
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త టుసో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది.
పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్, డీజిల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్, 2 లీటర్ పవర్‌ట్రైయిన్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో రూపుదిద్దుకుంది. కెమెరా, రాడార్ సెన్సార్స్‌తో ఆటోమేటిక్ సెన్సింగ్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ విభాగంలో తొలిసారిగా 29 రకాల ఫీచర్లను జోడించారు.
ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కస్టమర్లు టుసోను సొంతం చేసుకున్నారు. 2021లో అంతర్జాతీయంగా 4.85 లక్షల టుసో కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఏటా సుమారు 40,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయి. 2025 నాటికి ఇది 55,000 యూనిట్లకు చేరవచ్చని కంపెనీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment