
నిస్సాన్ మోటార్ ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. స్వచ్ఛమైన, మరింత స్థిరమైన ఇంధన ఎంపికల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా ఈ వాహనం ఇప్పుడు పూర్తిగా ఈ20 అనుకూలమైనదిగా మారింది. అదేకాకుండా మాగ్నైట్ అద్భుతమైన ఎగుమతి మైలురాయిని సాధించింది, 2020 లో లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లను దాటింది.
ఈ20 కంపాటబిలిటీ
నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ బీఆర్ 10 పెట్రోల్ ఇంజన్ ను ఈ20 కంప్లైంట్ గా అప్ గ్రేడ్ చేశారు. ఇది ఇప్పటికే ఈ20 కంపాటబుల్ గా ఉన్న 1.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్ కు జతయింది. 20% ఇథనాల్, 80% గ్యాసోలిన్ కలిగి ఉన్న ఈ20 ఇంధనం.. కర్బన ఉద్గారాలు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ విస్తృత వ్యూహంలో భాగం. న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ 71బీహెచ్‌పీ పవర్, 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బోఛార్జ్ డ్ ఇంజన్ 98బీహెచ్‌పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కోసం ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఉన్నాయి. టర్బోఛార్జ్డ్ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (సీవీటీ) తో లభిస్తుంది.
ఎగుమతి మైలురాయి
మాగ్నైట్ విడుదల చేసినప్పటి నుండి 50,000 యూనిట్ల ఎగుమతి మార్కును అధిగమించిందని నిస్సాన్ మోటార్ ఇండియా నివేదించింది. జనవరిలో మాగ్నైట్ లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వేరియంట్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుండి లాటిన్ అమెరికన్ మార్కెట్లకు దాదాపు 2,900 యూనిట్లను రవాణా చేసింది. ఫిబ్రవరి నాటికి, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోని మార్కెట్లకు 10,000 యూనిట్లకు పైగా మాగ్నైట్ ఎగుమతి అయింది.
Comments
Please login to add a commentAdd a comment