Jeep
-
వెచ్చగా ఉంచే ‘ఊలీ’ క్యాంపర్ వ్యాన్
-
ప్రపంచంలోని బెస్ట్ ఆఫ్-రోడింగ్ కార్లు (ఫోటోలు)
-
రూ.24.99 లక్షల అమెరికన్ బ్రాండ్ కారు: భారత్‌లో లాంచ్
జీప్ కంపెనీ భారతదేశంలో తన మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ కలిగి 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. కొత్త మెరిడియన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరలో ప్రారంభమవుతాయి.అప్డేటెడ్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ 5-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన మూడు ట్రిమ్‌లు 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్‌తో హనీకూంబ్ మెష్ క్రోమ్ స్టడ్‌లను పొందుతుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. క్యాబిన్ లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ.. డ్యాష్‌బోర్డ్ కాపర్ స్టిచింగ్‌తో కొత్త స్వెడ్ ఫినిషింగ్‌ని పొందింది. 9 స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వాటితో పాటు.. ఈ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4x2, 4x4 వేరియంట్లతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ & 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన జీప్.. పూర్తి వివరాలు
భారతదేశంలో జీప్ కంపెనీ తన ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'కంపాస్ స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 25.26 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. కొత్త కాస్మొటిక్ డిజైన్స్ అన్నీ కూడా దీనిని స్పెషల్ ఎడిషన్ కారుగా గుర్తించడానికి సహకరిస్తాయి.కొత్త జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ బానెట్‌పై డ్యూయల్-టోన్ డికాల్తో పాటు ఆరవ గ్రిల్ స్లాట్‌పై వెల్వెట్ రెడ్ కలర్ ఉండటం చూడవచ్చు. లోపలి భాగంలో కూడా ఎక్కువ భాగం ఎరుపు రంగులోనే ఉండటం చూడవచ్చు. ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 43000 ఎక్కువ ధర వద్ద లభిస్తోంది.ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?కొత్త జీప్ స్పెషల్ ఎడిషన్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ తప్పా.. ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి కంపాస్ యానివర్సరీ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 350 న్యూటన్ మీటర్ టార్క్, 170 హార్స్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
Rajasthan: రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
సిరోహి: రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జీపు రాంగ్ డైరెక్షన్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీపు ప్రయాణికులతో నిండివుంది.జీపులో ప్రయాణిస్తున్నవారంతా పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించి, ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కంటల్ సమీపంలోకి రాగానే ఆ జీపు ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతిచెందారని పిండ్వారా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి హమీర్ సింగ్ తెలిపారు. మృతులు, గాయపడినవారు ఉదయపూర్ జిల్లాలోని గోగుండా, ఝడోల్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి -
హృతిక్ రోషన్‌తో ‘జీప్’ ప్రచార కార్యక్రమం
హైదరాబాద్: కార్ల తయారీ సంస్థ ‘జీప్ ఇండియా’ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జీప్ రాంగ్లర్ అత్యుత్తమ ప్రదర్శన, ఆకర్షణీయ ఫీచర్లను కస్టమర్లకు తెలియజేయనుంది.‘వన్‌అండ్‌ఓన్లీ’ ట్యాగ్‌లైన్ తగ్గట్లు సాటిలేని ప్రమాణాలతో వాహనాలను రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడమే కాకుండా, ఈ స్థాయిని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని జీప్ ఇండియా ప్రకటించింది. హృతిక్ రోషన్‌ను జీప్ సంస్థ ఇటీవలే తమ బ్రాండ్ పార్ట్నర్గా నియమించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
రోడ్డెక్కిన బుల్లి జీపు!
సాక్షి, హైదరాబాద్: బ్యాటరీతో నడిచే బుల్లి జీపు రోడెక్కింది. రయ్ రయ్ మంటూ ఇతర వాహనాలతో పోటీగా పరుగులు పెడుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మెహదీపట్నం నుంచి లక్డీకాపూల్ మీదుగా రోడ్డు మీద బుధవారం సాయంత్రం వేళలో వెళుతుండగా ‘సాక్షి’ కంట పడింది. రోడ్డు మీద వడివడిగా పరుగులు పెడుతున్న ఈ జీప్‌ను పలువురు వాహనదారులు ఫొటోలు, వీడియోలు తీస్తూ సంబరపడిపోయారు. వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి పలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. అయితే నంబరు ప్లేట్ లేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా రోడ్డుపై పరుగులు పెడుతున్న ఈ బుల్లి జీపుపై ట్రాఫిక్ పోలీసులు ఎలా స్పందిస్తారో!? -
భారత్‌లో సరికొత్త అమెరికన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ జీప్.. భారతీయ విఫణిలో సరికొత్త 'స్పెషల్ ఎడిషన్ మెరిడియన్ ఎక్స్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ. 34. 27 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వరకు అప్డేట్స్ పొందింది.జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్.. గ్రే రూఫ్, గ్రే యాక్సెంట్లతో అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇందులో సైడ్ మౌల్డింగ్, పుడిల్ ల్యాంప్స్, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రీమియం కార్పెట్ మ్యాట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధర దాని ఎంట్రీ లెవల్ లిమిటెడ్ (ఓ) వేరియంట్ కంటే రూ. 50000 ఖరీదైనది.కొత్త జీప్ మెరిడియన్ ఎక్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది.జీప్ కంపెనీ ఈ ఏడాది చివర్లో మిడ్-లైఫ్ అప్డేట్ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ అప్డేటెడ్ SUV ఇటీవలే టెస్టింగ్ దశలో కనిపించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందిందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి!
బీహార్‌లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్‌కలి సమీపంలో వేగంగా వస్తున్న వస్తున్న ఒక కారు..బైక్‌ను ఢీకొని, మరో లేన్‌లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల్లో గాయకుడు ఛోటూ పాండే కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ మాట్టాడుతూ స్కార్పియో వాహనం ససారం నుంచి వారణాసి వైపు వెళుతున్నదని, ఆ వాహనంలో ఎనిమిదిమంది ఉన్నారని తెలిపారు. మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్ 2లోని దేవ్‌కలి సమీపంలో, ఆ కారు ఒక బైక్‌ను ఢీకొని, డివైడర్‌ను దాటి.. మరో లేన్‌లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నదని తెలిపారు. -
కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్షిప్ - రూ.61 లక్షలు రీఫండ్!
కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇందర్జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది. కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్‌షిప్‌ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్‌షిప్‌కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. -
టెస్ట్ డ్రైవ్‌లో రూ.33 లక్షల కారు నుజ్జునుజ్జు - వీడియో వైరల్
సాధారణంగా ఒక కారు కొనడటానికి ముందు కంపెనీ డీలర్షిప్ టెస్ట్ డ్రైవ్ సదుపాయం కల్పిస్తుంది. అయితే కొన్ని సార్లు అనుభవం లేని డ్రైవర్లు కారుని డ్రైవ్ చేస్తే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఈ సంఘటన కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీలో జరిగినట్లు తెలుస్తోంది. అమెరికన్ కార్ బ్రాండ్ అయిన జీప్ మెరిడియన్ టెస్ట్ డ్రైవ్ సమయంలో అనుకోని పెద్ద ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లయితే, రోడ్డు తడిగా ఉండటం గమనించవచ్చు. ప్రమాదం జరగటానికి ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు. దీనికి కారణం అతి వేగమా? లేక డ్రైవింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోవడమా? అనేది తెలియాలి ఉంది. అయితే ప్రమాదంలో కారు చాలా ఎక్కువ దెబ్బతినడంతో ఫ్రంట్ బంపర్, రియర్ ప్రొఫైల్ చాలా వరకు పనికిరాకుండా పోయింది. కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండు స్ట్రీట్‌లైట్ స్తంభాలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా.. లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. లోపల ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడం వల్ల బహుశా వారికి గాయాలేమైనా అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా? జీప్ మెరిడియన్.. టెస్ట్ డ్రైవ్ సమయంలో వినియోగదారుడు పరిమిత వేగంతో డ్రైవ్ చేయాలి, ఎందుకంటే కొత్త కారు గురించి వారికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. కారు ప్రమాదానికి గురైతే టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకున్న వారు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగిందా? లేదా స్పష్టంగా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన జీప్ మెరిడియన్ ధర రూ. 33.41 లక్షల నుంచి రూ. 38.61 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదం ఇదే మొదటి సారి కాదు.. టెస్ట్ డ్రైవ్ సమయంలో కార్లు ప్రమాదానికి గురవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా, టాటా కంపెనీకి చెందిన కార్లు, హ్యుందాయ్ ఐ20 ప్రమాదాలకు గురయ్యాయి. కేవలం సాధారణ కార్లు మాత్రమే కాకుండా టెస్లా కార్లు కూడా టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదానికి గురైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
కేరళ: వయనాడ్‌లో ఘోర ప్రమాదం
తిరువనంతపురం: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం మనంథావాడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా వయనాడ్‌కు చెందిన వాళ్లని.. టీఎస్టేట్‌లో పని చేసే కూలీలుగా నిర్ధారణ అయ్యింది. 25 మీటర్ల లోయలో అతి వేగంగా జీపు పడడంతో.. అది రెండు ముక్కలైంది. మృతదేహాలను వయనాడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు.. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. #WATCH | Kerala | Nine people died, two injured after their jeep fell into a gorge near Thalapuzha in Wayanad district today. https://t.co/GRMc76Gv6M pic.twitter.com/V14Kuv1aja — ANI (@ANI) August 25, 2023 -
నటి 'వామిక గబ్బి' కారు కొనేసిందోచ్.. ధర ఎన్ని లక్షలంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే పంజాబీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించిన 'వామిక గబ్బి' (Wamiqa Gabbi) ఇటీవల అమెరికన్ బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కాగా ఈ భామ ఇటీవల కొనుగోలు చేసిన కారు జీప్ కంపెనీకి చెందిన మెరిడియన్. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. జీప్ మెరిడియన్ డెలివరీ తీసుకునే సమయంలో వామిక ముంబైలోని కంపెనీ డీలర్‌షిప్‌లో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇదే ఆమె మొదటి కారు కావడం ఇక్కడ విశేషం. వీడియో పోస్ట్ చేస్తూ నా తల్లితండ్రులు సహకారంతో.. అభిమానుల ఆదరాభిమానాలతో ఇది సాధ్యమైందని వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆ ప్రదేశం చూడగానే ఆకర్షిస్తుంది.. ఒక రాత్రి అక్కడ ఉండగలనా అంటే!) జీప్ మెరిడియన్.. ఇక జీప్ మెరిడియన్ విషయానికి వస్తే.. వామికా కొనుగోలు చేసిన కారు వెల్వెట్ రెడ్ షేడ్‌లో చూడచక్కగా ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ కలిగి.. ఫ్లోటింగ్-టైప్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 170 హార్స్ పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 32.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ధరలు మారుతాయి. వామిక ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే..
కొన్న వస్తువులు ఏవేవో కారణాల రీత్యా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎంతగా ప్రయంత్నించినా దొరికే అవకాశం గానీ వాటి ఆచూకీ గానీ కానరాదు. అలాంటి వస్తువు సడెన్‌గా దొరికినా లేదా చాలా ఏళ్లక్రితం మిస్ అయ్యిన వస్తువు అనుకోకుండా మనకు లభించిన లేదా బయటపడ్డ మన ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి విచిత్ర ఘటనే యూఎస్ఏలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యునైటెడ్ స్టేట్స్‌లోని కాన్వాస్‌కు చెందిన 45 ఏళ్ల జాన్ మౌన్స్ ఫాక్స్ అనే వ్యక్తి మంచి చేపలను పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో మే 29(మెమోరియల్ డే)న చెనీ సరస్సు వద్దకు వెళ్లాడు. సరస్సు వద్ద అనువైన చోటును వెదుకుతుండగా..ఓ విచిత్రమైన వస్తువు కంట పడింది. మొదట అర్థం కాలేదు. తన వద్ద ఉన్న సోనార్ పరికరాల సాయంతో నీటి అడుగున ఉన్న వస్తువుని నిశితంగా చూశాడు. ఏవో టైర్లు, రోల్‌బార్, స్టీరింగ్ వీల్ వంటి వాటితో కూడిన ఓ జీప్ లాంటి వస్తువును చూశాడు. ఎలాగైనా సరస్సు నుంచి తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్రేన్ల సాయంతో తీసేందుకు అధికారుల అనుమతి తీసుకుని మరీ ఆ వస్తువుని బయటకు తీశాడు. అతను ఊహించినట్లుగానే అది జీప్. 1990ల నాటి ఓల్డ్ జీప్ అని తేలింది. నిజానికి అతను ఏదో పెద్ద చేప ఏమో అనుకున్నాడు. బయటకు తీయాలనే ఆత్రుతలో అదే ఏంటో చూడగా అసలు విషయం బయపడింది. ప్రస్తుతం ఆ జీప్ని చూసేందుకు అధికారులు, ప్రజలు అతని ఇంటికి ఎగబడుతున్నారు. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
ఇండియన్ సెలబ్రిటీల మనసు దోచిన అమెరికన్ బ్రాండ్ కారు, ఇదే
భారతదేశంలో కేవలం దేశీయ వాహన తయారీ సంస్థల కార్లు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన కార్లు కూడా విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో ఇండియన్ సెలబ్రిటీల వద్ద అమెరికన్ కంపెనీకి చెందిన 'జీప్ కంపాస్' గురించి తెలుసుకుందాం. అక్షయ్ కుమార్ బాలీవుడ్ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు అక్షయ్ కుమార్. ఇతని గ్యారేజిలో బెంట్లీ, రేంజ్ రోవర్స్, రోల్స్ రాయిస్ వంటి అన్యదేశ కార్లతో పాటు అమెరికన్ కంపెనీకి చెందిన జీప్ కంపాస్ కూడా ఉంది. ఈ SUVని అక్షయ్ కుమార్ ఈ మధ్యనే కొనుగోలు చేసినట్లు తెలిసింది. బ్లాక్ కలర్లో ఉన్న ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సారా అలీ ఖాన్ జీప్ కంపాస్ కారుని కలిగి ఉన్న సెలబ్రిటీలలో సారా అలీ ఖాన్ ఒకరు. ఈమె బ్లూ కలర్ కంపాస్ కారులో ఇప్పటికే చాలా సార్లు కనిపించినట్లు సమాచారం. ఇది సారా అలీ ఖాన్ తల్లి పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. అంతే కాకుండా సారా గ్యారేజిలో అతి చౌకైన కార్లలో ఒకటైన ఆల్టో 800 కూడా ఉంది. ఉన్ని ముకుందన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరైన ఉన్ని 'ముకుందన్' కూడా ఆటోమొబైల్ ఔత్సాహికుడు. ఇతడు 2017లో రెడ్ కలర్ జీప్ కంపాస్ కొనుగోలు చేసాడు. ఇప్పటికే ఈ కారులో ప్రయాణిస్తూ చాలా సార్లు కనిపించినట్లు సమాచారం. రియా చక్రవర్తి జీప్ కంపాస్ కలిగి ఉన్న సెలబ్రిటీలలో రియా చక్రవర్తి ఒకరు. చాల రోజులకు ముందు ఈమె ఆ కారుని కొనుగోలు చేసినప్పటికీ ఎక్కువగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు చెబుతారు. అయితే ఈమె జీప్ కంపాస్ SUVలో ఏ వేరియంట్ కొనుగోలు చేసింది అనేది ఖచ్చితంగా తెలియదు. బహుశా అది మిడ్-స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. సుదీప్ కన్నడ సినీ రంగంలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కిచ్చ 'సుదీప్' గత ఏడాది బ్లాక్ కలర్ జీప్ కంపాస్ కొనుగోలు చేశారు. జీప్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలలో సుదీప్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఇతని వద్ద టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఉర్ఫీ జావేద్ విపరీతమైన ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీ 'ఉర్ఫీ జావేద్' కూడా జీప్ కంపాస్ కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఈమె కంపాస్ 7 సీటర్ స్థానంలో మెరిడియన్ SUV ని చేర్చింది. ఉర్ఫీ జావేద్ తరచుగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇక చివరగా బాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా జీప్ కంపాస్ కొనుగోలు చేసింది. తన కోసం కారుని కొనుగోలు చేయడమే కాకుండా తన మేకప్ ఆర్టిస్ట్ కోసం కూడా ఒక కారుని కొనుగోలు చేసింది. ఈమె వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ మేబ్యాక్ S500 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉంది. (ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) జీప్ కంపాస్ జీప్ కంపెనీకి చెందిన కంపాస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. భారతీయ మార్కెట్లో ఈ ఎస్యువి ప్రారంభ ధరలు రూ. 17.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). డిజైన్ ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది దీనిని ఎగబడిమరీ కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అమెరికన్ బ్రాండ్ కార్లపై రూ. 2.35 లక్షలు తగ్గింపు - పూర్తి వివరాలు
అమెరికన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ 'జీప్' (Jeep) భారతీయ మార్కెట్లో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి నాలుగు SUVలను విక్రయిస్తోంది. అయితే కంపెనీ ఈ నెలలో తన కంపాస్, మెరిడియన్ బేస్ వేరియంట్ల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జీప్ మెరిడియన్ బేస్ మోడల్ లిమిటెడ్ MT ధర రూ. 2.35 లక్షలు తగ్గింది. ధరల తగ్గుదల తర్వాత దీని ధర రూ. 27.75 లక్షలు. ఇందులో లిమిటెడ్ AT మోడల్ ధర రూ. 32 లక్షలు. ఈ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అదే సమయంలో లిమిటెడ్ (O) ట్రిమ్ ధర రూ. 35వేలు వరకు పెరిగింది. ఈ మోడల్ కొత్త ధర రూ. 32.95 లక్షలు. ఇక కంపాస్ స్పోర్ట్ ఎటి పెట్రోల్ మోడల్ ధర ఇప్పుడు రూ. 20.99 లక్షలు. ఈ ఎస్యువి ధరలను కంపెనీ రూ. 1.08 లక్షలు తగ్గించింది. ధరల తగ్గుదలకు ముందు దీని ధర రూ. 22.07 లక్షలు. అదే సమయంలో లిమిటెడ్ ఏటి, మోడల్ ఎస్ ఏటి ధరలలో ఎటువంటి మార్పులు లేదు. (ఇదీ చదవండి: కృతి ఖర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!) జీప్ కంపాస్ డీజిల్ ధరల విషయానికి వస్తే.. అన్ని మోడల్స్ ధరలు రూ. 35,000 తగ్గాయి. ఇందులో లిమిటెడ్, మోడల్ ఎస్ సిరీస్, 4X4 మోడల్ మొదలైనవి ఉన్నాయి. కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం వల్ల ఈ మోడల్స్ ధరలు తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు. కంపాస్ రెండూ డీజిల్ ఇంజన్స్ పొందుతుంది, అవి1.4-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ & 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్. అదే సమయంలో మెరిడియన్ ఒకే సింగిల్ డీజిల్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. అయితే పనితీరు పరంగా రెండూ అద్భుతంగా ఉంటాయి. -
Jeep Grand Cherokee: మొన్న విడుదలైంది, అప్పుడే కొత్త ధరలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్ భారతదేశంలో ఆధునిక ఉత్పత్తులను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇటీవల గ్రాండ్ చెరోకీ ఎస్యూవీ ధరలను కంపెనీ లక్ష వరకు పెంచింది. దేశీయ విఫణిలో విడుదలై నాలుగు నెలలు పూర్తి కాకుండానే ఇది మరింత ఖరీదైన కారుగా అవతరించింది. 2022 నవంబర్‌లో విడుదలైన గ్రాండ్ చెరోకీ ప్రారంభ ధర రూ. 77.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరల పెరుగుదల తరువాత ఈ SUV రూ. 78.50 లక్షలకు చేరుకుంది. ధరలు పెరిగినప్పటికీ గ్రాండ్ చెరోకీలో ఎటువంటు అప్డేట్స్ లేకపోవడం గమనార్హం. కావున ఇది అదే డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ పరంగా కూడా ఎటువంటి మార్పులు లేదు, కాబట్టి 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో 268 బిహెచ్పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్, సాండ్, స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆధునిక ఫీచర్స్, కొత్త హంగులతో రానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ.. వివరాలు) జీప్ గ్రాండ్ చెరోకీ సెవెన్ స్లాట్ గ్రిల్‌తో పాటు సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ కలిగి, దానికి కింది భాగంలో సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌లతో చంకీ రియర్ బంపర్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్‌లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులో ఉత్తమమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 'ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ'కి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్, పనోరామిక్ సన్‌రూఫ్, వెంటిలెటెట్ ఫ్రంట్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, వాయిస్ కమాండ్, 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్ అప్ డిస్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. -
వచ్చే ఏడాది జీప్ కొత్త మోడళ్లు
ముంబై: దేశీయ మార్కెట్ కోసం వచ్చే ఏడాది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు జీప్ ఇండియా హెడ్ నిపుణ్ మహాజన్ తెలిపారు. ‘వచ్చే ఏడాది కూడా వృద్ధిని చూస్తున్నాం. ఉత్పత్తిని జోడించినప్పుడు వృద్ధి జరుగుతుంది. కస్టమర్ సంఖ్యను, పరిమాణాన్ని పెంచుతాం. మరింత వ్యాపారాన్ని జోడిస్తామని ఆయన ప్రకటించారు. ఇదీ చదవండి: Zomato డెలివరీ ఫెయిల్: భారీ మూల్యం చెల్లించిన జొమాటో పరిమాణం పరంగా 2023 మెరుగ్గా ఉంటుంది. 2022లో మూడు ఉత్పాదనలను పరిచయం చేశాం.నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి పూర్తిగా ఖరీదైన విభాగంలో పోటీపడుతున్నాయి. మార్కెట్ పనితీరు బాగుంది’ అని అన్నారు. భారత్‌లో కంపెనీ జీప్ కంపాస్, రాంగ్లర్, మెరీడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విక్రయిస్తోంది. గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా నిపుణ్ ఈ విషయాలను వెల్లడించారు. కాగా, ఈ ఎస్యూవీ ధర రూ.77.5 లక్షలు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 110కిపైగా అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించారు. యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎనమిది ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, ఆక్యుపెంట్ డిటెక్షన్ వీటిలో ఉన్నాయి. -
‘ఇదే నా టాలెంట్, ప్లీజ్ సార్ జాబ్ ఇవ్వండి’.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే!
ట్రెండ్ మారింది గురూ! అసలే మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైంది. కోరుకున్న జాబ్ దొరకాలంటే కొన్ని ఫార్మాలిటీస్‌ను పక్కన పెట్టాల్సిందే. కొత్తగా ఆలోచించాల్సిందే. అలా చేస్తేనే జాబ్స్ వస్తున్నాయ్ మరీ. లేదంటే కాళ్లరిగేలా ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా అనే ఓ యువకుడు ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కళ్లలో పడ్డాడు. ఆనంద్ మహీంద్రా సైతం ఆ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా? గౌతమ్ అనే యువకుడు జాబ్ కోసం ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. తాను రూపొందించిన జీప్ ప్రత్యేకంగా కనిపించాలనుకున్నాడు గౌతమ్. ఆందుకే ముందు వెనుక చక్రాలను వేర్వేరుగా కంట్రోల్ చేసేలా ఆ జీప్‌ను తయారు చేశాడు. ఆ వాహనం ఎలా పని చేస్తుందో చూపించడంతో పాటు ఓ రైడ్ కూడా చేశాడు. ఇదంతా వీడియో తీసి ట్విటర్లో ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ.. ‘ఇందుకే ఈవీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని నమ్ముతున్నా. వినూత్న ప్రయోగాల వల్లే ఆటోమొబైల్‌లో అమెరికా ఆధిపత్యాన్ని చాటింది. గౌతమ్‌తో పాటు అలాంటి వ్యక్తులు మరింత ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు బదులిచ్చారు. అలాగే ఈ వీడియోని వేలు మహీంద్రాకు ట్యాగ్ చేసి గౌతమ్‌ని కలవాలని సూచించారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. మీరు గ్రేట్ సార్, టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. This is why I’m convinced India will be a leader in EVs. I believe America gained dominance in autos because of people’s passion for cars & technology & their innovation through garage ‘tinkering.’ May Gowtham & his ‘tribe’ flourish. @Velu_Mahindra please do reach out to him. https://t.co/xkFg3SX509 — anand mahindra (@anandmahindra) August 20, 2022 చదవండి: ప్రమాదంలో గూగుల్ క్రోమ్ యూజర్లు..కేంద్రం హెచ్చరిక, వెంటనే ఇలా చేస్తే మేలు! -
అదిరిపోయే లుక్‌తో విడుదలైన ఎస్యూవీ, ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: స్టెలాంటిస్ గ్రూప్‌లో భాగమైన జీప్ ఇండియా తాజాగా తమ కొత్త ఎస్యూవీ మెరీడియన్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 29.9 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం తొలిసారిగా మూడు వరుసల సీటింగ్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆల్–వీల్ డ్రైవ్ వెర్షన్‌తో పాటు ఇది అయిదు వేరియంట్లలో లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ ధరలు రూ. 29.9 లక్షల నుంచి రూ. 36.95 లక్షల వరకూ ఉంటాయని జీప్ బ్రాండ్ ఇండియా హెడ్ నిపుణ్ జె మహాజన్ తెలిపారు. జీప్ మెరిడియన్‌కి ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 50,000 డౌన్‌పేమెంట్ కట్టి మెరీడియన్‌ను తమ వెబ్సైట్లో బుక్ చేసు కోవచ్చని, జూన్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. బుకింగ్స్ ప్రారంభించడానికి ముందే 67,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చినట్లు, 5,000 మందికి పైగా కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు మహాజన్ చెప్పారు. -
భారత్‌లోకి జీప్ మెరీడియన్.. తొలి ఎస్యూవీ ఇదే!
ఆటోమోటివ్ గ్రూప్ స్టెలాంటిస్‌కు చెందిన జీప్ ఇండియా సరికొత్త ఎస్యూవీ మెరీడియన్‌ను ఆవిష్కరించింది. జూన్ నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ మంగళవారం ప్రకటించింది. మూడు వరుసల సీట్లతో కంపెనీ నుంచి తొలి ఎస్యూవీ ఇదే. భారత మార్కెట్ కోసం దీనిని రూపొందించారు. 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, 9 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. దేశీయ మార్కెట్ కోసం రాంగ్లర్, కాంపాస్‌తోసహా అయిదు మోడళ్ల అభివృద్ధికై రూ.1,900 కోట్లు ఖర్చు చేశామని స్టెలాంటిస్ ఇండియా సీఈవో, ఎండీ రోలాండ్ బుషే తెలిపారు. గ్రాండ్ చెరోకీ, కాంపాస్ ట్రయల్‌హాక్ సైతం ఈ ఏడాదే భారత రోడ్లపైకి దూసుకెళ్లనున్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ మరియు పవర్డ్ లిఫ్ట్‌గేట్ వంటివి ఉన్నాయి. కొత్త జీప్ మెరిడియన్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అబ్స్టాకిల్ డిటెక్షన్ & యాంటీ పించ్ సెన్సింగ్ సేఫ్టీ సిస్టమ్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: ఎన్సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ డిఫాల్ట్!) -
కేవలం రూ. 12 వేలకే జీప్ కారు..! ఇంకా దానిపై రూ. 200 డిస్కౌంట్..!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఒక జీప్‌కు సంబంధించిన ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారంది. కేవలం రూ. 12 వేలకే..! ఆనంద్ మహీంద్రా 1960 నాటి ఒక ప్రకటనను ట్విటర్లో షేర్ చేశారు. ఈ ప్రకటనలో వీల్లీస్ జీప్ కారు ధర రూ.12,421కు రానుంది. దీనిపై రూ. 200 రూపాయల డిస్కౌంట్‌ను కూడా అందిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఒక మంచి స్నేహితుడు ఈ అడ్వర్టైజ్మెంట్ను తన ఆర్కేవ్స్ నుంచి తీసిచ్చారని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అతని కుటుంబం చాలా కాలంగా తమ వాహనాలను పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. పాత రోజులే బాగున్నాయని ఆనంద్ మహీంద్రా గుర్తు చేసుకున్నారు. A good friend, whose family has been distributing our vehicles for decades fished this out from their archives. Aaah the good old days…when prices headed in the right direction! pic.twitter.com/V69sMaM98X — anand mahindra (@anandmahindra) March 6, 2022 ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు..! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ పోస్ట్‌పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా ఫోలోవర్లలో ఒకరు తన కోసం దయ చేసి ఆ పాత కాలం నాటి ధరతోనే రెండు జీప్ కార్లు బుక్ చేయాలంటూ రిప్లే ఇచ్చారు. అలాగే మరో నెటిజన్.. రూ.12,421కు ఇప్పుడు ఫ్లోర్ మ్యాట్స్, పర్ఫ్యూమ్ బాటిల్, డస్ట్ కవర్, కారు ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వంటి వాటికి సరిపోతుందని ఫన్నీ రిప్లే ఇచ్చారు. 2022లో కేవలం ఒక పది బొమ్మకార్లు వస్తాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కారు వీల్లీస్ సీజే జీప్. ప్రస్తుతం ఈ జీప్ ధర రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంది. Well you could buy 10 cars for that much; except they’re Thar die-cast toy collectibles…! https://t.co/HtvBzMpI6U pic.twitter.com/JsZEyvt6sb — anand mahindra (@anandmahindra) March 6, 2022 చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
యూజర్ల మతిపోగొడుతున్న జీప్ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు..!
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ జీప్ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు చిత్రాలను బయటకు విడుదల చేసింది. జీప్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారులు ఉన్నప్పటికీ సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు మాత్రం ఇదే. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2023లో విడుదల కానుంది. జీప్ మాతృ సంస్థ స్టెల్లంటిస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే రెండు సంవత్సరాలలో 21 వాహనాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలపై సుమారు $ 35.5 బిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2025 నాటికి మొత్తం ప్రపంచ అమ్మకాలలో 70% ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఈ వాహనం గురించి మాట్లాడుకుంటే ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం, రిమోట్ వాహన ట్రాకింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ వంటి అనేక ఫీచర్లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ జీప్'లో కొన్ని చంకీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, నాజూకైన ఎల్ఈడీ డీఆర్ఎల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, ఫ్లాష్ ఫైవ్ స్పోక్ డ్డ్యూయల్ టోన్ అలాయ్, సీ-పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎక్స్ ఆకారంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు ఉన్నాయి. జీప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మాస్క్యులర్ లుక్‌తో రెనెగేడ్ తరహా డిజైన్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. రియర్ సైడ్ త్రీడీ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. 2022లో జీప్ భారత్‌లో కంపాస్ ట్రయల్‌హాక్‌ను లాంఛ్ చేస్తుండగా న్యూ జనరేషన్ గ్రాండ్ చెరోకీ, త్రీ రో మెరిడియన్ ఎస్‌యూవీలతో ఎంట్రీ ఇవ్వనుంది. (చదవండి: వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ఇలా చేస్తే సైక్లింగ్ బూమ్ రావచ్చు: ఆనంద్ మహీంద్రా) -
జీప్ మెరిడియన్.. ఇది మేడ్ ఇన్ ఇండియా
ఎస్యూవీ సెగ్మెంట్లో మంచి పట్టున్న జీప్ సంస్థ 7 సీటర్ వెహికల్‌ను మార్కెట్లోకి తెస్తామంటూ ఎప్పటి నుంచో చెబుతోంది. టెస్ట్ రైడ్ సందర్భంగా పలుమార్లు జీప్ 7 సీటర్ ఎస్యూవీ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఎస్‌యూవీకి ఏ పేరు పెడతారనే ఆసక్తి మొబైల్ ఇండస్ట్రీలో నెలకొని ఉండేది. దాదాపు 70 పేర్లను పరిశీలించిన జీప్ ఇండియా చివరకు మెరిడియన్ పేరును ఫిక్స్ చేసింది. ఈ మెరిడియన్ పూర్తిగా మేడిన్ ఇండియా అని ఇది ఇండియన్ల కోసమే తయారు చేశామని చెబుతున్నారు. జీప్ మెరిడియన్ 7 సీటర్ ఎస్‌యూవీకి సంబంధించి కేవలం పేరు ఒక్కటే వెల్లడైంది. ఇంజన్ సామర్థ్యం, ఇన్ఫోంటైన్మెంట్, ఇతర ఫీచర్లకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ జీప్ మెరిడియన్‌లో కచ్చితంగా ఉండబోయే ఫీచర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల అంచనాలు ఇలా ఉన్నాయి - పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో వస్తుంది. 2.0 ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం - 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బాక్స్ - 10.25 ఇంచ్ ఇన్ఫోంటైన్మెంట్ స్క్రీన్ - పనోరమిక్ సన్‌రూఫ్ - 4 జోన్ వెదర్ కంట్రోల్ - ఫ్రంట్ వెంటిలేడెట్ సీట్స్ - టయోటా ఫార్చునర, ఎంజీ గ్లూస్టర్ , స్కోడా కోడియాక్ రేంజ్లో రూ. 35 లక్షల దగ్గర జీప్ 7 సీటర్ ఎస్యూవీ ధర ఉండవచ్చని అంచనా -
Visakhapatnam: లోయలో పడ్డ జీపు.. ఇద్దరు మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రూరల్ ఏజెన్సీలోని పెద్ద వలస బోడు వలస వద్ద జీపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో కొయ్యూరు మండలం వద్ద జీపు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులతో కలిసి అధికారులు సహయక చర్యలను చేపట్టారు. జీపులో పదిమంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను, బాధితుల వివరాలపై దర్యాప్తు చేపట్టారు. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి -
కొత్త మోడల్ కార్లలో టాటా సరికొత్త ఆవిష్కరణ
► కొత్త మోడల్ కార్ల తో టాటా దూసుకుపోతోంది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కోసం మైక్రో ఎస్‌యూవీని రంగంలోకి దించింది. ఎస్‌యూవీల్లో టాప్ బ్రాండ్‌గా ఉన్న జీప్.. 7 సీటర్‌ను ఇండియన్ రోడ్లపైకి తెచ్చింది. ► ఇక చాన్నాళ్ల పాటు మొబైల్ రంగాన్ని ఏలిన నోకియా.. స్మార్ట్ ఫోన్లలో కొత్త వ్యూహంతో అడుగుపెట్టబోతుంది. ఫుల్ హెచ్డీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన నోకియా బోలెడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ► పోలీస్ రోబో పేరుతో వచ్చిన గస్తీ రోబో.. త్వరలో భారతీయ కాలనీల్లో చూడవచ్చు. యాంటినాలు, ఎటువైపైనా కదిలే సౌకర్యం తో స్ట్రీట్ సర్వే చేపడతాయి ఈ రోబో లు. -
జీప్ రాంగ్లర్ ఎస్యూవి వెహికల్ కొనేవారికి షాక్!
మీరు కొత్తగా జీప్ రాంగ్లర్ ఎస్యూవి కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చేదువార్త. జీప్ ఇండియా గత వారం కంపాస్ ధరలను భారీగా పెంచగా, ఈ సారి రాంగ్లర్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది మార్చిలో జీప్ ఇండియా భారతదేశంలో రాంగ్లర్ ఎస్‌యూవిని అసెంబుల్ చేయడం ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం కంపాస్, రాంగ్లర్ వాహనాలను పూణేలోని రంజన్ గావ్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఉంది. అన్ లిమిటెడ్, రూబికాన్ అనే రెండు వేరియెంట్లలో రాంగ్లర్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ రెండు వేరియెంట్ల ధరలు రూ.1,25,000 పెరిగాయి. అన్ లిమిటెడ్ ధర ఇప్పుడు రూ.55.15 లక్షలు కాగా, రూబికాన్ రూ.59.15 లక్షలుగా దేశంలో ఇంతకు ముందు అమ్మకానికి వచ్చిన సీబియు వెర్షన్ కంటే రాంగ్లర్ సుమారు రూ.10 లక్షలు చౌక. మనదేశంలో అసెంబుల్ చేసిన ఈ జీప్ రాంగ్లర్ ఎస్యూవి 5-డోర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దీనికి పాత మోడల్ లాగానే 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 268 హెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది. (చదవండి: ఎలాన్ మస్క్, జెఫ్‌బెజోస్: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు') ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్లు, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, లెదర్ అప్హోల్స్టరీ, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 7.0-ఇంచ్ కలర్ ఎంఐడి స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ / స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాంగ్లర్ ఎస్యూవీ కావడంతో రిమువబుల్ డోర్స్, హార్డ్ టాప్ పైకప్పు ఉంటుంది. జీప్ రాంగ్లర్ లో ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా స్టాండర్డ్ సేఫ్టీ పరంగా అందిస్తుంది. -
ఘోరం: జీపును ఢీకొన్న సిమెంట్ లారీ.. 8 మంది మృత్యువాత
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో? చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం -
గూర్ఖా వచ్చేస్తోంది.. మహీంద్రా థార్‌కు గట్టిపోటీ!
ఆఫ్‌రోడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో రారాజుగా ఉన్న మహీంద్రా థార్‌కు గట్టిపోటీ ఎదురవబోతుంది. ఈ సెగ్మెంట్లో థార్‌కి పోటీగా గూర్ఖా తెస్తోంది ఫోర్స్ మోటార్స్ కంపెనీ. రాబోయే పండగ సీజన్లో ఈ ఎస్‌యూవీని మార్కెట్లో రిలీజ్ చేసేందుకు వీలుగా సన్నహకాలు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియాలో టీజర్ వదిలింది. సెప్టెంబరులోనే ? ఆఫ్‌రోడ్ రైడ్‌ని ఇష్టపడే వారి అభిరుచులకు తగ్గట్టుగా గూర్ఖా ఎస్‌యూవీని ఫోర్స్ సంస్థ డిజైన్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో గూర్ఖా వాహనాన్ని ప్రదర్శించింది ఫోర్స్ సంస్థ. ఇదే ఏడాది మూడో త్రైమాసికంలో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తెస్తామని ప్రకటించింది. దీంతో సెప్టెంబరు చివరి నాటికి ఫోర్స్ మార్కెట్లోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. గూర్ఖా ప్రత్యేకతలు - ఫోర్ వీల్ డ్రైవింగ్‌తో వచ్చే ఈ థార్ జీప్‌లో త్రీ డోర్స్, ఫోర్ డోర్ డిజైన్లు అందుబాటులో ఉంటాయి - ఎల్ఈడీ డీఆర్ఎల్ హెడ్లైట్లను ఉపయోగించారు - ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీకి తగ్గట్టుగా గ్రిల్స్, క్రోమ్, బంపర్లను డిజైన్ చేశారు. - రెండో వరుసలో కూడా కెప్టెన్ సీట్లను అమర్చే అవకాశం ఉంది - ఆఫ్‌రోడ్ స్పెషాలిటీ అయిన టైయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ డిజైన్‌ను కొనసాగిస్తున్నారు - గూర్ఖా పూర్తిగా రగ్గడ్ లుక్‌తో వస్తోంది. చదవండి :ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ఆపిల్ కార్లు -
వరద లో చిక్కుకొన్న జీప్
-
Jeep: జీప్ నుంచి మరో ఎస్యూవీ..త్వరలోనే రిలీజ్..!
ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు జీప్ మరో ఎస్యూవీను మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లోకి 3 రోస్ ఎస్యూవీను ఈ సంవత్సరం చివర్లో లేదా 2022 ప్రారంభంలో జీప్ విడుదల చేయనుంది. ఈ ఎస్యూవీను ‘మెరిడియన్’ పేరుతో భవిష్యత్తులో జీప్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మోడల్ ప్రస్తుతం స్పాట్ టెస్టింగ్ పరీక్షలను ఎదుర్కొంటుంది. #Jeep has registered a new trademark for the name ‘Meridian’ in India, hinting at the possibility of a new name for the brand’s upcoming 3-row SUV. The model recently spotted testing is expected to be launched later this year or in early 2022.https://t.co/b8ysFe7wMt#CWNews pic.twitter.com/jUjv8ShykY — CarWale (@CarWale) July 8, 2021 -
బిహార్: పాట్నాలో నదిలోకి దూసుకెళ్లిన జీపు
-
ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్..
చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వాహనాన్ని అందుకున్న టీమిండియా సెన్సేషనల్ బౌలర్ టి నటరాజన్.. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని నటరాజన్ గురువారం ట్విటర్ వేదికగా తెలియజేశాడు. తనకు అందిన ఎస్యూవీ వాహనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన మీకు కృతజ్ఞతలు సర్(ఆనంద్ మహీంద్ర), భారత్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నాకు దక్కిన వరం, గొప్ప వ్యక్తుల నుంచి ప్రోత్సాహం లభించడం నాకు దక్కిన గౌరవం, నాకు బహుమతిగా ఇచ్చిన వాహనాన్ని ఈ రోజే నడిపాను, నా అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ జెర్సీని మీకోసం పంపిస్తున్నాను" అంటూ క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, నటరాజన్‌తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీలు అందుకున్నారు. Playing cricket for India is the biggest privilege of my life. My #Rise has been on an unusual path. Along the way, the love and affection, I have received has overwhelmed me. The support and encouragement from wonderful people, helps me find ways to #ExploreTheImpossible ..1/2 pic.twitter.com/FvuPKljjtu — Natarajan (@Natarajan_91) April 1, 2021 ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం నటరాజన్ సిద్దమవుతున్నాడు. గురువారమే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరాడు. నిబంధనల మేరకు ఏడు రోజుల క్వారంటైన్లో ఉండనున్నాడు. గత సీజన్లో యార్కర్లతో అదరగొట్టిన నట్టూ ఈసారి అంతకుమించి రాణించాలని సన్‌రైజర్స్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చెన్నై వేదిక ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: నా డార్లింగ్‌తో చివరి పెగ్: వార్నర్ -
భారత్‌లోకి కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ
న్యూఢిల్లీ: అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ తన కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని 2017 తర్వాత తిరిగి భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ 2020 గ్వాంగ్జౌ ఆటో షోలో ఆవిష్కరించబడిన ఎస్యూవీ మాదిరిగానే ఉంటుంది. జనవరి 2021 చివరి నాటికి ఈ కారు యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎస్‌యూవీల కంటే తక్కువ ధరకే లభిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. ఇందులో గత మోడల్ కంటే అప్డేటెడ్ ఫీచర్స్, అప్డేటెడ్ ఇంటీరియర్స్, రిఫ్రెష్ స్టైలింగ్ ను కలిగి ఉంది. కంపెనీ ఈ ఎస్యూవీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.(చదవండి: ఫార్చూనర్ కొత్త వెర్షన్...) కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఫుల్-ఎల్ఈడి హెడ్లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఇడి టైల్లైట్స్, 7 స్లాట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్‌తో కొత్త ఫ్రంట్ బంపర్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్ ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బంపర్స్ రెండూ కూడా సవరించబడ్డాయి. కొత్త డాష్‌బోర్డ్‌లో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఎఫ్‌సిఎ యొక్క కొత్త యుకనెక్ట్ 5 టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఎస్యూవీ యొక్క వెనుక భాగంలో పెద్దగా ఎటువంటి మార్పులు జరగలేదు. కొత్త జీప్ కంపాస్‌లో ఏడు-ఎయిర్‌బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్పి), బ్రేక్ అసిస్ట్ (బిఎ), టెర్రైన్ మోడ్లు, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ యొక్క డాష్‌బోర్డ్‌లో డబుల్-స్టిచ్చింగ్ బ్రౌన్ లెదర్ ఇన్సర్ట్లను మరియు బ్రష్ చేసిన అల్యూమినియం లాంటి ట్రిమ్‌ను కూడా పొందుతుంది. (చదవండి: కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) -
బావిలో పడిన జీపు నలుగురి జలసమాధి
సంగెం: ఓ జీపు అదుపు తప్పి బావిలో పడటంతో డ్రైవర్ సహా నలుగురు జల సమాధి అయ్యారు. మరో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద చోటుచేసుకుంది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన సతీష్.. నిత్యం వరంగల్ నుంచి నెక్కొండ వరకు జీపు నడుపుతుంటాడు. రోజు మాదిరిగా మంగళవారం సాయంత్రం వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద 15 మంది ప్రయాణికులను ఎక్కించుకొని నెక్కొండకు బయలుదేరాడు, మార్గమధ్యలో గవిచర్లలోని మోడల్ స్కూల్ దాటిన తర్వాత డ్రైవర్‌కు ఫిట్స్ రావడం.. ఆ సమయంలో జీపు వేగంగా ఉండటంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. దీంతో డ్రైవర్ సతీష్ సహా నలుగురు వ్యక్తులు జల సమాధి అయ్యారు. జీపు వెనుక కూర్చున్న బండి కట్టయ్య (నెక్కొండ), బానోత్ రామచంద్రు, ఆయన భార్య విజయ (మడిపెల్లి, కస్నా తండా), గుగులోతు బుజ్జి, గుగులోతు వాగ్యా, ఆయన భార్య మంజుల, భూక్యా పీతాలి (భూక్యా తండా, మదనపురం), భూక్యా శ్రీనివాస్ (జుద్యా తండా), భూక్యా నవీన్ (రెడ్లవాడ), మాలోత్ సుజాత (మూడెత్తుల తండా)లతో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక చర్యల్లో భాగంగా రాత్రి 9 గంటలకు డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. భారీ మోటార్లను తెప్పించి నీటిని తోడేందుకు యత్నిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేవుడే రక్షించాడు.. గవిచర్ల మోడల్ స్కూల్ దాటగానే డ్రైవర్ సతీష్‌కు ఫిట్స్ రావడంతో జీపును కంట్రోల్ చేయలేకపోయాడని, అదే సమయంలో గతుకుల రోడ్లపై అతి వేగంగా వెళ్తుండటంతో ప్రయాణికులు ఎగిరి టాప్కు తగిలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంచెం వేగం తగ్గించాలని చెబుతుండగానే జీపు అదుపు తప్పి బావిలో పడిపోయిందని ప్రాణాలతో బయటపడిన రామచంద్రు తెలిపారు. తాను ఈదుకుంటూ ఒడ్డుకు చేరి తన భార్యను రక్షించానని తెలిపాడు. తర్వాత మరో ఇద్దరు మహిళలను ఒడ్డుకు చేర్చానని పేర్కొన్నాడు. వాగ్యా, శ్రీనివాస్‌లు బయటకు వచ్చి మరో ఇద్దరి బయటకు లాగారని వివరించారు. తమను ఆ దేవుడే రక్షించాడని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సంగెం ఎస్సై సురేశ్ ఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాం సుందర్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ కిషన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది డీజే లైట్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నీరు ఉండటంతో బయటపడ్డాం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బావిలో నీరు నిండుగా ఉంది. ఇదే తమ ప్రాణాలు కాపాడిందని బాధితులు తెలిపారు. జీపు వెనుక భాగంలో ఉన్న 10 మందితో పాటు ముందు కూర్చున్న ఒకరు నీటిలో తేలగానే.. చెట్టు కొమ్మలను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నామని చెప్పారు. -
ఎల్ఏ ఆటో షో-2018 : లగ్జరీ కార్లు జిగేల్..జిగేల్
లాస్ఏంజెల్స్ : ప్రపంచంలోని అతిపెద్ద ఆటో షో ప్రారంభం కానుంది. లాంజ్ ఏంజెల్స్ ఎల్ఏ కన్వెన్షన్ సెంటర్లో నవంబరు 30-డిసెంబరు 9 మధ్య దిగ్గజ ఆటో కంపెనీలన్నీ తన వాహానాలను ప్రద్శనకు ఉంచనున్నాయి. దాదాపు వెయ్యి దాకా కార్లు ఈ ఆటోషోలో విడుదల కానున్నాయి. . ఈ సందర్భంగా మీడియా ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు. బీఎండబ్ల్యూ, వోల్వో, మెర్సిడెస్ బెంజ్, పోర్షే, వోక్స్వ్యాగన్ ఆడి, ల్యాండ్‌రోవర్ జాగ్వార్, ఫోర్డ్, టయోటా, హ్యుందాయ్‌లాంటి దిగ్గజ కంపెనీల లగ్జరీ, పాసింజర్ ఎస్యేవీలు ఆవిష్కతం కానున్నాయి. ముఖ్యంగా జీప్ తన మొదటి ట్రక్ గ్లాడియేటర్‌ను ఈ ఆటో షోలో పరిచయం చేసింది. హ్యందాయ్‌కు చెందిన 8 పాసింజర్ ఎస్యూవీ పాలిసేడ్ పేరుతో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ రెండు వాహనాలను 2019 మార్చినాటికి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని కంపెనీలు ప్రకటించాయి. View this post on Instagram Behind-the-scenes of the arrival of the 918 Spyder featured in the Amazon / Grand Tour gaming lounge at the 2018 #LAAutoShow. It’s that time, So Cal. A post shared by Los Angeles Auto Show (@laautoshow) on Nov 28, 2018 at 10:22pm PST -
ఎం అండ్ ఎండ్‌కు పేటెంట్ షాక్
అమెరికాలో దేశీయ ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్రకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ చేపట్ట నున్నామని అమెరికా రెగ్యులేటరీ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ మంగళవారం ప్రకటించింది. జీప్ డిజైన్ విషయంలో అమెరికా వాహన దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ చేయనున్నట్టు తెలిపింది. జీప్ రూపకల్పనలో మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిన వివాదంలో మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ఆఫ్-రోడ్ యుటిలిటీ వాహనం రోక్సార్కి సంబంధించి పేటెంట్-సంబంధిత దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ITC) ఒక ప్రకటనలో తెలిపింది. 45 రోజుల వ్యవధిలో దాని దర్యాప్తును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదట్లో ఈ వార్తలను కొట్టి పారేసిన ఎంఅండ్‌ఎండ్ ఈ అంశాన్ని ధృవీకరించింది. ఫియట్ క్రిస్లెర్ ఫిర్యాదుపై ఐటిసి దర్యాప్తు చేపట్టనుందని మహీంద్ర ఆటోమోటివ్ ఉత్తర అమెరికా మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు రిచ్ అన్సెల్ వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు ఫియట్ క్రిస్లర్ అందుబాటులో లేదు. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఎం అండ్ ఎం షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా అమెరికాలో మహీంద్రా రోక్సార్ విక్రయాలను నిలిపివేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌ను ఫియట్ క్రిస్లర్ ఇటీవల ఆశ్రయించింది. తమ అనుబంధ సంస్థ జీప్ డిజైన్లను మహీంద్రా వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
మొరెనా: మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 15మంది మృత్యువాతపడ్డారు. గ్వాలియర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 20 మంది జీపులో ఘుర్గాన్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే సంతాప కార్యక్రమానికి వెళ్తున్నారు. వీరి వాహనాన్ని మొరెనా జిల్లా గంజ్రాంపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 12 మంది అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు మొరెనా ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూశారు. మిగతా ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. -
జీపు ఢీకొని వలస కూలీ మృతి
కృష్ణాయపాలెం (మంగళగిరి టౌన్): రాజధాని పుణ్యమా అంటూ వెనుకబడిన జిల్లాల నుంచి తక్కువ కూలికి వేలాది మంది కార్మికులు రాజధాని ప్రాంతానికి వస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందినా పట్టించుకునే వారే లేకపోవడంతో కుటుంబలకు తీరని వ్యథే మిగులుతోంది. తాజాగా రాజధాని పరిధిలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. కృష్ణాయపాలెంలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు బి.ఎస్.ఇ.పి.ఎల్. అనే కంపెనీ కాంట్రాక్టు చేజిక్కించుకుంది. పనులు చేసేందుకు తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా నుంచి వందలాది మంది కూలీలు గ్రామానికి వచ్చారు. ఆదివారం ఎత్తిరాల తిమ్మమ్మ (26) రోడ్డుపై రాళ్లు ఏరుతుండగా సంస్థకు చెందిన ఓ జీపు రివర్స్‌లో వస్తూ యువతిని ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. సంస్థ ప్రతినిధులు సోమవారం కూడా జీపు డ్రైవర్‌ను, జీపును పోలీసులకు అప్పగించకపోవడం గమనార్హం. చర్యలు శూన్యం.. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ యజమానులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు సన్నాహాలు చేశారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో చేసేదేం లేక పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాన్ని మంగళగిరి ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి మార్చురీలో భద్రపరిచారు. వైద్యులు సోమవారం సాయంత్రానికి కూడా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఎక్కడ ప్రమాదం జరిగినా పోలీసులు వెంటనే మృతదేహాన్ని స్వాధీనపరచుకుని పోస్టుమార్టం నిర్వహించి, సంబంధిత వాహనంపై కేసు నమోదు చేస్తారు. కానీ రాజధానిలో ఏం జరిగినా బయటకు రాకపోవడం, రెండు మూడు రోజుల తర్వాత బయటకు వస్తుండటం గమనార్హం. -
గుడ్డిగా యాప్స్ వాడితే అంతే సంగతి..!
వాషింగ్టన్: ప్రస్తుతం ఎక్కువగా టెక్నాలజీ మీదే ఆధారపడి పనులు లాగించేస్తున్నారు. అయితే కొన్నిసార్లు అది మన ప్రాణాల మీదకి తెస్తుందనడానికి అమెరికాలో ఇటీవల ఓ ప్రమాదం ఘటన నిదర్శనమని చెప్పవచ్చు. అసలేమైందంటే.. ఓ వ్యక్తి వద్ద ఇద్దరు మిత్రులు కారు అద్దెకు తీసుకున్నారు. ఈశాన్యరాష్ట్రం వెర్మాంట్ లోని బర్లింగ్టన్ నగరంలో ఎస్యూవీ కారును ఈ వ్యక్తుల డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ డ్రైవర్ ట్రాఫిక్ తగ్గుతుందని భావించి తరచుగా జీపీఎస్ మ్యాప్ ఫాలో అయ్యేవాడు. అందులో భాగంగానే తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న వేజ్ యాప్ (Waze app)ను వాడాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశానికి రాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, రద్దీ తక్కువగా ఉండే రూట్ కోసం వేజ్ యాప్‌లో జీపీఎస్ మ్యాప్‌ను ఫాలో అవుతూ కాస్త ముందుకు నడపగానే మంచుతో గడ్డకట్టి ఉన్న చిన్న సరసులోకి కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. భయబ్రాంతులకు లోనవడం కారులోని వారి వంతయింది. మంచుగడ్డలు చూపిన నరకం కన్నా యాప్ చూపిన నరకమే ఆ ముగ్గురు బాధితుల్ని తెగ ఇబ్బంది పెట్టిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ప్రమాదం విషయం తెలియగానే యజమాని టారా గుర్టిన్ షాకయ్యారు. కారులోని వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఎస్యూవీ జీపును నీటి మడుగు నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. గూగుల్ అధికార ప్రతినిధి జూలీ మోస్లర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వేజ్ యాప్‌లో ఇప్పటికే కొన్ని లక్షలసార్లు మార్పులు చేశాం. నిత్యం రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజూ అప్డేట్ చేస్తుంటాం. డ్రైవర్లు యాప్‌తో పాటు రోడ్డుపై ఓ కన్నేసి ఉంచి వాహనాలు నడిపితే కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. -
పండుగపూట విషాదం
కోటపల్లి(చెన్నూర్): కనుమ పండుగ పూట ఆ గ్రామంలో విషాదం నిండింది. సంక్రాంతి వేడుకలు బంధువుల ఇంటికి వెళ్లొస్తుండగా ఒకరిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రావుల ఆనంద్(42) సోమవారం ఉదయం మహారాష్ట్రలోని సిరొంచ నడికుడే గ్రామం నుంచి రొయ్యలపల్లికి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న జీపు ఒక్కసారిగా ఆనంద్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆనంద్ మంచిర్యాలలోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఆనంద్, రాజ్‌కుమార్, నవీన్ సోమవారం ఉదయం సిరోంచలోని తన చిన్నమ్మ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గ మధ్యలో తూమ్నూర్ వద్ద జీప్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట జరిగిన ప్రమాదంతో రొయ్యలపల్లిలో విషాదంలో నెలకొంది. ఆనంద్ మృతదేహన్ని సిరొంచ ప్రభుత్వాస్పత్రిలో పోస్టమార్టమ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
ఈవీఎంను జీప్‌లో మర్చిపోయారు!
రాజ్‌పిప్లా: గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ సిబ్బంది తమ అలసత్వాన్ని బయటపెట్టుకున్నారు. నర్మాదా జిల్లాలో దడియపద నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను రాజ్‌పిప్లాలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాల్సిన అధికారులు.. ఓ ఈవీఎం యూనిట్‌ను ప్రైవేటు జీప్‌లో మర్చిపోయి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని జీప్ డ్రైవర్ గమనించి స్థానిక నేతలకు, అధికారులకు సమాచారమిచ్చారు. వ్యవహారం బయటకు పొక్కడంతో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్ఎస్ నినమా నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆ ఈవీఎం యూనిట్‌ను పోలింగ్‌కు వినియోగించలేదన్నారు. పోలింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి ఆరు ఈవీఎం యూనిట్లను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలోని ఓ యూనిట్‌ను అధికారులు జీప్‌లో మర్చిపోయారన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈసీకి ఇప్పటికే నివేదిక సమర్పించామన్నారు. విధుల్లో అలసత్వం వహించినందున సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామన్నారు. -
జీప్ మోస్ట్ అఫార్డబుల్ ఎస్యూవీ, ధరెంతంటే...
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ఫేమస్ ఆటోమొబైల్ బ్రాండు జీప్, ఎట్టకేలకు తన మేడిన్ ఇండియా మోస్ట్ అఫార్డబుల్ ఎస్‌యూవీని భారత్ లో ప్రవేశపెట్టింది. జీప్ కంపాస్ ను బుధవారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతేడాది అంతర్జాతీయంగా లాంచ్ అయిన ఈ జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, హోండా సీఆర్-వీలకు గట్టి పోటీనిచ్చేందుకు మార్కెట్లోకి వచ్చింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో ఉన్న ఫియట్ ఆటోమొబైల్స్ కేంద్రంలో దీన్ని రూపొందించారు. రైట్-హ్యాండ్-డ్రైవ్ జీప్ కంపాస్ తయారీకి కేవలం ఈ ఒక్క తయారీ కేంద్రమే భారత్ లో ఉంది. ఈ కంపాస్ ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది 56 లక్షల ధర కలిగిన వ్రాంగ్లర్, 93 లక్షల ధర కలిగిన గ్రాండ్ చెరోకి ధర కంటే చాలా తక్కువగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో నిలదొక్కుకోవడానికి అఫార్డబుల్ ధరలోనే జీప్ కంపాస్ ను తీసుకొస్తున్నామని కంపెనీ కూడా చెబుతోంది. ధర విషయాన్ని పక్కనబెడితే, ఈ ఎస్యూవీ 1.4 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఆప్షన్లను కలిగి ఉంది. సిక్స్ స్పీడు మాన్యువల్ లేదా సెవన్ స్పీడ్ ఆటో బాక్స్ ను ఇది ఆఫర్ చేస్తోంది. ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ను ఇది కలిగి ఉంది. స్నో, శాండ్, రాక్ ఆప్షన్ డ్రైవింగ్ మోడ్స్ తో పవర్ డెలివరీ, డ్రైవ్ డైనమిక్స్ ను మార్చుకోవచ్చు. ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హెడ్ లైట్స్, బ్లాక్ రూఫ్ ఆప్షన్, సేఫ్టీ కోసం 50 ప్లస్ సెక్యురిటీ ఫీచర్లను దీనిలో పొందుపరచింది. ఆరు ఎయిర్ బ్యాగులతో ఇది రూపొందించింది. ఈ కంపాస్ లోని ఇతర సేఫ్టీ ఫీచర్లు.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటివి కలిగి ఉన్నాయి. నలుపు లేత గోధుమరంగులో ఇంటీరియర్స్ కలిగి ఉండబోతుంట. ఆపిల్ కారు ప్లే, గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్టు చేసేలా ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు. -
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
డెహ్రాడూన్: జీపు లోయలో పడ్డ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి అల్మోరా ప్రాంతంలోని లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతిచెందారని చెప్పారు. గాయపడ్డవారిని రక్షించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే వీరు ఒకే కుటుంబానికి చెందినవారా.. ఎవరు అన్నది తెలియరాలేదు. బాధితుల పూర్తి వివరాలూ తెలియాల్సి ఉంది. -
పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
సామాజిక హక్కుల వేదిక నాయకుల పిలుపు అమలాపురం టౌన్ : దేశ జనాభాలో అత్యధికులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం, మైనార్టీలను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్న పాలక పక్ష విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సామాజిక హక్కులవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా ప్రచార జీపుజాతా బుధవారం అమలాపురం వచ్చింది. వేదిక కోనసీమ కో ఆర్డినేటర్ కె.సత్తిబాబు ఆధ్వర్యంలో వేదిక ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జీపుజాతాకు స్వాగతం పలికారు. స్థానిక హైస్కూల్ సెంటర్లో జరగిన సభలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.ఈ వైఖరికి నిరసనగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదిక జిల్లా కన్వీనర్, జిల్లా సీపీఐ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తుండటం వల్ల ప్రభుత్వ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వేదిక అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్, రిపబ్లికన్ పార్టీ జాతీయ నాయకుడు డీబీ లోక్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అ««దl్యక్షుడు యిళ్ల సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు చెల్లుబోయిన కేశవశెట్టి, సామాజికవేత్త ఎంఏకే భీమారావు, కార్మిక నాయకుడు వాసంశెట్టి సత్తిరాజు తదితరులు ప్రసంగించారు. తొలుత అంబేడ్కర్, ఫూలే చిత్రపటాలకు పూలమాలల వేసి నివాళులర్పించారు. -
జీపు, బైక్ ఢీ: ఒకరి దుర్మరణం
బషీరాబాద్: జీపు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎక్మాయి గ్రామానికి చెందిన సంతోష్‌గౌడ్ (35), తన స్నేహితుడు రవితో కలిసి సోమవారం రాత్రి బషీరాబాద్‌లోని మద్యం తాగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. బషీరాబాద్ రైల్వేగేట్ సమీపంలో తాండూరు నుంచి బషీరాబాద్‌కు వస్తున్న జీపు, వీరి బైక్ ఢీకొన్నాయి. సంతోష్‌గౌడ్ ఎగిరి కిందపడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
పోలీస్ జీపును ఢీ కొన్న లారీ
పోలీస్ జీపును ఢీ కొన్న లారీ lorry dash police jeep పోలీస్, జీపును, ఢీ కొన్న, లారీ lorry, dash, police, jeep కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు..చేయి తొలగింపు స్వలంగా గాయపడిన ఏఎస్ఐ, హోంగార్డు సత్తుపల్లి :పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్జీపును మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని లారీ ఢీకొన్న సంఘటనలో ఒక కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వలంగా గాయపడ్డారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం..మండల పరిధిలోని తాళ్లమడ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ జీపును గుర్తు తెలియని లారీ సైడ్ నుంచి వేగంగా ఢీకొని వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ ఉమర్ కుడిచేయి నుజ్జునుజ్జు అయ్యి మాంసం ముద్దలు జీపులో పడ్డాయి. దీంతో జీపు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. జీపులో ఉన్న ఏఎస్సై రాజుకు తలకు గాయమైంది. హోంగార్డు కె.అశోక్ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న సీఐ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం ఉమర్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చేయి తొలగించారు. ఏఎస్సై రాజు, హోంగార్డు అశోక్‌కు చికిత్స నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాలకు సమాచారం అందించారు. గాయపడిన ఉమర్ చేయి తొలగించాల్సి రావడంతో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉమర్‌కు వివాద రహితుడిగా మంచిపేరు ఉంది. ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా క్రైం కేసుల్లో చురుగ్గా వ్యవహరించి పలు మార్లు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. -
భారత్‌కు జీప్ బ్రాండ్..
♦ ఆగస్టులో రెండు మోడళ్లతో ఎంట్రీ ♦ ప్రీమియం ఎస్‌యూవీలతో పోటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ వాహన రంగంలోకి మరో అమెరికన్ బ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్‌కు చెందిన ‘జీప్’ సొంతంగా ఇక్కడి మార్కెట్లో ఆగ స్టులో ప్రవేశిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో జీప్ బ్రాండ్ వాహనాలను మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసి విక్రయించేది. జీప్ ముందుగా భారత్‌లో ర్యాంగ్లర్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఇవి ప్రీమియం ఎస్‌యూవీలకు పోటీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లను పూర్తిగా తయారు చేసి భారత్‌కు దిగుమతి చేయనున్నారు. 2017 రెండో త్రైమాసికం నుంచి పూర్తిగా దేశీయంగా తయారీ చేపడతామని జీప్ బ్రాండ్ గ్లోబల్ హెడ్ మైఖేల్ మాన్లే వెల్లడించారు. అలాగే భారత్ నుంచి సమీపంలోని విదేశీ మార్కెట్లకు వాహనాలను ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. ధర రూ.40-80 లక్షలు.. అసలైన ఎస్‌యూవీలకు జీప్ బ్రాండ్ పెట్టింది పేరు. పేరు మాదిరిగానే వీటి ధర కూడా అదిరిపోనుంది. ర్యాంగ్లర్ ధర రూ.40-50 లక్షలు, గ్రాండ్ చెరోకీ ధర రూ.80 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. మూడు, అయిదు డోర్ల వేరియంట్లో ర్యాంగ్లర్ రానుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్న గ్రాండ్ చెరోకీ 3.0 లీటర్ సీఆర్డీ టర్బో వీ6 డీజిల్ ఇంజన్‌ను పొందుపరిచారు. మైలేజీ 12.8 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. గ్రాండ్ చెరోకీ లిమిటెడ్, సమ్మిట్, ఎస్ఆర్టీ వేరియంట్లలో లభిస్తుంది. 6.4 లీటర్ వీ8 ఇంజన్‌ను ఎస్‌ఆర్‌టీకి జతచేశారు. ఫోర్ వీల్ డ్రైవ్ ఈ ఎస్‌యూవీల ప్రత్యేకత. కంపెనీ దశలవారీగా ఇతర మోడళ్లను భారత్‌కు తీసుకు రానుంది. హైదరాబాద్‌లో జీప్.. తొలుత దేశవ్యాప్తంగా అయిదు మెట్రో నగరాల్లో జీప్ ఎక్స్‌క్లూజివ్ షోరూంలు రానున్నాయి. వీటిలో హైదరాబాద్ షోరూంను లక్ష్మీ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. డిసెంబరుకల్లా ఔట్‌లెట్‌ను సిద్ధం చేస్తామని లక్ష్మీ గ్రూప్ ఎండీ కంభంపాటి జైరామ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇక జీప్ బ్రాండ్ వాహనాలకు భారత్‌లోనూ క్రేజ్ ఎక్కువే. యూఎస్ నుంచి వీటిని దిగుమతి చేసుకుని షికారు చేసే వారూ ఉన్నారు. యూఎస్ ఆర్మీ విరివిగా జీప్ వాహనాలను ఉపయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఇవి తమ సత్తా చాటాయి కూడా. జీప్ బ్రాండ్ లెసైన్సును పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా భారత్‌లో పెద్ద ఎత్తున వాహనాలను విక్రయించింది. -
ట్రక్కును ఢీకొట్టిన జీపు: ముగ్గురి మృతి
సోనెభద్ర(ఉత్తరప్రదేశ్): జీపు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన వారణాసి-శక్తినగర్ రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లిన 13 మంది జీపులో తిరిగి వస్తుండగా నిర్మాణంలో ఉన్న ఫైఓవర్ వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. -
ఇన్నోవా-జీపు ఢీ: ఆరుగురికి గాయాలు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని గురజాల మండలం అంబాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, జీపు ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కన్హయ్య వెళ్తున్న కారుకు ప్రమాదం..
హైదరాబాద్: రాజ్యంగ పరిరక్షణ సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చి తిరిగి ఏయిర్‌పోర్టుకు వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏజీ కళాశాల ముందు గురువారం చోటుచేసుకుంది. కన్హయ్య ప్రయాణిస్తున్న కారును చిక్కడపల్లి సీఐ జీపు ఢీకొట్టింది. దీంతో కారు పాక్షీకంగా ధ్వంసం అయింది. అనంతరం కన్హయ్య కుమార్ సురక్షితంగా ఏయిర్పోర్టు చేరుకున్నారు. -
ఘోర రోడ్డుప్రమాదం: 11 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందారు. ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆరుగురు మరణించారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సంఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 20 మంది ప్రయాణికులతో వెళుతున్న జీప్ ధాటియా ప్రాంతానికి వెళ్తుండగా ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిప్రి బజార్ కు సమీపంలోని డిగ్రీ కళాశాల దగ్గర జరిగిన ఈ ఘటనలో ట్రక్క్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. -
స్వామి దర్శనానికి వెళ్లి కానరాని లోకాలకు
గుత్తి (అనంతపురం) : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగార్జున నాయుడు (10వ తరగతి విద్యార్థి) ఆంజనేయస్వామి మాలను ధరించి స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వెంకట సురేంద్ర, నాగార్జున, చంద్రశేఖర్, రమణ తదితరులు 20 మంది ఆంజనేయస్వామి మాలను ధరించారు.ఈ నెల 21న జీప్‌లో కసాపురం బయలుదేరారు. కసాపురంలో స్వామిని దర్శించుకుని తిరిగి మంగళవారం సొంత ఊరుకు వెళుతుండగా మార్గమధ్యంలోని గుత్తిలో నాగార్జున నాయుడుకు ఆయాసం ఎక్కువైంది.దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. నాగార్జున నాయుడు మృతి చెందిన విషయాన్ని తిమ్మాపురంలోని మృతుని తల్లిదండ్రులు గుర్రప్ప,నాగలక్ష్మమ్మలకు సమాచారమిచ్చారు.వారు హుటాహుటిన గుత్తికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తిమ్మాపురం తరలించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..ఇద్దరికి గాయాలు
తిరుమల ఘాట్ రోడ్డులో 32వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కొండపైకి వెళ్తున్న జీపు ప్రమాదవశాత్తూ కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు తమిళ భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
లోయలో పడిన జీపు
విశాఖ: విశాఖపట్టణం జిల్లా పెద్దబయలు మండలం తురకలవలస గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఒక జీపు లోయలో పడిపోయింది. అయితే జీపు పడిన ప్రాంతంలో ప్రయాణికులు ఎవరూ లేరు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు లోయలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. జీపు ఎవరిది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది. అందులో ప్రయాణిస్తున్నవారు ఏమయ్యారు అనే వివరాలు తెలియరాలేదు. పోలీసులు వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని జీపు బోల్తా
అట్లూరు (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎదురుగా వస్తున్న జీపు పక్కనున్న గోతిలోకి బోల్తాపడింది. కడప నుంచి బద్వేలుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా అరటికాయల లోడుతో వస్తున్న జీపును వేగంగా ఢీకొంది. దాంతో జీపు పైకి ఎగిరి పక్కనున్న గోతిలో బోల్తాపడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. -
గంజాయితోపాటు వాహనాన్ని తగలబెట్టిన స్మగ్లర్లు
విశాఖపట్నం: స్మగ్లర్లు భారీగా గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అకస్మాత్తుగా వాహనం నిలిచిపోయింది. వాహనాన్ని బాగు చేసేందుకు సమయం లేదు. ఓ వేళ వాహనం బాగు చేసే క్రమంలో పోలీసులు వస్తే అందరం దొరికిపోతామని భావించినట్లు ఉన్నారు. అంతే గంజాయితోపాటు వాహనాన్ని పెట్రోల్ పోసి తగలుబెట్టి అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పివేసి... జీపులోని 30 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరంలోని పెద్దగుమ్మలూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.