సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతీ సుజుకి తన కస్టమర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను భారీగా పెంచేందుకు యోచిస్తోంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల నిమిత్తం 2023, జనవరి నుంచి ధరల పెంపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. అలాగే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత డిసెంబరు కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేసింది. (బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!)
అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత కారణంగా దేశీయ మోడళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల నియంత్రణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ధరల పెరుగుదల 2023 జనవరిలో ఉంటుందని ప్రకటించింది. మోడల్‌ని బట్టి, ధర పెంపు ఉంటుందని ప్రకటించిన మారుతి పెంపు ఎంత శాతం అనేది ధృవీకరించలేదు.(లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్)
కాగా నవంబర్ 2022లో మొత్తం అమ్మకాలలో 14 శాతం పెరుగుదల సాధించింది మారుతీ సుజుకి. గత ఏడాది ఇదే కాలంలో 1,39,18 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 1,59,044 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 1,35,055 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ (స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో , డిజైర్) అమ్మకాలు గతేడాది నవంబర్‌లో 57,019 యూనిట్ల నుంచి 72,844 యూనిట్లకు పెరిగాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 1,554 యూనిట్లుగా ఉండగా, యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ (విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా) అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో 32,563 యూనిట్లకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment