మనం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నప్పటికీ అంబాసిడర్ వంటి అద్భుతమైన కార్లను ఎవ్వరూ మరచిపోలేరు. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందిన ఈ బ్రాండ్ కారు ఇప్పుడు మార్కెట్లో విక్రయానికి లేనప్పటికీ, అప్పుడప్పుడూ రోడ్లమీద కనిపిస్తూనే ఉంటాయి.
కొన్ని సంవత్సరాలను ముందు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మొదలైనవారు ఈ కార్లను తెగ ఉపయోగించారు. అంతే కాకుండా అప్పట్లో రాయల సీమలో ఈ కార్లను ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అయితే ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ధర ఎంత అనే విషయాన్నీ ఈ కథనంలో చదివేద్దాం.
1964లో అంబాసిడర్ కారు ధర ఎంత అనేదానికి సంబంధించిన ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దీని ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం. వినటానికి కొంత వింతగా ఉన్నా.. అప్పట్లో ఈ కారు ధర అంతే అనటానికి కొన్ని ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
1990 దశకంలో ఒక మెరుపు మెరిసిన అంబాసిడర్ కార్లను 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఆ తరువాత మారుతి కార్లు మార్కెట్లో విడుదలకావడం వల్ల వీటి ఆదరణ కొంత తగ్గింది, అయినప్పటికీ కొంత మంది అంబాసిడర్ అభిమానులు వీటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా వీటి అమ్మకాలు తగ్గడం వల్ల 2014లో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
(ఇదీ చదవండి: Odysse EV Bike: ఒక్క ఛార్జ్‌తో 125 కిమీ రేంజ్.. రూ. 999తో బుక్ చేసుకోండి!)
ఇక తాజాగా బయటపడిన అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ బిల్ ప్రకారం, ఇది 1964లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా తెలుస్తోంది. దీని ధర అప్పుడు రూ. 16.495 మాత్రమే. దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసింది. ఇందులో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు కూడా చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment