Rakesh Srivastava
-
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల తగ్గింపును పండుగ కానుకగా ఆటోమొబైల్ సంస్థలు అభివర్ణించాయి. సాధారణంగా పండుగల సీజన్లో ఆటోమొబైల్ అమ్మకాలు కనీసం 15-20 శాతం పెరుగుతాయని, కానీ గత కొద్ది సంవత్సరాలుగా అలా జరగడం లేదని పేర్కొన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో ఈసారి మళ్లీ ఆ మేర అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని హ్యుందాయ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ చెప్పారు. కస్టమర్లకు ఇది సానుకూల సంకేతమని మారుతీ సుజుకీ ఈడీ ఆర్సీ కాల్సీ అభిప్రాయపడ్డారు. -
పెరగనున్న హ్యుందాయ్ కార్ల రేట్లు
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఆగస్టు 1 నుంచి తమ కార్ల రేట్లను రూ. 30,000 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం క్రెటా మినహా మిగతా అన్నింటి రేట్లు పెరగనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. ముడివస్తువుల వ్యయాల పెరుగుదలను తట్టుకోవడానికి వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని ఆయన వివరించారు. ఇయాన్, ఐ10 (చిన్న కార్లు), వెర్నా, సోనాటా (సెడాన్లు), శాంటా ఫే (ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) మొదలైన కార్లను హ్యుందాయ్ ప్రస్తుతం విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.08 లక్షల నుంచి రూ. 30.21 లక్షలు (ఎక్స్‌షోరూం ఢిల్లీ) దాకా ఉన్నాయి. కంపెనీ ఈ మధ్యే రూ. 8.59-13.6 లక్షల శ్రేణిలో క్రెటా ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. -
హ్యుందాయ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. అన్ని మోడళ్లళ కార్ల ధరలను జవనరి నుంచి రూ.5,000-రూ.20,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ చెప్పారు. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ధరలు పెంచుతున్నామని వివరించారు. ఇప్పటికే మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి, హోండా తదితర కంపెనీలు ధరలను పెంచాయి. -
3 నెలల్లో 30 వేల హ్యుందాయ్ గ్రాండ్ విక్రయాలు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ గ్రాండ్ కార్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. విడుదల చేసిన మూడు నెలల్లోనే 33 వేల కార్లను విక్రయించామని తెలిపారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా మెట్రో, టైర్ టూ నగరాల్లో యువ కొనుగోలుదారుల నుంచి అధిక ఎంక్వైరీలు వచ్చాయని వివరించారు. అధికంగా విక్రయమైన 5 కార్ బ్రాండ్లలో ఇదొకటిగా నిలిచిందని పేర్కొన్నారు. యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్‌తో లభిస్తున్న గ్రాండ్ కారు 24 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.