Nissan
-
ఆటో దిగ్గజాల జత.. సక్సెస్ మంత్ర..!
ఆటోరంగం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఒక కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేగంగా దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఒకవైపు, ఆర్టీఫిషియల్ టెక్నాలజీతో నడిచే డ్రైవర్ లెస్ కార్లు రోబో ట్యాక్సీలు మరోవైపు ఆటో కంపెనీ లకు ఆర్థిక భారాన్ని పెడుతున్నాయి.. అమెరికా కార్ల దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ఆధిపత్యం చెలాయిస్తుంటే, చైనా కంపెనీలు బీవైడీ, నియో, గ్రేట్‌వాల్ మోటార్స్ తక్కువ ధరకే ఈవీలను రోడ్లపైకి తెస్తూ చైనాకు చెక్ పెడుతున్నాయి. కొత్తగా ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి, అనేక దేశాల్లో ఆటో కంపెనీలు తమ పోటీ కంపెనీలతోనే పొత్తుకు దిగుతున్నాయి.ప్రత్యర్ధి కంపెనీలతోనే చేతులు కలుపుతున్నాయి. కార్ల తయారీ నుంచి మార్కెటింగ్ దాకా పలు విభాగాల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా విలీనం బాట పట్టి ఇతర మార్కెట్లకు విస్తరిస్తుంటే మరికొన్ని టెక్నాలజీని షేర్ చేసుకుంటూ కొత్త మోడళ్ల అభివృద్ధి వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. తాజాగా జపనీస్ కంపెనీలు నిస్సాన్, హోండా కూడా విలీనానికి చేతులు కలపడం ఆటో రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నా విలీనాలు, భాగస్వామ్యాలతో ఏ కంపెనీ ఎక్కువ లాభపడినట్లు గణాంకాలు వెల్లడించడంలేదు. వివరాలు చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్భాగస్వామ్యాల తీరిదీ.. ⇒ ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతల కోసం ఫోర్డ్ మోటార్, ఫోక్స్‌వేగన్ చేతులు కలిపాయి. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల బిజినెస్‌ను మూసివేయగా.. కొంతమేర లబ్ధి పొందాయి. ⇒ జనరల్ మోటార్స్‌తో హోండా జత కలిసింది. జీఎం తయారు చేసే 2 ఈవీ కార్లను హోండా విక్రయిస్తోంది. ఈ రెండింటికి మాత్రమే ఈ భాగస్వామ్యం పరిమితం. ⇒ ఫ్రాన్స్ ప్యూజో, ఫియట్ క్రిస్లర్ జట్టు కట్టడం ద్వారా 2021లో స్టెల్లాంటిస్‌కు ఊపిరిపోశాయి. అయితే ఫ్యాక్టరీలు మూసివేత బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ⇒ రేనాల్ట్తో నిస్సాన్ జత కలిసింది. దీంతో నిస్సాన్ నిలదొక్కుకుంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే అంత విజయవంతంకాలేదు. ⇒ అందుబాటు ధరల కార్ల తయారీకి వీలుగా లగ్జరీ కార్ల కంపెనీ దైమ్లర్తో, క్రిస్లర్ విలీనమైనప్పటికీ 9 ఏళ్ల తదుపరి 2007లో విడిపోయాయి.దేశీయంగా.. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2016లోనే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2019 ఆగస్ట్‌లో దీర్ఘకాలిక సహకారంలో భాగంగా ఈవీ టెక్నాలజీ, అటానమస్ డ్రైవింగ్‌పై కన్నేశాయి. ఈ బాటలో దేశీయంగా మారుతీ సుజుకీ బ్రాండ్ ద్వారా కార్ల అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు వేశాయి. మరోపక్క మారుతీ సియాజ్, ఎర్టిగా ప్లాట్‌ఫామ్ ద్వారా అభివృద్ధి చేసిన వాహనాలను సరఫరా చేయనుంది. ఇదేవిధంగా సీవిభాగంలోని ఎంపీవీ, టయోటా కరోలా సెడాన్, విటారా బ్రెజ్జా తదితర ప్లాట్‌ఫామ్‌లను పరస్పరం అభివృద్ధి చేయనున్నాయి.టాటా చేతికి జేఎల్ఆర్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి జాగ్వార్– ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్), మజ్దా, వోల్వో విభాగాలను ఫోర్డ్ మోటార్ కంపెనీ విక్రయించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారీ నష్టాలలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల విభాగం జేఎల్ఆర్ను దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. తదుపరి కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా అధ్యక్షతన నష్టాలను వీడి లాభాల బాట పట్టిన సంగతి తెలిసిందే. హోండా – నిస్సాన్ విలీనం.. మూడో పెద్ద కంపెనీ జపనీస్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ తాజాగా విలీనానికి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో అమ్మకాలరీత్యా ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీ ఆవిర్భావానికి తెరతీయనున్నాయి. మిత్సుబిషీ సైతం వీటితో కలవనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే విలీన కంపెనీ టయోటా, ఫోక్స్వ్యాగన్తో పోటీ పడనుంది. ఇప్పటికే నిస్సాన్, హోండా, మిత్సుబిషీ సంయుక్తంగా ఈవీల కోసం బ్యాటరీలు తదితర విడిభాగాల తయారీ టెక్నాలజీని పంచుకోనున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా అటానమస్ డ్రైవింగ్‌కు వీలుగా సాఫ్ట్ వేర్‌పై పరిశోధనలు సైతం చేపట్టనున్నట్లు తెలియజేశాయి.ఆర్ఐఎల్– టెస్లా టెస్లా దేశీయంగా రిలయన్స్‌తో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతున్నట్లు సమా చారం. తద్వారా స్థానికంగా టెస్లా ఎల క్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్‌తో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ దేశీయంగా తొలి హైడ్రోజన్ ఐసీఈ ఇంజిన్‌తో నడిచే హెవీడ్యూటీ ట్రక్‌ను 2023లో ఆవిష్కరించింది.జేఎస్‌డబ్ల్యూ– చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి జిందాల్ గ్రూప్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ సైతం చైనీస్ దిగ్గజాలు బీవైడీ, జీలీ తదితరాలతో చర్చలు. జరుపుతోంది. లైసెన్సింగ్ ఒప్పందం, టెక్నాలజీ బదిలీ తదితరాలకు ఒప్పందాలు కుదుర్చుకునే సన్నాహాల్లో ఉంది. వోల్వో కార్ల కంపెనీగా జీలీ ఇప్పటికే పరోక్షంగా కార్యకలాపాలు కలిగి ఉంది. దేశీయంగా 2024 తొలి 11 నెలల్లో 18.7 లక్షల ఎలక్ట్రిక్ కార్లు విక్రయంకావడంతో పలు దిగ్గజాలు ఈవీ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నాయి. -
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్‌తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్‌లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్‌గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. -
మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ నిస్సాన్ తన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేయడానికి 100 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టినట్లు శుక్రవారం తెలిపింది. కొత్త ఉత్పత్తి అభివృద్ధి, దేశంలో అదనపు అమ్మకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కంపెనీ ఇప్పటికే 600 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెట్టుబడి దీనికి అదనం.2026 నాటికి దేశీయంగా విక్రయాలను మూడింతలు చేయడం ద్వారా ఒక లక్ష యూనిట్లకు, అదే స్థాయిలో ఎగుమతులను చేయాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతకు అదనపు పెట్టుబడి నిదర్శనమని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. మాగ్నైట్ కొత్త వర్షన్‌ను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ సైతం తయారీ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 20 మార్కెట్లకు మాగ్నైట్ ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ తయారీతో 65 మార్కెట్లకు ఎగుమతి చేయడానికి వీలు కలుగుతోందని వివరించారు. నిస్సాన్‌కు ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఉందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని టోరెస్ తెలిపారు.మూడు మోడళ్ల విడుదల..వచ్చే 30 నెలల్లో కంపెనీ మరో మూడు మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. మాస్ మార్కెట్ సెగ్మెంట్లో రెండు మిడ్–సైజ్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి ఐదు సీట్లు, ఇంకొకటి ఏడు సీట్ల సామర్థ్యంతో రానుంది. అలాగే ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.2026 చివరి నాటికి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావాలన్నది ప్రణాళిక అని టోరెస్ వెల్లడించారు. ఆ సమయానికి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్ కోసం హైబ్రిడ్, సీఎన్జీతో సహా వివిధ పవర్‌ట్రెయిన్స్‌ను కంపెనీ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఏటా 32,000 యూనిట్లను విక్రయిస్తున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. 30 నెలల్లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం ఉన్న ఒక శాతం నుంచి మూడు శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
నిస్సాన్ మాగ్నైట్ మళ్లీ వచ్చేసింది.. సరికొత్తగా..
సరికొత్త రూపం సంతరించుకున్న నిస్సాన్ మాగ్నైట్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది విసియా, విసియా ప్లస్, ఏసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే ఆరు వేరియంట్లలో, రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్ తొలిసారిగా 2020లో పరిచయమైంది. అప్పటి నుంచి కంపెనీలో ప్రధాన మోడల్ కారుగా ఉంటూ వచ్చింది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపేసింది. ఎగుమతులతో కలుపుకొని మొత్తం 1.5 లక్షల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో ఉండే ఈ కారును మరింత ఆకర్షణీయంగా ఫేస్‌లిఫ్ట్ చేసి 2024 మోడల్‌గా కంపెనీ విడుదల చేసింది.తాజా నిస్సాన్ మాగ్నైట్ పాత ఫీచర్లతోనే వచ్చినప్పటికీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందుభాగంలో సరికొత్త ఫ్రంట్ బంపర్తోపాటు ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అలాగే ఆటోమెటిక్ ఎల్ఈడీ హెడ్లైట్లు బై ఫంక్షనల్ ప్రొజెక్టర్‌తో ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌లో ఉన్నాయి. వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన డీటైలింగ్, స్మోక్డ్ ఎఫెక్ట్‌తో ఇచ్చారు. రియర్ బంపర్ డిజైన్ కూడా మార్చారు.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ మొత్తానికి మార్చకుండా చిన్నపాటి మార్పులు చేశారు. లోపలవైపు లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్లెస్ చార్జర్ సరికొత్త ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరోవైపు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
వరద బాధిత కస్టమర్లకు ఉచిత సేవలు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన వినియోగదారుల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక సహాయక చర్యలు ప్రకటించింది. వరదలతో సతమవుతున్న కంపెనీ వినియోగదారులకు ఉచితంగా తమ వాహనాల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.వరద ప్రభావిత ప్రాంతాల్లోని కంపెనీ కస్టమర్లకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా నిస్సాన్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. వరదల్లో చిక్కుకున్న వాహనాలను సమీపంలోని కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌కు తీసుకెళ్లడానికి వీలుగా ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) సేవలను ప్రారంభించింది. దాంతోపాటు బీమా వాహనాలకు క్లెయిమ్ ప్రాసెస్ ఫీజు రూ.1000 మినహాయించినట్లు పేర్కొంది. బీమా క్లెయిమ్ చేయాలనుకునే కస్టమర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కంపెనీ లక్ష్యమని తెలిపింది.ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో కంపెనీ కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్(1800 209 3456)ను ఏర్పాటు చేశాం. కస్టమర్లు సత్వర చర్యల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’వరద బాధిత కస్టమర్లకు నిస్సాన్ మోటార్ ఇండియా ఇంజిన్ ఆయిల్ / ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్పై 10%, ఫ్లోర్ కార్పెట్ రీప్లేస్మెంట్పై 10% ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దాంతోపాటు వరద ప్రభావిత వాహనాలన్నింటికీ కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌ల్లో ఫిట్నెస్ టెస్ట్ వివరాలు అందిస్తామని పేర్కొంది. -
భారతీయ మార్కెట్లో జపాన్ బ్రాండ్ కారు లాంచ్ - పూర్తి వివరాలు
నిస్సాన్ కంపెనీ తన ఎక్స్-ట్రైల్ SUVని రూ. 49.92 లక్షల ప్రారంభ ధర వద్ద దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు 7 సీటర్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది.కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 163hp పవర్, 300Nm టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఆటో-హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
నిస్సాన్ కొత్త కారు 'ఎక్స్-ట్రైల్' ఇదే.. విశేషాలేంటో తెలుసా?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రస్తుతం భారతదేశంలో మాగ్నైట్ SUVని మాత్రమే విక్రయిస్తోంది. అయితే దేశీయ విఫణిలో తన ఉనికిని చాటుకోవడానికి, వాహన ప్రియులకు చేరువ కావడానికి ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలను మాత్రమే వెల్లడికావాల్సి ఉంది.నాల్గవ తరం నిస్సాన్ ఎక్స్-ట్రైల్.. పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ అనే మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కారు.. భారతదేశంలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతుంది. ఇంజిన్ 163 పీఎస్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, ముందు అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారు ధర రూ. 40 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే ధరలు అధికారికంగా ఆగష్టు 1న వెల్లడవుతాయి. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా నిస్సాన్ కంపెనీ తయారుచేసిన మ్యాగ్నైట్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023 మధ్య తయారైన ఈ మోడళ్లలో ముందు డోరు హ్యాండిల్ సెన్సార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబర్ తర్వాత తయారైన మోడళ్లలో ఈ సమస్య లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చేరవేశామని కంపెనీ చెప్పింది. కంపెనీ గుర్తింపు పొందిన సర్వీస్ కేంద్రాల్లో ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని సంస్థ పేర్కొంది. -
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కియా కారెన్స్ ఎక్స్-లైన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్టీ, టర్బో పెట్రోల్ ఎమ్టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్ వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి లాంబోర్గినీ రెవెల్టో ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
Nissan Magnite Geza Special Edition: ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న 'నిస్సాన్ మాగ్నైట్' ఇప్పుడు సరికొత్త స్పెషల్ ఎడిషన్‌లో విడుదలైంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు ఇప్పుడు కొత్త అప్డేట్స్ పొందింది. ఈ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ భారతదేశంలో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ పేరు 'గెజా'. నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది ఒనిక్స్ బ్లాక్, సాండ్స్టోన్ బ్రౌన్, స్టార్మ్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్ అనే ఐదు కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్ కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దాదాపు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే ఫీచర్స్ కొన్ని అప్డేట్ పొందాయి. ఇందులోని 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ టచ్‌స్క్రీన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇందులో JBL స్పీకర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అత్యంత ఖరీదైన మెక్లారెన్ సూపర్‌కార్ - 330 కిమీ/గం స్పీడ్) ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదలైంది. కాగా ఇప్పుడు గెజా ఎడిషన్ అడుగు పెట్టింది. ఇందులో యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. దీనిని నిస్సాన్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో బేజ్ కలర్ సీట్ కవర్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఇందులో రియర్ కెమెరా, షార్క్ న్ యాంటెన్నా వంటివి కూడా ఉన్నాయి. ఇంజిన్ కంపెనీ అందించిన సమాచారం మాగ్నైట్ గెజా స్పెషల్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కావున అదే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 hp పవర్ ప్రోడీసు చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కావున పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) ప్రత్యర్థులు కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యువి300, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కిగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా ఇది గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
నిస్సాన్ కస్టమర్లకు భారీ షాక్: 8 లక్షల కార్లు రీకాల్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ తన కస్టమర్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. అమెరికా, కెనడాలో దాదాపు 8 లక్షల కార్లను రీకాల్ చేస్తోంది. ఇంజీన్‌లో లోపం కారణంగా ఈ భారీ రీకాల్ చేపట్టింది. 2014 నుండి 2020లో కొన్న రోగ్ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు విక్రయించిన రోగ్ స్పోర్ట్స్ కార్లను వెనక్కి తీసుకోనుంది. ఈ కార్లలో జాక్‌నైఫ్ ఫోల్డింగ్ కీ పూర్తిగా తెరుచుకోక పోవచ్చని, కీని పాక్షికంగా తిప్పి, డ్రైవ్ చేస్తే, డ్రైవర్ ఫోబ్‌ను తాకడం, లేదా ఇంజీన్ ఆగిపోవడం లాంటివి జరగవచ్చని నిస్సాన్ తెలిపింది. అంతేకాదు దీని కారణంగా ఇంజిన్ పవర్ , పవర్ బ్రేక్‌లను కోల్పోయేలా చేస్తుంది. కారు క్రాష్ అవవ్వొచ్చు. ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కాకపోవచ్చు అని తెలిపింది. అయితే ప్రమాద తీవ్రతపై స్పష్టత లేదని పేర్కొంది. ఫలితంగా అమెరికా, కెనడాలో 809,000 కంటే ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది.అలాగే సంబంధిత కారు యజమానులకు ఈ మార్చి నెలలో సమాచారం అందిస్తున్నట్టు తెలిపింది. -
భారత్ నుంచి మళ్లీ డాట్సన్ ‘గో’..
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ .. భారత్‌లో తమ డాట్సన్ బ్రాండ్ కార్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ‘చెన్నై ప్లాంటులో (రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా) డాట్సన్ రెడీ–గో ఉత్పత్తి నిలిపివేశాం. అయితే, స్టాక్ ఉన్నంత వరకూ వాటి విక్రయాలు కొనసాగుతాయి. డాట్సన్ కొనుగోలు చేసిన ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్లకు యథాప్రకారంగా దేశవ్యాప్త డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, విడిభాగాలు అందుబాటులో ఉంచడం, వారంటీపరమైన సపోర్ట్ అందించడం కొనసాగిస్తాం‘ అని నిస్సాన్ ఇండియా తెలిపింది. కంపెనీ ఇప్పటికే డాట్సన్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవెల్ చిన్న కారు గో, కాంపాక్ట్ మల్టీపర్పస్ వాహనం గో ప్లస్ మోడల్స్ ఉత్పత్తి ఆపేసింది. డాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదు. 1986లో ఆపేసే నాటికి డాట్సన్ భారత్ సహా 190 దేశాల్లో అమ్ముడయ్యేది. మళ్లీ చాలాకాలం తర్వాత 2013లో డాట్సన్ బ్రాండ్ భారత మార్కెట్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. మిగతా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో 2020లోనే రష్యా, ఇండోనేసియా మార్కెట్లలో డాట్సన్‌ను ఆపేసిన నిస్సాన్ అటు పై క్రమంగా భారత్, దక్షిణాఫ్రికాలో కూడా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. -
కారు కొనాలనుకునే వారికి తీపికబురు
ప్రముఖ కారు తయారీ కంపెనీలు మారుతి సుజుకి, మహీంద్రా ఈ ఫిబ్రవరి నెలలో కార్లపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్, డాట్సన్ కంపెనీలు కూడా ఇప్పుడు తమ కార్లపై రూ.95 వేల వరకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. డాట్సన్ తన వాహన శ్రేణిలో మూడు కార్లపై ఆఫర్లు ప్రకటిస్తే, నిస్సాన్ కిక్స్‌పై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు అన్ని ఫిబ్రవరి 2021నెలలో బుకింగ్ చేసుకున్న వాటికీ మాత్రమే వర్తిస్తుంది. ఆ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. నిస్సాన్ కిక్స్: ఈ కారు ధర రూ.9.49 లక్షల నుంచి రూ.14.64 లక్షల వరకు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో కంపెనీ రూ.25వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.50 వేలు, రూ. 20 వేలు లాయల్టీ బెనిఫిట్లతో పాటు మొత్తం రూ.95 వేల డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. డాట్సన్ రెడి-గో: ఈ కారు ధర రూ.2.86 లక్షల నుంచి రూ.4.82 లక్షల వరకు ఉంటుంది. ఈ నెలలో కంపెనీ రూ.15 వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వేల, రూ.4 వేల లాయల్టీ బెనిఫిట్లతో కలుపుకొని మొత్తం రూ.34 వేల వరకు డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. డాట్సన్ గో: ఈ కారు ధర రూ.4.02 లక్షల నుంచి రూ.6.51 లక్షల వరకు ఉంటుంది. ఈ డిస్కౌంట్లు డాట్సన్ గో యొక్క అన్ని వేరియంట్లలో వర్తిస్తాయి. ఈ కారుపై రూ.20వేల నగదు తగ్గింపు, రూ.20వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలుపుకొని మొత్తం రూ.40 వేల డిస్కౌంట్ అందిస్తుంది. డాట్సన్ గో ప్లస్: ఈ కారు ధర రూ.4.25 లక్షల నుంచి రూ.6.99 లక్షల వరకు ఉంటుంది. ఈ నెలలో కంపెనీ రూ.20వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.20వేలతో మొత్తం రూ.40 వేల వరకు మొత్తం డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. చదవండి: అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి -
నిస్సాన్ సెల్ఫ్‌డ్రైవింగ్ కారు జీటీ-ఆర్(ఎక్స్)
ప్రపంచంలోని స్పోర్ట్స్ రేసింగ్ బెస్ట్ కార్లలో నిస్సాన్ జీటీ-ఆర్ ఒకటి. దీనిని మొదటిసారిగా 2007లో జపాన్‌లో తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులను ఆకట్టుకుంటింది.ఈ సూపర్ కార్ చరిత్ర చాలా పెద్దది. 2020లో తీసుకొచ్చిన నిస్సాన్ జిటి-ఆర్ కార్ లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో ది బెస్ట్ వన్. ఇది జిటి-ఆర్ శక్తివంతమైన ట్విన్-టర్బో ఇంజిన్, హైటెక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది. ఇప్పుడు నిస్సాన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను భవిష్యత్ లో తీసుకురావాలని భావిస్తుంది. దీనిలో భాగంగా ఆర్ 35-జనరేషన్ నిస్సాన్ జీటీ-ఆర్ ఆధారంగా పనిచేసే నిస్సాన్ జీటీ-ఆర్(ఎక్స్) 2050 ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కారును తీసుకు రాబోతున్నారు.(చదవండి: యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) నిస్సాన్ జీటీ-ఆర్(ఎక్స్)ని 2050 నాటికీ తీసుకురావాలని భావిస్తున్నారు. దీనికి సంబందించిన డిజైన్ ని కాలిఫోర్నియాలోని పసాదేనాలోని ఆర్ట్సెంటర్ కాలేజ్ ఆఫ్ డిజైన్ విద్యార్థి జేబమ్ చోయ్ రూపొందించారు. ఇది మెదడు కదలికలతో పనిచేస్తుంది. అమెరికాలోని నిస్సాన్ డిజైన్ కి సంబందించిన డిపార్ట్మెంట్ లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు చోయ్. ఈ ఇంటర్న్‌షిప్ లో భాగంగా మెదడు ఆధారంగా పనిచేసే సూపర్ కార్ జిటి-ఆర్ (ఎక్స్) 2050 డిజైన్ ని రూపొందించాడు. ఈ డిజైన్ చుస్తే మాత్రం సాధారణ కారు డిజైన్ లాగా మాత్రం కనిపించడం లేదు. జీటీ-ఆర్ 4.5 అడుగుల ఎత్తుతో పోలిస్తే ఇది 2 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. ఇందులో డ్రైవ్ చేసే వ్యక్తికీ ఒక సూట్ ధరిస్తారు. ఈ సూట్ మెదడు కదలికల ఆధారంగా కారును ఆటోమేటిక్ గా ఆపరేట్ చేస్తుంది. ఇది మానవ మెదడును కంప్యూటర్‌తో అనుసంధానించే "సాధారణ" సెల్ఫ్-డ్రైవింగ్ కార్ల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది అని సమాచారం. ఈ డిజైన్ చివరిది కాదు. దీనిలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. -
నిస్సాన్ తొలి కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాహన రంగంలో అధిక పోటీ ఉండే కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలోకి నిస్సాన్ మోటార్ అడుగుపెట్టింది. ప్రారంభ ధర రూ.4.99 లక్షలతో బుధవారం తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘మాగ్నైట్’ మోడల్‌ను ఆవిష్కరించింది. మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఈ మోడల్ దేశంలోని మారుతీ విటారా, బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 హోండా డబ్ల్యూఆర్–వీలతో పోటీ పడనుంది. ఈ కారు రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒక లీటరు పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే మోడల్ ధరలు రూ.4.99– రూ.7.55 లక్షల మధ్య ఉండగా.., ఒక లీటరు టర్బో పెట్రోల్ వేరియంట్ మోడల్ ధరలు రూ.6.99–రూ.8.45 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ధరలు ఈ ఏడాది చివరి తేది డిసెంబర్ 31 నాటి వరకే వర్తిస్తాయి. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ యాపిల్ కార్డ్‌ప్లే, అండ్రాయిడ్ ఆటో, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, పుష్బటన్ స్టార్ట్, క్రూజ్‌కంట్రోల్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
10 వేల ఉద్యోగాలకు ఎసరు
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. ఆర్థిక సంక్షోభం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గ్లోబల్‌గా 4వేల 800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించిన కంపెనీ తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసిందట. కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ జపాన్ మీడియా బుధవారం అందించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. అమెరికా, ఐరోపాలో అమ్మకాలు పడిపోవడంతో ఈ సంస్థ దెబ్బతినడంతోపాటు, ఆర్థిక కుంభకోణం ఆరోపణలపై మాజీ బాస్ కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ తరువాత నిస్సాన్ మరింత కుదేలైంది. అలాగే 43 శాతం వాటా ఉన్న ఫ్రెంచ్ భాగస్వామి రెనాల్ట్‌తో వివాదం ముదిరి సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ ఉద్యోగుల్లో లక్షా 39వేల ఉద్యోగాల్లో 4,800 ఉద్యోగాల కోత పెట్టనున్నామని కంపెనీ మేలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా కథనాలపై వ్యాఖ్యానించేందుకు నిస్సాన్ ప్రతినిధి నిరాకరించారు. కాగా నిస్సాన్ లాభాలు గత ఏడాది దశాబ్దం కనిష్టానికి పడిపోయింది. అలాగే భవిషత్తు మరింత కష్టంగా ఉండనుందని కూడా వ్యాఖ్యానించింది. 2019 మార్చి లో 319 బిలియన్ యెన్ల (2.9 బిలియన్ డాలర్లు) నికర లాభాలను నివేదించింది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 57 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లాభాలు 170 బిలియన్లకు పడిపోవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది. -
రూ.19 లక్షల కారు రూ. 2 లక్షలకే..?!
సాక్షి, బెంగళూరు : చోర కళలో నేరగాళ్లు రోజు రోజుకు ఆరి తేరి పోతున్నారు. బెంగళూరు లోని నిస్సాన్ షోరూంకి కుచ్చు టోపీ పెట్టి ఖరీదైన కారుతో చల్లగా జారుకున్నాడు. డౌన్ పేమెంట్ చెల్లించి మరీ యజమానిని నమ్మించి ఉడాయించాడు. సుమారు 19లక్షల విలువ చేసేకారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఎగరేసుకుపోయాడో ప్రబుద్దుడు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. విలాసవంతమైన ఎస్యూవీ నిస్సాన్ కిక్స్‌ను కొనుగోలు చేస్తానంటూ షోరూంకి వచ్చాడు జోస్ థామస్ అకా జోసెఫ్. షోరూం మేనేజర్ని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. ధర రూ 18.6 లక్షలని చెప్పగానే వెంటనే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టి.. పూజా కార్యక్రమాలను చేయించుకుంటానని చెప్పి బురిడీ కొట్టించి కారును తీసుకెళ్లాడు. అంతే ఇక అక్కడనుంచి పత్తా లేకుండాపోయాడు. ఎన్ని ఫోన్లు చేసినా సమాధానం లేదు. అతని ఆఫీసుకు వెళ్లినా.. ఫలితం శూన్యం. చివరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే...ఈ సంఘటన జరిగి నాలుగు నెలలైంది. జనవరి 23న బెంగళూరులోని దొడ్డనకుంది సూర్య నిస్సాన్ షోంరూంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు నాలుగు నెలల తరువాత అంటే మే 21వ తేదీన షోరూం యజమాని గణేశ్ కుమార్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారన్నదానిపై స్పందించేందుకు గణేష్ తిరస్కరించారు. గణేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని సంబంధిత డీసీపీ అబ్దుల్ అహద్ తెలిపారు. నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆఫీస్ అడ్రస్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేశారు కాబట్టి కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ప్రపంచకప్ టోర్నీకి నిస్సాన్ వినియోగదారులు
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అభిమానుల ఆదరణ పొందే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఓ వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చింది. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నిస్సాన్ కిక్స్ కారు యజమానులకు ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కల్పించింది. నిస్సాన్ కిక్స్ కారును సొంతం చేసుకున్న 15 మంది యజమానులకు జూన్ 16న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లను అందించనున్నట్లు నిస్సాన్ యాజమాన్యం ప్రకటించింది. టికెట్లతో పాటు ఇంగ్లండ్ వెళ్లేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామంటూ తెలిపింది. వీరితో పాటు మరో 250 మంది క్రికెట్ అభిమానులను నిస్సాన్ ఇండియా ఎంపిక చేసింది. ప్రపంచకప్‌లో భారత్ తలపడే ఇతర మ్యాచ్‌లకు వీరిని పంపిస్తామని పేర్కొంది. ఎర్నాకులం, షిమోగ, ముజఫర్‌నగర్, గుంటూరు, కోటలకు చెందిన నిస్సాన్ కంపెనీ వినియోగదారులు ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో జతకట్టిన నిస్సాన్ కంపెనీ... గతేడాది ఆగస్టులో నిర్వహించిన ‘ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీ’ టూర్లో భాగస్వామిగా వ్యవహరించింది. -
అమ్మకానికి కస్టమర్ల డేటా!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ తన వినియోగదారుల సమాచారాన్ని విక్రయించాలని 2012లో అనుకుందని ఓ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఫేస్‌బుక్‌కు చెందిన గ్రాఫ్ ఏపీఐలో వినియోగదారుల సమాచారం భారీస్థాయిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ గ్రాఫ్ ఏపీఐలోని వివరాలు/సమాచారాన్ని పొందేందుకు కంపెనీల నుంచి కనీసం రెండున్నర లక్షల డాలర్లు వసూల చేయాలని ఫేస్బుక్ 2012లో భావించిందని అర్స్‌టెక్నికా అనే సంస్థ బయటపెట్టింది. 2014లో ఫేస్బుక్ ఆ నిర్ణయానికి కొన్ని మార్పులు చేసిందనీ, 2015 నాటికి గ్రాఫ్ ఏపీఐలోని కొద్ది సమాచారం మాత్రమే కంపెనీలకు అందుబాటులో ఉండేలా మార్పులు చేసిందని తెలిపింది. కోర్టుకు చేరిన ఓ పత్రం నుంచి సమాచారాన్ని సేకరించి అర్స్‌టెక్నికా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాఫ్ ఏపీఐ నుంచి విస్తృత స్థాయిలో సమాచారం పొందేందుకు నిస్సాన్, కెనడా రాయల్ బ్యాంక్, ఎయిర్‌బీఎన్‌బీ, నెట్‌ఫ్లిక్స్, లైఫ్ట్, క్రైస్లర్/ఫియట్ తదితర కంపెనీలు ఉన్నాయని అర్స్‌టెక్నికా తెలిపింది. ఓ కేసులో బ్రిటన్ పార్లమెంటు ఫేస్బుక్ అంతర్గత పత్రాలను పరిశీలన నేపథ్యంలో తాజా వార్త ఫేస్‌బుక్‌కు మరింత ఆందోళన కలిగించనుంది. -
నిస్సాన్ ఛైర్మన్‌పై వేటు
టోక్యో: ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో ప్రపంచం ఆటోదిగ్గజం నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ ఘోన్ వేటుపడింది. రెండురోజులక్రితం గోన్‌ను టోక్యో విచారణ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిస్సాన్ బోర్డునుంచి ఆయన్ను తొలగించాలని బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని నిస్సాన్ గురువారం వెల్లడించింది. అలాగే మరో ఎగ్జిక్యూటివ్ రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీని కూడా తొలగించినట్టు తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత నివేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరం బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. యోకోహామాలో సంస్థ ప్రధాన కార్యాలయంలో బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. మరోవైపు ఘోన్ స్థానంలో సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఒక ఎడ్వైజరీ కమిటీని నియమించినట్టు నిస్సాన్ ప్రకటించింది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో జపనీస్ మహిళా రేసింగ్ డ్రైవర్ కైకో ఇహారా కూడా ఉన్నారు. -
నిస్సాన్ చీఫ్ ఘోన్ అరెస్ట్
టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ చైర్మన్ కార్లోస్ ఘోన్ అరెస్టయ్యారు. తన ఆదాయాన్ని తక్కువగా చూపించటం సహా పలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ల విచారణలో వెల్లడైందని, దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారని జపాన్ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ‘ఆర్థిక సాధనాలు, విదేశీ మారక చట్టం నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాలతో నిస్సాన్ చైర్మన్ ఘోన్‌ను టోక్యో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అరెస్టు చేసింది‘ అని ఈ సంస్థ తెలియజేసింది. మరోవైపు, ప్రజావేగు నివేదిక మేరకు ఘోన్పై గత కొద్ది నెలలుగా అంతర్గతంగా విచారణ సాగిస్తున్నట్లు నిస్సాన్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా ఏళ్లుగా మరో అధికారితో కలిసి అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలొచ్చాయని వివరించింది. దీంతో ఘోన్, రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ‘ఘోన్ అందుకునే జీతభత్యాలను తక్కువగా చేసి చూపించేందుకు ఆయన, కెల్లీ కలిసి టోక్యో స్టాక్ ఎక్సే్చంజీకి పలు సంవత్సరాలుగా తప్పుడు సమాచారం అందిస్తున్నారని మా విచారణలో వెల్లడైంది. అంతేగాకుండా ఘోన్పై దుష్ప్రవర్తన ఆరోపణలూ ఉన్నాయి. కంపెనీ ఆస్తుల్ని సొంతానికి వాడుకోవడం వంటివి చేశారు. ఈ వ్యవహారాల్లో కెల్లీ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాలన్నీ జపనీస్ ప్రాసిక్యూటర్లకు తెలియజేశాం. ఆయనతో పాటు కెల్లీని తక్షణం అన్ని హోదాల నుంచి తొలగించాలంటూ డైరెక్టర్ల బోర్డు ముందు ప్రతిపాదించనున్నాం’’ అని నిస్సాన్ తన ప్రకటనలో వివరించింది. ఘోన్‌ను ప్రాసిక్యూటర్స్ ప్రశ్నిస్తున్నారన్న వార్త అసాహి షింబున్ అనే స్థానిక వార్తాపత్రిక ద్వారా బైటికొచ్చింది. అటుపై యోకోహామాలోని నిస్సాన్ ప్రధాన కార్యాలయంపై టోక్యో ప్రాసిక్యూటర్స్ దాడులు నిర్వహించనున్నట్లు ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ప్రశ్నార్థకంగా రెనో–మిత్సుబిషి కూటమి.. ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో– నిస్సాన్– మిత్సుబిషిలను ఒకే తాటిపైకి తెచ్చిన ఘోన్ అరెస్టయిన నేపథ్యంలో ఈ కూటమి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారవచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి బ్రాండ్ ఇమేజ్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌కి చెందిన ఘోన్ (64) 1996– 99 మధ్య కాలంలో ఫ్రాన్స్ ఆటోమొబైల్ సంస్థ రెనోలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా చేసి కంపెనీ పునరుద్ధరణలో కీలకపాత్ర పోషించారు. వ్యయాల్లో కోత పెట్టడంలో నిరంకుశంగా వ్యవహరిస్తారనే పేరుపొందారు. 1999లో ఘోన్.. జపాన్‌కి చెందిన నిస్సాన్‌ను పునరుద్ధరించే బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేశారు. అయిదు ఫ్యాక్టరీలను మూసివేసి, 21,000 ఉద్యోగాలను తగ్గించి, తద్వారా మిగిలిన నిధులను మూడేళ్లలో కొత్తగా 22 కార్లు, ట్రక్ మోడల్స్‌ను ప్రవేశపెట్టడంపై ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్, టయోటాలకు దీటైన పోటీనిచ్చే సంస్థలుగా నిస్సాన్, రెనోలను తీర్చిదిద్దారు. 2016లో మిత్సుబిషి సంస్థను గట్టెక్కించేందుకు నిస్సాన్ 2.2 బిలియన్ డాలర్లతో మూడో వంతు వాటాలు కొనుగోలు చేసింది. దానికి కూడా సారథ్య బాధ్యతలు చేపట్టిన ఘోన్... రెనో, నిస్సాన్,మిత్సుబిషిలతో ఒక కూటమి తయారుచేశారు. ఈ క్రమంలో ఆయన అందుకుంటున్న జీత భత్యాలపై చాన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. రెనో–నిస్సాన్–మిత్సుబిషి కూటమి చైర్మన్‌గా, రెనో సీఈవోగా, నిస్సాన్..మిత్సుబిషి సంస్థల చైర్మన్‌గా ఆయన వివిధ హోదాల్లో జీతభత్యాలు అందుకునేవారు. కానీ నియంత్రణ సంస్థలకు మాత్రం వీటిని తగ్గించి చూపేవారని ఆరోపణలున్నాయి. ఈ వివాదమే తాజాగా ఆయన అరెస్టుకు దారితీసింది. ఘోన్‌ను చైర్మన్ హోదా నుంచి తొలగించే ప్రతిపాదనపై గురువారం బోర్డు సమావేశం కానున్నట్లు నిస్సాన్ సీఈవో హిరోటో సైకావా తెలిపారు. రెనో, మిత్సుబిషితో తమ లావాదేవీలపై ఘోన్ అరెస్టు, తొలగింపు ప్రభావమేమీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఒకే ఎగ్జిక్యూటివ్‌కి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. -
అతి సురక్షితమైన ఎలక్ట్రిక్ కారు ‘నిస్సాన్ లీఫ్’
-
నిస్సాన్ కారుకు.. సెఫ్టీలో 5 స్టార్..!!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో ఎంతోమంది కోరిన కారది. ప్రపంచంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు కూడా అదే. ప్రస్తుతం ప్రపంచంలో అతి సురక్షితమైన ఎలక్ట్రిక్ కారుగా కూడా నిలిచింది ‘నిస్సాన్ లీఫ్’ . యూరో ఎన్‌క్యాప్ సురక్షిత పరీక్షలో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ మేరకు నిస్సాన్ ఓ ప్రకటన చేసింది. కారుకు టెస్టు నిర్వహిస్తున్న వీడియోను కూడా విడుదల చేసింది. యూరో ఎన్‌క్యాప్ పరీక్షలో 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారు కూడా నిస్సాన్ లీఫే. 2011లో తొలిసారి నిస్సాన్ లీఫ్‌ను నిస్సాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ముందు వెళ్లే సైకిస్టు, పాదచారులను గుర్తించి ఆటోమేటిక్ బ్రేక్ సదుపాయాన్ని కూడా కొత్తమార్పుల్లో లీఫ్‌కు నిస్సాన్ జోడించింది. -
నిస్సాన్ + రెనో = ....?
ఆటోమొబైల్ పరిశ్రమలో మరో పెద్ద డీల్‌కు తెరలేవబోతోంది. ఒకటేమో ఫ్రెంచ్కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో. మరొకటేమో జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ నిస్సాన్. పైపెచ్చు రెండింటికీ ఒకదానిలో మరొక దానికి వాటాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇవి రెండూ పరస్పరం విలీనానికి చర్చలు మొదలెట్టాయి. ఈ రెండూ కలిసి కొత్త సంస్థ ఏర్పాటవుతుందని విలీన అంశంతో సంబంధమున్న వర్గాలు తెలియజేశాయి. విలీన డీల్‌తో రెండు కంపెనీల మధ్య ప్రస్తుతమున్న భాగస్వామ్యం పోయి ఓ పెద్ద సంస్థ ఆవిర్భవిస్తుంది. రెనోకు ప్రస్తుతం నిస్సాన్‌లో 43 శాతం వాటా ఉంది. అలాగే నిస్సాన్‌కు రెనోలో 15 శాతం వాటా ఉంది. రెనో, నిస్సాన్ కంపెనీల చైర్మన్ కార్లోస్ ఘోసన్ ఈ విలీన చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, విలీనానంతరం ఏర్పాటు కానున్న సంస్థకు కూడా ఈయనే నాయకత్వం వహిస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రెనో, నిస్సాన్ విలీన డీల్ పూర్తి కావడం కష్టమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఫ్రెంచ్ ప్రభుత్వానికి రెనోలో 15 శాతం వాటా ఉంది. దీన్ని వదులుకోవడానికి, తన నియంత్రణను కోల్పోవడానికి ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు. అలాగే కొత్త కంపెనీ ఏర్పాటు ఎక్కడనేది కూడా ప్రధానమైనదే’’ అని ఆ వర్గాలు చెప్పాయి. విలీనం జరిగితే లండన్ లేదా నెదర్లాండ్స్‌లో కంపెనీ ఏర్పాటుకు అవకాశాలున్నట్లు తెలిసింది. అయితే కంపెనీల ప్రతినిధులు కానీ, ఫ్రెంచ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ విలీన వార్తలపై స్పందించలేదు. ఇక రెనో మార్కెట్ క్యాప్ 33 బిలియన్ డాలర్లుగా, నిస్సాన్ మార్కెట్ క్యాప్ 43 బిలియన్ డాలర్లుగా ఉంది.