
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్‌లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి.
అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది.
అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్‌లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం.
చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!
Comments
Please login to add a commentAdd a comment