Automobile company
-
అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద..
సాధరణంగా ఊహించని లాభాలు, ఆదాయం వస్తే అదృష్టం వరించింది అంటుంటారు. కానీ ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద పెరిగితే దాన్ని ఏమంటారు? అదృష్టం కాదు.. అంతకు మించి అంటారు. సింగపూర్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ (VinFast Auto Ltd) స్టాక్ మార్కెట్లలో ప్రవేశించిన మొదటి రోజునే దూసుకెళ్లి, దాని వ్యవస్థాపకుడి సంపదను భారీగా పెంచింది. దిగ్గజ కంపెనీలను దాటేసి.. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షేర్లు మంగళవారం (ఆగస్టు 15) ఏకంగా 255 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ చైర్మన్ వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ (Pham Nhat Vuong) నికర సంపదకు 39 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరాయి. పరిశ్రమ దిగ్గజాలు జనరల్ మోటార్స్ కో, మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కంటే విన్‌ఫాస్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ సంపద ఇప్పుడు 44.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీలో వూంగ్ వాటాను స్టాక్ ఇండెక్స్ గతంలో చేర్చలేదు. తన వింగ్ గ్రూప్ జేఎస్సీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 99 శాతం కంపెనీ అవుట్‌స్టాండింగ్ వూంగ్ నియంత్రణలోనే ఉన్నాయి. అత్యధిక వాటా ఆయనకే ఉండటంతో ఇతర ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లు అందుబాటులో లేవు. విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్‌ను 2017లో వూంగ్ స్థాపించారు. తమ వాహనాల అమ్మకాలు ఈ సంవత్సరం 45,000 నుంచి 50,000కి చేరుకుంటాయని కంపెనీ అంచనా వేసింది. గత నెలలో నార్త్ కరోలినాలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. వూంగ్తోపాటు అతని బంధువులు విన్‌ఫాస్ట్ సంస్థలో కనీసం 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. న్యూడిల్స్ బిజినెస్‌తో మొదలుపెట్టి... రష్యాలో జియో-ఎకనామిక్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత 1990ల ప్రారంభంలో వూంగ్ ఉక్రెయిన్‌కు వెళ్లారు. అనంతరం వియత్నాంకు తిరిగి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఇన్స్టాంట్ న్యూడిల్స్ బిజినెస్‌ను ప్రారంభించారు. తర్వాత దాన్ని 2010లో నెస్లే ఎస్ఏకి అమ్మేశారు. అప్పటికే ఆయన రియల్ ఎస్టేట్, రిసార్ట్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ వ్యాపారాలు నిర్వహించే వింగ్ గ్రూప్ జేఎస్సీ (Vingroup JSC)ని స్థాపించారు. హనోయి కేంద్రంగా కార్యకలాపాలు నర్వహిస్తున్న ఈ సంస్థ గత సంవత్సరం 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. విన్‌ఫాస్ట్ కంపెనీలో ఇది ప్రధాన వాటాదారుగా ఉంది. -
తగ్గేదేలే అంటున్న కార్ల అమ్మకాలు.. తొలి నెలలోనే అదరగొట్టారు
ముంబై: కొత్త క్యాలండర్ ఏడాది(2023) తొలి నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజాలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీకేఎం, కియా ఇండియా, హ్యుందాయ్ జనవరిలో పటిష్ట విక్రయాలను సాధించాయి. అయితే ఎంజీ మోటార్, హోండా మాత్రం వాహన విక్రయాలలో వెనకడుగు వేశాయి. మారుతీ 12 శాతం అధికంగా 1,72,535 వాహనాలను విక్రయించగా.. ఎంఅండ్ఎం 37 శాతం వృద్ధితో 64,335 వాహనాలను అమ్మింది. ఈ బాటలో టాటా మోటార్స్ అమ్మకాలు సైతం 6 శాతం పుంజుకుని 81,069 వాహనాలకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) అమ్మకాలు 175 శాతం జంప్‌చేసి 12,835 యూనిట్లను తాకాయి. కియా ఇండియా అమ్మకాలు 48 శాతం మెరుగుపడి 28,634 యూనిట్లకు చేరగా.. హ్యుండాయ్ మోటార్ ఇండియా 17 శాతం అధికంగా 62,276 వాహనాలను విక్రయించింది. చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్‌తో దూసుకుపోతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్‌లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్‌లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
మంచు కొండల్లో మహీంద్రా కారు బీభత్సం.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్!
మహీంద్రా కార్లుకు భారతీయ మార్కెట్లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ వాహనాలు లాంచ్ చేస్తే రికార్డ్ బుకింగ్స్ అవుతుండడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మహీంద్రా తన XUV400 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఈ కారు ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇంతలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది. మహీంద్రా కారా మజాకా మార్కెట్లో ఇంకా అఫిషియల్‌గా లాంచ్ కాక ముందే అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 24 గంటల్లో 751 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా పేరు సంపాదించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి డ్రైవ్ ప్రారంభించి 24 గంటల్లో 751 కి.మీ ప్రయాణించింది. సబ్-జీరో భూభాగంలోని నిటారుగా ఉన్న వాలులలో కూడా XUV400 సజావుగా దూసుకెళ్లింది. ఎత్తైన ప్రదేశాల్లోని వంపుల్లో కారు నడపడం కష్టతరం, అయినప్పటికీ XUV400 24 గంటల్లో 751 కిమీ ప్రయాణించి తన పనితీరుని నిరూపించుకుని ఈ అరుదైన రికార్డ్‌ను తన పేరిట నమోదు చేసుకుంది. ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం XUV400 112 Ah కెపాసిటీ రేటింగ్‌తో 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. బ్యాటరీ ప్యాక్‌లో NMC (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) ఎలక్ట్రో-కెమికల్ కూర్పు ఉంది. ఈ వాహనం బరువు 1,960 కిలోలు, ఇందులో బ్యాటరీ ప్యాక్ 309 కిలోల బరువు ఉంటుంది. అధికారికంగా, XUV400 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది లగ్జరీయేతర సెగ్మెంట్‌ను మినహాయించి దేశంలో తయారైన అత్యంత వేగవంతమైన ప్రయాణీకుల వాహనంగా నిలిచింది. ఈ కారు అత్యధికంగా 150 kmph స్పీడ్‌ను అందుకోగలదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, XUV400 తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాటరీ తయారీలపై ఫోకస్ పెట్టింది. అందుకే మహీంద్రా సహకారంతో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. అయితే, బ్యాటరీ కంట్రోలర్, ఎలక్ట్రిక్ మోటార్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 17 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఉండచ్చని తెలుస్తోంది. మరో వైపు ప్రత్యేర్థి టాటా నెక్సన్ ఈవీ కంటే.. ఫీచర్లు, ప్రత్యేకతలు, బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
మెర్సిడెస్ నుంచి 10 కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ఈ ఏడాది 10 నూతన మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో అత్యధికం రూ.1 కోటికిపైగా ధరల శ్రేణిలో ఉంటాయని కంపెనీ తెలిపింది. 2022లో భారత్‌లో కంపెనీ నూతన రికార్డు సాధించి 15,822 యూనిట్లను విక్రయించింది. 2021లో 11,242 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన కార్లలో రూ.1 కోటిపైన ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లు 3,500 యూనిట్లకుపైమాటే. ఈ విభాగం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 69 శాతం వృద్ధి చెందడం విశేషం. ఇప్పటి వరకు కంపెనీ ఖాతాలో 2018లో అ మ్ముడైన 15,583 యూనిట్లే అధికం. టాప్ ఎండ్ మోడళ్ల వాటా 2018లో 12 % ఉంటే గతేడాది ఇది ఏకంగా 22 శాతానికి చేరిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. -
విదేశాల్లో మారుతీ సుజుకీ హవా.. 2022లో 2,63,068 కార్ల ఎగుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 2022లో 2,63,068 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2021తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే రెండున్నరెట్లు ఎక్కువగా సరఫరా అయ్యాయి. 2019లో కంపెనీ 1,07,190 వాహనాలను ఎగుమతి చేసింది. విదేశాలకు గతేడాది అధికంగా సరఫరా అయిన మోడళ్లలో డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెస్సో, బాలెనో, బ్రెజ్జా ఉన్నాయి. వరుసగా రెండవ సంవత్సరం ఎగుమతుల్లో 2 లక్షల మైలురాయిని దాటడం కంపెనీ ఉత్పత్తుల పట్ల విశ్వసనీయత, నాణ్యత, పనితీరును సూచిస్తుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు. 1986–87లో భారత్ నుంచి మారుతీ సుజుకీ ఎగుమతులను ప్రారంభించింది. 100 దేశాలకు వాహనాలు సరఫరా అవుతున్నాయి. ఆఫ్రికా, మధ్యప్రాచ్య, లాటిన్ అమెరికా, ఆసియాన్ దేశాలు సంస్థకు ప్రధాన మార్కెట్లు. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను జనవరి 23 నుంచి పెంచుతోంది. మోడల్‌నుబట్టి ధర రూ.30,000 వరకు అధికం కానుంది. ముడిసరుకు వ్యయాలు దూసుకెళ్లడం, నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీ చేపడుతుండడం ఇందుకు కారణమని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కాలుష్యం ఏ మేరకు విడుదల అవుతుందో తెలుసుకునే పరికరాన్ని కార్లలో ఏర్పాటు చేయాలన్న నిబంధన 2023 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తోంది. ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇప్పటికే ప్రకటించాయి. -
ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట!
ఇటీవల కార్ల వాడకం పెరుగుతోంది. ఇదివరకు కస్టమర్లు స్టైలిష్ లుక్, సాకర్యాలు, ఫీచర్ల, ధరను చూసేవాళ్లు. ప్రస్తుతం ఇంధన ధరల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ఓ కన్నేస్తున్నారు. కొంతవరకు, (CNG) సీఎన్జీ ఇంధనం ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. అయితే ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, కానీ అవి ప్రస్తుతం కొంచెం ఖరీదుగా ఉండడం, పైగా వాటి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్దగా లేకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో, ఎక్కువ మంది కంపెనీలు తమ దృష్టిని హైబ్రిడ్ టెక్నాలజీ కార్ల వైపు మళ్లిస్తున్నాయి. అందుకే రానున్న కాలంలో అదిరిపోయే మైలేజ్‌తో ఉన్న కార్లు మార్కెట్లో విడుదలకు తయారీదారులు ప్లాన్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. మారుతి నుంచి ఆ రెండు కార్లు ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్, డిజైర్ మారుతి కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కస్టమర్లు కోరుకునే బడ్జెట్ ధరలతో పాటు ఫీచర్లు, కార్ల పనితీరు కారణంగా ఇవి సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. తదపరి మారుతి నుంచి స్విఫ్ట్, డిజైర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్నాయని నివేదికలు చెప్తున్నాయి. మారుతి ఈ రెండు మోడళ్లలో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఈ కార్ల ఇంజిన్లు కూడా టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు కావచ్చని సమాచారం. నివేదికల ప్రకారం.. మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్ హైబ్రిడ్ మోడల్ కార్లు దేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన వాహనాలుగా మారనున్నాయి. ఇవి 35 km/l నుంచి 40 km/l వరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీతో స్విఫ్ట్ , డిజైర్ 2024 తొలి త్రైమాసికంలో మార్కెట్లో రావొచ్చు. ప్రస్తుతం మైలేజ్ పరంగా గ్రాండ్ విటారా SUV 27.97 కిమీ/లీతో ఫ్యూయల్ ఎకానమీ చార్ట్‌లలో ముందుంది. ఇదిలా ఉండగా మారుతీ సుజుకీ మాత్రం ఈ కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే! -
ఆటో సంస్థలకు నిబంధనల భారం
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ కంపెనీలు పాటించాల్సిన చట్టాలు, నిబంధనలు అనేకానేకం ఉంటాయి. అయితే, ఆయా కంపెనీల మేనేజ్మెంట్లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. టీమ్‌లీజ్ రెగ్‌టెక్ నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్ కంపెనీలపై రెగ్‌టెక్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు. -
‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!
బండ్లు ఓడలు అవ్వడం.. ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’ అనే సామెత మనం వినే ఉంటాం. ఇప్పుడు ఈ సామెత ఓలా సీఈవో భవిష్ అగర్వాల్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కార్పొరేట్ వరల్డ్‌లో బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోగొట్టుకుంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితులు ఒకానొక దశలో తారుమారయ్యాయి. కొనే నాథుడే లేడు సమ్మర్ సీజన్లో ఆ సంస్థ తయారు చేసిన ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపాలు సీఈవో భవిష్ అగర్వాల్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. వెహికల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం. వాహనదారులు ప్రమాదాలకు గురికావడం. నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ తయారు చేయడంతో చిన్న పాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్ టైర్లు ఊడిపోవడం లాంటి వరుస ఘటనలతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో ఓలా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకున్న వాహన దారులు సైతం వెనక్కి తగ్గారు. దీంతో తయారు చేసిన వెహికల్స్ అమ్ముడు పోక.. స్టాక్ మిగిలిపోయింది. చదవండి👉 ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే.. దీనికి తోడు సంస్థను వివాదాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులు, ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, వాటి విడుదలలో కీరోల్ ప్లే చేస్తున్న టాప్ లెవల్ ఎక్జిక్యూటీవ్‌లు సంస్థను వదిలేస్తున్నా భవిష్ మాత్రం అన్నీ తానై సంస్థను ముందుండి నడిపించారు. ఓలా మినహాయి మిగిలిన వ్యాపారాల్ని క్లోజ్ చేశారు. ఓలా ఈవీలపై దృష్టిసారించారు. రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగి ఇంజనీరింగ్ విధులు, టీమ్ బిల్డింగ్, ఉత్పత్తులపై ఫోకస్ చేయడమే కాదు..టూవీలర్లతో పాటు కార్లను మార్కెట్లోకి విడుదల చేసే పనిలో పడ్డారు. కట్ చేస్తే.. Crossed 1 lakh vehicles produced yesterday. In just 10th month of production, probably fastest ever for a new auto company in India. Just getting started and #EndICEage is coming nearer and nearer! pic.twitter.com/FnJWLEQ1D8 — Bhavish Aggarwal (@bhash) November 3, 2022 కట్ చేస్తే తాజాగా ఈవీ చరిత్రలో అత్యంత వేగంగా వెహికల్స్ తయారీ చేసిన సంస్థగా ఓలా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం పది నెలల్లో లక్ష(నిన్నటితో) వెహికల్స్‌ను తయారు చేసింది. ఈ సందర్భంగా దేశీయ ఆటోమొబైల్ చరిత్రలో ఇంత వేగంగా వెహికల్స్‌ను తయారు చేసిన దాఖలాలు లేవని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. టార్గెట్ కో అంటే కోటి అంతేకాదు డిసెంబర్ 2021లో ఓలా వెహికల్స్ తయారీ ‘సున్నా’ కాగా నవంబర్ 2022 నాటికి ఆ సంఖ్య లక్షకు చేరింది. నవంబర్ 2023నాటికి 10లక్షలు, నవంబర్ 2024 నాటికి కోటి వెహికల్స్ తయారీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. Our cumulative production numbers: Dec 2021: 0 Nov 2022: 1,00,000 Nov 2023: 10,00,000 Nov 2024: 1,00,00,000 This is the journey to #EndICEAge by 2025 🙂😎 pic.twitter.com/HV8x6JbCgm — Bhavish Aggarwal (@bhash) November 4, 2022 నవంబర్‌లో ఓలా ఒక్క నెలలో ఏకంగా తన ఎస్1 సిరీస్ 20 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అమ్మింది. అదనంగా, దాని మొత్తం అమ్మకాలు నెలవారీగా 60 శాతం పెరిగాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ విక్రయాల్లో 4 రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు ఓలా వెల్లడించింది. ఈ కాలంలో ప్రతి నిమిషానికి ఒక స్కూటర్‌ను విక్రయించినట్లు నివేదించింది. కాగా, ఓలా వెహికల్స్ ఉత్పత్తి, అమ్మకాలపై భవిష్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేస్తుండగా..ఆయన సహచరులు మాత్రం ‘బండ్లు ఓడలు అవ్వడం..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’.. సంస్థ పని ఇక అయిపోయిందిలే అని అనుకునే సమయంలో తన అపారమైన వ్యాపార నైపుణ్యాలతో సంస్థను గట్టెక్కించారంటూ భవిష్ అగర్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 20000 Ola S1 units sold in October, highest ever for an EV company in India! 60% growth month on month for @OlaElectric. The Ola community is now bigger than ever and Mission Electric 2025 is in sight! We will #EndICEage together💪🏼 pic.twitter.com/hyU0xiD6WL — Bhavish Aggarwal (@bhash) November 1, 2022 చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
భారత్‌కు నిస్సాన్ గ్లోబల్ మోడల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ నిస్సాన్.. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌ను (ఎస్యూవీ) భారత మార్కెట్లో పరిచయం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో మాగ్నైట్, కిక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్–ట్రయల్, జూక్, కష్కాయ్ మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఎక్స్–ట్రయల్, కష్కాయ్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత రోడ్లపై ఈ రెండు మోడళ్ల పరీక్ష మొదలైందని వెల్లడించింది. భారతీయ రోడ్లు, విభిన్న భూభాగాలకు ఈ వాహనాలు అనుకూలమా కాదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలు అంచనా వేస్తాయని కంపెనీ తెలిపింది. పరీక్షలు పూర్తి అయ్యాక సానుకూల ఫలితాలు వస్తే తొలుత ఎక్స్–ట్రయల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత కష్కాయ్ కూడా రోడ్డెక్కనుంది. ఉద్గారాలను బట్టి పన్ను..: వాహనాల పొడవు, ఇంజన్ పరిమాణం కంటే ఉద్గారాల ఆధారంగా ప్రయాణికుల వాహనాలపై పన్ను విధించడాన్ని భారతదేశం పరిగణించాలని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఆటోమొబైల్స్ ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి హైబ్రిడ్ల వంటి బహుళ సాంకేతికతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్గారాల స్థాయిని బట్టి వేర్వేరు పన్ను స్లాబ్‌లు ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే నాలుగు మీటర్ల లోపు, నాలుగు మీటర్ల కంటే పొడవు, ఇంధనం పరంగా భిన్నమైన పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంది. జీఎస్టీ విధానం ప్రకారం కార్లపై 28 శాతం పన్నుతోపాటు సెస్ విధిస్తున్నారు. 4 మీటర్ల కంటే పొడవు ఉండే కార్లు, ఎస్‌యూవీలకు 50 శాతం, హైబ్రిడ్ వాహనాలకు 43 శాతం, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు 5 శాతం జీఎస్టీ ఉంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
భారత్‌లో బీవైడీ అటో–3
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్‌లో తాజాగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ అటో–3 ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 521 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 7 ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్–కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రెండు వైపులా కొలీషన్ వార్నింగ్, ఏబీఎస్, ఈఎస్సీ, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను జోడించారు. ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బీవైడీ భారత్‌లో మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ6ను విక్రయిస్తోంది. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహన విపణి 55 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఆ సమయానికి 30 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. చెన్నై ప్లాంటులో ఎస్‌యూవీని అసెంబుల్ చేస్తామన్నారు. మార్కెట్ డిమాండ్‌నుబట్టి తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. బీవైడీ తయారీ 800లకుపైగా ఎలక్ట్రిక్ బస్సులు భారత్‌లో 11 నగరాల్లో పరుగెడుతున్నాయని వివరించారు. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ బంపరాఫర్
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొనుగోలు దారులకు టాటా టియాగో, టైగోర్,టైగోర్ సీఎన్జీ, హారియర్, సఫారీ కార్లపై పలు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో టాటా హారియర్‌పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ ,రూ.5000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తుంది. దీంతో పాటు టైగోర్ సీఎన్జీపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15,000 , రూ.10 వేలు డిస్కౌంట్ అందిస్తున్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు. అన్ని టాటా సఫారీ వేరియంట్లపై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. టైగోర్పై ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 బెనిఫిట్ లభిస్తుంది. టాటా టియాగోపై ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.10వేలు, క్యాష్ డిస్కౌంట్‌గా రూ.10 వేలు బెనిఫిట్ పొందవచ్చు. హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.3000 అందిస్తున్నది. -
టాటా మోటార్స్: ఏటా రూ.2,000 కోట్ల వ్యయం
వాణిజ్య వాహన విభాగంలో ఏటా రూ.2,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్టు సంస్థ ఈడీ గిరీష్ వాఘ్ సోమవారం తెలిపారు. యోధ 2.0, ఇంట్రా వీ50, సీఎన్జీ, పెట్రోల్‌తో నడిచే ఇంట్రా వీ20 పికప్ వాహనాలను భారత మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పికప్స్ విభాగంలో కంపెనీతోపాటు, పరిశ్రమ ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదు చేస్తుంది. టాటా ఏస్ ఈవీ వాహనాలు అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాయి. వాణిజ్యపరంగా ఉత్పత్తి మొదలైంది. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయి. నూతన పికప్ వాహనాలు అధిక సామర్థ్యం, ఎక్కువ బరువు మోయగలిగి, అధిక దూరం ప్రయాణించేలా రూపొందించాం’ అని వివరించారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్ క్రేజ్ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్ లుక్‌తో వచ్చేస్తోంది!
ఒకప్పుడు ఆటో మొబైల్ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్ కంపెనీ మరోసారి భారత్‌లో తన మార్క్‌ని చూపెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం 1970లో కస్టమర్లను తనవైపు తిప్పుకుని భారత రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరిగిన లాంబ్రెట్టా స్కూటర్లును .. 2023లో లేటెస్ట్ మోడల్‌తో తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రానున్న మోడల్స్‌లో 200, 350సీసీ ఇంజిన్స్‌తో ఈ స్కూటర్లు రానున్నాయి. వీటితో పాటు 2024 చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. బర్డ్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్లో భాగంగా ఈ కంపెనీ మార్కెట్లోకి ఈ స్కూటర్లను తీసుకురాబోతున్నాయి. కంపెనీ ముఖ్య అధికారి మాట్లాడుతూ.. బర్డ్ గ్రూప్‌తో కలిసి వచ్చే 5 సంవత్సరాలలో $200 మిలియన్లకు పైగా ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. 1970లో భారత్ మార్కెట్లో ఈ స్కూటర్ బ్రాండ్‌కి ప్రత్యేక గుర్తింపుతో పాటు కస్టమర్లలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త రకం స్కూటర్ల మోడళ్లను డిజైన్, లుక్, ఫీచర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల కానున్న స్కూటర్లతో కంపెనీకి భారత్‌లో ఉన్న గత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్లు హై-ఎండ్ మోడల్స్‌గా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అత్యంత ఖరీదైన మోడల్‌ల కంటే దాదాపు 20% ఖరీదు ఉంటుందని అంచనా. ఈ జాయింట్ వెంచర్లో లాంబ్రెట్టా 51% వాటా ఉండగా, మిగిలిన 49% బర్డ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్ లాంబ్రెట్టా స్కూటర్ 2023లో మిలన్ మోటార్‌సైకిల్ షోలో ప్రజలకు ప్రదర్శించబోతోంది. అదే మోడల్‌ను భారత్‌లో స్థానికంగా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. లాంబ్రెట్టా ప్రస్తుతం దాదాపు 70 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. -
హోండా సీబీ300ఎఫ్ బైక్ లాంచ్, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)తాజాగా సీబీ300ఎఫ్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. డీలక్స్ ధర రూ. 2.25 లక్షలు కాగా డీలక్స్ ప్రో ధర రూ. 2.28 లక్షలుగా (ఢిల్లీలో ఎక్స్‌షోరూం) ఉంటుంది. బిగ్‌వింగ్ షోరూమ్‌లలో ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని హెచ్ఎంఎస్ఐ ఎండీ అత్సుషి ఒగాటా తెలిపారు. 293 సీసీ ఇంజిను, అధునాతన ఆయిల్–కూలింగ్ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టం తదితర ప్రత్యేకతలు ఈ బైక్‌లో ఉన్నాయి. -
స్టైలిష్ లుక్‌తో..హ్యుందాయ్ నుంచి ఎస్యూవీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త టుసో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్, డీజిల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, 2 లీటర్ పవర్‌ట్రైయిన్స్, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో రూపుదిద్దుకుంది. కెమెరా, రాడార్ సెన్సార్స్‌తో ఆటోమేటిక్ సెన్సింగ్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ విభాగంలో తొలిసారిగా 29 రకాల ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కస్టమర్లు టుసోను సొంతం చేసుకున్నారు. 2021లో అంతర్జాతీయంగా 4.85 లక్షల టుసో కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఏటా సుమారు 40,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయి. 2025 నాటికి ఇది 55,000 యూనిట్లకు చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. -
అదిరిపోయే పల్సర్ బైక్, అమ్మో ధర ఇన్ని లక్షలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పూర్తి నలుపు రంగులో పల్సర్ 250 వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. పల్సర్ ఎన్250, ఎఫ్250 ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.1.5 లక్షలు ఉంది. సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ఇప్పటికే ఉన్న రంగుల్లో లభిస్తుంది. డ్యూయల్ చానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది రూపుదిద్దుకుంది. మెరుగైన గ్రిప్ కోసం వెడల్పాటి టైర్లు, ముందువైపు 300 ఎంఎం, వెనుకవైపు 230 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు చేశారు. ఆవిష్కరించిన ఆరు నెలల్లోనే పల్సర్ 250 మోడల్లో 10,000 యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ వెల్లడించింది. బీఎస్–6 ప్రమాణాలు అమలులోకి వచ్చిన తర్వాత 250 సీసీ విభాగంలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని తెలిపింది. -
అదిరిపోయే లుక్‌తో విడుదలైన ఎస్యూవీ, ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: స్టెలాంటిస్ గ్రూప్‌లో భాగమైన జీప్ ఇండియా తాజాగా తమ కొత్త ఎస్యూవీ మెరీడియన్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 29.9 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం తొలిసారిగా మూడు వరుసల సీటింగ్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆల్–వీల్ డ్రైవ్ వెర్షన్‌తో పాటు ఇది అయిదు వేరియంట్లలో లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ ధరలు రూ. 29.9 లక్షల నుంచి రూ. 36.95 లక్షల వరకూ ఉంటాయని జీప్ బ్రాండ్ ఇండియా హెడ్ నిపుణ్ జె మహాజన్ తెలిపారు. జీప్ మెరిడియన్‌కి ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 50,000 డౌన్‌పేమెంట్ కట్టి మెరీడియన్‌ను తమ వెబ్సైట్లో బుక్ చేసు కోవచ్చని, జూన్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. బుకింగ్స్ ప్రారంభించడానికి ముందే 67,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చినట్లు, 5,000 మందికి పైగా కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు మహాజన్ చెప్పారు. -
భారత్ నుంచి మళ్లీ డాట్సన్ ‘గో’..
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ .. భారత్‌లో తమ డాట్సన్ బ్రాండ్ కార్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ‘చెన్నై ప్లాంటులో (రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా) డాట్సన్ రెడీ–గో ఉత్పత్తి నిలిపివేశాం. అయితే, స్టాక్ ఉన్నంత వరకూ వాటి విక్రయాలు కొనసాగుతాయి. డాట్సన్ కొనుగోలు చేసిన ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్లకు యథాప్రకారంగా దేశవ్యాప్త డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, విడిభాగాలు అందుబాటులో ఉంచడం, వారంటీపరమైన సపోర్ట్ అందించడం కొనసాగిస్తాం‘ అని నిస్సాన్ ఇండియా తెలిపింది. కంపెనీ ఇప్పటికే డాట్సన్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవెల్ చిన్న కారు గో, కాంపాక్ట్ మల్టీపర్పస్ వాహనం గో ప్లస్ మోడల్స్ ఉత్పత్తి ఆపేసింది. డాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదు. 1986లో ఆపేసే నాటికి డాట్సన్ భారత్ సహా 190 దేశాల్లో అమ్ముడయ్యేది. మళ్లీ చాలాకాలం తర్వాత 2013లో డాట్సన్ బ్రాండ్ భారత మార్కెట్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. మిగతా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో 2020లోనే రష్యా, ఇండోనేసియా మార్కెట్లలో డాట్సన్‌ను ఆపేసిన నిస్సాన్ అటు పై క్రమంగా భారత్, దక్షిణాఫ్రికాలో కూడా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. -
అదిగో అదిరిపోయే ఆడి..భారత్‌లో కొత్త కారు విడుదలపై మా ధీమా అదే!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి త్వరలో ఏ8 సెడాన్ కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తోంది. లాంగ్ వీల్ బేస్, 3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధిస్తామన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2021లో ఆడి ఇండియా రెండింతల అమ్మకాలతో 3,293 యూనిట్లు నమోదు చేసింది. సంస్థ ఈ ఏడాది ఇప్పటికే రూ.80 లక్షల ఎక్స్‌షోరూం ధరతో క్యూ7 ఎస్యూవీ కొత్త వర్షన్ ప్రవేశపెట్టింది. -
బాదుడే.. బాదుడు..మరింత పెరగనున్న కార్ల ధరలు!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల ధరలు ఎగుస్తున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను ఈ నెలలో పెంచనున్నట్లు దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. అయితే, ఎంత మేర పెంచేదీ మాత్రం వెల్లడించలేదు. ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో గత ఏడాది కాలంగా వాహనాల తయారీ వ్యయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఎంఎస్ఐ వివరించింది. దీనితో కొంత భారాన్ని రేట్ల పెంపు రూపంలో కొనుగోలుదారులకు బదలాయించక తప్పడం లేదని పేర్కొంది. ఉక్కు, అల్యుమినియం వంటి కమోడిటీలతో పాటు సరకు రవాణా చార్జీలు మొదలైనవన్నీ పెరిగిపోవడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఏప్రిల్ నుండి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకీ గతేడాది జనవరి నుండి ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో 8.8 శాతం మేర తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. ఆల్టో మొదలుకుని ఎస్–క్రాస్ వరకూ వివిధ మోడల్స్‌ను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.25 లక్షల నుండి రూ. 12.77 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంది. -
దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారిలోనూ సూపర్ లగ్జరీ కార్లకు ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలీ లంబోర్గినీ భారత్‌లో అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. 2021లో 69 కార్లను విక్రయించింది. 2020తో పోలిస్తే ఇది 86 శాతం అధికం. భారత్‌లో లంబోర్గినీ కార్ల ధర రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2019లో దేశంలో 52 లంబోర్గినీ కార్లు రోడ్డెక్కాయి. 52 మార్కెట్లలో 173 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 8,405 యూనిట్లను విక్రయించింది. సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో ఇదే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ది. తొలి స్థానంలో ఉన్న యూఎస్‌లో 2,472 యూనిట్లు అమ్ముడయ్యాయి. చైనా, జర్మనీ, యూకే, ఇటలీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
2022లో పెరగనున్న కార్లు, బైక్స్ కంపెనీల జాబితా ఇదే..!
భారత్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయా వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి. కార్లతో పాటుగా టూవీలర్ వాహనాల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ కంపెనీలు ధరల పెంపు అనివార్యమని ప్రకటించాయి. అధిక ఇన్పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు అలాగే సరఫరా అంతరాయాలు మార్జిన్లను దెబ్బతీస్తున్నందున, భారత్‌లోని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ముడి సరకుల ధరలు పెరగడంతో 2021 ఏడాది పొడవునా అనేకసార్లు ఆటోమొబైల్ కంపెనీలు ధరలను పెంచాయి. 2022 నుంచి ధరలను పెంచనున్న కంపెనీలు..! మారుతీ సుజుకి: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఈ నెల ప్రారంభంలో తన అన్ని మోడళ్లకు జనవరి 2022 నుంచి ధరల పెంపును ప్రకటించింది. భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ తాజా ధరల పెంపునకు వాహనాల తయారీ వ్యయం పెరగడమే కారణమని పేర్కొంది. హీరో మోటోకార్ప్: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది జనవరి 4 నుంచి తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. స్ప్లెండర్ బైక్‌ల తయారీకోసం క్రమంగా పెరుగుతున్న వస్తువుల ధరలే దీని కారణమని తెలుస్తోంది. టాటా మోటార్స్: స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ కార్ల ధరలను జనవరి 2022 నుంచి పెంచనుంది. టాటా కార్లపై రానున్న ధరల పెంపు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఐసీఈ ప్యాసింజర్ కార్లకు కూడా వర్తించనుంది. డుకాటి ఇండియా: రేసింగ్ బైక్స్‌లో పేరుగాంచిన ఇటాలియన్ బైక్ మేకర్ డుకాటి ఇండియా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భారత్‌లో తన అన్ని మోడల్స్/వేరియంట్ల ధరలను పెంచనుంది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన తొమ్మిది డీలర్‌షిప్‌లలో డుకాటి బైక్స్ ధరలు పెరగనున్నాయి. ఆడి ఇండియా: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా 2022 జనవరి 1 నుంచి తన మోడళ్ల ధరలను పెంచబోతోంది. కంపెనీలోని ఆయా కార్ల ధరలు మూడు శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టయోటా: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తన కార్ల ధరలను జనవరి 1, 2022 నుంచి పునఃసమీక్షించనుంది. ముడి పదార్థాలతో సహా ఇన్పుట్ ఖర్చులలో నిరంతర పెరుగుదలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఈ నెల ప్రారంభంలో పంపిన ప్రెస్ నోట్లో తెలిపింది. కవాసకి: డుకాటితో పాటు, కవాసకి కూడా జనవరి 1, 2022 నుంచి భారత్‌లోతన మోడళ్లలో ధరలను పెంచనుంది. గతంలో ఆగస్టు 2021లో కవాసకి తన ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచింది. వీటితో పాటుగా సిట్రోయెన్ ఇండియా, స్కోడా , వోక్స్వ్యాగన్ వంటి ఇతర ఓఈఎమ్స్ కూడా వచ్చే ఏడాది నుంచి ధరలను పెంచనున్నాయి. చదవండి: అలర్ట్: జనవరిలో నెలలో బ్యాంక్ హాలిడేస్..! ఎన్ని రోజులంటే..! -
భారత్ ఆటోమొబైల్.. ‘అమ్మో’రికా!
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో.. అమెరికన్ కంపెనీలు రాణించలేక చతికిలపడుతున్నాయి. ఆశావహ అంచనాలతో అడుగుపెట్టడం.. ఆఖరుకు తట్టా బుట్టా సర్దుకుపోవడం యూఎస్ బ్రాండ్లకు పరిపాటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. భారత్ మార్కెట్ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం.. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉండడం వాటి వైఫల్య కారణాల్లో ప్రధానమైనవి. జనరల్ మోటార్స్ (చెవ్రోలెట్), హార్లే డేవిడ్సన్ నష్టాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించగా.. తాజాగా ఫోర్డ్ మోటార్స్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లో దిగ్గజ బ్రాండ్లు కావడం గమనార్హం. దీంతో భారత ఆటో మార్కెట్ ప్రపంచ ఆటో దిగ్గజాలకు, ముఖ్యంగా అమెరికన్ కంపెనీలకు ఎందుకు మిస్టరీగా ఉంటోందన్న ప్రశ్న మరోసారి ఉదయించింది. ముందు అంచనాలు ఘనంగానే ఉంటాయి. కానీ భారత్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత అమెరికా కంపెనీల అంచనాలు మారిపోతున్నాయి. ఒక స్థాయికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీలు సాహసించడం లేదు. ఇదే మార్కెట్లో దక్షిణ కొరియా, జపాన్, ఆఖరుకు చైనా కంపెనీలు పోటీపడుతూ బలంగా చొచ్చుకుపోతుంటే.. అమెరికా కంపెనీలకే ఈ పరిస్థితి ఎందుకన్నది చర్చనీయాంశంగా మారింది. వృద్ధి బలహీనం భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంటోంది. దీనికితోడు 2010 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం మధ్య విక్రయాల్లో వార్షిక వృద్ధి 3.6 శాతం మించి లేదు. అంతకుముందు పదేళ్ల కాలంలో విక్రయాల్లో వృద్ధి 10 శాతంపైనే కొనసాగుతూ వచ్చింది. వృద్ధి బలహీనంగా> ఉండడం కూడా అమెరికా కంపెనీల కష్టాలకు కారణమేనని చెప్పుకోవచ్చు. 2011లో ఫోర్డ్ అత్యధికంగా 98,537 కార్లను విక్రయించగా.. అదే గరిష్టంగా మిగిలిపోయింది. ఇందులో సగం కార్లను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక్క నెలలోనే విక్రయిస్తుండడాన్ని పరిశీలించాలి. మారుతి సుజుకీ తర్వాత దేశీ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ రెండో దిగ్గజంగా కొనసాగుతోంది. ఫలించని ఫోర్డ్ ప్రయత్నాలు ఫోర్డ్ మోటార్స్ 2019లో మహీంద్రా అండ్ మహీంద్రాతో కలసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ఫోర్డ్‌కు 49 శాతం వాటా, మహీంద్రాకు మెజారిటీ వాటాను ప్రతిపాదించాయి. ఈ ప్రయత్నంతో అయినా నష్టాలకు చెక్‌పెట్టి.. లాభాల్లోకి ప్రవేశించొచ్చని ఫోర్డ్ ఆశపడగా.. అది కూడా సఫలం కాలేదు. జాయింట్ వెంచర్ ప్రతిపాదన నుంచి రెండు సంస్థలు గతేడాది విరమించుకున్నాయి. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత పదేళ్లలో రెండు బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను (రూ.15వేల కోట్లు) మూటగట్టుకున్న ఫోర్డ్.. ఇక్కడ ఇక నెగ్గలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. ఫలితమే నిష్క్రమణ నిర్ణయం. ఖరీదైన బైక్‌లకు పేరొందిన హార్లేడేవిడ్సన్ కూడా 2020 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ప్రత్యక్ష కార్యకలాపాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించడం గమనించాలి. విక్రయాలు ఆశించిన మేర లేకపోవడం, బైక్‌ల తయారీని స్థానికంగా చేపట్టకుండా దిగుమతులపైనే ఈ సంస్థ ఆధారపడడం ప్రతిబంధకాలుగా మారాయి. దిగుమతి చేసుకునే బైక్‌లపై పన్నుల భారం అధికంగా ఉండడంతో.. దీన్ని తగ్గించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పలు సందర్భాల్లో భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు కూడా. అయినా ఆ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదు. దీంతో భారత్‌లో నేరుగా విక్రయ కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్టు హార్లే డేవిడ్సన్ ప్రకటించింది. ఆ తర్వాత భారత్‌లో హార్లే డేవిడ్సన్ విక్రయాలు, సర్వీసు కోసం హీరో మోటోతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. సరైన వ్యూహాల్లేకపోవడం? భారత కస్టమర్లు ‘వ్యాల్యూ ఫర్ మనీ’ చూస్తారు. తాము పెడుతున్న డబ్బుకు తగిన విలువ లభిస్తుందా? అని ఎక్కువ మంది పరిగణించే అంశం. అమెరికా దిగ్గజాలు.. ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో మాదిరే భారత్‌లోనూ ‘బిగ్ ఈజ్ బ్యూటిఫుల్’ (పెద్దదే ముద్దు) మంత్రం ఫలిస్తుందన్న అంచనాలు తప్పాయి. చిన్న కార్లు, తక్కువ ఖరీదున్న బైక్‌లకే ఇక్కడ పెద్ద మార్కెట్ అన్న సూక్ష్మాన్ని అవి గుర్తించలేకపోయాయి. భారత్‌లో ప్రతీ 10 కార్లు, మోటారుసైకిళ్ల విక్రయాల్లో 7 బడ్జెట్ విభాగంలోనివే ఉంటున్నాయి. పైగా ఇతర మార్కెట్లలో మాదిరే ఉత్పత్తులు, మార్కెటింగ్ విధానాలు భారత్‌లో ఫలిస్తాయన్న అంచనాలూ సరికాదు. భారత కస్టమర్లు విక్రయానంతర సేవలనూ దృష్టిలో పెట్టుకుంటారన్నది నిజం. మారుతీ, హ్యాందాయ్, ఇటీవలే ప్రవేశించిన కియా మెరుగ్గా రాణించడానికి మార్కెట్నాడిని పట్టుకోవడం వల్లేనని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు. ‘‘జపాన్, కొరియా సంస్థల్లా కాకుండా.. ఇతర పాశ్చాత్య వాహన కంపెనీలు బలహీన యాజమాన్య నిర్వహణ, భారత్ లో పోటీ విషయం లో బలహీన అంచనా లే అవి రాణించలేకపోవ డానికి కారణాలు’’ అని రెనో అండ్ స్కోడా భారత ఆపరేషన్స్‌కు గతంలో చీఫ్‌గా పనిచేసిన సుధీర్‌రావు చెప్పారు. పన్నుల పాత్ర.. జీఎం, ఫోర్డ్, ఇతర అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు భారత్‌లో విజయం సాధించలేకపోవడం వెనుక పన్నుల పాత్ర కూడా ఉందని పరిశ్రమల వర్గాల అభిప్రాయంగా ఉంది. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉన్న విషయాన్ని పేర్కొంటున్నారు. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.2 లీటర్ల సామర్థ్యం వరకు ఇంజన్లు కలిగిన కార్లపై జీఎస్టీ 28 శాతం, ఒక శాతం సెస్సు అమల్లో ఉంది. ఇంతకుమించి పొడవు, ఇంజన్ సామర్థ్యాలతో కూడిన కార్లపై పన్ను భారం 50% వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా పన్నుల విధానం లేదని టొయోటా కిర్లోస్కర్ మోటార్ మాజీ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ పేర్కొన్నారు. చిన్న కార్ల మోడళ్లను తీసుకొచ్చినా విక్రయాలు భారీగా ఉంటే తప్ప లాభసాటి కాదన్నారు. ‘టొయోటా ఒక్క ఇన్నోవా వాహనం విక్రయంపై వచ్చిన లాభాన్ని.. చిన్న కార్ల నుంచి తెచ్చుకోవాలంటే కనీసం 80 ఎటియోస్లను విక్రయించాల్సి ఉంటుంది’ అన్నారు. -
ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు టెక్ నిపుణుల వెంట పడ్డాయేంటి? అన్న సందేహం రాకమానదు. కానీ, కరోనా అనంతరం మారిన పరిస్థితులు, ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో కంపెనీలు టెక్నాలజీ నిపుణులపై పెద్ద ఎత్తున ఆధారపడడం తప్పడం లేదు. అధిక వేతనం ఆఫర్ ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా టెక్నాలజీ నిపుణులను ఆటోమొబైల్ కంపెనీలు నియమించుకుంటున్నాయి. 35–40 శాతం అధిక వేతన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పెద్ద ఎత్తున డిజిటైజేషన్ నడుస్తుండడం.. వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడం కారణంగా.. ఆన్లైన్ విక్రయాలను పెంచుకునే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో సరఫరా వ్యవస్థలో సమస్యలను అధిగమించేందుకు.. కొనుగోళ్లు, తయారీ కార్యక్రమాల పర్యవేక్షణకు టెక్నాలజీయే కీలకమని అవి గుర్తించాయి. వీరికి డిమాండ్ టీమ్‌లీజ్ సంస్థ వద్దనున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆటోమొబైల్ పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ నిపుణల నియమాకాలు కరోనా ముందు 2019తో పోలిస్తే 45 శాతం పెరగడం గమనార్హం. ‘‘గత రెండేళ్ల నుంచి వినియోగదారులు ఆన్లైన్ వేదికలపై వాహనాల గురించి తెలుసుకొని, కొనుగోలు చేయడం పెరిగింది. దీంతో ఆటోమోటివ్ కంపెనీలు కార్యకలాపాలను డిజిటైజ్ చేసి, వర్చువల్ విక్రయాలకు (ఆన్లైన్) వీలు కల్పించేందుకు, సౌకర్యం, సమర్థత పెంచేందుకు ఎక్కువ సమయం కృషి చేస్తున్నాయి’’ అని టీమ్‌లీజ్ డిజిటల్ ఏవీపీ (డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్) మునీరా లోలివాలా చెప్పారు. వాహన తయారీదారులు తమ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా డిజిటల్‌గా మార్చేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం, డీలర్ల స్థాయిలో వనరులను మెరుగ్గా వినియోగించుకోవడంతోపాటు.. మొత్తం కొనుగోలు ప్రక్రియను మార్చే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడాన్ని గమనించాలి. ఇంత పెద్ద స్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం నిపుణుల అవసరాలను గణనీయంగా పెంచినట్టు లోలివాలా చెప్పారు. డిజిటల్ మార్కెటింగ్, వినియోగదారుల సేవలు, వాహన ముందస్తు నిర్వహణ విభాగాల్లో నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. మూడు నెలల్లోనే 18 వేల మంది.. ప్రస్తుత త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) 18,000 టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడినట్టు లోలివాలా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 25,000ను చేరుకోవచ్చని ఆమె చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ డిమాండ్ 15–18 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. విక్రయాలు, మార్కెటింగ్ విభాగాల్లో డేటా అనలిటిక్స్ నిపుణుల నియామకాలను పెంచినట్టు కార్ల తయారీ సంస్థలు సైతం అంగీకరిస్తున్నాయి. వినియోగదారులు డిజిటల్ చానళ్లవైపు మళ్లడంతో విచారణ నిర్వహణకు హైపర్ లోకల్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘ప్రస్తుతం 35 శాతం విచారణలు (కొనుగోళ్లకు సంబంధించి వివరాలు) డిజిటల్ చానళ్ల నుంచే వస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 శాతం పెరిగింది. లాక్డౌన్ల సమయాల్లో అయితే ఇది 50 శాతం వరకు ఉంది’’ అని శ్రీవాస్తవ వివరించారు. విక్రయాలకు సంబంధించి 26 టచ్పాయింట్లకు గాను 24ను డిజిటల్‌గా మార్చినట్టు.. మిగిలినవి కేవలం పరీక్షల కోసం ఉద్దేశించినవిగా చెప్పారు. ‘‘డిజిటల్ టూల్స్‌తో మా ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో డేటాను ఉపయోగించుకుని కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించాలన్నది మా ప్రయత్నం. ఇటువంటి అధునాతన డిజిటల్ టూల్స్ వినియోగం వల్ల సీఆర్ఎం కార్యకలాపాలకు సంబంధించి నియామకాల్లో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో అధిక నైపుణ్యాలున్న వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. డిమాండ్ ఇలా... - ఆటోమొబైల్ రంగంలో ఈ త్రైమాసికంలోనే 18,000 నిపుణులకు డిమాండ్ నెలకొంది. - ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 నియామకాలకు డిమాండ్ పెరగొచ్చన్న అంచనా. - 2022–23లో ఇటువంటి నిపుణులకు 15–18% అదనపు డిమాండ్ ఉండొచ్చు. - ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో చేయి తిరిగి నిపుణులకు డిమాండ్ 45 శాతం పెరిగింది. - 35–40 శాతం అధిక వేతనాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. చదవండి: ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు -
వాహనాల తనిఖీ కోసం రీకాల్ చేస్తున్న మహీంద్రా
భారతీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మంగళవారం జనవరి 2020 - ఫిబ్రవరి 2021 మధ్య తయారు చేసిన కొన్ని పికప్ వాహనాల్లో ఫ్లూయిడ్ పైపును తనిఖీ చేయడానికి రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. "ఇది కేవలం 29878 వాహనాల బ్యాచ్ కు మాత్రమే పరిమితం చేసినట్లు" అని కంపెనీ తెలిపింది. "తనిఖీ చేసిన తర్వాత ఏవైనా లోపాలు ఉంటే రెక్టిఫికేషన్ అనేది కస్టమర్లందరికీ ఉచితంగా నిర్వహించనుంది" అని అధికారిక ప్రకటనలో తెలిపింది. గత నెలలో నాసిక్ ప్లాంటులో తయారు చేసిన 600 డీజిల్ ఇంజిన్ వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కలుషితమైన ఇంధనం కారణంగా ఇంజిన్ భాగాలు త్వరగా డ్యామేజ్ అవుతున్నట్లు గమనించిన తర్వాత వాహనాలను తనిఖీ చేసి వాటి భాగంలో కొత్తవి రీప్లేస్ చేస్తున్నట్లు పేర్కొంది. -
అమ్మకాల జోరు, ఏ వాహనాల్ని ఎక్కువగా కొన్నారంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలైలో వాహన అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం విక్రయాలు అధికమై 15,56,777 యూనిట్లు నమోదయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. ప్రయాణికుల వాహనాలు 63 శాతం పెరిగి 2,61,744 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 28 శాతం అధికమై 11,32,611, వాణిజ్య వాహనాలు రెండున్నరెట్లు ఎగసి 52,130 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 82,388 యూనిట్లుగా ఉంది. సెమికండక్టర్ల కొరత ప్రయాణికుల వాహన విభాగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. -
ఏపీలో డావ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనాకు చెందిన డావ్ ఈవీటెక్.. భారత్‌లో ఆటోమొబైల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నానికి దగ్గరలో దీనిని నెలకొల్పనుంది. 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ బాలాజీ అచ్యుతుని సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఏటా 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు బ్యాటరీ, చాసిస్, కంట్రోలర్స్, మోటార్ల తయారీ సైతం ఇక్కడ చేపడతామని చెప్పారు. నవంబర్‌లో ఈ కాంప్లెక్స్ నుంచి తొలి ఉత్పాదన రెడీ అయ్యే అవకాశముందన్నారు. మూడేళ్లలో రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని, ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. 40 దాకా అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు. ఫిబ్రవరిలో తొలి వాహనం.. డావ్ ఈవీటెక్ భారత్‌లో తొలి వాహనాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది ఆరు మోడళ్లను ప్రవేశపెడతామని డావ్ ఈవీటెక్ చైర్మన్ మైఖేల్ లియో వెల్లడించారు. అంతర్జాతీయంగా 25 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో సాధించిన అనుభవంతో భారత్‌లో అడుగుపెడుతున్నట్టు చెప్పారు. గంటకు 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే లో స్పీడ్ మోడళ్లు 3... అలాగే 25 కిలోమీటర్లకంటే వేగంగా ప్రయాణించే హై స్పీడ్ మోడళ్లు 3 అందుబాటులోకి తెస్తారు. వీటిలో ఇంటర్నెట్తో అనుసంధానించిన వాహనాలు కూడా ఉంటాయని కంపెనీ సీవోవో లానా జోయో తెలిపారు. కాగా, వాహనాల ధర లోస్పీడ్ అయితే రూ.50–75 వేలు, హై స్పీడ్ మోడళ్లు రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే మోడల్‌ను బట్టి 100–125 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. సొంత ప్లాంటు రెడీ అయ్యే వరకు హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ వద్ద ఉన్న అసెంబ్లింగ్ ప్లాంటులో టూ వీలర్లు రూపుదిద్దుకుంటాయి. -
కియా ‘మేడిన్ ఆంధ్రా’సెల్టోస్ వచ్చేసింది..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా భారత్‌లో తమ తొలి కారు ’సెల్టోస్’ను ఆవిష్కరించింది. అనంతపురం ప్లాంటులో గురువారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్–కిల్, కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హున్ షిమ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టెస్టింగ్ చేసిన అనంతరం సెల్టోస్ వాహనాల పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించినట్లు కియా మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనోహర్ భట్ తెలిపారు. జూలై 16న ప్రీ–బుకింగ్స్ ప్రారంభమైనప్పట్నుంచి కేవలం మూడు వారాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 23,311 కార్లు బుక్ అయ్యాయని ఆయన వివరించారు. ఆగస్టు 22 నుంచి కారు డెలివరీలు ప్రారంభించనున్నట్లు భట్ వివరించారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ఎనలేని సహాయ, సహకారాల తోడ్పాటుతో మేం నిర్దేశించుకున్న రికార్డు సమయంలో సెల్టోస్ కార్లను ఉత్పత్తి చేయగలిగాం. భారత మార్కెట్‌కి సంబంధించిన మా నిబద్ధతకు ఈ తొలి సెల్టోస్ నిదర్శనం‘ అని ఈ సందర్భంగా కూక్ హున్ షిమ్ చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, కియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాంట్ నుంచి బయటికొస్తున్న కియా సెల్టోస్ కారు పక్క చిత్రంలో కొత్త కారుపై సంతకాలు చేస్తున్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, రోజా తదితరులు విదేశాలకు ఇక్కణ్నుంచే ఎగుమతులు.. సెల్టోస్ కారును ఇక్కణ్నుంచే దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కియా మోటార్స్ ఎగుమతి చేయనుంది. భారత్‌లో కియా మోటార్స్ దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. ఇందులో 1.1 బిలియన్ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్ చేసింది. దీనితో 11,000 మందికి ఉపాధి లభిస్తుందని కియా తెలిపింది. వీరిలో పర్మనెంటు సిబ్బంది 4,000 మంది కాగా, 7,000 మంది తాత్కాలిక సిబ్బంది ఉంటారు. 536 ఎకరాల్లో ప్లాంటు .. అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంటు ఏర్పాటైంది. వార్షికంగా దీని ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు కాగా, భవిష్యత్‌లో 7 లక్షల యూనిట్లకు కియా పెంచుకోనుంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారుచేసేలా ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరిలో కియా మోటార్స్ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ ప్లాంటులో వినియోగిస్తోంది. సెల్టోస్ ప్రత్యేకతలివీ .. మధ్య స్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల కోవకి చెందినది కియా సెల్టోస్. కొత్తగా ప్రకటించిన బీఎస్6 కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా సెల్టోస్ కార్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, ఈ విభాగంలో తొలిసారిగా 1.4 టర్బో పెట్రోల్ వేరియంట్స్‌లో కారు లభిస్తుంది. వాహనదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా 3 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్‌లోను, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లలోనూ సెల్టోస్ లభిస్తుంది. సంపూర్ణ సహకారం వైజాగ్–చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ఆర్టీసీలో క్రమంగా అన్నీ ఎలక్ట్రిక్ బస్సులు సెల్టోస్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సందేశం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలతో పాటు రాయితీలు కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. దివంగత నేత, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నానని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా పంపిన సందేశంలో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వాస్తవానికి కియా సెల్టోస్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రావాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో పరిణామాలతో పాటు గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించే పని ఉండటంతో హాజరుకాలేకపోయారని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వ ఆకాంక్ష. వాస్తవానికి కియా మోటార్స్ ఏర్పాటు అనేది దివంగత నేత, మా నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి 2007లో హ్యుందాయ్ మోటార్స్ సంస్థ ఇచ్చిన హామీ. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్‌ను కియా ఏర్పాటు చేసింది. అందువల్ల వ్యక్తిగతంగా హాజరుకావాలని భావించాను. అయితే, అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీనిస్తున్నాను. కియా ఏర్పాటు వల్ల ఇక్కడ ఆటోమొబైల్ రంగంతో పాటు విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. విశాఖపట్నం–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు వల్ల పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఈ కారిడార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది’’ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. ఆటోమొబైల్‌కు అనుకూలం.. ‘‘అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో ఆటోమొబైల్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది’’ అని జగన్ తెలిపారు. ఇక రాష్ట్రంలో ఆర్టీసీలో ప్రస్తుతమున్న బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించారు. కియాకు ఏపీఐఐసీ మరో 143 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఐఐసీ చైర్మన్ రోజా తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకు కచ్చితంగా 75 శాతం ఉద్యోగాలివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి అనుగుణంగా కియా మోటార్స్ కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆమె సూచించారు. -
11% తగ్గిన పండుగ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయంగా వాహన కంపెనీల రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది పండుగల సీజన్లో 11 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాలు, టూ–వీలర్ల అమ్మకాలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. గత కొన్నేళ్లలో పండుగల సీజన్ ఇంత నిస్సారంగా ఉండడం చూడలేదని ఫాడా ప్రెసిడెంట్ అశీష్ హర్షరాజ్ కాలే పేర్కొన్నారు. ఇంధనం ధరలు అధికంగా ఉండటం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల కొరత తీవ్రంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం, వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం.. వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించారు. వాహన విక్రయాలకు ఎన్బీఎఫ్సీలు కీలకమని, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలని ఆర్బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఫాడా వెల్లడించిన వివరాల ప్రకారం.., ∙రిటైల్ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా గణిస్తారు. టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఈ సెగ్మెంట్లో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన నిల్వలు డీలర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది పండుగల సీజన్లో 23,01,986గా ఉన్న మొత్తం రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది పండుగల సీజన్లో 20,49,391కు పడిపోయాయి. ఇక ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్లు 3,33,456 నుంచి 2,87, 717కు తగ్గాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు 18,11,703 నుంచి 13 % తగ్గి 15,83,276కు పడిపోయాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ వాహన రిటైల్ అమ్మకాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకూ 1,12,54,305గా ఉన్న వాహన రిటైల్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 7 శాతం పెరిగి 1,19,89,705కు పెరిగాయి. -
లైఫ్‌లో ఏదీ సులభంగా అందదు
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని అంటారు. ఇప్పుడు దానిని కాస్త మార్చి మహిళా సీఈవోలను చూసి, కంపెనీలని చూడాలని అంటున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో అత్యున్నత పదవులకు మహిళల నియామకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దినట్టే మహిళలు కంపెనీనీ సమర్థంగా నిర్వహిస్తారనే భావన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ తమ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్ఓ) మొట్టమొదటిసారిగా ఒక మహిళను నియమించింది. భారత్‌లోని చెన్నైకి చెందిన దివ్య సూర్యదేవరను సీఎఫ్ఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.జనరల్ మోటార్స్‌లో దివ్య 2005 సంవత్సరంలో చేరారు. వివిధ స్థాయిల్లో ఎన్నో పదవులు నిర్వహించారు. 2017 జూలై నుంచి ఆమె కార్పొరేట్ ఫైనాన్స్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. సెప్టెంబర్ నుంచి సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే జనరల్ మోటార్స్ కంపెనీ సీఈవోగా మేరీ బర్రా అనే మహిళే ఉన్నారు. అంతే కాకుండా హెర్షే కో, సిగ్నెట్ జ్యుయలర్స్ వంటి ప్రసిద్ధ కంపెనీలకు సీఈవో, సీఎఫ్ఓలుగా మహిళలే ఉన్నారు. ‘‘పెద్ద పెద్ద కంపెనీలన్నీ అత్యున్నత స్థాయి పదవుల్లో మహిళల్నే నియమించడం నిజంగా గర్వ కారణం. ఇది సంబరాలు చేసుకునే సమయం’’ అని మహిళలు అత్యున్నత స్థాయికి వెళ్లడానికి శిక్షణనిచ్చే స్వచ్ఛంద సంస్థ సీనియర్ డైరెక్టర్ అన్నా బెనింగర్ వ్యాఖ్యానించారు. చదువులకోసం అప్పులు బ్యూక్, కాడిలాక్, చావర్లెట్ వంటి కార్లను రూపొందించే అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీ జనరల్ మోటార్ ఆర్థిక వ్యవహారాల బాధ్యతల్ని చూడటం అంటే ఆషామాషీ కాదు. ఈ స్థాయికి దివ్య ఎదగడం వెనుక ఆమె అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయి. తాను చేరిన సంస్థలోనే అత్యున్నత స్థాయికి ఎదగడంతో దివ్య ఆనందం పట్టలేకపోతున్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నతనంలో తను ఎన్ని కష్టాలు పడ్డారో గుర్తు చేసుకున్నారు. ‘‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. దీంతో అమ్మ ఒక్కతే రెక్కలు ముక్కలు చేసుకుంటూ మమ్మల్ని పెంచింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అప్పోసొప్పో చేసి మరీ చదివించింది. పెద్ద చదువులు చదివి పైకి ఎదగాలని మా అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది. జీవితంలో ఏదీ సులభంగా అందదని నాకు చిన్నవయసులోనే అర్థమైంది. ఉన్నత చదువుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఉద్యోగం వచ్చాక నేనే చెల్లించాను. అమెరికాకు వచ్చాక సాంస్కృతిక తేడాల కారణంగా అలవాటు పడటానికి సమయం పట్టింది’’ అంటూ ఆమె తన మనోగతాన్ని వెల్లడించారు. మద్రాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివి దివ్య ఆ తర్వాత అమెరికాకు వచ్చేశారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్‌లో తొలుత ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 25 ఏళ్లకే జనరల్ మోటార్లో చేరారు. దివ్యలో ప్రతిభ, ఆమె అనుభవం, నాయకత్వ లక్షణాలతో జీఎం మంచి వాణిజ్యపరమైన లాభాలు చూసిందని ఆ సంస్థ కొనియాడింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
టయోటా యారిస్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా తమ బ్రాండ్ వినియోగదారులకు కార్ల సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేయనుంది. యారిస్ పేరుతో సీ- సెగ్మెంట్ కారును ప్రవేశపెడుతోంది. వచ్చే నెల నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చని, మే నుంచి అమ్మకాలు మొదలవుతాయని సంస్థ తెలిపింది. తమ కొత్త యారిస్... హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్, హ్యూందాయ్ వెర్నాలకు గట్టిపోటీనిస్తుందని సంస్థ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ బ్రాండ్ వినియోగదారులకు ఇతియోస్ సెడాన్, కరోలా అట్లిస్ వంటి ఉత్తమ కార్లను అందజేశామని, ఇప్పుడు యారిస్ కూడా అందరి అభిమానాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యారిస్ ఫీచర్లు... 1.5 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం గల ఇంజన్ రెండు గేర్ బాక్సులు(6- స్పీడ్ మాన్వల్ లేదా 7- స్ఫీడ్ సీవీటీ ఆటోమేటిక్) 7 ఎయిర్ బ్యాగులు ధర : 10 నుంచి 12 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం) -
డీలర్ల సమాఖ్యతో ‘కార్దేఖో’ ఒప్పందం
న్యూఢిల్లీ: కార్ల డీలర్లు ఆన్‌లైన్‌లోనూ వాహనాల విక్రయం చేపట్టేందుకు తోడ్పాటు అం దించేలా ఆన్లైన్ ఆటోమొబైల్ సంస్థ కార్‌దేఖోడాట్‌కామ్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) చేతులు కలిపాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆన్లైన్లో వాహనాల లిస్టింగ్ ప్రక్రియను, వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడే వ్యూహాలు తదితర అంశాల గురించి డీలర్లకు అవగాహన కల్పిస్తామని కార్‌దేఖోడాట్‌కామ్ సీఈవో అమిత్ జైన్ తెలిపారు. ప్రస్తుతం అంతా డిజిటల్ మీడియా హవా నడుస్తున్న నేపథ్యంలో కార్ డీలర్లు, ఆటోమొబైల్ సంస్థలు ఈ శక్తివంతమైన మాధ్యమం ద్వారా మరిన్ని వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆయన చెప్పారు. ఇక వాహనాలకు సంబంధించిన సమాచార సేకరణ ఎక్కువగా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారానే జరుగుతున్నందున, కార్దేఖో వంటి సంస్థతో భాగస్వామ్యం డీలర్లకు లాభిస్తుందని ఎఫ్ఏడీఏ డెరైక్టర్ నికుంజ్ సంఘీ చెప్పారు. -
పెరగనున్న హ్యుందాయ్ కార్ల రేట్లు
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఆగస్టు 1 నుంచి తమ కార్ల రేట్లను రూ. 30,000 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం క్రెటా మినహా మిగతా అన్నింటి రేట్లు పెరగనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. ముడివస్తువుల వ్యయాల పెరుగుదలను తట్టుకోవడానికి వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని ఆయన వివరించారు. ఇయాన్, ఐ10 (చిన్న కార్లు), వెర్నా, సోనాటా (సెడాన్లు), శాంటా ఫే (ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) మొదలైన కార్లను హ్యుందాయ్ ప్రస్తుతం విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.08 లక్షల నుంచి రూ. 30.21 లక్షలు (ఎక్స్‌షోరూం ఢిల్లీ) దాకా ఉన్నాయి. కంపెనీ ఈ మధ్యే రూ. 8.59-13.6 లక్షల శ్రేణిలో క్రెటా ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. -
హ్యుందాయ్ క్రెటా వచ్చేసింది..
రేటు రూ. 8.59 లక్షల నుంచి ప్రారంభం న్యూఢిల్లీ : దేశీయంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) మార్కెట్లో ఆధిపత్యాన్ని దక్కించుకునే లక్ష్యంతో ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా మంగళవారం ‘క్రెటా’ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ ఎస్యూవీ ధరలు రూ. 8.59 లక్షల నుంచి రూ. 13.6 లక్షల దాకా ఉంటాయి. భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు క్రెటా ఉపయోగపడగలదని, దీన్ని అంతర్జాతీయంగా ఇతర మార్కెట్లలోనూ ఆవిష్కరిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ బీఎస్ సియో తెలిపారు. గడచిన 20 రోజుల్లో 15,000 పైచిలుకు ప్రీ-బుకింగ్స్ వచ్చినట్లు ఆయన వివరించారు. కొరియాలో డిజైన్ చేసిన క్రెటాను అభివృద్ధి చేయడంపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్.. చెన్నైలోని తమ ఇంజినీర్లు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నట్లు సియో తెలిపారు. ఫైవ్ సీటర్ క్రెటాలో అత్యాధునిక నేవిగేషన్ సిస్టం, పుష్ బటన్ స్టార్ట్, లెదర్ సీట్లు మొదలైన ఫీచర్లు ఉంటాయి. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 8.59-11.19 లక్షలుగాను, డీజిల్ వెర్షన్స్ రేట్లు రూ. 9.46-13.6 లక్షలు దాకా ఉంటాయి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా సఫారీ స్టార్మ్ మొదలైన వాటితో క్రెటా పోటీపడనుంది. వీటి ధర రూ. 6.75-15.99 లక్షల దాకా ఉంది. -
స్వల్పశ్రేణిలో షేర్ల కదలికలు!
ఇన్వెస్టర్ల పొజిషన్లు అంతంతే... సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీల విక్రయాల డేటా నేపథ్యంలో అప్రమత్తత ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా న్యూఢిల్లీ: సంవత్సరాంతపు రోజులు కావడంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ పొజిషన్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని... దాంతో ఈ వారం షేర్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. అలాగే సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీల డిసెంబర్ నెల అమ్మకపు గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పారు. 2014లో ఇప్పటివరకూ 30% పెరిగిన బీఎస్ఈ , సెన్సెక్స్, ఎన్ ఎస్ఈ నిఫ్టీలు ఈ సంవత్సరాంతపువారంలో కన్సాలిడేట్ కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపవచ్చని వారు వ్యాఖ్యానించారు. ఈ వారం జనవరి 2న హెచ్ఎస్బీసీ తయారీ సూచీకి సంబంధించిన డేటా వెల్లడవుతుందని, దీనికి తోడు డిసెంబర్ నెలకు సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీలు సేల్స్ డేటా వెలువడుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మలిక్ చెప్పారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, రూపాయి కదలికలు సమీప భవిష్యత్తులో మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని క్యాపి టల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అన్నారు. ఈ వారం మార్కెట్ స్వల్పశ్రేణిలో కదలవచ్చని, మధ్యకాలికంగా నిఫ్టీ 8,100-8,550 మధ్య ట్రేడ్‌కావొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ అంచనావేశారు. 2015 జనవరి రెండోవారం నుంచి వెలువడే కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు మార్కెట్లను భారీగా కదల్చవచ్చని నిపుణులు అంటున్నారు. దేశ ఆర్థిక చరిత్రలో 2015 ఏడాది ప్రధానమైనదిగా నిలుస్తుందని, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి బాటలు వేసే పలు సంస్కరణలు అమలవుతాయని అంచనావేస్తున్నట్లు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఫండ్ మేనేజర్ నిలేష్ షెట్టి చెప్పారు. 2 బిలియన్ డాలర్లకు ఎఫ్ఐఐ పెట్టుబడులు డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు దాదాపు 2 బిలియన్ డాలర్లకు చేరాయి. డిసెంబర్ 1-26 తేదీల మధ్య ఈక్విటీ మార్కెట్లో వారి పెట్టుబడులు 116 మిలియన్ డాలర్ల (రూ. 553 కోట్లు) మేర ఉన్నాయి. రుణ మార్కెట్లో ఇవి 1.94 బిలియన్ డాలర్లకు (రూ. 12,065 కోట్లు) చేరినట్లు సెబి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం ఎఫ్ఐఐ పెట్టుబడులు 42 బిలియన్ డాలర్లకు (రూ.2.56 లక్షల కోట్లు) పెరిగాయి. ఈక్విటీల్లో 16 బిలియన్ డాలర్లు (రూ. 96 వేల కోట్లు) రుణపత్రాల్లో 26.4 బిలియన్ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్లు) చొప్పున వారు పెట్టుబడి చేశారు. -
మహీంద్రా చేతికి ప్యూజో మోటోసైకిల్స్
51% వాటా కొనుగోలుకు ఒప్పందం డీల్ విలువ రూ. 217 కోట్లు ముంబై: ఆటోమొబైల్ సంస్థ ప్యూజో మోటోసైకిల్స్లో 51 శాతం వాటాలను దేశీ దిగ్గజం మహీంద్రా టూ వీలర్స్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 28 మిలియన్ యూరోలు (దాదాపు రూ. 217 కోట్లు). ఇందుకు సంబంధించిన ఒప్పందంపై మంగళవారం ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఫ్రాన్స్‌కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్ఏ గ్రూప్‌లో ప్యూజో మోటోసైకిల్స్ భాగం. తాజా బైండింగ్ ఒప్పందం ప్రకారం వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే దిశగా మహీంద్రా టూ వీలర్స్ సంస్థ.. ముందుగా ప్యూజోలో 15 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది. తదుపరి మరో 13 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది. ఇతరత్రా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి డీల్ మూడు నెలల్లోగా పూర్తి కావొచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. రెండేళ్ల పాటు ఎటువంటి పునర్వ్యవస్థీకరణ చర్యలు ఉండవని, ఇప్పుడున్న మేనేజ్మెంట్ బృందాన్నే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఎంఅండ్ఎంతో ఒప్పందం తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడగలదని ప్యూజో స్కూటర్స్ ఎండీ ఫ్రెడరిక్ ఫేబర్ పేర్కొన్నారు. దాదాపు 116 ఏళ్ల చరిత్ర గల ప్యూజో యూరప్‌లో ద్విచక్ర వాహనాలు, కార్ల తయారీకి పేరొం దింది. ప్రస్తుతం కంపెనీ ద్విచక్రవాహనాల విభాగం నష్టాల్లో ఉంది. మరోవైపు, కొన్నాళ్ల క్రితమే ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన ఎంఅండ్ఎం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, మంగళవారం ఎంఅండ్ఎం షేరు బీఎస్ఈలో 2.3% నష్టంతో రూ. 1,359 వద్ద క్లోజైంది. -
రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు
ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. కొత్త మోడల్స్ అందించడం, పరిశోధన.. అభివృద్ధి, మార్కెటింగ్ తదితర కార్యకలాపాల కోసం వీటిని వెచ్చించనుంది. భవిష్యత్ పెట్టుబడులపై, గుజరాత్లో కొత్త ప్లాంట్‌పై శనివారం సమావేశమైన మారుతీ సుజుకి ఇండియా డెరైక్టర్ల బోర్డ్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. మారుతీ మాతృసంస్థ సుజుకీ మోటార్స్ చైర్మన్ ఒసాము సుజుకి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పెట్టుబడులు రూ. 3,000 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, వివాదాస్పద గుజరాత్ ప్లాంట్ అంశంపై మైనారిటీ వాటాదారుల ఆమోదం తీసుకోవాలని డెరైక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు సంస్థ చైర్మన్ ఆర్.సి. భార్గవ తెలిపారు. ఈ నిర్ణయానికి కంపెనీ ఇండిపెండెంట్ డెరైక్టర్లు మద్దతు పలికారు. సాధారణంగా కంపెనీ బోర్డ్ తీసుకున్న నిర్ణయాలకు మైనారిటీ వాటాదారుల ఆమోదం పొందాల్సిన అవసరం లేకపోయినా, కార్పొరేట్ గవర్నెన్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని భార్గవ పేర్కొన్నారు. 44 శాతంగా ఉన్న మైనారిటీ వాటాదారుల ఆమోదం పొందగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదం పొందుతామని, ఈ ఆమోదం పొందే ప్రక్రియ ప్రారంభించడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని కంపెనీ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. 32.8% మైనారిటీ వాటాదారులు అనుకూలంగా ఓటు వేస్తేనే తాజా ప్రతిపాదనలు ఓకే అవుతాయి. కాగా మైనారిటీ వాటాదారుల ఆమోదం పొందాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఫండ్‌హౌస్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని, ఇతర ఫండ్ హౌజ్‌లతో చర్చించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అటు, ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ కారును ఈ ఏడాది, కొత్త కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని భార్గవ వివరించారు.