న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను పెంచుతున్నట్లు లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ ఇండియా వెల్లడించింది. రేట్లను రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల శ్రేణిలో పెంచినట్లు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి పాత రేట్లే వర్తింపచేస్తామని, ఆ తర్వాత బుకింగ్స్‌కు కొత్త రేట్లు వర్తిస్తాయని వివరించింది.
తాజా మార్పులతో ఎక్స్‌సీ40 వంటి మోడల్స్ రేటు 3 శాతం పెరిగి రూ. 44.5 లక్షలకు, ఎక్స్‌సీ60 ధర 4 శాతం పెరిగి రూ. 65.9 లక్షలకు, ఎక్స్‌సీ90 రేటు 3 శాతం పెరిగి రూ. 93.9 లక్షలకు (అన్నీ ఎక్స్–షోరూం) చేరింది. ఈ ఏడాది తొలినాళ్లలోనే వోల్వో కార్ల రేట్లు పెంచింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, రవాణా వ్యయాలు .. ముడి వస్తువుల రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా మళ్లీ ధరల పెంపు తప్పలేదని సంస్థ పేర్కొంది.
చదవండి: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..!
Volvo Cars Price Hike: ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..!
Published Wed, Apr 20 2022 12:17 PM | Last Updated on Wed, Apr 20 2022 1:13 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment