ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా ఉన్న మహీంద్రా థార్‌కు గట్టిపోటీ ఎదురవబోతుంది. ఈ సెగ్మెంట్‌లో థార్‌కి పోటీగా గూర్ఖా తెస్తోంది ఫోర్స్ మోటార్స్ కంపెనీ. రాబోయే పండగ సీజన్‌లో ఈ ఎస్‌యూవీని మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు వీలుగా సన్నహకాలు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియాలో టీజర్ వదిలింది.
సెప్టెంబరులోనే ?
ఆఫ్‌రోడ్ రైడ్‌ని ఇష్టపడే వారి అభిరుచులకు తగ్గట్టుగా గూర్ఖా ఎస్‌యూవీని ఫోర్స్ సంస్థ డిజైన్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో గూర్ఖా వాహనాన్ని ప్రదర్శించింది ఫోర్స్ సంస్థ. ఇదే ఏడాది మూడో త్రైమాసికంలో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తెస్తామని ప్రకటించింది. దీంతో సెప్టెంబరు చివరి నాటికి ఫోర్స్ మార్కెట్‌లోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
గూర్ఖా ప్రత్యేకతలు
- ఫోర్ వీల్ డ్రైవింగ్‌తో వచ్చే ఈ థార్ జీప్‌లో త్రీ డోర్స్, ఫోర్ డోర్ డిజైన్లు అందుబాటులో ఉంటాయి
- ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ హెడ్‌లైట్లను ఉపయోగించారు
- ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీకి తగ్గట్టుగా గ్రిల్స్, క్రోమ్, బంపర్లను డిజైన్ చేశారు.
- రెండో వరుసలో కూడా కెప్టెన్ సీట్లను అమర్చే అవకాశం ఉంది
- ఆఫ్‌రోడ్ స్పెషాలిటీ అయిన టైయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ డిజైన్‌ను కొనసాగిస్తున్నారు
- గూర్ఖా పూర్తిగా రగ్గడ్ లుక్‌తో వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment