
కారుతో సహా పూడ్చి పెడుతున్న దృశ్యం
బీజింగ్: మనుషుల మధ్య బంధాలు కరువైన ఈ కాలంలో.. ప్రాణం లేని వస్తువుపై మక్కువ పెంచుకున్నాడో వ్యక్తి. తాను ఎంతగానో ఇష్టపడే కారు ఎప్పటికీ తనతోపాటే ఉండాలనుకున్నాడు. అందుకే స్థానికులు కారులోనే అతని భౌతికకాయన్ని ఉంచి ఖననం చేసేశారు.
సౌత్ చైనా మార్నింగ్ కథనం ప్రకారం... హెబెయి ప్రొవిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన క్వై అనే వ్యక్తి పదేళ్ల క్రితం హుండాయ్ సోనాటా కారును కొనుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. అయితే కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న క్వై.. సోమవారం మృతి చెందాడు. ఆఖరి ఘడియల్లో ఉన్న సమయంలో తన పక్కనున్నవారితో ఓ విషయం చెప్పాడు. తనను శవపేటికలో కాకుండా ప్రేమగా చూసుకున్న కారుతోపాటే ఖననం చేయాలని కోరాడు.
అతని కోరిక ప్రకారమే స్థానికులు ఓ క్రేన్‌ను తెప్పించి కారుతో సహా పూడ్చిపెట్టారు. ఆపై దానిపై కాంక్రీట్ నింపి సమాధిని నిర్మించారు. చైనా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఈ వీడియో.. ఇప్పుడు మిగతా మీడియా ఛానెళ్లలోనూ హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment