సాక్షి, న్యూఢిల్లీ: భారత వాహన రంగంలో అధిక పోటీ ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి నిస్సాన్ మోటార్ అడుగుపెట్టింది. ప్రారంభ ధర రూ.4.99 లక్షలతో బుధవారం తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘మాగ్నైట్’ మోడల్‌ను ఆవిష్కరించింది. మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఈ మోడల్ దేశంలోని మారుతీ విటారా, బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 హోండా డబ్ల్యూఆర్–వీలతో పోటీ పడనుంది. ఈ కారు రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
ఒక లీటరు పెట్రోల్ వేరియంట్‌లో లభ్యమయ్యే మోడల్ ధరలు రూ.4.99– రూ.7.55 లక్షల మధ్య ఉండగా.., ఒక లీటరు టర్బో పెట్రోల్ వేరియంట్ మోడల్ ధరలు రూ.6.99–రూ.8.45 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ధరలు ఈ ఏడాది చివరి తేది డిసెంబర్ 31 నాటి వరకే వర్తిస్తాయి. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వైర్‌లెస్ యాపిల్ కార్డ్‌ప్లే, అండ్రాయిడ్ ఆటో, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, పుష్‌బటన్ స్టార్ట్, క్రూజ్‌కంట్రోల్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment