హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పూర్తి నలుపు రంగులో పల్సర్ 250 వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. పల్సర్ ఎన్250, ఎఫ్250 ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.1.5 లక్షలు ఉంది.
సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ఇప్పటికే ఉన్న రంగుల్లో లభిస్తుంది. డ్యూయల్ చానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది రూపుదిద్దుకుంది. మెరుగైన గ్రిప్ కోసం వెడల్పాటి టైర్లు, ముందువైపు 300 ఎంఎం, వెనుకవైపు 230 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు చేశారు.
ఆవిష్కరించిన ఆరు నెలల్లోనే పల్సర్ 250 మోడల్‌లో 10,000 యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ వెల్లడించింది. బీఎస్–6 ప్రమాణాలు అమలులోకి వచ్చిన తర్వాత 250 సీసీ విభాగంలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment