
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 2022లో 2,63,068 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2021తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే రెండున్నరెట్లు ఎక్కువగా సరఫరా అయ్యాయి.
2019లో కంపెనీ 1,07,190 వాహనాలను ఎగుమతి చేసింది. విదేశాలకు గతేడాది అధికంగా సరఫరా అయిన మోడళ్లలో డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెస్సో, బాలెనో, బ్రెజ్జా ఉన్నాయి. వరుసగా రెండవ సంవత్సరం ఎగుమతుల్లో 2 లక్షల మైలురాయిని దాటడం కంపెనీ ఉత్పత్తుల పట్ల విశ్వసనీయత, నాణ్యత, పనితీరును సూచిస్తుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు.
1986–87లో భారత్ నుంచి మారుతీ సుజుకీ ఎగుమతులను ప్రారంభించింది. 100 దేశాలకు వాహనాలు సరఫరా అవుతున్నాయి. ఆఫ్రికా, మధ్యప్రాచ్య, లాటిన్ అమెరికా, ఆసియాన్ దేశాలు సంస్థకు ప్రధాన మార్కెట్లు.
Comments
Please login to add a commentAdd a comment