భారీ వర్షాల కారణంగా డ్యామేజీ అవుతున్న హ్యుందాయ్ కార్లపై ఆ సంస్థ ఆఫర్ ప్రకటించింది.ఇన‍్సూరెన్స్ ప్రీమియం తగ్గించడంతో పాటు స్పెషల్ సర్వీస్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది.
గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 52మంది ఆచూకీ లభ్యం కాలేదని మహరాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), భారత నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టకొని బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు.
ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ముంబైలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హ్యుందయ్ సంస్థకు చెందిన వాహనాలకు ఈ ఏడాది పాటు స్పెషల్ సర్వీస్‌లు అందించడంతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 50శాతం తగ్గిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా సేల్స్,మార్కెటింగ్ డైరక్టర్ తరుణ్ గార్గ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment