నిస్సాన్ నుంచి ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’ | Nissan unveils limited edition Datsun redi-Go Sport | Sakshi
Sakshi News home page

నిస్సాన్ నుంచి ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’

Published Fri, Sep 30 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

నిస్సాన్ నుంచి ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’

నిస్సాన్ నుంచి ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘రెడిగో’లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.3.49 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్, బ్లాక్ ఇంటీరియర్స్, బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ అండ్ గ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. తాజా కొత్త వేరియంట్‌కు ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మలిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. కాగా కంపెనీ జూన్ నెలలో రెడిగో మోడల్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement