Car prices
-
కార్ల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ప్రారంభ స్థాయి కార్ల నుంచి లగ్జరీ వాహనాల వరకు జనవరి నుంచి వివిధ కార్ల రేట్లకు రెక్కలు రానున్నాయి. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోయిన కారణంగా వివిధ మోడల్స్ ధరలను పెంచబోతున్నట్లు పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను 4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ఆల్టో కే10 నుంచి మల్టీ యుటిలిటీ వాహనం ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలను రేట్ల పెంపునకు కారణంగా పేర్కొంది. కస్టమర్లపై భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కొంత బదలాయించక తప్పని పరిస్థితి ఉంటోందని వివరించింది. మరోవైపు హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా తమ కార్ల రేట్లను రూ. 25,000 వరకు పెంచడంపై దృష్టి పెట్టింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాలు 3 శాతం వరకు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం, కమోడిటీల ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అటు, టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్ వాహనాలపై 3 శాతం మేర, కియా ఇండియా 2 శాతం స్థాయిలో రేట్లను పెంచనున్నట్లు వెల్లడించాయి. వచ్చే నెల నుంచి తమ మొత్తం వాహనాల శ్రేణి రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా వెల్లడించింది. అటు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కూడా 3 శాతం పెంచనుంది. కమోడిటీల రేట్లు, లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైనవి నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జీఎల్సీ మోడల్ ధర రూ. 2 లక్షల వరకు, టాప్ ఎండ్ మెర్సిడెస్–మేబాక్ ఎస్ 680 లగ్జరీ లిమోజిన్ రేటు రూ. 9 లక్షల వరకు పెరగనుంది. ముడి వస్తువులు, రవాణా వ్యయాలు పెరగడంతో ఆడి ఇండియా కూడా తమ వాహనాల శ్రేణి ధరను 3 శాతం వరకు పెంచుతోంది. ఇక బీఎండబ్ల్యూ ఇండియా కూడా 3 శాతం స్థాయిలో పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. హోండా కార్స్ సైతం ఇదే యోచనలో ఉన్నప్పటికీ, పెంపు పరిమాణంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏటా డిసెంబర్లో జరిగేదే.. ముడివస్తువుల ధరల ఒత్తిడి మొదలైన అంశాల కారణంగా రేట్లను పెంచుతున్నామని కార్ల కంపెనీలు చెబుతున్నప్పటికీ, ఇది ఏటా డిసెంబర్లో జరిగే వ్యవహారమేనని పరిశ్రమ నిపుణులు తెలిపారు. సాధారణంగా కొత్త ఏడాదిలో కొత్త మోడల్‌ను కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో డిసెంబర్లో కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే కస్టమర్లను కాస్త తొందరపెట్టేందుకు వాహన కంపెనీలు ఇలాంటి ప్రక్రియ చేపడుతుంటాయని పేర్కొన్నారు. తద్వారా ఏడాది చివర్లో అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలు ప్రయతి్నస్తాయని వివరించారు. సాధారణంగా క్యాలెండర్ సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇలా ధరలను పెంచడం కనిపిస్తుంటుందని, కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేటప్పుడు కూడా ఇలా చేస్తుంటాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రజత్ మహాజన్ తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా రేట్లను సవరించలేదు కాబట్టి నాలుగో త్రైమాసికం ప్రారంభంలో పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో త్రైమాసికంలో కొన్ని బడా కంపెనీల లాభదాయకత తగ్గడం కూడా రేట్ల పెంపునకు కారణమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు సాధారణంగానే క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో రేట్లను పెంచుతుంటాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వర్ గుప్తా తెలిపారు. దానికి అనుగుణంగానే వివిధ కార్ల కంపెనీలు రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయని పేర్కొన్నారు. -
కియా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతోంది. ఏప్రిల్ 1 నుంచి సవరించిన ధరలు అమలులోని రానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ముడిసరుకు ధరలు, సరఫరా సంబంధిత వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ధరలను పెంచడం ఈ ఏడాది ఇదే తొలిసారి అని కియా తెలిపింది. -
వాహన ప్రియులకు షాక్.. రేపటి నుంచి అమల్లోకి కొత్త ధరలు!
దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఇప్పటికీ 'ఇయర్ ఎండ్ 2023' ఆఫర్స్ కింది అద్భుతమైన డిస్కౌంట్స్ అందించాయి. ఈ ఆఫర్స్ అన్నీ కూడా దాదాపు ఈ రోజుతో ముగియనున్నాయి. రేపటి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో 2024 జనవరి 1 నుంచే వాహనాల ధరలు పెరుగుతాయని ఇప్పటికే చాలా సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. ఇందులో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు ఉన్నాయి. ఇన్పుట్ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే తెలిపాయి. దీని ప్రకారం ధరల పెరుగుదల 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలు లేదా కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇప్పటికే పలు కంపెనీలు 0.8 శాతం ధరలను ఏప్రిల్ నెలలో పెంచాయి. కాగా ఇప్పుడు మరో సారి పెంచడానికి సన్నద్ధమైపోయాయి. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ప్యాసింజర్ కార్ల ధరలు మాత్రమే కాకుండా.. లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ల ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గుతాయా? లేదా కార్ల విక్రయాను పెంచడానికి కంపెనీలు ఏమైనా వారంటీలు వంటివి అందిస్తాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
ఏకంగా రూ. 3 లక్షలు పెరిగిన ఎక్స్1 ప్రైస్ - కొత్త ధరలు ఇలా!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) 2023 ప్రారంభంలో ఎక్స్1 లగ్జరీ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన కేవలం మూడు నెలలకే కంపెనీ ఈ మోడల్ ధరలను భారీగా పెంచేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కొత్త ధరలు: 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1 డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు డీజిల్ వేరియంట్ ధరలు రూ. 3 లక్షల వరకు పెంచింది. కావున X1 sDrive 18d M Sport ధర రూ. 50.90 లక్షలు. ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 47.50 లక్షలు. ఇక పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, sDrive 18i xLine ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. కావున ఇది రూ. 45.90 లక్షలకే అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కార్లను బుక్ చేసుకున్న వారికి కొద్ద ధరలు వర్తించవు. రానున్న రోజుల్లో బీఎండబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ మోడల్ కొనాలనుకునేవారు ఈ కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజైన్: దేశీయ మార్కెట్లో 2023 BMW X1 దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. ముందు భాగంలో గ్రిల్ కొంత పెద్దదిగా ఉంటుంది. బంపర్ బ్రష్డ్ సిల్వర్ ఇన్సర్ట్లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో అట్రాక్టివ్ హెడ్‌ల్యాంప్, ఇన్వర్టెడ్ ఎల్ షేప్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, 18-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక LED టెయిల్ ల్యాంప్ వంటివి ఉంటాయి. (ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్‌ప్లస్ ట్యాబ్ ధరలు లీక్.. ఎంతో తెలుసా?) ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్: కొత్త ఎక్స్1 ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ కర్వ్డ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే చూడచక్కగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువగా స్టోరేజ్ స్పేస్‌లు, కొన్ని ఫిజికల్ బటన్స్ కలిగి ఉన్న ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. బూట్ స్పేస్ సుమారు 500 లీటర్ల వరకు ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.70 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 12-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, ADAS టెక్నాలజీ ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.5 లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 136 హెచ్‌పి పవర్, 230 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 150 హెచ్‌పి పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. BMW X1 పెట్రోల్ వెర్షన్ కేవలం 9.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, డీజిల్ ఇంజిన్ కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.03 కిమీ మైలేజ్ అందిస్తే, డీజిల్ ఇంజిన్ లీటరుకు 19.23 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రత్యర్థులు: కొత్త 2023 ఎక్స్1 దేశీయ విఫణిలో మెర్సిడెస్ బెంజ్ GLA, ఆడి క్యూ3, మినీ కంట్రీమ్యాన్, వోల్వో ఎక్స్‌సి 40 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
టైగన్ ప్రియులకు షాక్.. భారీగా ధరలు పెంచిన ఫోక్స్‌వ్యాగన్
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గత నెలలోనే టైగన్ ధరల పెరుగుదలను గురించి ప్రకటించింది. అయితే ఇప్పుడు కొత్త ధరలను కూడా వెల్లడించింది. రియల్ డ్రైవ్స్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా అప్డేట్ చేయడం వల్లే ఈ ధరల పెరుగుదల జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ధరల పెరుగుదలకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రస్తుతం కంఫర్ట్‌లైన్, హైలైన్, ఫస్ట్ యానివర్సరీ, టాప్‌లైన్, జిటి, జిటి ప్లస్ అనే ఆరు వేరియంట్లలో లభిస్తోంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 45,000 పెరిగింది. అదే సమయంలో జిటి & జిటి ప్లస్ ధరలు వరుసగా రూ. 30,000, రూ. 10,000 పెరిగాయి. ఇక హైలైన్ వేరియంట్ ధర రూ. 24,000 పెరిగింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్పి పవర్, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది. ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్పి పవర్, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. పనితీరు పరంగా ఈ రెండు ఇంజిన్లు ఉత్తమంగా ఉంటాయి. -
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ..
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్ల కార్లు, వాహనాల ధరలను పెంచేసింది. వాహన ధరల సగటు పెరుగుదల 0.8 శాతంగా ఉంది. పెరిగిన తయారీ ఖర్చులు, నియంత్రణ వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ మార్చి 23నే ప్రకటించింది. (తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!) అంతకు ముందు జనవరిలో కంపెనీ తమ వాహనాల ధరలను 1.1 శాతం పెంచింది. మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్‌తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి, కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించడానికి వాహనాలు ఆన్ బోర్డ్ స్వీయ నిర్ధారణ పరికరాన్ని కలిగి ఉండాలి. ఇందుకు గాను ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) కంపెనీ విక్రయాల విషయానికి వస్తే గత నెలలో మొత్తం అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 1,70,071కి చేరుకున్నాయి. దేశీయ విపణిలో డీలర్లకు వాహనాల సరఫరా 3 శాతం క్షీణించి 1,39,952 యూనిట్లకు చేరుకుంది. ఇక గత నెలలో ఎగుమతులు 14 శాతం పెరిగి 30,119 యూనిట్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,52,653 యూనిట్ల నుంచి గతేడాది 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్ల అత్యధిక టోకు విక్రయాలను నమోదు చేసింది. 2022-23 సంవత్సరంలో డొమెస్టిక్ డిస్పాచెస్ 17,06,831 యూనిట్లు కాగా ఎగుమతులు 2,59,333 యూనిట్లు. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) కాగా కంపెనీ విదేశీ ఎగుమతులు ప్రారంభించినప్పటి నుంచి ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు మారుతీ సుజుకీ బాలెనో వాహనాన్ని ఎగుమతి చేసి ఈ రికార్డు సాధించిది.1986-87లో మారుతీ సుజుకీ బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది.ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 100 దేశాలకు తమ వాహనాలు ఎగుమతి చేస్తోంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్) -
1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!
మనం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నప్పటికీ అంబాసిడర్ వంటి అద్భుతమైన కార్లను ఎవ్వరూ మరచిపోలేరు. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందిన ఈ బ్రాండ్ కారు ఇప్పుడు మార్కెట్లో విక్రయానికి లేనప్పటికీ, అప్పుడప్పుడూ రోడ్లమీద కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలను ముందు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మొదలైనవారు ఈ కార్లను తెగ ఉపయోగించారు. అంతే కాకుండా అప్పట్లో రాయల సీమలో ఈ కార్లను ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అయితే ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ధర ఎంత అనే విషయాన్నీ ఈ కథనంలో చదివేద్దాం. 1964లో అంబాసిడర్ కారు ధర ఎంత అనేదానికి సంబంధించిన ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దీని ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం. వినటానికి కొంత వింతగా ఉన్నా.. అప్పట్లో ఈ కారు ధర అంతే అనటానికి కొన్ని ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1990 దశకంలో ఒక మెరుపు మెరిసిన అంబాసిడర్ కార్లను 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఆ తరువాత మారుతి కార్లు మార్కెట్లో విడుదలకావడం వల్ల వీటి ఆదరణ కొంత తగ్గింది, అయినప్పటికీ కొంత మంది అంబాసిడర్ అభిమానులు వీటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా వీటి అమ్మకాలు తగ్గడం వల్ల 2014లో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: Odysse EV Bike: ఒక్క ఛార్జ్‌తో 125 కిమీ రేంజ్.. రూ. 999తో బుక్ చేసుకోండి!) ఇక తాజాగా బయటపడిన అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ బిల్ ప్రకారం, ఇది 1964లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా తెలుస్తోంది. దీని ధర అప్పుడు రూ. 16.495 మాత్రమే. దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసింది. ఇందులో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు కూడా చూడవచ్చు. -
Jeep Grand Cherokee: మొన్న విడుదలైంది, అప్పుడే కొత్త ధరలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్ భారతదేశంలో ఆధునిక ఉత్పత్తులను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇటీవల గ్రాండ్ చెరోకీ ఎస్యూవీ ధరలను కంపెనీ లక్ష వరకు పెంచింది. దేశీయ విఫణిలో విడుదలై నాలుగు నెలలు పూర్తి కాకుండానే ఇది మరింత ఖరీదైన కారుగా అవతరించింది. 2022 నవంబర్‌లో విడుదలైన గ్రాండ్ చెరోకీ ప్రారంభ ధర రూ. 77.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరల పెరుగుదల తరువాత ఈ SUV రూ. 78.50 లక్షలకు చేరుకుంది. ధరలు పెరిగినప్పటికీ గ్రాండ్ చెరోకీలో ఎటువంటు అప్డేట్స్ లేకపోవడం గమనార్హం. కావున ఇది అదే డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ పరంగా కూడా ఎటువంటి మార్పులు లేదు, కాబట్టి 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో 268 బిహెచ్పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్, సాండ్, స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆధునిక ఫీచర్స్, కొత్త హంగులతో రానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ.. వివరాలు) జీప్ గ్రాండ్ చెరోకీ సెవెన్ స్లాట్ గ్రిల్‌తో పాటు సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ కలిగి, దానికి కింది భాగంలో సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌లతో చంకీ రియర్ బంపర్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్‌లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులో ఉత్తమమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 'ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ'కి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్, పనోరామిక్ సన్‌రూఫ్, వెంటిలెటెట్ ఫ్రంట్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, వాయిస్ కమాండ్, 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్ అప్ డిస్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. -
వోల్వో అభిమానులకుషాకిచ్చిందిగా!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మైల్డ్ హైబ్రిడ్ మోడళ్లపై 2 శాతం వరకు ధర పెంచింది. ఫలితంగా మోడల్ని బట్టి 50వేల రూపాయల నుంచి 2 లక్షల దాకా భారం పడనుంది. ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ సవరించిన నేపథ్యంలో పెరిగిన ముడిసరుకు వ్యయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం ఎక్స్‌సీ40, ఎక్స్‌సీ60, ఎస్90,ఎక్స్‌సీ90 వేరియంట్ల ధరలు అధికం కానున్నాయి. బెంగళూరు ప్లాంటులో ఈ మోడళ్లను కంపెనీ అసెంబుల్ చేస్తోంది. (ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్:లడ్డూ కావాలా నాయనా..కస్టమర్‌కి దిమ్మ తిరిగిందంతే!) ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన విధంగా కస్టమ్స్ డ్యూటీలో మార్పుల ఫలితంగా తమ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ఇన్పుట్ ఖర్చులు పెరిగిన ఫలితంగా హైబ్రిడ్ల ధరలు స్వల్పంగా పెరిగాయని వోల్వో మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారం, సెమీ-నాక్డ్ డౌన్ (SKD) రూపంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్స్ సుంకం 30 శాతం నుండి 35 శాతానికి పెరిగింది. అయితే, అంతకుముందు విధించిన 3శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జి (SWS) రద్దు అయింది. -
మారుతి లవర్స్‌కు అలర్ట్, కొత్త కారు కొనాలంటే..!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021, డిసెంబరులో ప్రకటించిన మారుతీ సుజుకి ఇండియా జనవరి 16 నుంచి కార్ల ధరల పెంపు అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.వెల్లడించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది. కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను అప్డేట్ చేయడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెంపు తప్పడలం లేదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో మారుతీ సుజుకీ లవర్స్ కారు కొనాలంటే మరింత ధర పడనుంది. మారుతి ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుండి SUV గ్రాండ్ విటారా వరకు రూ. 3.39 లక్షల నుండి రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య వాహనాను విక్రయిస్తోంది. -
మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతీ సుజుకి తన కస్టమర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను భారీగా పెంచేందుకు యోచిస్తోంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల నిమిత్తం 2023, జనవరి నుంచి ధరల పెంపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. అలాగే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత డిసెంబరు కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేసింది. (బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!) అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత కారణంగా దేశీయ మోడళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల నియంత్రణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ధరల పెరుగుదల 2023 జనవరిలో ఉంటుందని ప్రకటించింది. మోడల్ని బట్టి, ధర పెంపు ఉంటుందని ప్రకటించిన మారుతి పెంపు ఎంత శాతం అనేది ధృవీకరించలేదు.(లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) కాగా నవంబర్ 2022లో మొత్తం అమ్మకాలలో 14 శాతం పెరుగుదల సాధించింది మారుతీ సుజుకి. గత ఏడాది ఇదే కాలంలో 1,39,18 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 1,59,044 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 1,35,055 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ (స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో , డిజైర్) అమ్మకాలు గతేడాది నవంబర్‌లో 57,019 యూనిట్ల నుంచి 72,844 యూనిట్లకు పెరిగాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 1,554 యూనిట్లుగా ఉండగా, యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ (విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా) అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో 32,563 యూనిట్లకు పెరిగాయి. -
‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మోడల్స్‌పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి. కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. -
ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను పెంచుతున్నట్లు లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ ఇండియా వెల్లడించింది. రేట్లను రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల శ్రేణిలో పెంచినట్లు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి పాత రేట్లే వర్తింపచేస్తామని, ఆ తర్వాత బుకింగ్స్‌కు కొత్త రేట్లు వర్తిస్తాయని వివరించింది. తాజా మార్పులతో ఎక్స్‌సీ40 వంటి మోడల్స్ రేటు 3 శాతం పెరిగి రూ. 44.5 లక్షలకు, ఎక్స్‌సీ60 ధర 4 శాతం పెరిగి రూ. 65.9 లక్షలకు, ఎక్స్‌సీ90 రేటు 3 శాతం పెరిగి రూ. 93.9 లక్షలకు (అన్నీ ఎక్స్–షోరూం) చేరింది. ఈ ఏడాది తొలినాళ్లలోనే వోల్వో కార్ల రేట్లు పెంచింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, రవాణా వ్యయాలు .. ముడి వస్తువుల రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా మళ్లీ ధరల పెంపు తప్పలేదని సంస్థ పేర్కొంది. చదవండి: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..! -
టాటా మోటార్స్: వాహనాల ధరల పెంపు
పండుగ సందడి ముగిసిన వెంటనే.. స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహనదారులకు షాకిచ్చింది. ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరల అమలు జనవరి 19 (బుధవారం నుంచి) వర్తిస్తుందని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాహనాలపై సగటున 0.9 శాతం పెంపుదల బుధవారం నుంచి వర్తిస్తుందని పేర్కొంది. వేరియెంట్, మోడల్‌ను బట్టి ధరల నిర్ధారణ ఉంటుందని తెలిపింది. జనవరి 18(ఇవాళ), అంతకంటే ముందు బుక్ చేసుకున్న కార్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ స్పష్టం చేసింది. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతోందని, ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో కస్టమర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి.. ప్రత్యేకించి కొన్ని వేరియెంట్ల మీద పది వేల రూ. దాకా తగ్గింపు కొనసాగుతుందని ప్రకటించి ఊరట ఇచ్చింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఆటోమేకర్.. టియాగో, పంచ్, హర్రియర్ లాంటి మోడల్స్‌తో దేశీయ మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే కిందటి నెలలోనే కమర్షియల్ వాహనాలపై రేట్లు పెంచిన టాటా మోటార్స్.. జనవరి 1 నుంచి ప్యాసింజర్ వెహికల్స్ పైనా రేట్లు పెంచింది. ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ప్రకటన చేసింది. రీసెంట్గా మరో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఏకంగా 4.3 శాతం దాకా వాహన ధరలు పెంచిన విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించుకుంటున్నాయి. చదవండి: వారెవ్వా టాటా ! ‘డార్క్’ దద్దరిల్లిపోతుందిగా !! -
కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు.. ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: అన్ని ప్యాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా ఇన్ స్టలేషన్ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పుడు వేగవంతం చేస్తుంది. అదనంగా నాలుగు ఎయిర్ బ్యాగులను ఇన్ స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.9,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి ఎయిర్ బ్యాగ్ ధర రూ.1,800 నుంచి రూ.2,000 వరకు ఉండవచ్చు అని తెలిపారు. ఇప్పుడు ఆ మేరకు కార్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతంలోనే దీనికి ఎయిర్ బ్యాగుల తప్పనిసరి అనే నిబందనకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు అన్ని కార్లు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా నాణ్యమైన ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా బిగించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. దీంతో ఆయా వాహనాల ధరలపైనా ఈ ప్రభావం పడబోతోంది. కానీ దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న రోడ్లు ప్రమాదాల నివారణలో ఎయిర్ బ్యాగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా, వాహనం అన్ని వేరియెంట్, సెగ్మెంట్లలో కనీసం ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా అందించాలని నేను అన్ని ప్రైవేట్ వాహన తయారీదారులకు విజ్ఞప్తి చేశాను రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో తయారు చేసిన అన్ని వాహనాల్లో తప్పనిసరిగా ముందు వరస సహ ప్రయాణీకుల కోసం రెండు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాద బాధితుల్లో భారతదేశంలోనే దాదాపు 10 శాతం మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..ఎయిర్ బ్యాగులు, సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందు కూర్చొన్న వారిలో మరణించే వారి శాతం 61 శాతం వరకు తగ్గింది. ఎయిర్ బ్యాగు ఉండటం వల్ల మరణాల శాతం 34 శాతం తగ్గినట్లు ఆ నివేదికలో తేలింది. (చదవండి: కొత్త ఏడాదిలో ఎలన్ మస్క్ జోరు.. గంటకు వేలకోట్ల సంపాదన!) -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
షాకిచ్చిన టాటా మోటార్స్.. కార్ల ధరల పెంపు
TATA Motors Increase Prices On All Vehicles: కొత్త సంవత్సరంలో కొత్తకారు కొనాలనుకుంటున్న వాళ్లకు టాటా మోటార్స్ షాకిచ్చింది. ఈ వాహన తయారీ సంస్థ అన్ని ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను జనవరి 1వ తేదీ నుంచి పెంచుతోంది. దీంతో టాటా మోటార్స్ కార్లు ఖరీదు కానున్నాయి. అయితే ఎంత శాతం సవరిస్తున్నదనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేశ్ చంద్ర తెలిపారు. మరోవైపు కమర్షియల్ వెహికల్స్ ధరలను సైతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ఈమధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ, మధ్య, తేలిక వాహనాలతో పాటు చిన్నస్థాయి వాణిజ్య వాహనాలు, బస్సులకు ఈ పెంపు వర్తించనుందని తెలిపింది. ఇక ఈ కమర్షియల్ వాహనాలపై 2.5 శాతం పెంపు జనవరి 1, 2022 నుంచి అమలుకానుంది. డుకాటీ సైతం కాగా, లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటీ సైతం వచ్చే నెల 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతోంది. ‘ఇక్కడి మార్కెట్లో అత్యంత పోటీతత్వంతో వాహనాల ధరలను ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. ముడి సరుకు, ఉత్పత్తి, రవాణా ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ధరలను మార్చవలసి వస్తోంది’ అని వివరించింది. ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకి కార్ల ధరలను పెంచుతున్నట్టు హఠాత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే హోండా, రెనాల్ట్ కంపెనీలు కూడా ధరలను ధరల పెంపును సమీక్షించే యోచనలో ఉండగా.. అడీ కంపెనీ ఏకంగా 3 శాతం పెంచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది,. కానీ, కార్ల తయారీలో కీలకమైన స్టీలు, రోడియం మెటీరియల్‌ల ధరలు బాగా పెరగడం, దీనికి తోడు సెమికండర్ల కొరత సైతం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఈ కారణాలతో ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీలు చెప్తున్నాయి. కార్ల రేట్లు రయ్.. రయ్! -
సొంత కారు కలకు షాకిచ్చిన మారుతి
సాక్షి, ముంబై: సొంత కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కార్ల ధరలను మరోసారి పెంచింది. కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు తక్షణం (శుక్రవారం) అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ధరల్ని పెంచక తప్పలేదని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయంతో స్విఫ్ట్, సెలెరియా మినహా అన్ని మోడళ్లకు చెందిన వాహన ధరలు రూ.22,500 వరకు పెరిగే అవకాశం ఉంది.మోడల్‌ను బట్టి 1.6 శాతం మేర ధరల పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది జనవరి 18న ధరలు పెంచిన కంపెనీ... కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. -
ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి కారు, ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకు ధరలు, వస్తువుల ఖర్చులు పెరగడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల పెరుగుదల వల్ల ఇప్పటికే జనవరిలోనే వాహనాల ధరలు పెరిగాయి. కేవలం స్వల్ప సమయంలోనే రెండో సారి ధరలు పెరగనున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే వివిధ మోడల్స్, వేరియంట్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన వాహనా తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని మారుతి సుజుకి పేర్కొంది. అందువల్ల, ఏప్రిల్‌లో కస్టమర్ల మీద అదనపు భారం పడే అవకాశం ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కూడా కొత్త ఎస్‌యూవీల ధరలను పెంచాలని నిర్ణయించింది. నిస్సాన్, డాట్సన్ సిరీస్‌లోని వివిధ వేరియంట్ల ధరలను విడివిడిగా పెంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా వాహనాల ధరలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే ధరల పెరుగుదల గురించి సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా ఇంధన, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలపై భారం పడుతోంది. డీజిల్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కంపెనీలు రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు పెరిగాయి. ఈ కారణాల వల్ల బైక్ కంపెనీ ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నాయి. ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అలాగే ప్రీమియం బైక్స్‌పై కూడా ఈ ప్రభావం పడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 కొత్త వేరియంట్ ధరలు 2 శాతం పెరిగాయి. చదవండి: వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
2021లో కొత్త మార్పులు- మీరు రెడీనా?
ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో ప్రజా జీవనానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలలో మార్పులకు తెరలేవనుంది. వీటిలో ప్రధానంగా చెక్కుల జారీ ద్వారా జరిగే చెల్లింపుల నిబంధనలు మారనున్నాయి. ఇదేవిధంగా యూపీఐ చెల్లింపులలో అదనపు చార్జీలతోపాటు.. కార్లు, ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగే వీలుంది. ఇక పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ కలిగిన కొన్ని ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోనుంది. కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు చెల్లింపుల పరిమితి రూ. 5,000కు పెరగనుంది. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేయాలంటే నంబర్‌కు ముందు 0ను జత చేయవలసి రావచ్చు. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొన్ని అంశాలను చూద్దాం.. 1. చెక్ చెల్లింపులు సానుకూల చెల్లింపుల వ్యవస్థలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని సవరణలు చేపట్టింది. దీంతో రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల్లో కస్టమర్ల వివరాలను బ్యాంకులు తిరిగి ధృవ పరుచుకోవలసి ఉంటుంది. రూ. 5 లక్షలకు మించిన చెక్కుల చెల్లింపులకు ఇవి తప్పనిసరికాగా.. కొన్ని విషయాలలో కస్టమర్ల ఆసక్తిమేరకు బ్యాంకులు ఈ నిబంధనను అమలు చేసే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. (జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్) 2. పిన్‌తో పనిలేదు బ్యాంకులు జారీ చేసిన కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు రూ. 5,000వరకూ పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లింపులు చేపట్టవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి రూ. 2,000గా అమలవుతోంది. రక్షణాత్మక విధానంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత కోవిడ్-19 నేపథ్యంలో కస్టమర్ల భద్రతరీత్యా కూడా డిజిటల్ చెల్లింపుల పరిమితిని పెంచినట్లు తెలియజేశాయి. (పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్) 3. యూపీఐ చెల్లింపులు అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే తదితర యాప్‌ల ద్వారా వినియోగదారులు చేపట్టే చెల్లింపులపై అదనపు చార్జీల భారం పడనుంది. థర్డ్‌పార్టీ నిర్వహించే యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలను విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. జనవరి 1నుంచి థర్డ్‌పార్టీ యాప్స్‌పై 30 శాతం పరిమితిని విధించినట్లు తెలుస్తోంది. 4. ఫాస్టాగ్ తప్పనిసరి జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీల్ వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరికానుంది. ఇందుకు కేంద్ర రోడ్ రవాణా శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989కు సవరణలు చేపట్టింది. ఈ అంశంపై నవంబర్ 6నే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 5. నో.. వాట్పాప్ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నడిచే స్మార్ట్ఫోన్లలో ఇకపై వాట్సాప్‌కు వీలుండదు. ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 వెర్షన్‌తో నడిచే స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇదేవిధంగా ఐవోఎస్9 వెర్షన్ ఐఫోన్లలోనూ వాట్సాప్ నిలిచిపోనుంది. ఈ జాబితాలో కేఏఐవోఎస్ 2.5.1 వెర్షన్‌తో నడిచే కొన్ని ఎంపిక చేసిన జియో ఫోన్లు సైతం ఉన్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. 6. ఎల్పీజీ, కార్ల ధరలు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతీ నెలా మొదటి రోజున అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు సగటు ధరల ఆధారంగా వంట గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. ఇటీవల విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌తోపాటు, ఎల్పీజీ ధరలను సైతం పెంచిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఆటో రంగ దిగ్గజాలు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా తదితరాలు జనవరి నుంచి వాహనాల ధరలను పెంచేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 7. 0తో మొదలు ల్యాండ్ లైన్ నుంచి దేశీయంగా మొబైల్‌కు కాల్ చేయాలంటే నంబర్‌కు ముందు 0ను జత చేయవలసి రావచ్చని టెలికం వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశాయి. తద్వారా మొబైల్ టెలికంలు తగిన మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. -
హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు..!
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్ ఆధారంగా పెంపు ఉండనున్నట్లు చెప్పిన కంపెనీ.. ఎంత మేర ధరలు పెరగనున్నాయనేది వెల్లడించలేదు. మారుతీ, టాటా మోటార్స్‌తో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా వాహన ధరలను జనవరి 1 నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
రాష్ట్రాల్లో పన్నులు అధికం
ముంబై: రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉన్నాయని, ఫలితంగా కార్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు పెట్రోల్‌పై రాష్ట్రాలు భారీగా పన్నులు విధిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను బాగా పెంచాయని, ఫలితంగా కార్ల ధరలపై రాష్ట్రాల పన్ను భారం ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, రోడ్డు ట్యాక్స్ పెంచిన రాష్ట్రాల్లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయని వివరించారు. రాష్ట్రాలు తోడ్పాటునందించాలి.... తయారీ రంగంలో తమ పాత్ర విషయమై రాష్ట్రాలు తగిన విధంగా వ్యవహరించాలని భార్గవ సూచించారు. లేకుంటే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం సాకారం కావడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తయారీ రంగం వృద్ధి చెందడానికి రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పడాలని ఆయన సూచించారు. -
హ్యుందాయ్ కార్ల ధరలు మరింత ప్రియం
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నూతనంగా విడుదల చేసిన వెన్యూ, కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మినహాయించి మిగిలిన అన్ని మోడళ్లపై ధరలను పెంచనున్నట్లు మంగళవారం వెల్లడించింది. నూతన భద్రతా నిబంధనలను పాటించాల్సి రావడం వల్ల ముడి పదార్థాల వ్యయం పెరిగినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. మోడల్ ఆధారంగా రూ.9,200 వరకు పెంపు ఉండనుండగా.. కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కంపెనీ శాంత్రో హ్యాచ్‌బ్యాక్ నుంచి టక్సన్ ఎస్యూవీ వరకు విక్రయిస్తోంది. -
కార్ల కంపెనీల ధరల హారన్
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్ ఎక్సే్ఛంజ్ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5% పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ఈడీ వినయ్ రైనా వెల్లడించారు. ఇక టాటా మోటార్స్..మోడల్‌ను బట్టి గరిçష్టంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ, ఇసుజు, టయోటా కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.