hyundai car
-
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్.. ఎందుకంటే..
హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన ఈవీ అయానిక్5 మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)ను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య తయారు చేసిన అయానిక్ 5 మోడల్ కార్లలో ఐసీసీయూలో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ ప్రతినిధి మాట్లాడుతూ..‘కార్ల రీకాల్ అంశాన్ని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్ఐఏఎం)కు తెలియజేశాం. హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా 1,744 యూనిట్ల అయానిక్ 5 మోడల్కార్లను రీకాల్ చేస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్‌ను తనిఖీ చేసి ఏదైనా సమస్యలుంటే అప్‌గ్రేడ్ చేస్తాం. రీకాల్ ప్రక్రియలో కార్ల యజమానులతో సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు వ్యక్తిగతంగా సంప్రదిస్తాయి’ అని తెలిపారు. అయానిక్ 5 ప్రారంభ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఏడాదిలో కంపెనీకి చెందిన కార్లను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి జూన్ 6, 2023 మధ్య తయారు చేసిన క్రెటా, వెర్నా 7,698 యూనిట్లను ఫిబ్రవరిలో రీకాల్ చేశారు. -
కొత్త వెర్షన్లో సిద్దమవుతున్న 'హ్యుందాయ్ ఐ10 నియోస్'.. ప్రత్యర్థులకు ఇక గట్టి పోటీనే!
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ 'హ్యుందాయ్' (Hyundai) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన 'ఐ10' మోడల్ కారు ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఆ తరువాత ఐ10 నియోస్ పుట్టుకొచ్చింది, కాగా ఇప్పుడు 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' రావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇటీవల కెమెరాకి చిక్కాయి. హ్యుందాయ్ నుంచి రానున్న 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. గత కొన్ని సంవత్సరాలు హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో తీసుకురావడానికి శ్రమిస్తూనే ఉంది, అయితే ఇప్పటికి ఆ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఇటీవల ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కనిపించింది. అయితే ఈ వెర్షన్ టెస్టింగ్ సమయంలో చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌కు సమీపంలో కనిపించింది. కావున దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్‌ను గుర్తుకు తెస్తుంది. కొత్తగా రానున్న ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ ముందు మరియు వెనుక చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఖచ్చితమైన డిజైన్ వెల్లడి కాలేదు. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్ కేసింగ్ డిజైన్ వంటివి మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా కొంత అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. రియాక్ర్ ప్రొఫైల్‌లో రిఫ్రెష్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే 2023 ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అప్డేట్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో అందుబాటులో ఉన్న 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ హ్యుందాయ్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!
ఇటీవల ప్రజలు కారు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వాటి సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అయితే హ్యుందాయ్ కంపెనీలోని ఓ మోడల్ కారుని ప్రజలు ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. గతంలో ఈ కారుకి ఫుల్ డిమాండ్. మధ్యతరగతి ప్రజలు ఈ కార్లే కావాలని కొనేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క కారు కూడా కొనలేదు హ్యుందాయ్ కంపెనీలోని శాంత్రో (Santro) మోడల్ కారు మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే పలు కారణాల వల్ల సంస్థ ఈ కారు ఉత్పత్తిని మే 2022లో కంపెనీ నిలిపివేసినప్పటికీ, దాని మూసివేత ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఈ కారు స్టాక్‌ను క్లియర్ చేయాలనుకోవడం దీనికి కారణం. వాస్తవానికి, ఇప్పటికీ కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ కారు జాబితా ఉంచి ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయినా స్టాక్ క్లియర్ చేయలేకపోతోంది. మరోవైపు ఈ కారు సేల్స్ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. అలా ఏకంగా గత అక్టోబర్ నెలలో దీన్ని అమ్మకాలు జీరోగా ఉంది. ఇది కంపెనీకి భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఫ్యామిలీ కారుగా గుర్తింపు సాధించింది శాంత్రో ప్రస్తుతం దాని సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా నిరాశపరిచింది. ఏడాది కిందట చూస్తే.. శాంట్రో అమ్మకాలు 2877 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2018లో శాంత్రో కారును రీలాంచ్ చేసి దీని ప్రారంభ ధర రూ. 3.9 లక్షలుగా నిర్ణయించింది. అయితే నాలుగేళ్ల కాలంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.7 లక్షలకు చేరింది. ఇక ధర పెరగడంలో కొనే వారు కరువైనట్లు తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్! -
దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు!
అక్టోబర్ నెల రావడంతో పండగ కల వచ్చేస్తోంది. ప్రారంభంలో దసరాతో వచ్చి పోతూ పోతూ దీపావళితో ధూం ధాం చేసి వెళ్తుంది. పండుగా వస్తే చాలు.. ప్రజలు సాధారణ రోజుల కంటే ఈ రోజుల్లోనే కాస్త ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లకు హాయ్ చెబుతుంటాయి. ఈ దీపావళి సందర్భంగా మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. పండుగ సీజన్లో పలు కంపెనీలు తమ కార్లపై భారీగా తగ్గింపులు, బెనిఫిట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai Motor India) తాజాగా మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ అందిండంతో పాటు ఏకంగా రూ. లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. హ్యుందాయ్ కోనా(Hyundai Kona Electric) హ్యుందాయ్ కోనా కారు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఇటీవలే రెండు కొత్త కలర్స్‌ని కూడా లాంచ్ చేసింది. కోనా ఎలక్ట్రిక్ ధర రూ. 23.84 లక్షల నుంచి 24.03 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్(Hyundai Grand i10 Nios) కంపెనీ శాంట్రో నిలిపివేయడంతో, ప్రస్తుతం హ్యుందాయ్ ఎంట్రీ-లెవల్ మోడల్‌గా గ్రాండ్ i10 నియోస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.43 లక్షల నుంచి 8.45 లక్షల వరకు ఉంది. దీనిపై దాదాపు రూ. 48 వేల తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 (hyundai i20) హ్యుందాయ్ ఐ20 (hyundai i20) కారుపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉన్నాయి. ఈ ఆఫర్లు i20 Magna, Sportz వేరియంట్లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఐ20 ధర రూ.7.07 లక్షల నుంచి రూ.11.62 లక్షల మధ్య ఉంది. ఉంటుంది. ఇక ఈ మోడల్‌పై కార్పొరేట్ డిస్కౌంట్లు లేవని తెలిపింది. హ్యుందాయ్ ఆరా(Hyundai Aura) హ్యుందాయ్ ఆరా మోడల్‌పై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ కారుపై రూ. 33 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేలు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వంటివి కూడా కలిసి ఉన్నాయి. ఇతర వేరియంట్లు రూ. 18,000 వరకు గరిష్టంగా ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఆరా ప్రారంభ ధర రూ. 6.09 లక్షల నుంచి గరిష్టంగా 8.87 లక్షలు ఉంది. గమనిక:పైన పేర్కొన్న ఆఫర్లు. నగరం లేదా రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు, మరిన్ని వివరాల కోసం మీ సమీప డీలర్‌షిప్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇవి పండుగ ఆఫర్లు కాబట్టి అక్టోబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి: బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్! -
స్టైలిష్ లుక్‌తో..హ్యుందాయ్ నుంచి ఎస్యూవీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త టుసో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్, డీజిల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, 2 లీటర్ పవర్‌ట్రైయిన్స్, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో రూపుదిద్దుకుంది. కెమెరా, రాడార్ సెన్సార్స్‌తో ఆటోమేటిక్ సెన్సింగ్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ విభాగంలో తొలిసారిగా 29 రకాల ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కస్టమర్లు టుసోను సొంతం చేసుకున్నారు. 2021లో అంతర్జాతీయంగా 4.85 లక్షల టుసో కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఏటా సుమారు 40,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయి. 2025 నాటికి ఇది 55,000 యూనిట్లకు చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. -
భారీ వర్షాలు, స్పెషల్ ఆఫర్ ప్రకటించిన హ్యుందాయ్
భారీ వర్షాల కారణంగా డ్యామేజీ అవుతున్న హ్యుందాయ్ కార్లపై ఆ సంస్థ ఆఫర్ ప్రకటించింది.ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించడంతో పాటు స్పెషల్ సర్వీస్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది. గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 52మంది ఆచూకీ లభ్యం కాలేదని మహరాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), భారత నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టకొని బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ముంబైలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హ్యుందయ్ సంస్థకు చెందిన వాహనాలకు ఈ ఏడాది పాటు స్పెషల్ సర్వీస్‌లు అందించడంతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 50శాతం తగ్గిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా సేల్స్,మార్కెటింగ్ డైరక్టర్ తరుణ్ గార్గ్ ప్రకటించారు. -
విశాఖపట్నం కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం
-
షోరూంలో అగ్ని ప్రమాదం : నాలుగు కార్లు దగ్ధం
సాక్షి, విశాఖపట్నం : నగరంలోని ఎంవీపీ డబుల్ రోడ్డులో ప్రముఖ కార్ల కంపెనీ 'హుందాయ్' షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ షోరూంలో విక్రయించే కార్లతో పాటు సర్వీసింగ్‌కు వచ్చిన కార్లు కూడా ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దాదాపు అరగంట శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. నష్ట తీవ్రత లక్షల్లో ఉండొచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. -
‘శాంత్రో’ రీఎంట్రీ ఈ నెల 23న
చెన్నై: అతి త్వరలోనే ‘హ్యుందాయ్ శాంత్రో’ మళ్లీ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబరు 23న న్యూఢిల్లీలో సరికొత్త శాంత్రోను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియా (హెచ్ఎంఐఎల్)... భారత్‌లో ఇది ఈ నెల తరువాత అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. అక్టోబర్ 10 (బుధవారం) నుంచి 22 వరకు ఆన్లైన్ ప్రీ–బుకింగ్స్ కొనసాగనుండగా.. ప్రారంభ ఆఫర్ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నట్లు సంస్థ సీఈఓ వై.కే కూ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల విరామం తరువాత మిడ్–కాంపాక్ట్ సెగ్మెంట్లో మరోసారి అడుగుపెడుతున్నాం. గడిచిన మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.740 కోట్లను పెట్టుబడిగా పెట్టాం. తొలిసారి కారు కొనుగోలు చేసే వారిని, గ్రామీణ ప్రాంతాల వారిని, టైర్ టూ, త్రీ టౌన్ల వినియోగదారులను లక్ష్యంగా చూస్తున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్‌లో ఉత్పత్తయ్యే అధునాతన శాంత్రో కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. -
కారుతోపాటే ఖననం చేశారు..వైరల్!
-
కారుతోసహా పూడ్చిపెట్టేశారు
బీజింగ్: మనుషుల మధ్య బంధాలు కరువైన ఈ కాలంలో.. ప్రాణం లేని వస్తువుపై మక్కువ పెంచుకున్నాడో వ్యక్తి. తాను ఎంతగానో ఇష్టపడే కారు ఎప్పటికీ తనతోపాటే ఉండాలనుకున్నాడు. అందుకే స్థానికులు కారులోనే అతని భౌతికకాయన్ని ఉంచి ఖననం చేసేశారు. సౌత్ చైనా మార్నింగ్ కథనం ప్రకారం... హెబెయి ప్రొవిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన క్వై అనే వ్యక్తి పదేళ్ల క్రితం హుండాయ్ సోనాటా కారును కొనుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. అయితే కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న క్వై.. సోమవారం మృతి చెందాడు. ఆఖరి ఘడియల్లో ఉన్న సమయంలో తన పక్కనున్నవారితో ఓ విషయం చెప్పాడు. తనను శవపేటికలో కాకుండా ప్రేమగా చూసుకున్న కారుతోపాటే ఖననం చేయాలని కోరాడు. అతని కోరిక ప్రకారమే స్థానికులు ఓ క్రేన్‌ను తెప్పించి కారుతో సహా పూడ్చిపెట్టారు. ఆపై దానిపై కాంక్రీట్ నింపి సమాధిని నిర్మించారు. చైనా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఈ వీడియో.. ఇప్పుడు మిగతా మీడియా ఛానెళ్లలోనూ హల్ చల్ చేస్తోంది. -
చల్ 'వాహన' రంగ
కారు.. ఇపుడు రోటీ, కపడా ఔర్ మకాన్ సరసన చేరిపోతోంది. పట్టణ, నగరవాసులకైతే... చేరిపోయిందనే చెప్పాలి!!. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సరదాగానో.. అవసరానికో ఎక్కడికైనా వెళ్లాలంటే కారు కావాలి మరి. మారుతున్న పరిస్థితులు, కొత్తరూపు సంతరించుకుంటున్న జీవన స్థితిగతులు, పెరుగుతున్న ఆదాయాలు, వినియోగదార్లను కార్లవైపు పరుగులు తీయిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వాహన సంస్థలు కూడా అందిపుచ్చుకుంటున్నాయి. కొత్త మోడళ్లతో.. లగ్జరీ లుక్‌తో.. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించే సరికొత్త వ్యూహాలతో దూసుకొస్తున్నాయ్. వాహన సంస్థలు తమ సత్తా చూపేందుకు, మార్కెట్లో పోటీపడేందుకు వేదికగా నిలుస్తోంది ఆటో ఎక్స్పో. ఈసారి గ్రేటర్ నోయిడా కేంద్రంగా వచ్చే ఫిబ్రవరిలో 9–14 మధ్య వెలుగులు విరజిమ్మే ఈ వాహన ప్రదర్శనలో 25–30 ఆవిష్కరణలు చోటు చేసుకోనున్నాయి. ఆయా కార్ల వివరాలే ఈ ప్రత్యేక కథనం... – సాక్షి, బిజినెస్ విభాగం రెనో క్విడ్ రేసర్.. బడ్జెట్ కార్ల సెగ్మెంట్లో అధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో రెనో క్విడ్ ఒకటి. క్విడ్‌లో ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త వేరియంట్‌ను రెనో కంపెనీ తెస్తోందంటే.. ఈ మోడల్ ఎంతగా పాపులర్ అయిందో అర్థమవుతోంది. క్విడ్ రెగ్యులర్ మోడల్లో స్పోర్టియర్ వెర్షన్‌గా క్విడ్ రేసర్‌ను రెనో కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. రూ.5 లక్షల ఖరీదుండే కార్ల సెగ్మెంట్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించే మోడల్ ఇది. మళ్లీ హ్యుందాయ్ శాంత్రో.. రూ.4 లక్షలు–6 లక్షల రేంజ్లో రోడ్ల మీద దూసుకెళ్లనుంది. 15 ఏళ్ల విక్రయాల అనంతరం ఈ మోడల్‌ను భారత మార్కెట్ నుంచి హ్యుందాయ్ ఉపసంహరించింది. అత్యంత స్టైల్‌గా, స్పోర్ట్స్ కారు లుక్‌తో శాంత్రో కారును హ్యుందాయ్ డిజైన్ చేస్తోంది. ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. హ్యుందాయ్ ఆఫర్ చేయనున్న తొలి ఏఎంటీ వెర్షన్ కారు బహుశా ఇదే కానున్నది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనలో తీసుకొచ్చి మార్కెట్లోకి మాత్రం దసరా, దీపావళి కల్లా తీసుకురానున్నట్లు సమాచారం. విటారా బ్రెజా.. (పెట్రోల్ వెర్షన్) రూ.7 లక్షలు–10 లక్షలు మారుతీ సుజుకీ మోడళ్లలో టాప్ మోడల్, అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో విటారా బ్రెజా ఒకటి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ డీజిల్ వేరియంట్‌కు అనూహ్యమైన స్పందన లభించడమే కాకుండా దీంట్లో పెట్రోల్ వేరియంట్ కావాలన్న డిమాండ్ బాగా పెరుగుతోంది. అందుకని ఈ మోడల్లో పెట్రోల్ వేరియంట్‌ను మారుతీ సుజుకీ తేనుంది. డీజిల్ మోడల్లో ఉండే విధంగానే డిజైన్, ఇతరత్రా ఫీచర్లు ఉంటాయి. మారుతీ సుజుకీ జిమ్ని రూ.5.70 లక్షలు–రూ.7 లక్షల రేంజ్లో సుజుకీ తెస్తోంది. ఈ కారును భారత్‌లో తయారు చేసి ఆగ్నేయాసియా, యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కొత్త ఎస్యూవీ కొండలు, గుట్టలు, ఎడారులు వంటి ఆఫ్–రోడ్ ప్రయాణ ఔత్సాహికులను ఆకట్టుకోగలదని కంపెనీ ఆశిస్తోంది. పెద్ద బంపర్, పెద్ద పెద్ద హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఆకర్షణీయ అంశాలు. నిస్సాన్ కిక్స్ రూ.10 లక్షలు–రూ.15 లక్షలు ఎస్యూవీ కిక్స్‌ను భారత మార్కెట్లోకి నిస్సాన్ కంపెనీ తేనున్నది. భారత్‌లో ఎస్‌యూవీలు బాగా అమ్ముడవుతున్న నేపథ్యంలో ఈ నిస్సాన్ కిక్స్ మంచి విక్రయాలు సాధించగలదని కంపెనీ ఆశిస్తోంది. ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ఆవిష్కరించవచ్చు. హ్యుందాయ్ క్రెటాకు గట్టిపోటీనిస్తుందన్న అంచనాలున్నాయి. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలోనూ లభ్యం కావచ్చు. టాటా క్యూ501 రూ.16 లక్షలు–25 లక్షల రేంజ్లో ల్యాండ్ రోవర్ డిస్కవరీ ప్లాట్ఫార్మ్పై టాటా మోటార్స్ తయారు చేస్తోన్న ప్రీమియమ్ ఎస్యూవీ ఇది. నెక్ట్స్ జనరేషన్ టాటా సఫారీ స్టార్మ్ కూడా ఇదే. జీప్ కంపాస్, హ్యుందాయ్ ట్యూసన్ ఎస్‌యూవీలకు ఈ ఏడు సీట్ల ఎస్యూవీ గట్టి పోటీనివ్వగలదని అంచనా. 2.0 లీటర్ ఇంజిన్‌తో రూపొందే ఈ 4వీల్ డ్రైవ్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యన కంపెనీ మార్కెట్లోకి తేవచ్చు. మహీంద్రా యూ321 రూ.12 లక్షలు–18 లక్షలు జైలో ఎంపీవీ(మల్టీ పర్పస్ వెహికల్) స్థానంలో మహీంద్రా కంపెనీ తెస్తున్న ప్రీమియమ్ ఎంపీవీ ఇది. టయోటా ఇన్నోవా క్రిస్టకు గట్టి పోటీనివ్వగలదని అంచనాలున్నాయి. ఉత్తర అమెరికా టెక్నికల్ సెంటర్లో డిజైన్ చేసిన ఈ ఎంపీవీని నాసిక్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పెద్దదైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్ రేడియేటర్ ఎయిర్–ఇన్లెట్స్ వంటి ఫీచర్లున్నాయి. ఆటోమేటిక్ వేరియంట్ వెర్షన్ కూడా లభిస్తుంది. 1.99 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందే ఈ మోడల్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 5–స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తదితర ఫీచర్లున్నాయి. డాట్సన్ గో క్రాస్ రూ.5–10 లక్షలు ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మారుతీ విటారా బ్రెజాలకు పోటీగా రెనో–నిస్సాన్ ద్వయం తెస్తున్న మోడల్ ఇది. భారత్‌లోనే తయారైన విడిభాగాలను అధికంగా వినియోగించుకోవడం వల్ల ధరను ఆకర్షణీయంగా నిర్ణయించే అవకాశం ఉంది. 5, 7 సీట్ల పెట్రోల్, డీజిల్ .వేరియంట్లలో ఈ కార్లు లభ్యమవుతాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్‌లైట్స్ తదితర ఫీచర్లున్నాయి. ఇంటీరియర్ ఫీచర్లు వెల్లడి కానప్పటికీ, గోప్లస్ ఎంపీవీ ఫీచర్లు దాదాపు ఉండొచ్చు. టాటా ఎక్స్451 రూ.5 లక్షలు–8 లక్షలు వివిధ సెగ్మెంట్లలో కొత్త మోడళ్లను తెస్తోంది. ప్రీమియమ్ హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లోకి ఈ మోడల్‌తో ప్రవేశిస్తోంది. ఆటో ఎక్స్‌పోలో ఈ కారును కంపెనీ డిస్ప్లే చేసే అవకాశాలున్నాయి. టాటా మోటార్స్‌కు చెందిన మూడు డిజైన్ స్టూడియోలు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంయుక్త సహకారంతో ఈ కారును డిజైన్ చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, త్వరలో మార్కెట్లోకి వచ్చే నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉండే ఫీచర్లు కొన్ని ఈ కారులో ఉండవచ్చు. మారుతీ.. మరో చిన్న కారు రూ.3.5 లక్షలు–రూ.5 లక్షలు మారుతీ నుంచి మరో చిన్న కారు ఆవిష్కరణ జరగనుంది. రెనో క్విడ్‌కు పోటీగా దీన్ని విపణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచుతోంది. ఎస్‌యూవీల్లో ఉండే ఫీచర్లతో ఈ కారును మారుతీ రూపొందిస్తోందని సమాచారం. 1.0 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారయ్యే ఈ మోడల్లో ఆటోమేటిక్ వేరియంట్ కూడా అందుబాటులోకి రానున్నది. 2018లో గానీ, 2019లో గానీ మార్కెట్లోకి రావచ్చు. ఈ మోడళ్లలో కొత్త వేరియంట్లు కొత్త మోడళ్లే కాకుండా పలు కంపెనీలు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త కొత్త ఫీచర్లతో వేరియంట్లను అందించనున్నాయి. హోండా సీఆర్వీ ∙హోండా సివిక్ హోండా అమేజ్ ∙ హోండా బ్రియో హోండా జాజ్ ∙మారుతీ స్విఫ్ట్ మారుతీ ఎర్టిగ ∙ మారుతీ సియాజ్ హ్యుందాయ్ క్రెటా ∙హ్యుందాయ్ ఇలీట్ ఐ20 ∙నిస్సాన్ మైక్రా ∙ఫోక్స్‌వ్యాగన్ పోలో ∙ మహీంద్రా కేయూవీ 100 -
ఎండకు.. కోర్టు ప్రాంగణంలో కారు దగ్ధం!
కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని న్యాయస్థానాల సముదాయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఎండవేడిమికి కారు దగ్ధమైంది. న్యాయవాది జయప్రకాశ్ రెండు నెలల క్రితం కొన్న హుందాయ్ ఇయాన్ కారును కోర్టు ప్రాంగణంలోని ఓ షెడ్డు కింద పార్కింగ్ చేసి వెళ్లాడు. ఈ క్రమంలో ఎండకు కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పింది. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. పెట్రోల్, ఎల్పీజీతో నడిచే కారు కావడంతో ఎండల తీవ్రతకు దగ్ధమై ఉండొచ్చని స్థానికులంటున్నారు. - కామారెడ్డి -
ఆ కారు ధర.. 4 వేలే!
అది ఒకప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్‌గా పేరున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం దర్జాగా తిరిగిన కారు. ఆకుపచ్చ రంగు హ్యుందయ్ ఎసెంట్ సెడాన్ మోడల్. ఆ కారును ఇప్పుడు వేలంలో పెట్టగా.. దానికి కనీస ధరను రూ. 4 వేలుగానే నిర్ణయించారు. దాదాపు దశాబ్దం క్రితం ఈ కారుతో పాటు మరికొన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దావూద్ అసలు ఆస్తులతో పోలిస్తే ఇవి నామమాత్రమేనని చెబుతున్నారు. కొన్నింటిని ఇప్పటికే గతంలో అమ్మకానికి పెట్టగా, మిగిలినవాటి మీద ఎవరూ పెద్దగా దృష్టిపెట్టలేదు. దక్షిణ ముంబైలోని ఓ హోటల్ వద్ద బుధవారం నాడు వేలం నిర్వహించగా, అక్కడ భారీగా జనం పోగుపడ్డారు. దావూద్ ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి భారత ప్రభుత్వం చాలా కాలం పాటు పోరాడాల్సి వచ్చింది. దావూద్‌తో పాటు అతడి బంధువుల ఆస్తులను కూడా చివరకు స్వాధీనం చేసుకున్నారు. 'ఢిల్లీ జకియా' హోటల్‌ను వేలంలో పెట్టగా, ఒకప్పటి జర్నలిస్టు, ప్రస్తుత ఉద్యమకారుడు ఎస్. బాలకృష్ణన్ దాన్ని రూ. 4.28 కోట్లకు సొంతం చేసుకున్నారు. బుర్హానీ అనే వ్యక్తి రూ 4.27 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, తాను మరో లక్ష రూపాయలు పెంచి బిడ్ వేశానని బాలకృష్ణన్ మీడియాకు చెప్పారు.