Jeep Meridian 7 Seater Suv Launched In India: Check India Prices And Special Features - Sakshi
Sakshi News home page

Jeep Meridian 7 Seater SUV: అదిరిపోయే లుక్‌తో విడుదలైన ఎస్‌యూవీ, ధర ఎంతంటే!

Published Fri, May 20 2022 8:45 PM | Last Updated on Sat, May 21 2022 9:13 AM

Jeep Meridian 7 Seater Suv Launched In India - Sakshi

న్యూఢిల్లీ: స్టెలాంటిస్‌ గ్రూప్‌లో భాగమైన జీప్‌ ఇండియా తాజాగా తమ కొత్త ఎస్‌యూవీ మెరీడియన్‌ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 29.9 లక్షల నుంచి (ఎక్స్‌ షోరూం) ప్రారంభమవుతుంది.

ప్రత్యేకంగా భారత మార్కెట్‌ కోసం తొలిసారిగా మూడు వరుసల సీటింగ్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆల్‌–వీల్‌ డ్రైవ్‌ వెర్షన్‌తో పాటు ఇది అయిదు వేరియంట్లలో లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ ధరలు రూ. 29.9 లక్షల నుంచి రూ. 36.95 లక్షల వరకూ ఉంటాయని జీప్‌ బ్రాండ్‌ ఇండియా హెడ్‌ నిపుణ్‌ జె మహాజన్‌ తెలిపారు.

జీప్‌ మెరిడియన్‌కి ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. రూ. 50,000 డౌన్‌పేమెంట్‌ కట్టి మెరీడియన్‌ను తమ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసు కోవచ్చని, జూన్‌ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. బుకింగ్స్‌ ప్రారంభించడానికి ముందే 67,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చినట్లు, 5,000 మందికి పైగా కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు మహాజన్‌ చెప్పారు.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement