రద్ధా జైన్ తెలుసా?’ అని అడిగితే – ‘తెలుసు’ అని చెప్పేవారి సంఖ్య తక్కువ కావచ్చుగానీ– ‘అయ్యో శ్రద్ధా తెలుసా’ అంటే ‘అయ్యో... తెలియకపోవడం ఏమిటి!’ అనే వాళ్ల సంఖ్య ఎక్కువే. బెంగళూరుకు చెందిన శ్రద్ధా జైన్ అలియాస్ ‘అయ్యో శ్రద్ధా’ ‘ఇంటర్నెట్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవల ‘నేషనల్ క్రియేటర్స్’ అవార్డ్ అందుకుంది హాయిగా నవ్వించే వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది శ్రద్ధా జైన్. తులు, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. 2016లో కర్నాటకాలో జరిగిన ఒక ఫెస్టివల్‌కు సంబంధించి ఫేస్బుక్ వీడియోను పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియో శ్రద్ధాకు వీర లెవెల్లో పేరు తెచ్చింది. ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు హోస్ట్‌గా, కొన్ని టీవీ కార్యక్రమాలకు క్రియేటివ్ డైరెక్టర్‌గా అవకాశాలు తెచ్చింది. ఇక కామేడీ షోల సంగతి సరే సరి. కామెడీ డ్రామా సిరీస్ ‘పుష్పవల్లి’తో శ్రద్ధ పేరు హాస్యాభిమానుల అభిమాన పేరు అయింది. పెద్ద బ్రాండ్స్‌తో కలిసి పనిచేసిన శ్రద్ధ ఇలా అంటుంది... ‘కంటెంట్‌లో వెరైటీ ఉండేలా ప్రయత్నించేదాన్ని. ప్రేక్షకుల సంగతి ఏమిటోగానీ కంటెంట్‌లో వెరైటీ లేకపోతే ముందు నాకే బోర్ కొడుతుంది. అది ఎంత పెద్ద హిట్ అయినా సరే ఒకే అంశాన్ని పదేపదే చేయలేను. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఉన్న వారికి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియదు. నేను సృష్టించిన రీనా దలాల్ క్యారెక్టర్‌ను చూసిన తరువాత... రీనా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనుకున్నారు. మొదట్లో రియల్ ఎస్టేట్ కోసం కంటెంట్ క్రియేట్ చేసిన అతి కొద్దిమందిలో నేను ఒకరిని’ అంటుంది శ్రద్ధ. ఏ బ్రాండ్ వారు వచ్చినా తమది ఏ బ్రాండ్ అనేది మాత్రమే చెబుతారు. వారికి ‘ఐడియా’ గురించి బొత్తిగా ఐడియా ఉండదు. ఈ నేపథ్యంలో ఐడియా జెనరేట్ చేయడం నుంచి స్క్రీన్‌ప్లే వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని విద్యల్లో ఆరితేరింది శ్రద్ధ.పని పట్టాలెక్కడానికి అట్టే టైమ్ పట్టదు. కాన్సెప్ట్ డిస్కషన్ మీటింగ్ తరువాత పని పరుగులు తీస్తుంది. సాధారణంగా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఫిక్స్డ్ స్టైల్‌కే పరిమితం అవుతారు. అది దాటి బయటికి రావడాన్ని రిస్క్ అనుకుంటారు. అయితే ఎప్పటికప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ ‘ఫిక్స్డ్ స్టైల్’ అనేది లేకుండా జాగ్రత్త పడింది శ్రద్ధ. రేడియా జాకీ, డ్యాన్స్ షో హోస్ట్, కమెడియన్, రైటర్, అయిదు లక్షల ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్... ఇలా శ్రద్ధా జైన్ సృజనాత్మక రూ΄ాలు ఎన్నో ఉన్నాయి. ‘డాక్టర్ జీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. ‘నా నటన, రచనలకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారా ఏదైనా సౌత్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వస్తుంది అనుకున్నాను. అయితే ఏకంగా బాలీవుడ్ నుంచే పిలుపు రావడం ఆనందంగా అనిపించింది’ అంటున్న శ్రద్ధ పోస్ట్–గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌గా నటించింది. ‘పెర్ఫర్మర్, కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి టైమ్. ఏమాత్రం టాలెంట్ ఉన్నా మన స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’ అంటుంది -
Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్ పూనమ్ పాండేకు మరో భారీ షాక్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె, ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్‌కతాకు చెందిన అమిత్ రాయ్ పూనమ్ పాండేకు లీగల్ నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె అధికారిక ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ మరునాడే తాను బతికే ఉన్నానని, సర్వైకల్ కేన్సర్ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో రిలీజ్ చేయండం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
కచోరీ, జిలేబీ సూపర్: జపాన్ రాయబారి!
భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్‌ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో దీనికి సంబంధించిన రెండు క్లిప్‌లను షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది. జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు. Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023 -
భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!
భారత వంటకాలను ఇష్టపడే విదేశీయలు ఎందరో ఉన్నారు. ఇప్పుడూ ఆ లిస్ట్‌లోకి జపాన్ వచ్చింది. సాక్షాత్తు జపాన్ అంబాసిడర్ మన భారతీయ వంటకాలను రుచి చుడటమే గాక వాటిని వండిని చెఫ్‌ని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మీరు వంటకాలను ప్రదర్శించగలరని కితాబు కూడా ఇచ్చేశాడు. ఇంతకీ ఆయన రుచిన చూసిన వంటకం ఏంటీ? ఆ అదృష్టాన్ని దక్కించుకున్న చెఫ్ ఎవరంటే..? భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తన సతీమణితో కలిసి ఢిల్లీలోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్‌ని సందర్శించారు. అక్కడ ఆలు టిక్కాను ఆస్వాదించినప్పుడూ ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీని రుచి జపాన్ రాయబారి హిరోషికి ఎంతగానో నచ్చింది. దీంతో దాన్ని తయారు చేసిన నాగాలాండ్ చెఫ్ జోయెల్ బసుమతారిని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేగాదు అతడి చేతితో తయారు చేసిన భోజనాన్ని కూడా ఆస్వాదించాడు. చాలా రుచికరంగా ఉందని మెచ్చుకోవడమే గాక భవిష్యత్తులో మంచి పాక నిపుణుడిగా పేరొస్తుందని ప్రశంసించారు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. పైగా ఆ చెఫ్‌ని కూడా తన వంటకాల గురించి మాట్లాడమని కూడా చెప్పారు. ఆ చెఫ్ తాను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య వంటకాలను ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారో వివరించారు. మీరు చేసిన ఈశాన్య వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి. కచ్చితం మీరు ఈ విషయంలో సక్సెస్ అవుతారని మెచ్చుకున్నారు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి . అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చూడండి. Enjoyed wonderful dinner prepared by Nagaland’s star chef Mr. Joel Basumatari. Chef Joel promotes North Eastern cuisine around the world. Wish him great success in the future !! pic.twitter.com/FLNHWvcoex — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 7, 2023 (చదవండి: 'సైంటిస్ట్‌గా ఓ భార్యగా గెలిచింది'!..భర్త ప్రాణాలను కాపాడిన నవయుగ సావిత్రి ఆమె!) -
చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్‌తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్‌పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది. క్విన్‌గాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని జిన్‌పింగ్ వెంటనే ఆయనను జూన్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్‌గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్‌కు జిన్‌పింగ్ కట్టబెట్టారు. వివాహేతర బంధమే క్విన్‌గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా -
కీర్తి సురేష్: కేరళలో మహిళల క్రికెట్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా (ఫోటోలు)
-
ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్‌కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా ఆమె పనిచేశారు. 1991లో ఫారిన్ సర్వీస్‌లో చేరిన లఖ్దీర్.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్‌కు డిప్యూటీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్ఎస్ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు -
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా.. భారత్‌లోనే
ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. కాబట్టే భారత్ కాస్మోటిక్ రంగం గణనీయంగా వృద్ది సాధిస్తోంది. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ నుండి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఫలితంగా కాస్మోటిక్ సంస్థలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్‌ల కోసం మహిళలు సగటున రూ.1,214 ఖర్చు చేయగా.. దాదాపు 40 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ తరుణంలో అంతర్జాతీయ కాస్మోటిక్ సంస్థలు భారతీయ మహిళల్ని ఆకట్టుకునేలా స్టార్ హీరోయిన్లను తమ బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి. ఇక జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2, భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించింది. షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా నియాకం ఆశ్చర్యానికి గురి చేసిందన్న మిల్కిబ్యూటీ.. దాదాపూ 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమన్నా - షిసిడో మధ్య ఒప్పందం భారత్ ఎంటర్టైన్ మెంట్ పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు దోహదం చేస్తుందని షిసిడో యాజమాన్యం భావిస్తుంది. -
WC 2023: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా..(ఫొటోలు)
-
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం
క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న పురుషుల వన్డే ప్రపంచకప్ 2023కు గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ కొద్దిసేపటి కిందట ప్రకటించింది. గ్లోబల్ అంబాసిడర్‌గా హోదాలో సచిన్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వరల్డ్‌కప్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ప్రపంచ కప్ ట్రోఫీతో పాటు మైదానంలోకి వస్తాడు. ఈ సందర్భంగా సచిన్ వరల్డ్‌కప్ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటిస్తాడు. ఐసీసీ ప్రకటించిన వరల్డ్‌కప్ ఐసీసీ అంబాసిడర్ల జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా మాజీ సారథి అరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీథరన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్, టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఉన్నారు. -
అమెరికాలో వివాహేతర సంబంధం.. అందుకే పదవి ఊడింది..
న్యూయార్క్: చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ కారణంగానే చైనా ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. క్విన్ గ్యాంగ్ వివాహేతర సంబంధంతో అమెరికాలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అమెరికాలో వివాహేతర సంబంధంతో ఓ బిడ్డకు క్విన్ గ్యాంగ్ తండ్రి అయ్యాడని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో క్విన్ గ్యాంగ్ దేశ భద్రతను పణంగా పెట్టారా..?లేదా..? అనే అంశంపై చైనా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరమైన పోటీ నడుస్తున్న క్రమంలో ఈ అంశం చైనాకు పెను సవాలుగా మారింది. క్విన్ గ్యాంగ్‌ను నియమించిన ఏడు నెలలకే చైనా అయన్ని పదవి నుంచి తొలగించింది. ఇంత తక్కువ సమయంలో పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను కూడా చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇలాంటి అస్థిరమైన నిర్ణయాలతో జిన్‌పింగ్ ప్రభుత్వం కూడుకుని ఉందని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు విదేశాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలోను దర్యాప్తులు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
గ్రీన్ప్లై బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హానికారక ఉద్గారాలను తగ్గించే జీరో ఎమిషన్ ప్లైవుడ్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించుకున్నట్లు గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ (జీఐఎల్) సీఈవో మనోజ్ తుల్సియాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త వాణిజ్య ప్రచార ప్రకటనలను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ప్లైవుడ్ పరిశ్రమ 4.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, అందులో సంఘటిత రంగం వాటా 30 శాతం వరకు ఉంటుందని సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 1,800 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల వరకు అంచనా వేస్తున్నట్లు మనోజ్ చెప్పారు. ప్రస్తుతం తమకు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎండీఎఫ్, ప్లైవుడ్ తయారీ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. టర్కీకి చెందిన సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేస్తున్న ప్లాంటు వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని మనోజ్ చెప్పారు. -
అమ్మవారిని దర్శించుకున్న 'మాజీ మిస్ ఇండియా'..!
ఆదిలాబాద్: మాజీ మిస్ ఇండియా, తెలంగాణ ఐటీ హబ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాగూర్ బుధవారం కుటుంబసమేతంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి, అమ్మవారి శేష వస్త్రంతో ఆశీర్వచనాలు అందజేశారు. -
'జైలర్' సినిమా.. జపాన్ ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజులో!
రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా మన దేశంలో ఉన్న జపాన్ అంబాసిడర్ రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘బెస్ట్ విషెస్’ చెప్పాడు. ఇక ‘ముత్తు’ నాటి నుంచి రజనీకి ఫ్యాన్స్‌గా ఉన్న ఒక జంట ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి వచ్చింది సినిమా చూడటానికి!రజనీ హవా అలా ఉంది. ‘హుకుమ్... టైగర్ కా హుకుమ్’ అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సినిమా హాల్లో విజిల్స్‌ను మోతెక్కిస్తోంది. ప్రపంచాన్ని ఇప్పుడు రజనీ చుట్టుముట్టి ఉన్నాడు– జైలర్ సినిమాతో. అసలే రజనీ అనుకుంటే అతనికి తోడు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివ రాజ్‌కుమార్ కూడా సినిమాలో ఉండేసరికి మాస్ ఆడియెన్స్ పోటెత్తుతున్నారు. అయితే ఈ సంబరంలో ఇండియన్స్ మాత్రమే లేరు... జపనీయులు కూడా ఉన్నారు. ‘ముత్తు’ కాలం నుంచి ఇండియాలో రజనీ ఎంతో జపాన్‌లో కూడా అంతే. అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ. అందుకే ఇండియాలో ఉన్న జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకీ ఒక వీడియో రిలీజ్ చేసి అందులో రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘రజనీ యూ ఆర్ జస్ట్ సూపర్.. విష్ యూ గ్రేట్ సక్సెస్’ అని చెప్పాడు. ఇలాంటి మర్యాద ఏ స్టార్‌కూ దక్కలేదు. ఇక జపాన్‌లోని ఒకాసా నుంచి యసుదా హిదెతోషి అనే ఆసామి తన భార్యతో ఏకంగా చెన్నైలో ల్యాండ్ అయ్యాడు ‘జైలర్’ చూసేందుకు. అతను జపాన్‌లో ఆల్ జపాన్ రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అట. నెల్సన్ డైరెక్ట్ చేసిన ‘జైలర్’ ప్రస్తుతం కలెక్షన్ల హవా సృష్టిస్తోంది. -
ఎందరో సహకారంతో ఈ స్థాయికి చేరా: దినేష్ కార్తిక్
సాక్షి, చైన్నె: తన క్రికెట్ పయనంలో ఎందరో సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరినట్టు క్రికెటర్, స్టైలిష్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ తెలిపారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా ఆయన నియమితులయ్యారు. శనివారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో దినేష్ కార్తిక్ స్ఫూర్తితో కొత్త స్పోర్ట్స్ వేర్ లైన్‌ను పరిమ్యాచ్ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన క్రికెట్ పయనం, పరిమ్యాచ్ స్పోర్ట్స్, ఐపీఎల్ అనుభవాలను గురించి దినేష్ కార్తిక్ మీడియాకు వివరించారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అనేది అసమానమైన శైలి, అసాధారణమైన సౌలభ్యం, బలమైన విజేత స్ఫూర్తిని సూచించే బ్రాండ్‌గా వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్న తనం నుంచి ఎన్నో ఆశలు ఉండేవని, ఇవి ప్రస్తుతం సాకారం అవుతున్నట్టు వివరించారు. ఎందరో సహకారంతో తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు. తన బ్యాట్, జెర్సీ, క్యాప్, ఇలా అన్నింటా ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ముందుకెళుతున్నట్టు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే తాను ఈ వ్యవహారంలో నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. -
జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్
పూణే: భారతదేశంలోని జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి తన భార్యతో కలిసి పూణే వీధుల్లో విహరించి అక్కడి వీధుల్లో వడాపావ్, మిసాల్ పావ్ తిన్నారు. ఆ రుచికి ఫిదా అయిపోయిన సుజుకి ట్విట్టర్లో నాకు భారతీయ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. కానీ పోటీలో నా భార్య నన్ను ఓడించింది. చాలామంది మిసాల్ పావ్ తినమని నన్ను రికమెండ్ చేశారు. చాలా రుచిగా ఉంది కానీ కొద్దిగా ఘాటు తగ్గించాలని రాసి వీడియోని కూడా జతపరిచారు. దీనికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ తనదైన శైలిలో చమత్కరించారు. జపాన్ రాయబారి చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ ప్రధాని.. ఓడిపోయినా పర్వాలేదనిపించే పోటీ ఏదైనా ఉందంటే, అది ఇదొక్కటే.. అంబాసిడర్ గారు. భారతదేశ పాక వైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నందుకు సంతోషం. మరిన్ని వీడియోలు చెయ్యండి. అని రాశారు. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలోనే అభిమానులున్నారు. అందులోనూ వడాపావ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. వారిలో ఇప్పుడు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి జంట కూడా చేరిపోయారు. I love street food of India🇮🇳 ...but thoda teekha kam please!🌶️#Pune #Maharashtra #VadaPav pic.twitter.com/3GurNcwVyV — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) June 9, 2023 This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ — Narendra Modi (@narendramodi) June 11, 2023 ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి? -
సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం.. ఏపీలో పెట్టుబడులపై చర్చ
సాక్షి, తాడేపల్లి: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్ నాసర్ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్‌కు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యూఏఈ రాయబారికి సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుడ్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యూఏఈ రాయబారి తెలిపారు. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ భేటీలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చదవండి: గర్వంగా ఉంది: సాత్విక్- చిరాగ్‌లకు సీఎం జగన్ అభినందనలు -
విజయ్ దేవరకొండ ఖాతాలో మరో కంపెనీ
హైదరాబాద్: టీఎంటీ బార్ల తయారీలోని శ్యామ్ స్టీల్ నటుడు విజయ్‌దేవరకొండతో కలసి నూతన డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. టెలివిజన్ ప్రచార చిత్రాన్ని ఇగ్నిషన్ ఫిల్మ్స్‌కు చెందిన రెన్సిల్ డిసిల్వ, పార్థో సర్కార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ టెలివిజన్ ప్రచారం ద్వారా ఏపీ, తెలంగాణలో కస్టమర్లకు తన ఉత్పత్తులను మరింత చేరువ చేయాలన్నది శ్యామ్ స్టీల్ ప్రణాళికగా ఉంది. -
1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!
మనం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నప్పటికీ అంబాసిడర్ వంటి అద్భుతమైన కార్లను ఎవ్వరూ మరచిపోలేరు. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందిన ఈ బ్రాండ్ కారు ఇప్పుడు మార్కెట్లో విక్రయానికి లేనప్పటికీ, అప్పుడప్పుడూ రోడ్లమీద కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలను ముందు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మొదలైనవారు ఈ కార్లను తెగ ఉపయోగించారు. అంతే కాకుండా అప్పట్లో రాయల సీమలో ఈ కార్లను ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అయితే ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ధర ఎంత అనే విషయాన్నీ ఈ కథనంలో చదివేద్దాం. 1964లో అంబాసిడర్ కారు ధర ఎంత అనేదానికి సంబంధించిన ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దీని ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం. వినటానికి కొంత వింతగా ఉన్నా.. అప్పట్లో ఈ కారు ధర అంతే అనటానికి కొన్ని ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1990 దశకంలో ఒక మెరుపు మెరిసిన అంబాసిడర్ కార్లను 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఆ తరువాత మారుతి కార్లు మార్కెట్లో విడుదలకావడం వల్ల వీటి ఆదరణ కొంత తగ్గింది, అయినప్పటికీ కొంత మంది అంబాసిడర్ అభిమానులు వీటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా వీటి అమ్మకాలు తగ్గడం వల్ల 2014లో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: Odysse EV Bike: ఒక్క ఛార్జ్‌తో 125 కిమీ రేంజ్.. రూ. 999తో బుక్ చేసుకోండి!) ఇక తాజాగా బయటపడిన అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ బిల్ ప్రకారం, ఇది 1964లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా తెలుస్తోంది. దీని ధర అప్పుడు రూ. 16.495 మాత్రమే. దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసింది. ఇందులో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు కూడా చూడవచ్చు. -
భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్‌తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌తో సాన్నిహిత్యంగా ఉండటం తమకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. అంతేగాదు భారత్ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చిండానికి నాటో సిద్ధంగా ఉందని కూడా స్మిత్ చెప్పారు. దీంతో ఒకరకంగా నాటోలో భారత్ చేరేలా యూఎస్ ప్రత్యక్ష సంకేతాలిస్తునట్లుగా ఉంది. ఈ మేరకు భారత్, యూఎస్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు గురించి మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమం, వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, సాంకేతికత, విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు. సోవియట్ యూనియన్ కోసం ఏర్పడ్డ నాటో తొలిసారిగా ఇండో పసిఫిక్‌తో తన విస్తరణను పెంచుకుందని తెలిపారు. అలాగే చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాల తోపాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు ఇడో పసిఫిక్ దేశాలు జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందినట్లు ఆమె తెలిపారు. ఈ దేశాలతో తమ భాగస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్ దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని, పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ దేశాలు కేవలం ఉక్రెయిన్‌కు అవసరమైన వాటిని అందించడమే కాకుండా భవిష్యత్తులో రష్యన్లు చేసిన పనిని ఇతర దేశాలు చేసే ప్రమాదం ఉందని స్మిత్ హెచ్చరించారు. అలాగే ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కి భారత్ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది. యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల యూఎన్ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్ అన్నారు. ఈ యుద్ధంలో రష్యా గనుక అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు. (చదవండి: పంజాబ్ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు) -
నాటు నాటు పాటకి జర్మన్ అంబాసిడర్ స్టెప్పులు..వీడియో వైరల్
నాటు నాటు పాట యావత్ దేశాన్ని ఊర్రూతలు ఊగించడమే గాక ప్రపంచ దేశాల ప్రజల చేత కూడా స్పెప్పులు వేయించింది. ఆ పాటకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. అందుకు తగ్గట్టుగానే రాజమైళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో గొప్ప విజయాన్ని దక్కించుకుంది. దీంతో యావత్తు భారతదేశం సంతోషంతో సంబరాలు జరపుకుంది. అంతేగాదు అందులోనూ ఒక తెలుగ సినిమాకు తొలిసారిగా దక్కడం అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంది భారత్. ఐతే ఇప్పుడూ పాట దేశ రాయబారుల చేత కూడ స్పెప్పులు వేయిచింది. ఈ మేరకు భారత్‌లోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిఫ్ అకెర్మాన్ ఓల్డ్ ఢిల్లీలోని తన బృందంతో కలిసి డాన్య్లు చేసి ఆ విజయాన్ని వారు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు కూడా.ఆ వీడియోలో జర్మన్ రాయబారి చాందినీ రిక్షాలో దిగుతూ.. ఒక దుకాణదారుని వద్దకు వచ్చాడు. అతను అక్కడ బాగా ఫేమస్ అయిన జిలేబితో పాటు దక్షిణ కొరియ జెండా తోపాటు నాటు నాటు పాట ముద్రించిన లాఠీని అందిస్తాడు. ఆ తర్వాత అకెర్మాన్ తన బృందంతో రహదారిపై నాటు నాటు పాటకు డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో వారిని ఉత్సాహపరిచేలా చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గుమిగూడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. జర్మన్లు డ్యాన్సులు చేయలేరనుకుంటున్నారా? అని అన్నారు.పైగా తాను తన ఇండో బృందంతో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న నాటు నాటు విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐతే అంత పరెఫెక్ట్గా రాలేదు కానీ ఏదో సరదాగా ఇలా చేశాం అని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆయన ట్విట్టర్లో మాకు స్ఫూర్తినిచ్చిన భారత్‌లోని కొరియన్ ఎబసీకి ధన్యావాదాలు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ బృందానికి అభినందనలు. ఐతే ఇప్పుడూ నెక్స్ట్ ఎవరూ? అంటూ ఎంబసీ ఛాలెంజ్ విసురుతుంది. అని అన్నారు. కాగా, ఇంతకు మునుపు కొరియా రాయబారి చాంగ్ జే బోక్ తన సిబ్బందితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఐతే నెటిజన్లు ఈ వీడియను చూసి..వావ్ చాల బాగా చేసింది బృందం అంటూ జర్నన్ రాయబారిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా స్పందిస్తూ చాలా బాగుందని తెగ మెచ్చుకున్నారు. Germans can't dance? Me & my Indo-German team celebrated #NaatuNaatu’s victory at #Oscar95 in Old Delhi. Ok, far from perfect. But fun! Thanks @rokEmbIndia for inspiring us. Congratulations & welcome back @alwaysRamCharan & @RRRMovie team! #embassychallange is open. Who's next? pic.twitter.com/uthQq9Ez3V — Dr Philipp Ackermann (@AmbAckermann) March 18, 2023 (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్) -
గార్సెటీ సాధించేదేమిటి?
దౌత్యం గురించీ, దౌత్యవేత్తల గురించీ వ్యంగ్య వ్యాఖ్యలు ఎంతగా ప్రచారంలో ఉన్నా దేశాల మధ్య సంబంధాల్లో దౌత్యవేత్త పోషించే పాత్ర అత్యంత విలువైనది. అలా చూస్తే అమెరికా వంటి అగ్ర రాజ్యానికి మన దేశంలో గత 26 నెలలుగా పూర్తికాలం పనిచేసే రాయబారి లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని అవరోధాలూ అధిగమించి ఎరిక్ గార్సెటీ ఎట్టకేలకు ఈ పదవి స్వీకరించ బోతున్నారు. ఆయన విషయంలో సెనేట్‌లో అధికార, విపక్షాలమధ్య ఏకాభిప్రాయం కుదరక పోవటమే ఇంత జాప్యం చోటుచేసుకోవటానికి కారణం. సుదీర్ఘమైన ఈ ప్రక్రియ పొడవునా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టుదలగా వ్యవహరించటం గార్సెటీకి కలిసొచ్చింది. స్వపక్షమైన డెమాక్రాటిక్ పార్టీనుంచి ముగ్గురు కట్టుదాటినా రిపబ్లికన్ పార్టీనుంచి ఏడుగురు ఆసరాగా నిలవడంతో 52–42 తేడాతో గార్సెటీ ఎంపిక ఆమోదం పొందింది. బైడెన్ తన మొండిపట్టు ద్వారా సెనేట్‌కు ఒక సందేశం పంపారు. తన ఎంపిక ఆమోదం పొందేవరకూ ఎంతకాలమైనా ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచుతాన న్నది దాని సారాంశం. అమెరికాలో కీలక పదవుల ఎంపికంతా మనకు భిన్నం. అధికార పక్షం ఎంపిక చేసినవారిపై బహిరంగంగా చర్చ జరగటం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావటం సర్వసాధారణం. వచ్చిన ఆరోపణలకు అభ్యర్థి సంతృప్తికరంగా సమాధానాలివ్వలేకపోతే ఆ ఎంపిక వీగిపోతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ఒకటే...రాయబారి అయినా ఒకటే. గార్సెటీపై వ్యక్తిగతంగా నేరుగా ఆరోపణలు లేవు. కానీ గతంలో ఒక పదవిలో ఉండగా తన సహాయకుడిగా ఉన్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు వచ్చినా దాన్ని ఆయన పట్టించుకోలేదన్నది ఆ ఆరోపణల సారాంశం. అప్పట్లో ఆ సంగతి తనకు తెలియనే తెలియదని గార్సెటీ వివరణనిచ్చారు. ఆయన గతంలో లాస్ ఏంజెలిస్ మేయర్‌గా పనిచేశారు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో రాగల రోజులు దౌత్యపరంగా ఎంతో కీలకమైనవి. చైనాను కట్టడి చేయటం కోసం అమెరికా రూపకల్పన చేసిన ఇండో పసిఫిక్ దేశాల కూటమి క్వాడ్‌లో మన పాత్ర ప్రధానమైనది. ఒకపక్క ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. అక్కడ ఏ క్షణంలో ఏమవుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూఉంది. రష్యానుంచి ముడి చమురుతోసహా దేన్నీ కొనుగోలు చేయొద్దని అమెరికా కోరినా మన దేశం దాన్ని పాటించటం లేదు. దీర్ఘకాల మిత్రదేశమైన రష్యాను కాదనటం మనకంత సులభమేమీ కాదు. రష్యాను ఆర్థికంగా కట్టడి చేయాలన్న అమెరికాకు ఇది మింగుడుపడటం లేదు. భారత్‌ను తన దారికి తెచ్చుకోవటం ఎలాగన్నదే దాని ఆత్రుత. గార్సెటీ రాయబారిగా ఉంటే ఇది సులభమవుతుందని ఆ దేశం భావిస్తోంది. అదీగాక ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటించబోతున్నారు. అలాగే సెప్టెంబర్‌లో ఇక్కడ జరగబోయే జీ–20 శిఖరాగ్ర సదస్సుకు బైడెన్ హాజరవుతున్నారు. ఇలాంటి తరుణంలో రాయబారి పదవి ఖాళీగా ఉండటం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. వాస్తవానికి గార్సెటీకి దౌత్యరంగంలో పెద్దగా అనుభవం, నిపుణత లేవు. భారత్ వంటి కీలక దేశానికి అటువంటి వ్యక్తిని పంపటం సరైందికాదన్న విమర్శలు రిపబ్లికన్ శిబిరం నుంచి వినిపించాయి. అయితే బైడెన్‌కు ఆయన అత్యంత విశ్వసనీయుడు. ఉపాధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపిక చేసిన కమిటీకి నేతృత్వంవహించింది గార్సెటీయే. ఆ ఎంపిక అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించటానికి బాటలు పరిచిందని చెప్పాలి. రాయబారిగా తన ప్రాధాన్యతలేమిటో 2021 డిసెంబర్లోనే సెనేట్ ముందు గార్సెటీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా భద్రతకూ, కలిమికీ భారత్ తోడ్పాటు ఎంతో అవసరమని, దాన్ని తాను సాధించగలనని హామీ ఇచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలన్న అమెరికా భావనతో భారత్‌కు ఏకీభావం ఉన్నదని, ఈ విషయంలో ద్వైపాక్షిక సంబంధాలు దృఢతరం కావటానికి అవసరమైన చొరవ తీసుకుంటానని గార్సెటీ వివరించారు. అలాగే భారత్‌కు బలమైన పొరుగుదేశంనుంచి ముప్పు ఉన్నందున దానికి అమెరికా అండగా నిలవటం ముఖ్యమని, ఈ విషయంలో తాను గట్టిగా కృషి చేస్తానన్నారు. పైగా 1990లో భారత్ పర్యటన తర్వాత హిందీ, ఉర్దూ అధ్యయనం చేయటం, ఇక్కడి సాంస్కృతిక, మత సంబంధ చరిత్ర గురించిన అవగాహన పెంచుకోవటం గార్సెటీకి అనుకూలాంశాలు. అమెరికాలో 40 లక్షలమంది భారతీయు లున్నారు. రెండు లక్షలమంది అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. మరిన్ని లక్షల మంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రజల మధ్యా సాన్నిహిత్యం అవసరమని, దాన్ని తాను సాధించగలనని హామీ ఇచ్చారు. వీటితోపాటు మానవహక్కుల్ని గౌరవించటం, పటిష్ట ప్రజాస్వామిక సంస్థలు ఇరు దేశాల సంబంధాల్లో కీలకాంశాలని, భారత్‌తో వీటిపై తరచు చర్చిస్తానని కూడా చెప్పారు. ఇది సహజంగానే వివాదాస్పదం కావొచ్చు. ఈ పరిధిలోకి వచ్చే అంశాలేమిటో ఆయన చెప్పకపోయినా 370వ అధికరణ, నిఘా సంస్థల వ్యవహార శైలివంటివి అందులో భాగం కావొచ్చునన్న అనుమానాలున్నాయి. అదే జరిగితే మోదీ సర్కారు మౌనంగా ఏమీ ఉండకపోవచ్చు. కనుక బాధ్యతల నిర్వహణ గార్సెటీకి అంత సులభమేమీ కాదనే చెప్పాలి. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి మన దేశానికి రాయబారిగా రావటం శుభసూచకం. ఇప్పుడున్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థితికి చేరుకోవటానికి దోహద పడగల పరిణామం. -
ఖతార్ ఎయిర్వేస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరోయిన్
న్యూఢిల్లీ: దుబాయ్‌కి చెందిన ఖతార్ ఎయిర్వేస్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను తమ గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ సందర్బంగా ఖతార్‌కు మించింది మరేదీ లేదు అంటూ కొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఖతార్ ఎయిర్వెస్ 'ఆంట్ నో బడీ' ప్రచార వీడియోను ట్వీట్ చేసింది. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయం హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యూటిఫుల్ లుక్‌లో దీపికా పడుకొణె మెరిసింది. ప్రీమియం అనుభవంతో, ఎక్సలెన్స్‌కు, లగ్జరీకి పర్యాయపదంగా ఉన్న ఖతార్‌కు దీపిక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణమని, ఇందుకు ప్రఖ్యాత నటి దీపికా సరియైన ఎంపిక అంటూ ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, హిస్ ఎక్సలెన్సీ అక్బర్ అల్ బేకర్ సంతోషాన్ని ప్రకటించారు. ఖతార్ ఎయిర్వేస్ ఇటీవలే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రేటింగ్ ఆర్గనైజేషన్ స్కైట్రాక్స్ అందించే 2022 వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో 'ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్'గా అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు గెల్చుకోవడం వరుసగా ఇది ఏడోసారి (2011, 2012, 2015, 2017, 2019, 2021 2022). వీటితో పాటు వరల్డ్ బెస్ట్ బిజినెస్ క్లాస్, వరల్డ్ బిజినెస్ క్లాస్ లాంజ్ డైనింగ్, బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అవార్డులను కూడా అందుకుంది. కాగా ఖతార్ఎయిర్వేస్ దోహా హబ్, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ ద్వారా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 150 కంటే ప్రదేశాలకు విమానాల్ని నడుపుతోంది. There's nothing else quite like the luxury of travelling with Qatar Airways ✈️ Introducing our brand-new film featuring our global brand ambassador @deepikapadukone pic.twitter.com/NjAgXInl7v — Qatar Airways (@qatarairways) February 28, 2023 -
India Buying Russian Oil: భారత్‌ని నిందించలేం! అది మా పని కాదు!
రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్న భారత్ గురించి జర్మన్ రాయబారి ఫిలప్ అకెర్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గురించి భారత్‌ని నిందించలేనని స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ అనుసరిస్తున్న విధానం సౌకర్యవంతంగా ఉందని యూఎస్ చెప్పిన కొద్ది వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం విషయమై భారత్‌ని విమర్శించలేను, అది మాకు అనవసరమైన విషయం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం దీనిలో తాము జోక్యం చేసుకోమని తెగేసి చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే తగిన అభ్యర్థి భారతేనని, దానికి ఆ నైపుణ్యం, దౌత్యం ఉన్నాయని జర్మన్ రాయబారి అకెర్ మాన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి. కానీ చైనా, యూఎస్ తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు అయిన భారత్ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నా.. మంచి డీల్ లభించిన చోట చమురు కొనుగోలు చేస్తూనే ఉంటామని కరాఖండీగా చెప్పింది. ఐతే రష్యా చమురుపై పరిమితి విధించిన జీ7 దేశాలకు మద్దతివ్వకుండా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. భారత్‌లో రష్యన్ చమురు దిగుమతులు జనవరిలో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల బారెళ్లకు చేరాయి. మాస్కో ఇప్పటికి న్యూఢిల్లీకి చమురు అమ్మకందారుగా ఉంది. దీంతో భారత్‌లో రిఫైనర్లు రష్యా కీలక చమురు క్లయింట్‌గా ఉద్భవించాయి. అంతేగాదు భారత్ ఐరోపా, యూఎస్ కోసం ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది కూడా. ఐతే శుద్ధి చేసిన ఇంధనం రష్యన్‌కి చెందినదిగా పరిగణించబడదు. అదీగాక ముడి చమురును సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం రష్యాతో భారత్ కఠినమైన భేరాన్నే కుదుర్చుకుంది. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..ఇంధన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వాషింగ్టన్ న్యూఢిల్లీతో సౌకర్యవంతంగా ఉందని బైడెన్ పరిపాలనాధికారి తెలిపారు. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
'నిజమైన స్నేహితుడికి అర్థం భారత్'!..: టర్కీ
కనివినీ ఎరుగని రీతిలో 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి టర్కీని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆయా ప్రాంతాలన్నీ మృత్యు ఘోషతో విషాదమయంగా మారాయి. కోలుకోలేని బాధలో ఉన్న టర్కీకి భారత్ స్నేహ హస్తం చాపి కావాల్సిన నిధులను అందించింది. అలాగే టర్కీకి అవసరమయ్యే రెస్క్యూ, వైద్య బృందాలను పంపింది. దీంతో భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ న్యూఢిల్లీకి కృతజ్ఞతలు తెలుపుతూ..ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. టర్కిష్ భాషలోనూ, హిందీలోనూ 'దోస్త్' (స్నేహితుడు) అనేది కామన్ పదం. టర్కిష్‌లోని 'దోస్త్ కారా గుండె బెల్లి ఒలూర్ (ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు)' అనే సామెతను ప్రస్తావిస్తూ..భారత్‌కి చాలా ధన్యవాదాలు అని అన్నారు. కాగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతిని, మానవతావాద మద్దతును కూడా ఆయన తెలియజేశారు. అంతేగాదు రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ప్రభుత్వ సమన్వయంతో ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌ల తోపాటు రిలీఫ్ మెటీరియల్‌ను టర్కీకి పంపాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. అంతేగాదు ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, అవసరమైన పరికరాలు, సుమారు 100 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భూకంపం సంభవించిన ప్రాంతాలకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రకటనలో తెలిపింది. అలాగే తక్షణ సహాయక చర్యలపై చర్చించేందుకు సౌత్ బ్లాక్‌లో ప్రధాని ప్రిన్సిపాల్ సెక్రటరీ పీకే మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేబినేట్ సెక్రటరీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ), డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రక్షణ దళాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానాయన ఆరోగ్య మంత్రిత్వ శాక తదితర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు ఈ పాటికే సహాయక సామాగ్రితో రెండు భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టర్కీ, సిరియాలకు బయలుదేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఆ బృందాలు వైద్య సామాగ్రి, మందులతో టర్కీలోని డమాస్కస్ చేరుకున్నాయని సమాచారం. (చదవండి: వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో భారత సంతతి అమ్మాయికి స్థానం) -
ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి బెదిరింపులకు దిగింది. ఆ తర్వాత ఇప్పుడూ కీవ్ రాయబార కార్యాలయాలకు జంతువులు కళ్లు, నెత్తుటితో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను పంపుతోంది రష్యా. ఈ మేరకు హంగేరి, నెదర్లాండ్స్, పోలాండ్, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని కీవ్ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన బ్లడ్ ప్యాకేజీలను రష్యా పంపినట్లు సమాచారం. అదీగాక వాటికన్లోని ఉక్రెయిన్ రాయబారి కార్యాలయం తలుపులను ధ్వసం చేసి అక్కడ మానవ మలం వదిలి వేసినట్లు ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే కజకిస్తాన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్‌లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్‌ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. ఉక్రెయిన్ ఎప్పుడూ సదా అప్రమత్తంగానే ఉంటుంది. అలాగే ఈ రాయబార కార్యాలయాలు సదా ఉక్రెయిన్ గెలుపు కోసం సమర్థవంతంగా పని చేస్తూనే ఉంటాయి అని నొక్కి చెప్పారు. ఐతే రష్యా రాయబార కార్యాలయాలు ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. -
అంబాసడర్ ఎలక్ట్రిక్ కార్స్... కమింగ్ సూన్
-
తైవాన్ శాంతి ప్రతిపాదన... ఎలెన్ మస్క్‌కి థ్యాంక్స్ చెప్పిన చైనా!
వాషింగ్టన్: యూఎస్‌లోని చైనా రాయబారి క్విన్ గ్యాంగ్ టెస్లా దిగ్గజం ఎలెన్ మస్క్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చైనా తైవాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎలెన్ మస్క్ ఒక శాంతి ప్రతిపాదనను సూచించారు. ఈ నేపథ్యంలోనే చైనా రాయబారి ఎలెన్మస్క్కి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఎలెన్ మస్క్ ఫైనాన్షియల్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో... తైవాన్ను చైనా ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్‌గా మార్చవచ్చని ఒక సలహ ఇచ్చారు. దీంతో చైనా రాయబారి ట్విట్టర్లో... ఒక దేశం రెండు వ్యవస్థలుగా తైవాన్ సమస్యను తీర్చే మీ సలహ ఉత్తమైమనది అని ప్రశంసించారు. ఇది చాలా శాంతియుత పునరేకికరణ అంటూ ఎలెన్ మస్క్‌ని ప్రశంసించారు. ఐతే చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలకు హామీ ఇచ్చినట్లయితే తైవాన్ పునరేకీకరణ తర్వాత ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా స్వయం ప్రతిపత్తిని, అభివృద్ధిని పొందుగలుగుతుందని క్విన్ గ్యాంగ్ ట్వీట్ చేశారు. ఐతే ఎలెన్ మస్క్ సలహ తైవాన్ ప్రజలకు నచ్చలేదు, పలు తైవాన్ రాజకీయ పార్టీలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అంతేగాదు మస్క్ వ్యాఖ్యలు జాతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లఘించడమే కాకుండా ప్రజాస్వామ్యానికి హాని కలిగించేవని తైవాన్ డెమోక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి హువాంగ్త్సాయ్ పేర్కొన్నారు. అయినా మస్క్‌కి చైనాలో పలు వ్యాపారాలు ఉన్నాయని అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతోంది తైవాన్. మరోవైపు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాత్రం తైవాన్ విషయంలో విదేశీ శక్తుల జోక్యాన్ని చైనా అంగీకరించదని దృఢంగా చెప్పడం విశేషం. (చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్.. ఉక్రెయిన్ ఘాటు కౌంటర్) -
నేనెవర్నీ ఆహ్వానించ లేదు.. కలుసుకోను లేదు! : హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్ అన్సారీ తనను భారత్‌కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హమీద్ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత యూఎన్ఎస్సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్‌లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు) -
భారత్ ఆ నిర్ణయం తీసుకుంటే...రాయబారిగా అత్యంత సంతోషిస్తా!
If Indias Position Moved Closer To Ukraine: ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ సంక్లిష్టమైన తటస్థ వైఖరిని అవలంభిస్తోందని భారత్‌లోని కైవ్ రాయబారి ఇగోర్ పొలిఖా అన్నారు. యూఎన్‌లోని ఉక్రెయిన్ మానవతా సంక్షోభానికి సంబంధించిన రష్యా తీర్మానానికి భారత్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఇగోర్ పొలిఖా ప్రస్తావిస్తూ భారత్‌ని అభినందించారు. దీంతో రష్యాకు ఒకే ఒక మద్దతుదారు (చైనా) లభించిందని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్‌కు భారత్ మానవతా సహాయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రశంసించారు. అదే సమయంలో వాషింగ్టన్‌లోని ఇతర మిత్ర దేశాలతో పోలిస్తే ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో భారత్ స్పందను గురించి కూడా మాట్లాడారు. తాను భారత్ విదేశాంగ విధాన అవసరాలను లోతుగా అర్థం చేసుకున్నాని అన్నారు. ఒక ఇండాలజిస్ట్గా తాను అనేక అధికారిక అనధికారిక విషయాలను అర్థం చేసుకోగలను అని కూడా చెప్పారు. కానీ రాయబారిగా మాకు మద్దతు ఇవ్వండి అని ఒత్తిడి చేయక తప్పడం లేదని అన్నారు. అంతేకాదు భారత్ గనుకు రష్యా దాడికి వ్యతిరేకంగా బలమైన నిర్ణయం తీసుకుంటే తాను రాయబారిగా మరింత సంతోషిస్తానని అన్నారు. ఈ యుద్ధం ఒకరకరంగా అందర్నీ ఒకింత ఒత్తిడికి గురిచేస్తోందని అన్నారు. ఈ యుద్ధం ఇన్ని రోజులు సాగుతుందని రష్యన్ల కూడా అనుకుని ఉండరన్నారు. పైగా రష్యన్లు సైనిక మరణాల గణనను కూడా విడుదల చేయడం లేదని చెప్పారు. వాళ్ల తప్పుడు లెక్కల ప్రకారం నాలుగు రోజ్లులో యుద్ధం ముగిసిపోతుందని పైగా ప్రతి వీధిలో సైనికుడు పుష్ప గుచ్చంతో స్వాగతం పలుకుతారని ఊహించుకుంటోంది రష్యా అని విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఇంతమంది మద్దతును కూడగట్టుకుని అతి పెద్ద శక్తిగా అవతరిస్తారని రష్యన్లు ఊహించలేకపోయారని అన్నారు. తమ అధ్యక్షుడు నేపథ్యం అందరికీ తెలుసని కానీ ఈ యుద్ధం మొదలైన తర్వాత చాలా మంది నాయకులు హాస్య నటులుగా మారిపోవడం విశేషం అని వ్యంగ్యంగా అన్నారు. (చదవండి: యుద్ధాన్ని ఆపమని పుతిన్‌కి చెప్పగలిగేది చైనా మాత్రమే!) -
భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్‌కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
చైనాలో భారత్ కొత్త రాయబారికి క్వారంటైన్
బీజింగ్: చైనాలో రాయబారిగా ఇటీవల నియమితులైన ప్రదీప్‌కుమార్ రావత్‌ను అధికారులు కోవిడ్–19 నిబంధనల పేరుతో నిర్బంధ క్వారంటైన్లో ఉంచినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. ఆయన్ను తప్పనిసరి క్వారంటైన్ కోసం షాంగైకి తరలించిన అక్కడి అధికారులు.. ఇటువంటి కోవిడ్ నిబంధనపై ముందుగా భారత అధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనాకు రాయబారిగా పనిచేసిన విక్రమ్ మిస్రిని ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి, ఆయన స్థానంలో రావత్‌ను ఎంపిక చేసింది. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రావత్, గతంలో ఇండోనేసియా, నెదర్లాండ్స్‌లలో రాయబారిగా పనిచేశారు. మాండరిన్ అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన హాంకాంగ్, బీజింగ్‌లలో కూడా పనిచేశారు. (చదవండి: నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం) -
ఉత్త సక్సెస్ కాదు.. గొప్ప సక్సెస్ కావచ్చని నిరూపించింది!
యూట్యూబ్‌లో అందరూ వీడియోలు చేస్తారు. కాని ప్రాజక్తా కోలి సరదా వీడియోలతో పాటు బాధ్యత కలిగిన వీడియోలు చేసేది. ∙ఆడపిల్లల చదువు ∙బాడీ షేమింగ్ ∙మానసిక ఆరోగ్యం వీటి పట్ల చైతన్యం కలిగించే వీడియోలు పెద్ద హిట్. 65 లక్షల సబ్స్క్రయిబర్లు కలిగిన ఒక యువ యూట్యూబ్ స్టార్‌గా యువత మీద ఆమె ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యు.ఎన్.డి.పి)కి మన దేశ ‘తొలి యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. యువత బాధ్యత చూపితేమరింత గుర్తింపు తెచ్చే బాధ్యత వస్తుందనడానికి ప్రాజక్తా ఒక ఉదాహరణ. గలగలమని పొంగే మాట, నిశితమైన గమనింపు, భళ్లుమనే వ్యంగ్యం, లక్ష్యాన్ని చేరుకునే చురుకుదనం ఉంటే సక్సెస్ కావచ్చా? ఉత్త సక్సెస్ కాదు గొప్ప సక్సెస్ కావచ్చు అని ప్రాజక్తా కోలి నిరూపించింది. తన సరదా వీడియోలతో వ్యక్తుల ప్రవర్తనను, లోకం పోకడలను ఎత్తి చూపే ప్రాజక్తా తొలితరం యూట్యూబ్ స్టార్లలో అందరి కంటే అందనంత ఎత్తుకు చేరుకుంది. అందుకే ఐక్యరాజ్య సమితి తన ‘డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ కింద పర్యావరణ స్పృహ కలిగించే వివిధ దేశాల యూత్ క్లయిమెట్ ఛాంపియన్ల ఎంపికలో భాగంగా ప్రాజక్తాను మన దేశం నుంచి తొలిసారిగా ‘యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. 28 ఏళ్ల ప్రాజక్తా ఇక మీదట మన దేశంలోని యువతలోనే కాదు అనేక దేశాల యువతలో కూడా పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేస్తున్న లియొనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి పని చేయనుంది. ఒక భారతీయ యువతికి దక్కిన గొప్ప గుర్తింపు ఇది. ‘ఇది నాకు ఇష్టమైన పని. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రాజక్తా ఈ సందర్భంగా. మనం మార్చగలం ‘ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మనమే తెచ్చాం. మనమే వాటిని పరిష్కరించగలం. నా దృష్టిలో యువత ఈ విషయంలో మొదటి వరుస సైనికులుగా ఉండాలి. యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో మానవజాతే అంతరించి పోయే పరిస్థితులు వస్తాయి. అలా జరక్కుండా ఉండటానికి మన దేశంలో యువత చైతన్యవంతం కావాలి. అందుకు నేను పని చేస్తాను. అలాగే ప్రపంచ యువత ఆలోచనలను పంచుకుంటాను’ అంది ప్రాజక్తా. (చదవండి: ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!) థానే అమ్మాయి ప్రాజక్తా మహరాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. ముంబైలో చదువుకుంది. తండ్రి మనోజ్ కోలీ చిన్న సైజు రియల్టర్. తల్లి అర్చన కోలి టీచర్. ఈమెకు నిషాంత్ అనే తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ప్రాజక్తా ఉత్త వాగుడుకాయ. స్కూల్లో ప్రతి పోటీలో పాల్గొని మాట్లాడేది. ప్రైజులు కొట్టేది. తమ అమ్మాయి ఇంట్లో, క్లాస్‌రూమ్‌లో వొదిగి ఉండటానికి పుట్టలేదని, స్టేజ్ మీద జనాన్ని అలరించడానికి పుట్టిందని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ప్రాజక్తాను బాగా ప్రోత్సహించారు. ఆరవ తరగతిలోనే రేడియో జాకీ అవ్వాలనుకున్న ప్రాజక్తా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసి ముంబై ‘ఫీవర్’ రేడియోలో ఒక సంవత్సరం ఇన్‌టర్న్‌గా చేసింది. కాని ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో గెస్ట్‌గా వచ్చిన హృతిక్ రోషన్‌తో ప్రాజక్తా చేసిన ఒక చిన్న వీడియో చూసిన డిజిటల్ కంటెంట్ ఎక్స్పర్ట్ సుదీప్ లహరీ ‘నీ మాటలో మంచి విరుపు ఉంది. ఇది యూట్యూబ్ యుగం. యూ ట్యూబ్ చానల్ మొదలెట్టు’ అని సలహా ఇచ్చాడు. అలా 2015లో ప్రాజక్తా మొదలెట్టిన యూట్యూబ్ చానల్ ‘మోస్ట్‌లీసేన్’. మోస్ట్‌లీసేన్ ‘మోస్ట్‌లీసేన్’ చానల్లో అన్నీ తానుగా ప్రాజక్తా వీడియోలు చేసి రిలీజ్ చేస్తుంది. అంటే వీడియోలో ఆమె ఒక్కతే రకరకాల పాత్రలుగా కనిపిస్తుంది. అందుకు ఆమె తాను గమనించిన మనుషుల ప్రవర్తనలను ముడి సరుకుగా చేసుకుంటుంది. ‘మనకు తెలిసిన 10 రకాల టీవీ ప్రేక్షకులు’, ‘పది రకాల విద్యార్థులు’, ‘వీరండీ మన ఇరుగు పొరుగు’, ‘మన అమ్మలు... వారి చాదస్తాలు’... ఇలా టాపిక్ తీసుకుని ఆ పాత్రలన్నీ తానే ధరిస్తుంది. ఈ వీడియోల్లో తమను తాము చూసుకున్న ప్రేక్షకులు వెంటనే సబ్స్క్రయిబర్లుగా మారారు. ఒక్క సంవత్సరంలోనే లక్ష మంది సబ్స్క్రయిబర్లను పొందింది ప్రాజక్తా. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 65 లక్షలకు చేరింది. వారంలో మూడు వీడియోలు ఆమె విడుదల చేస్తే యూట్యూబ్ ద్వారా బోలెడు ఆదాయం వచ్చి పడుతోంది. మిషేల్ ఒబామాతో కాఫీ ప్రాజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అంతే కాదు యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్‌గా ఎదిగింది. ఇవన్నీ ఆమె తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది. యువత తన కెరీర్ కోసం కష్టపడాలి. తప్పదు. దాంతో పాటు సామాజిక బాధ్యత చూపిస్తే ప్రాజక్తాలా గొప్ప గొప్ప బాధ్యతలు వరిస్తాయి. జీవితంలో సక్సెస్‌ను అలా కదా చూడాలి. -
పేటీఎం విజయ్ శేఖర్ శర్మకు అంతర్జాతీయ గుర్తింపు
న్యూఢిల్లీ: పేటీఎం వ్యవస్థాకుడు విజయ్ శేఖర్ శర్మ అంతర్జాతీయంగా ముఖ్యమైన గ్రూపులో చోటు సంపాదించుకున్నారు. యూనివర్సల్ యాసెప్టెన్స్ స్టీరింగ్ గ్రూపు (యూఏఎస్జీ).. శర్మను యూఏ (యూనివర్సల్ యాసెప్టెన్స్) అంబాసిడర్‌గా నియమించింది. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్ఎన్) మద్దతుతో ఈ గ్రూపు పనిచేస్తుంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్ అవకాశం లేని భాషలకు సంబంధించి స్క్రిప్ట్‌లకు ప్రమాణాలను ఈ గ్రూపు సిఫారసు చేస్తుంటుంది. ‘డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకెళ్లే బహుళ భాషల ఇంటర్నెట్ కోసం మేము కృషి చేస్తున్నాం. భాషల పరంగా ఉన్న అడ్డంకిని ఛేదించాలన్నది మా ఆలోచన. ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాం. విజయ్ వంటి నాయకుడు యూఏ అంబాసిడర్‌గా ఉండడం మాకు గౌరవం’ అని యూఏఎస్జీ చైర్పర్సన్ అజయ్ డాటా పేర్కొన్నారు. ‘భారత్ విభిన్న బాషలకు నిలయం. భారతీయులకు వారికి సౌకర్యమైన భాషల్లో ఉత్పత్తులు, సేవలు అందించగలగడం మాకు గర్వకారణం. అందరికీ ఇంటర్నెట్ కోసం పనిచేసే యూఏతో కలసి పనిచేసే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. -
రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్.. ట్వీట్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్ దొరికింది. అతడిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ట్విటర్ వేదికగా ఆదివారం ప్రకటించారు. యువతను క్రీడలు, ప్రజారోగ్యం వైపునకు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. స్వయంగా వీడియోకాల్ చేసి పంత్‌కు తమ నిర్ణయాన్ని సీఎం చెప్పారు. అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో పంత్ స్పందించాడు. ప్రజలకు క్రీడలు, ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని సీఎంతో అన్నాడు. ప్రభుత్వం తనకిచ్చిన అవకాశం పట్ల సీఎంకు అతను ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు పంత్ ట్వీట్చేశాడు. (చదవండి: Ashes 2021-22 second Test: విజయం దిశగా ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!) ఇక ఆట విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా టెస్టు స్క్వాడ్‌లో పంత్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జట్టుతో కలిసి అతను జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ఆ జట్టు రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు 25 టెస్టుల్లో 1549 పరుగులు, 18 వన్డేల్లో 529 పరుగులు , 41 అంతర్జాతీయ టీ20ల్లో 623 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 2500 పరుగులు చేశాడు. भारत के बेहतरीन क्रिकेट खिलाडियों में से एक, युवाओं के आदर्श और उत्तराखण्ड के लाल श्री ऋषभ पंत जी को हमारी सरकार ने राज्य के युवाओं को खेलकूद एवं जन- स्वास्थ्य के प्रति प्रोत्साहित करने के उद्देश्य से "राज्य ब्रांड एंबेसडर" नियुक्त किया है। @RishabhPant17 pic.twitter.com/7vVyoXUmwP — Pushkar Singh Dhami (@pushkardhami) December 19, 2021 Thank you @pushkardhami sir for giving me the opportunity to be the Brand Ambassador of promoting Sports and General Health among the people of Uttarakhand. I’ll do my best to spread this message and feeling happy that you are taking these steps towards a fitter India. https://t.co/xv17rs5bV0 — Rishabh Pant (@RishabhPant17) December 19, 2021 (చదవండి: Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు!) -
‘ఇండియా అమెరికాల మధ్య సత్సంబంధాలున్నాయి’
డాలస్, టెక్సాస్: జాతీయ సమైక్యతా దినంగా సర్థార్ వల్లభభాయి పటేల్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని భారత రాయబారి తరంజిత్ సింగ్ సందు అన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ), ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు 50 వరకు వివిధ భారతీయ సంఘాల నుండి 200లకు పైగా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికాలో భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందు ముఖ్య అతిధిగా, భారత కాన్సులేట్ అధికారి అసీం మహాజన్ ప్రత్యేక అతిధిగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరంజిత్‌సింగ్ మాట్లాడుతూ.. అమెరికా భారత దేశాల మధ్య సత్సంబంధాలు, వాణిజ్య అభివృద్ధికి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ ఇతోధికంగా కృషి చేస్తున్నారని ఇదే సమయంలో భారతదేశం కూడా ఎంతో ఆసక్తి తో అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన జారీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఐఏఎన్టీ అధ్యక్షుడు శైలేష్ షా ఇతర బోర్డు సభ్యులు అథిధులను ఘనంగా సన్మానించారు. సమావేశం అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. -
కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ
సాక్షి, అమరావతి: కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ(స్పాట్ బిల్డ్ పెలికాన్)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్.ప్రతీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్‌గా గుర్తించినట్లు చెప్పారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వారం దేశవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో చిత్తడి నేలలకు సంబంధించిన ఒక పక్షి లేదా అక్కడి వైవిధ్యమైన జంతువును అంబాసిడర్‌గా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఏపీలో గూడకొంగను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో ఉన్న పెలికాన్ పక్షుల్లో 40 శాతం ప్రతి ఏడాదీ కొల్లేరుకు వస్తాయని, అందుకే దీన్ని అంబాసిడర్‌గా ఎంపిక చేశామన్నారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్ ల్యాండ్ మిత్రాస్‌ను నియమిస్తామని తెలిపారు. స్థానికంగా సేవా దృక్పథం ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సెల్వం తదితరులు పాల్గొన్నారు. -
సువర్ణ భూమి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
-
Mahesh Babu: మహేశ్... ఇట్స్ ఏ బ్రాండ్
సూర్య ఇది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటూ బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌కి బాక్సాఫీస్ దద్దరిల్లింది. వెండితెరపై మహేశ్‌బాబు చేసే యాక్టింగ్‌కే కాదు డైలాగ్ డెలివరీకి, మ్యానరిజమ్ మూమేంట్స్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే మహేశ్‌లోని క్రేజ్‌తో తమ బ్రాండ్ల బిజినెస్ పెంచుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి నేషనల్ లెవల్‌కి వెళ్లిపోయాడు మన మహేశ్. సాక్షి, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ మాటకొస్తే మోస్ట్ డిజైరబుల్ జాబితాల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న హీరో కూడా మహేశే. పాతిక సినిమాలు పూర్తికాక ముందే స్టార్ హీరో రేసులో టాప్ పొజిషన్‌కు చేరడమే కాదు.. హ్యాండ్సమ్ హీరోగానూ మహేష్‌కి పేరుంది. ఈ ట్యాగ్ లైన్ టాలీవుడ్‌కే పరిమితం కాలేదు.. మిగతా భాషల్లోనూ హీరోల అందగాళ్ల జాబితాలోనూ మహేశ్ష్కు చోటు దక్కింది.అందువల్లే ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్దీ బ్రాండ్లు తమ అంబాసిడర్‌గా మహేశ్‌బాబుని ఎంచుకున్నాయి. సూపర్ స్టార్ ప్రచార పవర్‌కి సలాం కొడుతున్నాయి. వాట్నాట్ కూల్‌డ్రింక్ యాడ్‌తో మొదలైన మహేశ్ యాడ్ ఛరిష్మా.. ఇప్పుడు దాదాపు అన్నింటా పాకింది. బైకులు, సోపులు, బట్టలు, ఈ కామర్స్, మొబైల్ బ్రాండ్స్ వాట్ నాట్ అన్నింటీ మహేశే కావాలన్నట్టుగా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి,. మహేశ్ నటించే యాడ్స్‌ని తీసే బాధ్యతలను ఏస్ డైరెక్టర్లుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలాంటి వారికి అప్పగిస్తున్నాయి. మహేశే ఎందుకు మురారీ, అతడు, సీతమ్మ వాకిట్లో, శ్రీమంతుడుతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఒక్కడుతో మాస్‌ని, పోకిరితో యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సాధించిన మహేశ్ ఇప్పటికీ కాలేజ్ బాయ్‌లా కనిపిస్తుంటాడు. అందువల్లే యాడ్లలో మహేశ్ అప్పీయరెన్స్ ఆయన ఫ్యాన్స్‌నే కాదు ఫ్యామిలీ ఆడియొన్స్‌ను సైతం ఫిదా చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకోవాలంటే మహేశ్‌కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అందుకే బైజూస్ నుంచి మొదలు పెడితే టూత్‌బ్రష్, వంటనూనె, బంగారం, బట్టలు, పెర్ఫ్యూమ్, బైకులు, కూల్‌డ్రింక్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అన్నింటా బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ కనిపిస్తున్నారు. వేరియేషన్స్ వెండితెరపై కూల్ లుక్‌తో కనిపించే మహేశ్‌కు బుల్లితెరపైనా వచ్చే యాడ్స్‌లో జేమ్స్‌బాండ్ తరహాలో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా థమ్స్యాడ్స్ అన్నీ సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లతోనే వస్తున్నాయి. ప్రొడక్ట్ ఏదైనా సరే ఆ యాడ్‌లో మహేశ్ అలా నడిచి వచ్చి ఇలా ఓ లుక్క్ ఇచ్చి తనదైన స్టైల్లో రెండు మాటలు చెబితే చాలు ఆ బ్రాండ్ జనాల మదిలో రిజిస్టరై పోతుంది. రన్నింగ్ సిగ్నేచర్ సిల్వర్ స్త్రీన్‌పై మహేశ్‌బాబు రన్నింగ్ సీన్లకే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మురారీలో అరటితోటలో మొదలెట్టిన రన్నింగ్ టక్కరి దొంగ, పోకిరి, సీతమ్మ మీదుగా ఇప్పటికీ ఆగడం లేదు. ఈ రన్నింగ్ సీన్లని ఓ కూల్ డ్రింక్ కంపెనీ విపరీతంగా వాడేసుకుంటోంది. ఈ కంపెనీకి ఇతర భాషల్లో ఇప్పటికే పలువురు హీరోలని మార్చినా తెలుగు లో మాత్రం మహేశ్ అలానే ఉన్నాడు. లిస్టు పెద్దదే సోషల్ మీడియాలో టాలీవుడ్‌కు ఫాలోయింగ్ పాఠాలు నేర్పించిన మహేశ్.. సౌత్‌లోనే ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. సోషల్ క్యాంపెయిన్స్లోనూ ముందుండే మహేశ్ ఓ ప్రముఖ పిల్లల హాస్పిటల్కూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక కార్పోరేట్ బ్రాండింగ్ విషయానికి వస్తే మహేశ్ ఇప్పటి వరకు డెన్వర్ డియోడరంట్, ఫ్లిప్‌కార్ట్, క్లోజ్అప్, గోల్డ్ విన్నర్, ప్రోవోగ్ సూపర్ కలెక్షన్, ఐడియా సెల్యూలార్, టాటా స్కై, పారగాన్, టీవీఎస్ మోటార్, సంతూర్, అమృతాంజన్, రాయల్‌స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, బైజూస్, నవరత్న, ఐటీసీ వివెల్ షాంపూ, జాస్ అలుకాస్, యూనివర్సల్ సెల్, ప్రోవోగ్, ల్యాయిడ్, గోద్రేజ్, సూర్యా డెవలపర్స్, కార్దేఖో, అభిబస్ ఇలా అనేక బ్రాండ్లకు ప్రచారం చేశారు. దీపం ఉండగానే దీపం ఉండగానే ఇళ్లు.. క్రేజ్ ఉండగానే కమర్షియల్ కెరీర్ చక్కబెట్టుకోవాలి అనేది మన సెలబ్రిటీలకు బాగా వంటపట్టిన విషయం. అందుకే ఓ వైపు వెండితెర వేల్పుగా రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో జిగేల్మంటూ మరికొంత సంపాదిస్తుంటారు. జనాల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి వారికి పారితోషం ఇస్తుంటారు. ఇప్పటికే పలువురు సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరిలో మహేశ్ బాబు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న మహేశ్ బాబు ఇటు సినిమాలు చేస్తూ అటు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీటన్నిటికీ ప్రిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబు ఒక్కో ఎండార్స్మెంట్కి రూ. 5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. -
ఆరేళ్ళ అంబాసిడర్... జష్నీత్ కౌర్!
వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనుషులు మారుతున్నారు. కానీ ఇప్పటికీ అమ్మాయి పుడితే ఆనందించే కుటుంబాలు కొన్నే కనిపిస్తాయి. ఈ కోవకు చెందిన పంజాబి కుటుంబంలో పుట్టింది జష్నీత్ కౌర్. ముద్దులొలికే మాటలు, చిరునవ్వుల ముఖంతో ఆకర్షణీయంగా ఉండడంతో జష్నీత్‌ను పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఎడ్యుకేషన్ అంబాసిడర్ గా ఎన్నుకుంది. దీంతో ఎక్కడ చూసినా తమ చిన్నారి ఫోటో కనిపించడంతో అమ్మాయి వద్దనుకున్న జష్నీత్ తల్లి.. మా అమ్మాయి అబ్బాయితో సమానం అని గర్వంగా చెబుతున్నారు. పంజాబ్‌లోని ఫరీద్కోట్ జిల్లా వారా భాయ్ కా గ్రామానికి చెందిన జగిత్ సింగ్, సుదీప్ కౌర్ దంపతులకు జష్నీత్ పుట్టింది. సుదీప్ ఇంటర్మీడియట్ వరకు చదివి గృహిణి గా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంటే.. జగిత్ ఓ దారాల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సుదీప్ కడుపుతో ఉన్నప్పుడు తనకు అబ్బాయే పుట్టాలని కోరుకునేవారు. తొలి సంతానం కావడంతో ఆమె కొడుకు కావాలని, తనకి కొడుకే పుడతాడని ఆమె కలలు కనేవారు. కానీ చివరికి జష్నీత్ పుట్టింది. అమ్మాయి పుట్టిందని ఆమె చాలా బాధపడ్డారు. అయితే జష్నీత్ తండ్రి, తాత, నానమ్మలు మాత్రం నిరాశ చెందలేదు. జష్నీత్‌ను అల్లారుముద్దుగా చూసుకునేవారు. కానీ సుదీప్‌కౌర్‌కు మాత్రం ఆనందంగా ఉండేవారు కాదు. బాగా చదివించాలని.. ఒక్కగానొక్క కూతురు కావడంతో జష్నీత్‌ను ప్రైవేటు స్కూల్లో బాగా చదివించాలనుకున్నారు. కానీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూలు స్మార్ట్ స్కూల్‌గా మారడంతో ..ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న సదుపాయాలన్నీ ఇక్కడ కూడా ఉండడంతో జష్నీత్‌ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. ఓ రోజు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ కుమార్ ఆ స్కూల్ ను సందర్శించారు. జష్నీత్‌ను చూసిన ఆయన ఆమెతో మాట్లాడి ఫోటోలు తీసుకుని ఈ అమ్మాయి పంజాబ్ ఎడ్యుకేషన్ విభాగం బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఎడ్యుకేషన్ ప్రకటనల్లో జష్నీత్ కనిపించడం ప్రారభమైంది. రాష్ట్రంలో ఏ న్యూస్ పేపర్, టీవీల్లో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఆరేళ్ళ అమాయకమైన ముఖం, కళ్లతో చిరునవ్వులు చిందిస్తూ స్కూలు యూనిఫాం, టై కట్టుకుని రిబ్బన్లతో కట్టిన రెండు జడల్ని ముందుకేసుకున్న ఫోటో ఎడ్యుకేషన్ విభాగం నిర్వహించే అనేక కార్యక్రమాలో 2018 నుంచి కనిపించేది. వాట్సాప్ డిస్లే్ప ఫోటోగానూ జష్నీత్ కనిపించడం విశేషం. ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లల్ని చేర్పించమని.. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మంచి విద్యను అందిస్తున్నాం అని ప్రభుత్వం తరుపున ప్రచారం చేస్తోంది జష్నీత్. ఈచ్ వన్, బ్రింగ్ వన్ (ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమం), ఘర్ బైటే శిక్షా(ఆన్లైన్ ఎడ్యుకేషన్), లైబ్రరీ లాంగర్, మిషన్ సాత్ పరిషత్ వంటి కార్యక్రమాల్లో గత మూడేళ్లుగా జష్నీత్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఎంత అదృష్ట వంతురాలో అని అందరు అనుకుంటుంటే..జష్నీత్ తల్లి తెగ మురిసిపోతున్నారు. ‘‘జష్నీత్ పుట్టినప్పుడు అమ్మాయి పుట్టిందని చాలా బాధపడ్డాను. కన్నతల్లిగా కూతుర్ని అప్యాయంగా చూడలేకపోయాను. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఎక్కడ చూసిన నా చిట్టి తల్లి ఫోటోలు కనిపిస్తున్నాయి. అందరికి జష్నీత్ ఎవరో తెలిసిపోయింది. నాకు కొడుకు వద్దు జష్నీతే అబ్బాయి తో సమానం’’ అని ఆమె చెప్పారు. -
అమెరికా నుంచి భారత్‌కే అధిక టీకాలు
వాషింగ్టన్: అమెరికా ప్రపంచ దేశాలకు ఉచితంగా పంపిణీ చేయనున్న కోవిడ్ టీకా డోస్‌లలో భారత్‌కే అధిక పరిమాణంలో టీకాలు దక్కుతాయని అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధూ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను విరివిగా పంపిణీ చేయాలని అమెరికా నిర్ణయించిందనే విషయాన్ని సంధూ గుర్తు చేశారు. ఈ విషయంలో అగ్రరాజ్యం తాజాగా విడుదల చేసిన పొరుగు, మిత్రదేశాల జాబితాలో భారత్ ఉందన్నారు. జాబితాలోని దేశాలకు అమెరికా కరోనా టీకాలను నేరుగా పంపిణీ చేయనుందని పేర్కొన్నారు. అవసరానికి మించి ఉన్న టీకాలను ఇండియాలాంటి దేశాలకు అందజేయాలంటూ జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన వెల్లడించారు. భారత్ ఇప్పటికే టీకాల కొరతను ఎదుర్కొంటోందని చెప్పారు. దీంతో మిగులు టీకా డోస్‌లను ప్రపంచ దేశాలకు అందజేయాలని అమెరికా ఇటీవల నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గురువారం భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయనకు తెలిపారు. వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటున్న దేశాలకు త్వరలో 2.5 కోట్ల డోసులను అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే ప్రకటించారు. వీటిలో 1.9 కోట్ల డోసులను ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఇస్తామన్నారు. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రపంచ దేశాలకు 8 కోట్ల డోసులు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
Ashok Shrivastav: ‘అతడి ఇంట్లోని మహిళల మీద జాలి కలుగుతోంది’
‘ఫైండ్ ఎ బెడ్’ అనే యూఎన్ కోవిడ్ సహాయ కార్యక్రమానికి ఇండియా నుంచి బాలీవుడ్ నటీమణులు రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్ అంబాసిడర్లుగా ఉన్నారు. అయితే.. అందుకు వారు తగినవారు కాదు అని దూరదర్శన్ టీవీ జర్నలిస్ట్ అశోక్ శ్రీవాత్సవ్ ట్వీట్ చేయడం వివాదం అయింది. ‘తగని’ ఆ ముగ్గురూ శ్రీవాత్సవ్ కు తగిన సమాధానమే ఇవ్వబోతున్నారు. రిచా అయితే ఇప్పటికే టిట్ ఫర్ ట్వీట్ ఇచ్చేశారు. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్.. ఈ ముగ్గురూ.. ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ అని ఒక ఇమేజ్ ఉంది. కేవలం వాళ్లు నటించిన సినిమాల వల్ల మాత్రమే వచ్చిన ఇమేజ్ కాదు అది. విలక్షణమైన వాళ్ల వ్యక్తిత్వం కూడా ఆ ఇమేజ్‌కి కొంత కారణం. 34 ఏళ్ల రిచా సామాజిక కార్యకర్త. విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇస్తుంటారు. అందువల్ల తనకు సినిమా ఛాన్స్‌లు పోతాయనేం భయపడరు. ఇక నాలుగు పదుల సన్నీ లియోన్. ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్. తర్వాత హాలీవుడ్‌కి, అక్కణ్ణుంచి బాలీవుడ్‌కి వచ్చారు. రాజకీయ స్పృహ, చైతన్యం రెండూ ఎక్కువే. మూగజీవుల సంరక్షణ సంస్థ ‘పెటా’కు బ్రాండ్ అంబాసిడర్ కూడా పని చేశారు. 33 ఏళ్ళ స్వరా భాస్కర్ డేర్ అండ్ డెవిలిష్! ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై జరిగే ప్రదర్శనలకు తన గళాన్ని ఇస్తుంటారు. సినిమాల్లో, ఓటీటీల్లో ఆమె వేసే పాత్రలు కూడా ఆమెకు దీటైనవే. అంటే దాపరికాలు ఉండనివి. ఈ ముగ్గురూ ప్రస్తుతం ‘ఫైండ్ ఎ బెడ్’ అనే ప్రచారోద్యమానికి మద్దతిస్తున్నారు. అయితే.. ‘ఫైండ్ ఎ బెడ్‌కు వీరు తగని వ్యక్తులు’ అని అశోక్ శ్రీవాత్సవ్ అనే జర్నలిస్టు విమర్శించడంతో రిచా, సన్నీ, స్వరా స్పందించవలసి వచ్చింది. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి మహిళల్ని కించపరిచేలా రిచా, సన్నీ, స్వరాలను అంత మాట అన్న శ్రీవాత్సవ్ గురించి తర్వాత తెలుసుకోవచ్చు. ముందైతే ‘ఫైండ్ ఎ బెడ్’ ఏమిటో చూద్దాం. ఇదొక యూత్ ప్రోగ్రామ్. కోవిడ్ ఉద్ధృతితో ఆసుపత్రులలో బెడ్లు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైలోని ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూమెంట్ టు యునైటెడ్ నేషన్స్’ (ఐఐఎంయుఎన్) అనే సంస్థ తాజాగా ‘ఫైండ్ ఎ బెడ్’ అనే కార్యాచరణను భుజానికెత్తుకుంది. దేశంలోని 160 నగరాలను కలుపుతూ 26 వేల మంది విద్యార్థులతో ఒక వ్యవస్థను నిర్మించి, వారి ద్వారా అవసరమైన వారికి కోవిడ్ ఆసుపత్రులలో బెడ్లను సమకూర్చేందుకు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే ఆసుపత్రులలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఈ యువ సైన్యం ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారికి ఆ ప్రాంతంలో బెడ్ దొరికేలా ‘ఫైండ్ ఎ బెడ్’ ఏర్పాట్లు చేస్తుంది. యువతరంలో బాలీవుడ్ నటీనటులకు, అందులోనూ సామాజిక కార్యక్రమాల్లో కాస్త చురుగ్గా ఉండేవాళ్లకు క్రేజ్ ఉంటుంది కాబట్టి ఐ.ఐ.ఎం.యు.ఎన్. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్లను తమ ప్రచారోద్యమ గౌరవ సార థులుగా నియమించుకుంది. అది చూసే మన శ్రీవాత్సవ్ భ్రుకుటి ముడివేసి, ‘తగని వ్యక్తులు’ అని వీళ్ల మీద ఒక ట్వీట్ ముద్ర వేశారు. ∙∙ అశోక్ శ్రీవాత్సవ్ దూరదర్శన్‌లో సీనియర్ కన్సల్టింగ్ ఎడిటర్. అంతటి మనిషి ఇప్పుడిలా ఈ ముగ్గురిపై నోరు పారేసుకుని డీడీ ప్రతిష్టకే భంగం కలిగేలా చేశారని విమర్శలు వస్తున్నాయి. ‘ఫౌండ్ ఎ బెడ్’కు తమని తగని వ్యక్తులుగా పేర్కొంటూ ఆ ముగ్గురి ఫొటోలు పెట్టి ట్విట్టర్లో కామెంట్‌ను పోస్ట్ చేసిన శ్రీవాత్సవ్‌కు ఏ మాత్రం కనికరం లభించే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఇలాంటివే కొన్ని అనవసర వ్యాఖ్యల్ని చేసిన చరిత్ర అతడికి ఉంది. ఇప్పుడిక భవిష్యత్తునూ లేకుండా చేసుకునేలా ఉన్నారు. ‘‘అతడి ట్వీట్‌ను చూసి షాక్ తిన్నాను. దూరదర్శన్ ఇలాంటి స్త్రీ ద్వేషినీ, దుష్ట మానవుడినా ఉద్యోగంలోకి తీసుకుంది!’’ అని రిచా ట్వీట్ చేశారు. ఆపత్సమయాలలో ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తారు. ఇతడు సహాయం చేయకపోగా, ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు. వెంటనే నటి పన్ను తాప్సీ.. రిచాకు మద్దతుగా స్పందించారు. ‘‘అతడు నా గురించి కూడా గతంలా ఇలాగే కామెంట్ చేశాడు. ముఖ్యమైన ట్వీట్లకు సమాధానం ఇవ్వవలసిన తొందరలో ఉండి అతడిని వదిలేశాను. తన అధికారాన్ని ఆ వ్యక్తి ఇలా వాడుకుంటున్నాడు’’ అని తాప్సీ అన్నారు. ‘‘ఇలాంటి వాళ్లను ఊరికే వదలిపెట్టకూడదు’’ అని తాప్సీ ట్వీట్‌కి రిచా రిప్లయ్ ఇచ్చారు. ముగ్గురిలో మిగతా ఇద్దరు.. సన్నీ లియోన్, స్వరా భాస్కర్ వెంటనే ఏమీ స్పందించలేదు. శ్రీవాత్సవ్‌పై వారు దూరదర్శన్‌కు ఫిర్యాదు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిచా అయితే నేటికీ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నారు! ‘‘ఇలాంటి ఒక వ్యక్తి జాతీయ మీడియాలో ఎలా పని చేస్తున్నట్లు!! అతడి ఇంట్లోని, ఆఫీసులోని మహిళల మీద జాలి కలుగుతోంది’’ అని అంటున్నారు. -
అత్యున్నత స్థానాలు.. అందరూ మహిళలే
ఫ్రాన్స్‌కు తాజాగా మెన్నా రాలింగ్స్ అనే మహిళ... దౌత్యవేత్త కావడంతో బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి అన్ని సీనియర్ డిప్లొమాటిక్ పోస్టులలో మహిళలే కనిపిస్తున్న సందర్భం విశేష ప్రాధాన్యాన్ని, చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే బీజింగ్, వాషింగ్టన్, బెర్లిన్, మాస్కో, టోక్యో, రోమ్లలో అందరూ మహిళలే సీనియర్ స్థాయిలో దౌత్య అధికారులుగా ఉన్నారు. ఇదొక అపూర్వ ఘట్టం. బ్రిటన్ ప్రభుత్వంలో ‘సర్’లు, ‘లార్డ్’లు ఉన్నట్లే మహిళల్ని అతి కీలకమైన విదేశాంగ పదవుల్లోకి రానివ్వని ధోరణీ ఉంటుంది. ఆ దేశాన్ని ఎప్పుడూ రెండు పార్టీలు మారి, మారి పాలిస్తూ ఉంటాయి. కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. ఇప్పుడున్నది కన్జర్వేటివ్ పార్టీ. 187 ఏళ్ల క్రితం పుట్టింది. ఇంతవరకు ఆ పార్టీ తరఫున ఒక్క మహిళా విదేశాంగ కార్యదర్శిగా లేరు! ఉంటే అదొక విడ్డూరం. ఆడవాళ్లేంటి! దేశాలు దాటిపోవడం ఏంటి! అని. అందుకే కావచ్చు 2006లో లేబర్ పార్టీ మార్గరెట్ బెకెట్ను విదేశాంగ కార్యదర్శిగా నియమించినప్పుడు మార్గరెట్ తనకు తనే నమ్మలేకపోయారు. లేబర్ పార్టీ పుట్టింది 121 ఏళ్ల క్రితం. ఆ పార్టీ చరిత్రలో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి మార్గరెటే. పార్టీలంటే సరే. ఏవో పురుషాధిక్యాలు, ‘మహిళలు చేయలేరు’ అనే చాదస్తాలు ఉంటాయి. మెన్నా రాలింగ్స్ (ఫ్రాన్స్) , కరోలిన్ విల్సన్ (బీజింగ్), డేమ్ కరేన్ (వాషింగ్టన్) మరి సీనియర్ దౌత్య అధికారులుగా వారిని నియమించడానికేమైంది? నమ్మకం లేక! ఆ నమ్మకం లేకపో వడం ఏళ్లుగా సాగుతూ వస్తోంది. అందరు పురుషులు ఒకేలా ఉండరు కదా. ‘అవకాశం ఇచ్చి చూస్తే కదా మహిళలలా చేయగలరో తెలుస్తుంది’ అని యు.కె. విదేశాంగ కార్యదర్శులు ఇద్దరు సర్ సైమన్ ఫ్రేజర్, లార్డ్ మెక్‌డోనాల్డ్ పట్టుపడితే అప్పుడు ఒకళ్లిద్దరితో మొదలైన ఉన్నతస్థాయి మహిళా నియామకాలు ఒకటీ అరగా పెరుగుతూ వచ్చాయి. గత పదేళ్లలో 22 నుంచి 60 మంది మహిళలు విదేశాంగ శాఖలో పెద్ద పోస్టుల్లోకి రాగలిగారు. తాజాగా ఇప్పుడు ‘తొలి మహిళ’ నియామకం ఒకటి జరిగింది! ఫ్రాన్స్‌కి ఇంతవరకు బ్రిటన్ నుంచి మహిళా రాయబారి లేరు. ఇప్పటివరకు ఉన్న 43 మంది రాయబారులూ పురుషులే. తొలిసారి మెన్నా రాలింగ్స్ (53) అనే మహిళ మొన్న ఏప్రిల్ 29న ఫ్రాన్స్ రాయబారిగా నియమితులయ్యారు. బ్రిటన్ నుంచి ఒక మహిళ తనకు రాయబారిగా రావడం అన్నది పారిస్‌కు పూర్తిగా కొత్త. దీంతో ‘ఫస్ట్ ఉమన్ ఇన్ ది రోల్’గా రాలింగ్స్ చరిత్ర సృష్టించారు. చరిత్ర మాత్రమే కాదు. ఇదొక చరిత్రాత్మక సందర్భం కూడా! జిల్ గల్లార్డ్ (బెర్లిన్) , డెబోరా బ్రానెర్ట్ (మాస్కో), జూలియా లాంగ్బటన్ (టోక్యో) ∙∙ రాలింగ్స్ ఫ్రాన్స్ రాయబారిగా పారిస్ వెళ్లడంతో ప్రపంచంలో బ్రిటన్‌కు అత్యంత ప్రధానమైన అన్ని దేశాలలో మహిళలే అత్యున్నతస్థాయి దౌత్య అధికారులుగా ఉన్నట్లయింది! బ్రిటన్ చరిత్రలో ఇలాంటి సందర్భం ఇదే ప్రథమం. బీజింగ్‌లో కరోలిన్ విల్సన్, వాషింగ్టన్లో డేమ్ కరేన్ పియర్స్, బెర్లిన్‌లో జిల్ గల్లార్డ్, మాస్కోలో డెబోరా బ్రానెర్ట్, టోక్యోలో జూలియా లాంVŠ బటన్, రోమ్‌లో జిల్ మోరిస్.. అంతా మహిళలే. ప్రతిభ ఉన్నవారిని పెద్ద స్థానాలకు వెళ్లనివ్వకుండా పక్కన పెడితే పెద్ద స్థానాలే ప్రతిభను వెతుక్కుంటూ వస్తాయనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ. మహిళల శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను పురుషాధిక్య సమాజం ఎన్నాళ్లో, ఎన్నేళ్లో అడ్డుకుని ఆపి ఉంచలేదనడానికి ఇదొక నిదర్శనం కూడా. -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌కు అరుదైన గౌరవం
బోస్టన్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా విశ్వవిద్యాలయం విశ్వ పౌరసత్వ రాయబారిగా విశేషమైన గుర్తింపు ఇచ్చింది. ప్రపంచ శాంతి యత్నాలు, మానవతావాద, ఆధ్యాత్మిక నాయకత్వ పటిమతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతవిశ్వాసాల మధ్య సామరస్యం కోసం ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవం ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక సలహాదారు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అలెగ్జాండర్ లివరింగ్ కెర్న్ దీనిపై ప్రకటన విడుదల చేశారు. విశ్వమానవ రాయబారిగా గుర్తింపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు, మొట్టమొదటగా రవిశంకర్ కంటే ఉత్తమమైన వ్యక్తిని తాము ఊహించలేకపోయామని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆనందంగా కనిపించే మానవతావాది అని కొనియాడారు. ఉత్తమ మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచే రవిశంకర్‌తో చర్చా కార్యక్రమం ద్వారా వారి నుంచి జ్ఞానాన్ని పొందడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనికి తాము సంతోష పడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, సంస్థలు, జాతుల మధ్య పరస్పర శాంతిని పెంపొందించేందుకు, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు గురుదేవ్ అవిశ్రాంతంగా పాటుపడుతున్నట్లు వివరిస్తూ ఈ ప్రకటనను విడుదల చేశారు. -
ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ని అస్కార్ అవార్డుతో సమామైన అవార్డులను ప్రదానం చేసే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాఫ్టా.. నెట్‌ఫ్లిక్స్ సహకారంతో భారత్‌లో ఉన్న గొప్ప కాళాకారులను గుర్తించడానికి ఏర్‌ఆర్ రెహమాన్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఐదు రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారిని బాఫ్టా గుర్తించనుంది. తన ఎంపికపై ఏఆర్ రెహమాన్ స్పందింస్తూ.. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. బాఫ్టాతో పని చేస్తూ సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అని తెలిపారు. చదవండి: ఆది పురుష్‌కి రెహమాన్? ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను బాఫ్టా గుర్తించటం ఓ ప్రత్యేకమైన అవకాశం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, సంబంధాలు పెంచడంతో పాటు బాఫ్టా అవార్డు విజేతలు, నామినేషన్ దక్కించుకున్న వాళ్లకు మెంటర్‌గా ఉంటానని పేర్కొన్నారు. ఇక భారత్‌లో అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూసున్నానని తెలిపారు. యూకేలో బాఫ్టా బ్రేక్ త్రూ ఆర్టిస్టులను 2013 నుంచి గుర్తిస్తోంది. అదేవిధంగా 2019 నుంచి చైనాలో ఉన్న కొత్త ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక భారత్‌లో ఉన్న కొత్త టాలెంట్‌ను గుర్తించడానికి బాఫ్టా అడుగులు వేస్తోంది. చదవండి: ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది ఏఆర్ రెహమాన్ బాఫ్టా అంబాసిడర్‌గా తమకు మద్దతుగా నిలిచినందుకు ఆనందంగా ఉందని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ అన్నారు. అదే విధంగా కొత్త ప్రతిభను గుర్తించడం, పెంపొందించడంలో తమ అభిరుచులకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. హిందీ, తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలతో అనుబంధం ఉన్న రెహమాన్ సేవలు బాఫ్టాకు ఎంతగానో ఉయయోగపడతాయని పేర్కొన్నారు. బ్రేక్ త్రూ ఇండియా ఆర్టిస్టులను ఎంపిక చేయడం కోసం జ్యూరీ, న్యాయ నిర్ణేతలను నియామించాల్సి ఉందని బాఫ్టా పేర్కొంది. -
యువకుల వీపులపై నడిచిన చైనా రాయబారి
టరావా: కిరిబాటి ద్వీపంలో చైనా రాయబారికి ఆహ్వానం పలికిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కిరిబాటిలో చైనా రాయబారిగా విధులు నిర్వర్తించడానికి వెళ్లిన టాంగ్ సాంగన్‌కు స్వాగతం పలికేందుకు అక్కడ అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా అధికారి విమానం నుంచి దిగగానే దారి పొడవునా స్థానిక యువకులు నేలపై బోర్లా పడుకున్నారు. అనంతరం వీళ్ల వీపులపై చైనా రాయబారి నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు ఆయనను చెరో చేయి పట్టుకుని నడిపించారు. ఈ నెలలోనే జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఘటనపై కొందరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే కిరిబాటి అధికారులు మాత్రం ఇందులో తప్పేం లేదని చెప్పుకొచ్చారు. ఈ పద్ధతిలో అతిథులను ఆహ్వానించడం తమ సాంప్రదాయమని వెల్లడించారు. తొలిసారి పర్యటనకు వచ్చినప్పుడు కానీ, పెళ్లిళ్ల సమయంలో కానీ ఇలానే స్వాగతం పలుకుతామని అద్లి జ్టుహుక్స్ అనే నెటిజన్ పేర్కొన్నారు. (సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!) చదవండి: వామ్మో.. చై'నో'.. -
ఫిన్లాండ్లో భారత రాయబారిగా రవీష్ కుమార్
ఢిల్లీ/హెల్సింకి : ఫిన్లాండ్లో భారత రాయబారిగా రవీష్ కుమార్‌ను భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1995 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అయిన రవీష్ కుమార్.. ప్రస్తుతం విదేశాంగమంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. 2017 జూలై నుంచి 2020 ఏప్రిల్ వరకు విదేశీమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా ఉన్న రవీష్ కుమార్.. ఈ సమయంలో అతి సున్నితమైన బాలాకోట్ స్ట్రైక్స్‌తోపాటు జమ్ముకశ్మీర్ పునర్వవస్థీకరణ, ఎన్నార్సీపై భారతదేశం యొక్క విధానాన్ని ప్రపంచానికి విడమరిచి చెప్పారు. ('అంకుల్.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు') అంతకుముందు ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కౌన్సిల్ జనరల్‌గా కూడా సేవలందించారు. జకర్తాతో పాటు థింపూ, లండన్‌లోని ఇండియన్ మిషన్‌లో పనిచేశారు. 25 ఏండ్ల ఐఎఫ్ఎస్ సర్వీసు కలిగివున్న రవీష్ కుమార్.. ప్రస్తుతం ఫిన్లాండ్లో భారత రాయబారిగా ఉన్న వాణిరావు స్థానంలో నియమితులయ్యారు. ఫిన్లాండ్లో భారత్‌కు చెందిన దాదాపు 35 కంపెనీలు ఐటీ, ఆరోగ్యం, ఆతిథ్యం, ఆటోమోటీవ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టగా.. ఫిన్లాండ్కు చెందిన దాదాపు 100 సంస్థలు భారత్‌లో విద్యుత్, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ రంగాలలో పెట్టుబడులు పెట్టాయి.(అన్‌లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు) -
ఇజ్రాయెల్‌లో చైనా రాయబారి అనుమానాస్పద మృతి
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో చైనా రాయబారి డ్యు వీయ్ అనుమానాస్పద స్థితిలో తన నివాసంలో శవమై కనిపించారు. 57 సంవత్సరాల డ్యు వీయ్ గత ఫిబ్రవరి నెలలోనే ఇజ్రాయెల్‌లో చైనా రాయబారిగా నియమితులయ్యారు. టెల్ అవీవ్ నగరంలో తన నివాసంలో విగతజీవిగా పడిఉండటంతో.. సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మృతికి కారణాలు తెలియలేదని, అనుమానాస్పద మృతిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. కరోనా ఆంక్షల కారణంగా వీరు చైనాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: చైనాకు మరో ముప్పు తప్పదా..! -
‘ఐ యామ్ బ్యాడ్మింటన్’ అంబాసిడర్‌గా సింధు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమం ‘ఐ యామ్ బ్యాడ్మింటన్’కు వరల్డ్ చాంపియన్, హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ బుధవారం ప్రకటించింది. నిజాయితీగా ఆడటం ద్వారా ఆట పట్ల తమకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఆటగాళ్లు వ్యక్తం చేసేందుకు ఈ ప్రచార కార్యక్రమం వేదికగా నిలువనుంది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ‘ఏ క్రీడలోనైనా నిజాయితీగా ఆడటమనేది చాలా ముఖ్యం. నీ ఇçష్టప్రకారమే నువ్వు ఆటను ఎంచుకున్నావు. దాన్ని ఆడటంలో నువ్వు అమితమైన ఆనందాన్ని పొందాలి. ఆటలో నిజాయితీగా ఉండాలి. అదే నాకు ముఖ్యం. అంబాసిడర్లుగా ఈ విషయాన్ని మేం మరింత బాగా ఆటగాళ్లలోకి తీసుకెళ్లాలి. ఇలా అయితేనే ఈ విషయం ఎక్కువ మంది ఆటగాళ్లకు చేరుతుంది’ అని 24 ఏళ్ల సింధు పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమానికి సింధుతో పాటు మిచెల్లీ లీ (కెనడా), జెంగ్ సీ వీయ్, హంగ్ యా కియాంగ్ (చైనా), జాక్ షెఫర్డ్ (ఇంగ్లండ్), వలెస్కా ఖోబ్‌లాచ్ (జర్మనీ), చాన్ హో యున్ (హాంకాంగ్), మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికన్నా ముందు బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్, బీడబ్ల్యూఎఫ్ పారాలింపిక్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ రిచర్డ్ పెరోట్, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, విక్టర్ అక్సెల్సన్, హెండ్రా సతియావాన్, క్రిస్టినా పెడెర్సన్, చెన్ లాంగ్, మిసాకి మత్సుతోమో, అకయా తకహాషి 2016 నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమష్టి ప్రయత్నం ద్వారా బ్యాడ్మింటన్ క్రీడా లోకంలో అవగాహన పెంచడమే కాకుండా ఆట సమగ్రతను కాపాడటంలో ఆటగాళ్లను చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. -
సూపర్ ఎగ్జయిటెడ్
బాధ్యతలు పెరిగే కొద్దీ ‘ఉపాసన’ శక్తి పెరుగుతుందేమో! పెరిగే కొద్దీ కాకపోవచ్చు. ఇష్టపడే కొద్దీ అనాలి. పవర్ ఉమన్ ఉపాసన కామినేని కొణిదెల ఇప్పుడు ‘సూపర్ ఎగ్జయిటెడ్’గా ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధ వన్యప్రాణి సంరక్షణ సంస్థ డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. (వరల్డ్ వైడ్ ఫండ్) తనను రెండు తెలుగు రాష్ట్రాలకు ఫిలాంథ్రోఫీ అంబాసిడర్‌గా ఎంపిక చేసిందన్న వార్తను వినగానే ఆ పచ్చని కబురును వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. దాతృత్వ రాయబారి (ఫిలాంథ్రోఫీ అంబాసిడర్) గా ఉపాసన అటవీశాఖకు చెందిన 20 వేల మంది కార్మికుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని స్వీకరిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆపోలో ఆసుపత్రులు ఆ కార్మికులకు వైద్య చికిత్సలను అందజేస్తాయి. భారత్‌లో డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. కార్యక్రమాలు మొదలై ఈ ఏడాదికి యాభై ఏళ్లు. ఇదే ఏడాది ఉపాసన రాయబారి అవడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఉపసాన ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ సి.ఎస్.ఆర్. వైస్–ఛైర్మన్‌గా, అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ‘బి–పాజిటివ్’ మ్యాగజీన్ ముఖ్య సంపాదకురాలిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ‘అమితమైన ఉద్వేగానికి లోనయ్యాను. నిబద్దతతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన పెట్టిన పోస్ట్‌ని బట్టి ఇప్పుడీ కొత్త బాధ్యత ఆమెకు మరింత పవర్ ఇవ్వబోతున్నట్లే ఉంది. -
సిటీలో మెట్రో నియో!
సాక్షి, హైదరాబాద్: నాసిక్ తరహాలో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు తక్కువ వ్యయంతో కూడిన ‘మెట్రో నియో’ప్రాజెక్టు ప్రతిపాదనలు అనువుగా ఉంటాయని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ కోసం ఎలివేటెడ్ బస్‌ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (బీఆర్టీఎస్) ప్రతిపాదనల రూపకల్పనలో ‘మహా మెట్రో సంస్థ’తో కలసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలోని పలు నగరాల్లో మెట్రో రైలు సదుపాయం కల్పించేందుకు పనిచేస్తున్న మహా మెట్రో సంస్థ అధికారులతో మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. మెట్రో నియో నమూనాపై అధ్యయనం చేసి, సమగ్ర ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు. రోడ్డుపై నడిచే మెట్రో.. నాసిక్, పుణే, నాగ్‌పూర్ నగరాల్లో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలతో మహా మెట్రో అధికారులు మంత్రి కేటీఆర్ ముందు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతమున్న మెట్రోకు కొంత భిన్నంగా, అతి తక్కువ ఖర్చుతో ‘మెట్రో నియో’పేరుతో నాసిక్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు వివరాలను మంత్రికి అందజేశారు. సంప్రదాయ మెట్రోలో రైల్వే కోచ్‌లు ఉపయోగిస్తుండగా, ప్రస్తుతం తాము ప్రతిపాదించిన మెట్రోలో ఎలక్ట్రిక్ బస్సు కోచ్‌లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్లతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్లపై కూడా ఈ మెట్రో నడుస్తుందన్నారు. 350– 400 మంది ఒకేసారి ప్రయాణించవచ్చన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సుమారు 25 శాతం నిధులు లభించే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్: టీఎస్ఐపాస్ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని భారత్‌లో సౌదీ అరేబియా రాయబారి సవూద్ బిన్ మహమ్మద్ అస్సతికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వివరించారు. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను సౌదీ రాయబారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు. -
శాంతి దూతగా పంపండి : మొఘలాయి వారసుడు
హైదరాబాద్: మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా ప్రకటించుకున్న ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ శనివారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనను జమ్మూకశ్మీర్‌కు ‘శాంతి దూత’గా నియమించాలని రాష్ట్రపతిని ఓ లేఖ సమర్పించారు. ‘జమ్ము కశ్మీర్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య శాంతిని నెలకొల్పడానికి పనిచేస్తాను. మొఘలాయి వంశ వారసత్వానికి ఉన్న ప్రజాదారణతో ప్రత్యక్షంగా అక్కడి ప్రజలతో మమేకవుతాను. దేశద్రోహ సమూహాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నేను కశ్మీర్‌ను సందర్శించాలి. ఒక భారతీయుడిగా, మొగల్ వంశ వారసుడిగా నాపై ఆ బాధ్యతలు ఉన్నాయి. జమ్మూ, లఢఖ్‌లో నివసిస్తున్న మా వంశస్తులకు శాంతి, సౌఖ్యాలను పెంచడానికి నన్ను శాంతి దూతగా పంపాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను మొఘలాయి రాజులు శక్తిమంతమైందిగా నిలిపారు. నన్ను కశ్మీర్‌కు శాంతి దూతగా పంపిస్తే గౌరవ సూచకంగా ఉంటుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కశ్మీర్లో స్వార్థమయమడంతో వల్లే ప్రజలు తప్పుదారి పట్టారు. కానీ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో కశ్మీర్లో శాంతి స్థాపనకు కీలక పాత్ర పోషిస్తాను’అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ మొఘలాయి వారసుడి లేఖపట్ల రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించనున్నాం’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించనున్నట్లు రాష్ట్ర టూరిజం, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐకానిక్ స్టేడియం లాంటి నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో చేపట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో స్టేడియాన్ని నిర్మించాలని ఎమ్మెల్యేలు కోరినట్టు పేర్కొన్నారు. ఎన్సీసీని తెలంగాణ నుంచి విభజించాలని చూస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్సీసీ కెడెట్స్‌తో చేపడతామని వెల్లడించారు. పలు ప్రాంతాలను లీజుకు తీసుకున్న కొన్ని సంస్థలు లీజు డబ్బులను సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు. అటువంటి సంస్థలకు లీజు డబ్బులు చెల్లించడం కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు చెల్లించలేని పక్షంలో లీజులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కల్చరల్ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది పని తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భారత జట్టు అంబాసిడర్‌గా మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: స్ట్రీట్ చిల్డ్రన్ క్రికెట్ వరల్డ్‌కప్ (ఎస్‌సీసీడబ్ల్యూసీ)లో పాల్గొనే భారత జట్టుకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యవహరించనుంది. ఆమెతో పాటు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ కూడా ఈ టోర్నీలో పాల్గొనే జాతీయ జట్టుకు అంబాసిడర్లుగా ఉన్నారు. మే నెలలో వన్డే ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో లార్డ్స్ మైదానంలోనే ఎస్‌సీసీడబ్ల్యూసీ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ... వీధి బాలల క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగస్వా మ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. ‘ఒక అథ్లెట్‌గా వీధి బాలల జీవితాల్ని క్రీడలు ఎంతగా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోగలను. క్రీడలే వారికి అన్ని వర్గాల మద్దతు లభించేలా దోహదం చేస్తాయి. వీధి బాలల్లోనే దేశానికి అవసరమైన క్రీడా ప్రతిభ ఉంటుంది’ అని పేర్కొంది. లింగ భేదం లేకుండా బాలబాలికలు కలిసి ఈ టోర్నీలో మ్యాచ్ లు ఆడనుండటం ఒకింత ఆశ్చర్యానికి, ఆనందానికి లోను చేసిందని మిథాలీ హర్షం వ్యక్తం చేసింది. -
యూఎన్డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తన నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మిని నియమించింది. టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మిని అంబాసిడర్‌గా నియమిస్తున్నుట్లు యూఎన్డీపీ ప్రకటించింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన ఆమె అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి పాటుపడాల్సి ఉంటుంది. ‘ప్రపంచంలోని అనేక మంది మహిళలు, బాలికలు ఎన్నో వివక్షలను, అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న సంగతి మనం మరచిపోకూడదు. ప్రధానంగా అసమానతపై దృష్టి సారిస్తా’ అని ఈ సందర్భంగా పద్మాలక్ష్మీ అన్నారు. -
స్త్రీలోక సంచారం
పెప్సీ కంపెనీకి పన్నెండేళ్ల పాటు సేవలు అందించి, ఆ కంపెనీ సీఈవోగా ఈ ఏడాది అక్టోబర్ 2న పదవీ విరమణ పొంది, 2019 జనవరి వరకు ఛైర్మన్‌గా కొనసాగనున్న ఇంద్రా నూయి (62)ని న్యూయార్క్‌లోని ‘ఏషియా సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొందరు ‘‘పెప్సీ నుంచి బయటికి వచ్చేశారు కదా. ఇక ఇప్పుడు ట్రంప్ కేబినెట్లో చేరిపోతారా?’’ అని అడిగిన ఒక ప్రశ్నకు నూయీ పెద్దగా నవ్వుతూ.. ‘‘నేను కనుక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చు’’ అని అన్నారు. ‘‘పాలిటిక్స్‌కి నేను, నాకు పాలిటిక్స్ ఒకరికొకరం పడము. నేను అన్నీ బయటికే మాట్లాడేస్తాను. ఆచితూచి మాటల్ని వదల్లేను. అసలు దౌత్యం అంటే నాకు తెలీదు. నాలాంటి మనిషి రాజకీయాల్లోకి వచ్చిందంటే.. నా వల్ల మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు. కనుక నేను రాజకీయాల్లోకి రాను’’ అని స్పష్టంగా చెప్పారు. నలభై ఏళ్ల పాటు రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేసి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన ఇంద్రా నూయి.. ‘‘ఇప్పుడు కొద్దిగా తీరిక దొరకడంతో.. విముక్తి పొందినట్లుగా ఉంది’’ అని అన్నారు. 1955 అక్టోబర్ 28న మద్రాసులో పుట్టిన ఇంద్రా కృష్ణమూర్తి.. ‘ఆమ్సాఫ్ట్ సిస్టమ్స్’ సంస్థ ప్రెసిడెంట్ రాజ్ కె.నూయిని వివాహం చేసుకున్నాక (1981) ఇంద్రా నూయి అయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఈ కుటుంబం కనెక్టికట్‌లోని గ్రీన్విచ్లో ఉంటోంది. ఐక్యరాజ్యసమితి యు.ఎస్. రాయబారిగా ఈ ఏడాది చివర్లో తను రాజీనామా చేయబోతున్నట్లు రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా ప్రకటించి, అందరినీ నివ్వెరపరచిన నిక్కీ హేలీ (46) స్థానంలోకి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురు ఇవాంక ట్రంప్ (36) ను తీసుకోవచ్చని వస్తున్న వార్తల్ని స్వయానా ట్రంపే తోసిపుచ్చారు ‘‘డైనమైట్ లాంటి నా కూతురికి అది తగిన స్థానమే అయినప్పటికీ.. ఆమెను కనుక ఐరాస రాయబారిగా నియమిస్తే నాపై బంధుప్రీతి (నెపోటిజం) నింద పడుతుంది’’ అని ఆయన అన్నారు. ‘‘బహుశా నా కూతురికన్నా సమర్థమైన వాళ్లు ఆ స్థానానికి ఎవరూ లేకపోవచ్చు. అయినప్పటికీ నేను ఆమెను ఎంపిక చెయ్యడానికి సంశయిస్తాను. ఎందుకంటే మీరంతా రేపు నన్ను నిందించవచ్చు. నాకు నిజంగా లేని బంధుప్రీతిని మీరు నాకు అంటకట్టవచ్చు’’ అని ట్రంప్ మరికొంత వివరణ ఇచ్చారు. ఇవాంక కూడా.. తనకా పోస్టు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ట్విట్టర్లో తెలిపారు. ఒక్కోసారి ఓటమిని కన్నా గెలుపును తట్టుకోవడం కష్టం అవుతుందేమో. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏర్స్‌లో జరుగుతున్న 50 మీటర్ల ఉమెన్స్ స్విమ్మింగ్ ఫ్రీ స్టెయిల్ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్న అర్జెంటీనా క్రీడాకారిణి దెల్ఫియా నరెల్లా పిగ్నాటియల్లో తన విజయాన్ని తనే తట్టుకోలేక వలవల ఏడ్చేసింది. పతకం అందుకునే సమయంలో పెద్దగా ఏడుస్తూ ఆమె తన ఎడమ అర చేతిపై స్పెయిన్ భాషలో రాసుకున్న ‘గ్రాండ్‌మదర్’ అనే పదాన్ని, గుండె బొమ్మను అందరికీ చూపించడం ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేసింది. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల్ని నిరోధించడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ‘ఆత్మహత్యల నివారణ మంత్రి’గా ఒక మహిళను నియమించింది. కొత్తగా సృష్టించిన ఈ శాఖను బ్రిటన్ ప్రధాని థెరిసా.. జాకీ డోయల్ ప్రైస్ అనే పార్లమెంటు సభ్యురాలికి కేటాయించారు. అనంతరం లండన్‌లో జరిగిన 50 దేశాల ప్రతినిధుల మానసిక ఆరోగ్య సదస్సులో డోయల్ ప్రసంగించారు. బ్రిటన్‌లో యేటా 4,500 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించడం కోసం తన శాఖ కృషి చేస్తుందని డోయల్ తెలిపారు. -
యూఏఈ అంబాసిడర్ సంచలన ప్రకటన
తిరువనంతపురం: వరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీసాయాన్ని ప్రకటించడం ఆకర్షణీయంగా నిలిచింది. అయితే తాజాగా యూఏఈ ఆర్థికసాయంపై మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ భారీ సాయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలేదని యూఏఈ అంబాసిడర్ ప్రకటించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. కేరళకు అందించే ఆర్థిక సహాయం నిర్దిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. వారికందించాల్సిన విరాళాలపై తమ అంచనా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పారని రిపోర్ట్ చేసింది. అయితే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేవలం 600 కోట్ల రూపాయలిచ్చి కేంద్రం చేతులు దులుపుకోగా గల్ఫ్‌దేశం రూ.700 కోట్ల భారీ సాయం అందించిందంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు విదేశీ ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా భారీ చర్చకు తెరతీసిన సంగతి తెలిసిందే. విదేశీసాయంపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే, యూఏఈ రాయబారి ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు యూఏఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేయడం కూడా గమనార్హం. మరి తాజా గందరగోళంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు గల్ఫ్ దేశం సాయాన్నితిరస్కరించడంపై పలువురు నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ గల్ఫ్ దేశం ఇచ్చింది రుణంకాదు, సాయం, విపత్తు నివారణ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే యూఏఈ సహాయాన్ని ఆమోదించేలా విధానంలో సవరణలు తేవాలంటూ ప్రధాని మోదీకి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఒక లేఖ రాశారు. ప్రజల బాధలను నిర్మూలించేలా విధానాలు ఉండాలి, విదేశీ ఆర్థిక సహాయాన్ని ఆమోదించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, దయచేసి తగిన మార్పులను తీసుకురావాలని ఆయన కోరారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ యూఏఈ సహాయంపై స్వయంగా మీడియాకు తెలియజేసారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారని వెల్లడించారు. -
మత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది : నిక్కీ హేలీ
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమితులైన తర్వాత నిక్కీ హేలీ తొలిసారిగా భారతదేశ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన సందర్భంగా పలువురు భారత సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో ఆమె సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం భారత్‌కు చేరుకున్న నిక్కీ.. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్‌తో కలిసి మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్‌కు వస్తే తన సొంత ఇంటికి తిరిగి వచ్చిన భావన కలుగుతుందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సైనిక సహకారం తదితర అంశాల్లో భారత్- అమెరికాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడమే తన పర్యటన లక్ష్యమని నిక్కీ పేర్కొన్నారు. ఎన్నో విషయాల్లో భారత్, అమెరికాలకు సారూప్యం ఉందని.. అందుకే రెండు దేశాల మధ్య స్నేహబంధం రోజురోజుకీ బలపడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. మత స్వేచ్చకే అధిక ప్రాధాన్యం.. సంస్కృతీ సంప్రదాయాలకు భారత్ ఎంత విలువ ఇస్తుందో తెలుసుకోవడానికి హుమాయున్ సమాధి ఒక నిదర్శనమని నిక్కీ అన్నారు. చారిత్రక సంపదను కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు మనం అందించగలిగే గొప్ప కానుక వారసత్వ సంపదేనని ఆమె వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్‌కు ఉన్న గొప్ప లక్షణమని కొనియాడారు. అన్ని హక్కుల కన్నామత స్వాతంత్ర్యపు హక్కు ఎంతో ముఖ్యమైనదిగా తాము భావిస్తామని నిక్కీ తెలిపారు. మత స్వేచ్ఛ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు గురువారం పర్యటనలో భాగంగా వివిధ మతాలకు చెందిన పవిత్ర స్థలాలను ఆమె సందర్శించనున్నారు. -
సయీద్ ర్యాలీలో పాలస్తీనా దూత
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘పాలస్తీనా రాయబారితో పాటు రమల్లాలోని ఆ దేశ విదేశాంగ శాఖకు మా ఆందోళనల్ని స్పష్టం చేశాం. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొన్న సయీద్‌తో కలిసి శుక్రవారం రావల్పిండిలో నిర్వహించిన కార్యక్రమంలో పాలస్తీనా రాయబారి పాల్గొనడం ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ దేశానికి గట్టిగా చెప్పాం’ అని పేర్కొంది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది. ‘ఈ అంశాన్ని తగిన విధంగా పరిష్కరిస్తాం. భారత్‌లో సంబంధాలకు పాలస్తీనా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉగ్రపోరులో ఆ దేశానికి అండగా ఉంటాం. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన వారితో సంబంధాలు పెట్టుకోం’ అని పాలస్తీనా పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. -
టీపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అజహరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఎంపికయ్యారు. ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని టీపీఎల్ కార్యాలయానికి ఆయన గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా టీపీఎల్ సీఎండీ మన్నె గోవర్ధన్‌రెడ్డి అజహరుద్దీన్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలో ప్రారంభమయ్యే టీపీఎల్ రెండో ఎడిషన్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయన్నారు. మీడియా పార్ట్నర్లుగా ప్రముఖ చానళ్లు వ్యవహరిస్తున్నాయని, ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయన్నారు. టీపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అజహరుద్దీన్ అంగీకరించడం గర్వకారణమన్నారు. -
పాక్‌లో మా రాయబారిని చంపేస్తారేమో!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కొత్తగా నియమితులైన తమ రాయబారికి మరింత భద్రతను కల్పించాలని పాక్‌ను చైనా కోరింది. ఉగ్రవాదుల నుంచి తమ రాయబారి ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో చైనా ఈ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా ఎంబసీ అక్టోబర్ 19వ తేదీన పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తమ రాయబారిని హతమార్చేందుకు నిషేధిత తూర్పు టర్కీస్థాన్ ఇస్లామిక్ మూమెంట్‌కు చెందిన ఉగ్రవాది పాక్‌లోకి ప్రవేశించాడని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో పనిచేస్తున్న తమ దేశస్తులకూ భద్రతను కల్పించాలని చైనా– పాక్ ఎకనామిక్ కారిడార్( సీపీఈసీ) ప్రాజెక్టులో కీలక భూమిక పోషిస్తున్న పింగ్ ఫి లేఖలో కోరారు. -
కుదరదంటే కుదరదంతే
ఏం కుదరదు?! నిక్కీ హాలే దగ్గర ‘కుదరదు’ అంటే కుదరదు. కష్టమైనా, నష్టమైనా ఒకటి అనుకున్నప్పుడు..ఫైట్ చెయ్యాలంతే! కాన్ట్ ఈజ్ నాట్ ఏన్ ఆప్షన్.. ఆమె లైఫ్ కాప్షన్. అది ఆమె రాసిన పుస్తకం పేరు కూడా. నిక్కీ ఇండియా అమ్మాయి. ఐక్యరాజ్యసమితిలో ఇప్పుడు అమెరికా అమ్మాయి. అంబాసిడర్ టు అమెరికా! మన ‘నిమ్రత’ను అమెరికా తన ‘నిక్కీ’ని చేసుకుందంటే.. అది ఆమె క్యాలిబర్. ‘కుదరదు’ అనని ఆమె క్యాపబిలిటీ! ఆకాశమే హద్దుగా ఆస్వాదించే స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, అంతే వివపరీతమైన జాత్యాహంకారం, వర్ణవివక్ష.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ‘యునైటెడ్ క్యారెక్టరిస్టిక్స్!’ అందుకేనేమో నిక్కి హేలీ అంది.. ‘నేను భారతీయ స్త్రీని కావడం వల్ల అమెరికాను కొత్తకోణం నుంచి చేసే అవకాశం కలిగింది. అయితే ఇక్కడి సమాజాన్ని భిన్న వర్గాల సమూహంగా కాక భిన్న తత్వాల కలయికగా పరిశీలించాను’ అని! నిక్కి హేలీ.. అమెరికాలో పుట్టిపెరిగిన మన ఆడపడుచు. సౌత్ కరోలినా రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్.. భారత సంతతికి చెందిన తొలి అమెరికన్ గవర్నర్. ఈ రెండే కాదు.. భారతీయ ఉద్యోగవలసలను ఆపాలని కంకణం కట్టుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తమ దేశం తరపున నియమించిన యూఎన్ఓ దౌత్యవేత్త కూడా! ఈ ఘనతలే ఈ రోజు నిక్కి బయోను ఇక్కడ ఆవిష్కరించేలా చేశాయి. బిజినెస్ ఉమన్ నిక్కి 1972, జనవరి 20న సౌత్ కరోలినాలోని బాంబెర్గ్‌లో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికా వలసొచ్చిన సిక్కులు. నిక్కి పూర్తి పేరు నమ్రత నిక్కి రాంధ్వా హేలీ. ఆమె తండ్రి సిక్కుమతాచారం ప్రకారం తలకు పాగా ధరించేవారు. దాంతో ఆ ప్రాంతంలోని అమెరికన్స్, ఇతర యురోపియన్ మైగ్రెంట్స్కంటే నిక్కి వాళ్ల కుటుంబం, వాళ్ల ఆచారవ్యవహారాలు చాలా భిన్నంగా ఉండేవి, కనిపించేవి. దీనివల్ల ఆమె తన బాల్యంలో జాత్యహంకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక వలసల హక్కుల చట్టానికి గట్టి మద్దతు తెలిపి ఉంటుంది. పాఠశాల చదువు పూర్తయ్యాక క్లెమ్సన్ యూనివర్శిటీలో స్కాలర్షిప్ వచ్చింది. టెక్స్టైల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసింది. నిజానికి కాటన్, ఊలు, సిల్క్.. మీద ఆమెకు ఆసక్తి లేదు. కేవలం క్లెమ్సన్ యూనివర్శిటీలో చదువు ఒక్కటే ఆమె కల. కాబట్టి సీట్ దొరికిన కోర్స్‌ను చదువుకుంది. తల్లిదీ బట్టల వ్యాపారమే. ఆ చదువు వ్యాపారంలో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది అనుకుంది. అనుకున్నట్టే యూనివర్శిటీ నుంచి వచ్చాక బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టింది నిక్కి. ‘ఎక్సోటికా ఇంటర్నేషనల్’ అనే ఆ వస్త్రవ్యాపార సంస్థను మల్టీమిలియన్ డాలర్ కంపెనీగా మార్చే ప్రయత్నంలో పడింది. ఆమె వ్యాపార దక్షత 1998లో నిక్కీని ఆరేంజ్బర్గ్ కౌంటీ చాంబర్ ఆఫ్ కామర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి నేమినేట్ చేసింది. అలాగే 2003లో లెగ్జింటన్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కి కూడా ఆమెను నామినేట్ చేశారు. 2004లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ విమెన్ బిజినెస్ ఓనర్స్‌కి ప్రెసిడెంట్ అయింది. అక్కడితో ఆగిపోలేదు. లెగ్జింటన్ మెడికల్ ఫౌండేషన్, వెస్ట్ మెట్రో రిపబ్లికన్ విమెన్, ఎన్ఏడబ్ల్యూబీఓ సౌత్ కరోలినా చాప్టర్.. వంటి సంస్థల్లోనూ భాగస్వామి అయింది. ఇంకోవైపు కమ్యూనిటీ సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ నిక్కీ పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేశాయి. కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్ సదరన్ క్రాస్‌గా పిలిచే కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్ అనేది కాన్ఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు రాజకీయ చిహ్నం. ఉరిశిక్షను, జాత్యహంకార విధానాలను వ్యతిరేకించే ప్రయత్నాలకు అప్పటి ప్రెసెడెంట్ హ్యారీ ట్రుమన్ మద్దతు తెలిపాడు. సివిల్ వార్‌లో నల్లవాళ్లకు మద్దతుగా కూడా ఈ పతాకాన్ని ఉపయోగించారు. పొలిటికల్ లీడర్.. 2004లో సౌత్ కరోలినా శాసనసభకు ఎలక్షన్లు మొదలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగింది నిక్కీ. తన పోటీని ఖాయం చేసుకోవడానికి అప్పటికే హౌజ్ ఆఫ్ రిప్రజెంటీటివ్ అయిన ల్యారీ కూన్ మీద గెలవాలి. అదంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే ల్యారీ లాంగెస్ట్ సర్వింగ్ మెంబర్ ఆఫ్ ది హౌజ్. పైగా రాజీకాయాలను ఔపోసన పట్టిన నేత. తను.. ఓనమాలు దిద్దుతున్న వనిత. ఆమెకున్న చురుకుదనం, ఆసక్తి ల్యారీతో పోటీపడకుండా నిక్కీనే తమ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అలా సౌత్ కరోలీనా రిపబ్లికన్ ఆఫీస్‌కు మొదటి ఇండియన్ అమెరికన్ అధినేత అయింది నిక్కీ. 2008 ఎన్నికల్లోనూ డెమోక్రాట్ అభ్యర్థిని ఓడించింది. వలసల మద్దతుదారు ట్రంప్ అధికారంలోకి రాగానే వరాల కన్నా కోరడానే ఎక్కువగా ఝుళిపించాడు అమెరికాకు వస్తున్న వలసలకు సంబంధించి. కాని అదే పార్టీ అభ్యర్థిగా సౌత్ కరోలినా హౌజ్‌లో ఉన్న మన ఆడబిడ్డ మాత్రం వలసల పట్ల సహానుభూతే ప్రదర్శించింది. ప్రాక్టికల్‌గా నిలబడింది కూడా. వలసలకు సంబంధించిన చట్టాల అమలుకు మద్దతు తెలిపింది. అబార్షన్లను వ్యతిరేకించే బిల్లుకూ ఓటు వేసి అమ్మ మనసు చాటుకుంది. ప్రభుత్వాల మంకు పట్టు, ప్రజల పన్నులతో వచ్చిన ఆదాయాన్ని వృ«థాచేయడం, దుర్వినియోగం పర్చడం వంటివాటిని నిలువరించేందుకు మొదలైన టీపార్టీ ఉద్యమంలో సభ్యురాలై, ఆ ఉద్యమానికి జై కొట్టింది. రిపబ్లికన్ పార్టీ స్ట్రాటజీతో కాకుండా ప్రజల సమస్యలతో సంబంధం ఉండడం, వాటిని పరిష్కరించే మార్గాలు తెలుసుండడం, ప్రజా శ్రేయస్సు కోసం పార్టీని ఒప్పించే శక్తిసామర్థ్యాలు కలిగి ఉండడం.. వంటి లక్షణాలన్నీ 2010లో నిక్కీకి సౌత్ కరోలీనా గవర్నర్ పట్టాన్ని కట్టబెట్టాయి. ఈ విజయం.. సౌత్కరోలీనాకు తొలి మహిళా గవర్నర్‌గానే కాదు.. ఫస్ట్ ఇండియన్ అమెరికన్ గవర్నర్‌గా కూడ రికార్డ్ నమోదు చేసింది. తన జీవిత కథ ఆధారంగా ‘కాంట్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్’ పేరుతో ఓ పుస్తకాన్నీ రాసింది నిక్కీ హేలి. కాంట్రవర్సీలు.. సిక్కు మతస్తురాలుగా చిన్నప్పుడు ఎదుర్కొన్న జాత్యహంకార అనుభవాల దృష్ట్యా యుక్త వయసు వచ్చాక క్రిస్టియన్ మతం తీసుకుంది. క్రిస్టియన్నే పెళ్లిచేసుకుంది. కాని తల్లిదండ్రుల మీదున్న గౌరవంతో, వాళ్ల కోసం సిక్కు మత పండగలను, ఆచారాలను కూడా పాటిస్తుంది. సౌత్కరోలీనా ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పుడు ఈ అంశంతోనే ఆమె మీద బురదజల్లేందుకు యత్నించారు ప్రత్యర్థులు. అదొక విషయమే కాదన్నంత తేలికగా కొట్టిపారేసింది నిక్కి. అందుకే పూర్తి వ్యక్తిగతమైన ఆమె రిలేషన్స్‌ను తెరమీదకు తెచ్చారు. అపవాదు వేసి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడ రాజకీయాలు వ్యక్తిగత దూషణకు దిగజారుతాయని నిరూపించారు. నాగరిక సమాజంలో కూడా స్త్రీని నిలువరించాలంటే ఆమె శీలాన్ని శంకించాలనే అనాగరితను చాటుకున్నారు. దేనికీ స్పందించలేదు నిక్కీ. అతిగా ఆవేశపడలేదు. తనేంటో నిరూపించుకోవాలనే వ్యర్థ ప్రయత్నమూ చేయలేదు. తన మీద వచ్చిన విమర్శలకు అసలు విలువివ్వలేదు. ప్రజల పట్ల తనెంత లాయల్‌గా ఉంటుందో స్పష్టం చేసింది. అదే జనాలకూ నచ్చింది. అన్నిటికన్నా ముందు సమస్య వస్తే ధైర్యంగా నిలబడే ఆమె తీరును ఇష్టపడ్డారు. ఆమె నిజాయితీని మెచ్చారు. అదే ఆమె పట్ల వాళ్లకు నమ్మకాన్ని పెంచింది. గవర్నర్‌ను చేసింది. కాన్ఫిడరేట్ ఫ్లాగ్.. 2015, జైన్ 17న సౌత్ కరోలీనాలో జరిగిన ఓ సంఘటన అమెరికానే కాదు ప్రపంచాన్నంతటినీ వణికించింది. డైలాన్ రూఫ్ అనే 21 ఏళ్ల తెల్ల కుర్రాడు... సౌత్ కరోలీనాలోని ఇమాన్యుయేల్ ఆఫ్రికన్ మెథడిస్ట్ చర్చ్‌లో నల్లవాళ్ల మీద కాల్పులు జరిపాడు. ఆ దాడిలో ఆరుగురు ఆడవాళ్లు, ముగ్గురు మగవాళ్లు చనిపోయారు. మరణించిన తొమ్మిదిమందిలో రివరెండ్, స్టేట్ సెనేటర్ అయిన పింక్నీ కూడా ఉన్నారు. నల్లవాళ్ల మీద కోపంతోనే ఈ పని చేశానని, దీనితో నల్లవాళ్లకు వ్యతిరేకంగా ‘రేస్ వార్’ను స్టార్ట్ చేయాలనుకున్నానీ పోలీసులకు చెప్పాడు రూఫ్. అది విన్న లోకమంతా హతాశయింది. ఈ విషాదం జరిగిన తెల్లవారి గవర్నర్ నిక్కీ ఎన్బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘ఈ కాల్పులను ‘హేట్ క్రైమ్’గా పరిగణించి, నేరస్తులకు మరణశిక్ష పడేలా చూస్తామ’ని చెప్పింది. అప్పుడే సదరన్ హెరిటేజ్, ప్రైడ్కి చిహ్నంగా ఉన్న కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్‌ను పట్టుకుని నల్లజాతి వ్యతిరేక దండులో నినాదాలిస్తున్న రూఫ్ ఫోటోగ్రాఫ్ కూడా బయటపడి పెద్ద చర్చకు కారణమైంది. అప్పటి దాకా ఆ పతాకం స్టేట్ కాపిటల్ బిల్డింగ్ మీద రెపరెపలాడుతూ ఉండేది. నల్లవాళ్ల పట్ల వివక్షతో రగిలిపోతున్న రూఫ్ ఆ జెండాను పట్టుకొని తెల్లవాళ్ల ఉద్యమంలో తిరగాడడంతో.. ఇంతకీ కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్ హెరిటేజ్, ప్రైడ్కి చిహ్నమా లేక నల్లవాళ్ల మీద వివక్షను సూచించే పతాకమా అనే విమర్శలు వెల్లువెత్తాయి. డిబేట్ల సాగాయి. దాంతో 2015, జూన్ 22న స్టేట్ కాపిటల్ మీదున్న కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్‌ను తీయించే సాహసం చేసింది సౌత్ కరోలీనా గవర్నర్ నిక్కీ హేలీ. ‘ఈ నేల భిన్న జాతుల, సంస్కృతుల సమ్మేళనం. ఈ ఐక్యత విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే, రంగు, జాతి మనుషుల మధ్య విద్వేషాన్ని పెంచకుండా ఉండాలంటే కాపిటల్ గ్రౌండ్స్‌లోని ఈ కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్ అవతనం కావాల్సిందే’ అని స్టేట్మెంట్ ఇచ్చింది. – శరాది -
బిగ్‌బీకే మళ్లీ ఛాన్స్..
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు గౌరవ బాధ్యతలు మరింత రెట్టింపయ్యాయి. యూనిసెఫ్(అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి)కి రాయబారిగా అమితాబ్ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. పిల్లల్లో వచ్చే మీజిల్స్, రెబెల్లా వ్యాధుల నివారణపై ఆయన ఈ రెండేళ్లలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే పోలియో, హెపటైటిస్ బి, క్షయ వ్యాధుల నివారణకు సంబంధించి పలు ప్రచార కార్యక్రమాల్లో బిగ్ బీ పాల్గొంటున్నారు. పోలియో మహమ్మారిపై చేస్తున్న యుద్దంలో విజయం సాధించినందుకు, పసిపిల్లలకు ఎంఆర్ వ్యాక్సినేషన్ వేయించేందుకు కృషి చేస్తున్నందుకు తనను యూనిసెఫ్ అంబాసిడర్‌గా మరో రెండేళ్లు పొడిగించినట్లు అమితాబ్ స్వయంగా ఆదివారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అలాగే, తన సంతోషాన్ని అభిమానులతో తన బ్లాగులో అమితాబ్ పంచుకున్నారు. -
స్కిల్ ఇండియా అంబాసిడర్‌గా ప్రియాంకాచోప్రా
న్యూఢిల్లీ: నైపుణ్య భారతం (స్కిల్ ఇండియా) ప్రచారకర్తగా నటి ప్రియాంకా చోప్రా నియమితులయ్యారు. ఆమె ఈ కార్యక్రమానికి ఉచితంగా ప్రచారం చేయనున్నారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ డీసీ) సీఈవో మనీశ్ కుమార్ మాట్లాడుతూ ‘ప్రచారకర్తగా ఉంటాననీ ప్రియాంకా చో ప్రానే కోరారు. అందుకు మేం ఒప్పు కుంటూ ఆమెకు ఓ లేఖ అందజేశాం’ అని చెప్పారు. -
జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్
న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. దాదాపు అన్ని ప్రక్రియలను పూర్తిచేసేసింది. ప్రస్తుతం జీఎస్టీని ప్రమోట్ చేయడం కోసం ఓ బ్రాండ్ అంబాసిడర్ ను కూడా నియమించింది. ఆయనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ను జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ నియమించినట్టు తెలిసింది. ఇప్పటికే 40 సెకన్ల వీడియో ఫీచరింగ్ ను షూట్ చేశారని, దాన్ని సర్క్యూలేట్ కూడా చేస్తున్నట్టు వెల్లడవుతోంది. '' ఏకీకృత జాతీయ మార్కెట్ ను ఏర్పాటుచేయడానికి జీఎస్టీ ఓ అద్భుత కార్యక్రమం'' అని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. వీడియోకు అటాచ్డ్ గా ఈ ట్వీట్ చేసింది. జాతీయ జెండాకు సంబంధించి మూడు రంగులను ఎలాగైతే వివరిస్తామో అచ్చం అదే మాదిరిగా ఈ వీడియోలో జీఎస్టీ గురించి బచ్చన్ వివరించారు. ' ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్' ను సృష్టించే విధంగా జీఎస్టీ దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అతిపెద్ద పన్ను వ్యవస్థను ఇంకొన్ని రోజుల్లో అమలు చేయనున్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించి మెగాస్టార్ ఈ ప్రమోషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. జీఎస్టీకి అంతకముందు బ్రాండ్ అంబాసిడర్ గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ నిర్వహించారు. నాలుగు శ్లాబు రేట్లతో ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకురాబోతుంది. అవసరమైన వస్తువులకు 5 శాతం, కార్లు, కన్జూమర్ డ్యూరెబుల్స్ అత్యధికంగా 28 శాతం పన్ను రేట్లను వేయనున్నారు. మిగతావస్తువులు 12, 18 శాతం పరిధిలోకి రానున్నారు. ఈ పన్ను విధానం అమలు ప్రక్రియ గురించి ఇప్పటికే, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 17 సార్లు భేటీ అయ్యాయి. -
డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తరఫున గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఆగ్నేయాసియా హెపటైటిస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్ తెలిపారు. హెపటైటిస్ వల్ల గర్భస్థ శిశుమరణాలు సంభవిస్తున్నాయని, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అమితాబ్ సహకారం తీసుకుంటామన్నారు. అమితాబ్ సహకారంతో 2030 కల్లా హెపటైటిస్ ప్రభావాన్ని తగ్గించడానికి డబ్ల్యూహెచ్‌వో కృషి చేస్తుందన్నారు. హెపటైటిస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని అమితాబ్ బచ్చన్ తెలిపారు. తనలా ఎవరూ ఈ వ్యాధితో బాధపడకూడదని ఆకాంక్షించారు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం 9 కోట్ల మంది దీర్ఘకాలిక లివర్ వ్యాధులతో బాధపడుతున్నారు. -
‘గ్యాటోరెడ్’ అంబాసిడర్‌గా సింధు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్పోర్ట్స్ డ్రింక్ ‘గ్యాటోరెడ్’కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయనున్న తొలి భారత క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. పెప్సికో సంస్థ ఈ పానీయాన్ని ఉత్పత్తి చేస్తుంది. గతంలో స్టార్ ప్లేయర్స్ ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్), సెరెనా విలియమ్స్ (టెన్నిస్), మెస్సీ (ఫుట్‌బాల్) తదితరులు గ్యాటోరెడ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించారు. -
ప్యుగోట్ చేతికి అంబాసిడర్ బ్రాండ్
కోల్‌కతా: దేశీయంగా కార్ల విపణిలో ఓ వెలుగు వెలిగిన అంబాసిడర్ బ్రాండ్.. తాజాగా ఫ్రాన్స్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ప్యుగోట్ చేతికి చేరింది. దాదాపు రూ. 80 కోట్లకు దీన్ని విక్రయించేందుకు సీకే బిర్లా గ్రూప్ సారథ్యంలోని హిందుస్తాన్ మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, తమకు చెల్లించాల్సిన బకాయిల వివాదం ఇంకా పరిష్కారం కాకుండానే.. యాజమాన్యం అంబాసిడర్ బ్రాండ్ విక్రయించడం సరికాదని కంపెనీ కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1957లో అంబాసిడర్ కార్ల తయారీ ప్రారంభం కాగా... కాలక్రమంలో ప్రాభవం కోల్పోయిన నేపథ్యంలో 2014 మేలో హిందుస్తాన్ మోటార్స్ వీటి తయారీ నిలిపివేసింది. అంబాసిడర్ బ్రాండ్‌ను వినియోగించుకుని దేశీయంగా కార్ల ఉత్పత్తి పెంచుకోవాలని ప్యుగోట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు కంపెనీలు స్పష్టత ఇవ్వలేదు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం త్వరలోనే ప్యుగోట్ దేశీయంగా ఏడాదికి లక్ష కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. -
యునిసెఫ్ అంబాసిడర్‌గా ప్రియాంక
న్యూయార్క్: యునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ కొత్త ప్రచారకురాలిగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్, బ్రిటిష్ బాలనటి మిల్లీ బాబీ బ్రౌన్‌లు కలసి సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు. పీడిత బాలల విముక్తి కోసం, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ప్రపంచ దేశాలు సంయుక్తంగా కలసిరావాలని ప్రియాంక కోరారు. -
నన్ను అంబాసిడర్ చేయాలి: ఇవానా ట్రంప్
తనను చెక్ రిపబ్లిక్ కు యూఎస్ అంబాసిడర్ గా నియమించాలని న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్(67) అన్నారు. తనకు చెక్ మాట్లాడటం బాగా వచ్చని చెప్పుకొచ్చారు. చెక్ రిపబ్లిక్ తో పాటు ప్రపంచం మొత్తానికి తనను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను రాసిన మూడు పుస్తకాలు నలభై దేశాల్లో 25 భాషల్లో లభ్యమవుతున్నట్లు చెప్పారు. ఇవానా పేరుతో తాను అందరికీ తెలుసని, తన పేరు చివర ట్రంప్ అనే పదం అవసరం లేదని అన్నారు. కాగా, తన కుటుంబ సభ్యులు ఇవాంక, ఎరిక్, డోనాల్డ్ జేఆర్, జారేద్ కుష్నేర్ లకు కార్యనిర్వహక కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 1947లో జన్మించిన ఇవానా ట్రంప్ ను చెక్ రిపబ్లిక్ కు యూఎస్ అంబాసిడర్ గా నియమిస్తే.. 2014 నుంచి ఆ స్ధానంలో కొనసాగుతున్న ఆండీ శ్చాపిరో ను తొలగించాల్సివుంటుంది. 1993 నుంచి చెక్ రిపబ్లిక్ కు అమెరికా అంబాసిడర్ ను పంపుతోంది. -
చుక్కలు చూపించిన దీపిక!
అదో ప్రముఖ విమానయాన సంస్థ... తమకు ప్రచారకర్తగా ఓ స్టార్ హీరోయిన్ కావాలనుకున్నారు. దీపికా పదుకొనేని మించిన స్టార్ ఎవరుంటారు? అనుకున్నారు. పైగా నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె ఇప్పుడిప్పుడే హాలీవుడ్లో కూడా ఫేమస్ అయిపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్‌గా కూడా వర్కవుట్ అవుతుందని వాళ్ల ఆలోచన. దీపిక క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అంతే.. తమ ఎయిర్‌లైన్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించాలని అడిగారు. యాడ్ చిత్రీకరణ కోసం నాలుగు రోజులు కాల్షీట్ అడిగారు. దీపిక సంతోషంగా ఓకే చెప్పేశారు. కానీ ఆమె అడిగిన పారితోషికం విని, ఆ కంపెనీ ప్రతినిధులు కళ్లు తేలేశారు. ఏదో రెండు.. మూడు కోట్లు అడుగుతుందని లెక్కలేసుకున్నారట. కానీ, దీపిక ఎనిమిది కోట్లు అడగడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని వేరే హీరోయిన్ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. -
సల్మాన్‌పై యోగేశ్వర్ దత్ విసుర్లు
న్యూఢిల్లీ: 2016లో జరుగనున్న ఒలింపిక్స్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను నియమించడంపై ఇండియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ అసహనం వ్యక్తం చేశారు. అంబాసిడర్ గా నియమించడానికి సల్మాన్ కు ఉన్న అర్హత ఏమిటని, క్రీడలకు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. పీటీ ఉష, మిల్కా సింగ్ వంటివారు ఉండగా సల్మాన్ నియమించడమేమిటని అన్నారు. ఒలింపిక్ క్రీడలు సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వేదికలు కాదని ఘాటుగా విమర్శించారు.