న్యూఢిల్లీ : ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఆగస్టు 1 నుంచి తమ కార్ల రేట్లను రూ. 30,000 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం క్రెటా మినహా మిగతా అన్నింటి రేట్లు పెరగనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. ముడివస్తువుల వ్యయాల పెరుగుదలను తట్టుకోవడానికి వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని ఆయన వివరించారు.
ఇయాన్, ఐ10 (చిన్న కార్లు), వెర్నా, సోనాటా (సెడాన్లు), శాంటా ఫే (ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) మొదలైన కార్లను హ్యుందాయ్ ప్రస్తుతం విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.08 లక్షల నుంచి రూ. 30.21 లక్షలు (ఎక్స్‌షోరూం ఢిల్లీ) దాకా ఉన్నాయి. కంపెనీ ఈ మధ్యే రూ. 8.59-13.6 లక్షల శ్రేణిలో క్రెటా ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.
పెరగనున్న హ్యుందాయ్ కార్ల రేట్లు
Published Sun, Jul 26 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM