కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు.. | Maruti Fronx hits 2 lakh sales milestone | Sakshi
Sakshi News home page

కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..

Published Fri, Oct 11 2024 7:28 PM | Last Updated on Fri, Oct 11 2024 8:14 PM

Maruti Fronx hits 2 lakh sales milestone

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ (FRONX) ఎస్‌యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.

2023 ఏప్రిల్‌లో లాంచ్‌ అయిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్‌లు, మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్‌గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.

ఫ్రాంక్స్‌ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న  అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్‌ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్‌లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్‌సీఆర్‌, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్‌ మార్కెట్‌లుగా నిలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement