
భారతీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మంగళవారం జనవరి 2020 - ఫిబ్రవరి 2021 మధ్య తయారు చేసిన కొన్ని పికప్ వాహనాల్లో ఫ్లూయిడ్ పైపును తనిఖీ చేయడానికి రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. "ఇది కేవలం 29878 వాహనాల బ్యాచ్ కు మాత్రమే పరిమితం చేసినట్లు" అని కంపెనీ తెలిపింది. "తనిఖీ చేసిన తర్వాత ఏవైనా లోపాలు ఉంటే రెక్టిఫికేషన్ అనేది కస్టమర్లందరికీ ఉచితంగా నిర్వహించనుంది" అని అధికారిక ప్రకటనలో తెలిపింది. గత నెలలో నాసిక్ ప్లాంటులో తయారు చేసిన 600 డీజిల్ ఇంజిన్ వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కలుషితమైన ఇంధనం కారణంగా ఇంజిన్ భాగాలు త్వరగా డ్యామేజ్ అవుతున్నట్లు గమనించిన తర్వాత వాహనాలను తనిఖీ చేసి వాటి భాగంలో కొత్తవి రీప్లేస్ చేస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment