
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నూతనంగా విడుదల చేసిన వెన్యూ, కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మినహాయించి మిగిలిన అన్ని మోడళ్లపై ధరలను పెంచనున్నట్లు మంగళవారం వెల్లడించింది. నూతన భద్రతా నిబంధనలను పాటించాల్సి రావడం వల్ల ముడి పదార్థాల వ్యయం పెరిగినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. మోడల్ ఆధారంగా రూ.9,200 వరకు పెంపు ఉండనుండగా.. కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కంపెనీ శాంత్రో హ్యాచ్‌బ్యాక్ నుంచి టక్సన్ ఎస్‌యూవీ వరకు విక్రయిస్తోంది.