అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్ భారతదేశంలో ఆధునిక ఉత్పత్తులను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇటీవల గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ ధరలను కంపెనీ లక్ష వరకు పెంచింది. దేశీయ విఫణిలో విడుదలై నాలుగు నెలలు పూర్తి కాకుండానే ఇది మరింత ఖరీదైన కారుగా అవతరించింది.
2022 నవంబర్‌లో విడుదలైన గ్రాండ్ చెరోకీ ప్రారంభ ధర రూ. 77.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరల పెరుగుదల తరువాత ఈ SUV రూ. 78.50 లక్షలకు చేరుకుంది. ధరలు పెరిగినప్పటికీ గ్రాండ్ చెరోకీలో ఎటువంటు అప్డేట్స్ లేకపోవడం గమనార్హం. కావున ఇది అదే డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.
పర్ఫామెన్స్ పరంగా కూడా ఎటువంటి మార్పులు లేదు, కాబట్టి 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‍తో 268 బిహెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్, సాండ్, స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఆధునిక ఫీచర్స్, కొత్త హంగులతో రానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ.. వివరాలు)
జీప్ గ్రాండ్ చెరోకీ సెవెన్ స్లాట్ గ్రిల్‌తో పాటు సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ కలిగి, దానికి కింది భాగంలో సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌లతో చంకీ రియర్ బంపర్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్‌లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులో ఉత్తమమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.
(ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్‌కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?)
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్ 'ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ'కి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ కన్సోల్, పనోరామిక్ సన్‍రూఫ్, వెంటిలెటెట్ ఫ్రంట్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, వాయిస్ కమాండ్, 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్ అప్ డిస్‍ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment