variant
-
భారత్‌లో తొలి మంకీపాక్స్ ‘క్లేడ్ 1బీ’ కేసు నమోదు
న్యూఢిల్లీ: అనేక దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్‌కు సంబంధించి భారత్‌లో మరో కేసు నమోదైంది. కేరళకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ క్లేడ్ 1బీ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం పేర్కొంది. కాగా ఈ రకం కేసు దేశంలో నమోదవ్వడం ఇదే తొలిసారి. గతవారం కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తికి క్లేడ్ 1బీ వేరియంట్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతినిధి మనీషా వర్మ తెలిపారు. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి ఇటీవల వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్ 1గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచ ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాగా ప్రపంచ వ్యాప్తంగా 120కిపైగా దేశాల్లో ఎంపాక్స్ కేసులు వెలుగుచూశాయి. 2022 నుంచి 204 జూలై నాటికి లక్షకుపైగా కేసులు నమోదయ్యాయిఈ కేసుల్లో సగానికి పైగా ఆఫ్రికా ప్రాంతం, మరో 24శాతం అమెరికా, యూరోపియన్ ప్రాంతంలో 11శాతం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. చదవండి: ప్రధానికి ‘మన్‌కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్ -
ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!
కోవిడ్-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో అదరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునేలోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేను ఉన్నానంటూ కన్నెర్రజేస్తోంది. ఇప్పటివరకు ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి రకరకాల సబ్వేరియంట్లుగా రూపాంతరం చెంది కలవరపెడుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఎక్స్ఈసీ అనే కొత్త వేరియంట్ రూపంలో దూసుకొస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసుని జర్మన్లో గుర్తించారు. అలా ఇది యూకే, యూఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఇది యూరప్‌లో వేగంగా విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లో కూడా ఈ వైరస్ వృద్ధి తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఈ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్‌ని ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ హైబ్రిడ్ కేఎస్ 1.1, కేపీ, 3.3గా చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా, లండన్‌లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ.. ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎక్స్ఈసీ తొందరగా వ్యాప్తి చెందదని, అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు. శీతకాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ..ఈ వేరియంట్ ఉధృతి ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఇది తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు. ఈ ఎక్స్ఈసీ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వంశానికి చెందిన ఉపవేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్ల, బూస్టర్ డోస్‌లతో అదుపు చేయగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందర్నీ పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.ఎక్స్ఈసీ లక్షణాలు..జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత ఛార్జ్ చేస్తాడంటే..?) -
కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1
-
మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!
కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లిపోయిందనుకునేలోపు ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై నేనింకా ఉన్నానని చెబుతూనే ఉంటోంది. ఇప్పటి వరకు దాని రూపాంతర వేరియంట్ ఒమిక్రాన్ బీఏ 2.86 వంటి కేసులను ఫేస్ చేశాం. మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్ 1 అనే కరోనా కొత్త వేరియంట్ కేసులతో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు.ఇప్పుడూ ఆ తరహాలోనే తొలి కేసు భారత్‌లో కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జేఎన్.1 లక్షణాలు సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జేఎన్.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్ల కంటే జేఎన్.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది. (చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..) -
కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్‌కూ తప్పని ముప్పు?
కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రుచి లేదా వాసన కోల్పోవడం కోవిడ్-19 ప్రధాన లక్షణం అయితే, పిరోలా లేదా బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి. పిరోలా సోకినప్పుడు ముందుగా దాని ప్రభావం ముఖంపైనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకేహెచ్ఎస్ఏ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో ఉండేటప్పుడు కూడా మాస్క్ ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు. కాగా బీఏ.2.86 కేసులు తొలిసారి గత జూలైలో కనిపించాయి. ఇది కూడా చూడండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! -
రియల్‌మి ఏ2+ కొత్త వేరియంట్: ధర చూస్తే ఇంప్రెస్ అవుతారు!
Redmi A2+ 128GB Storage చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. రెడ్మి ఏ2+లో కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇపుడు 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్కాన్ఫిగరేషన్లో తీసుకొచ్చింది. MediaTek Helio G36 SoC , 5,000mAH బ్యాటరీ,మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో లాంచ్అయింది. ఇది గరిష్టంగా 32 రోజుల స్టాండ్‌బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్రెడ్మి ఏ2+ వేరియంట్ ధర ఎంఐడాట్‌కామ్‌లో రూ.8,499గా ఉంది. అయితే ప్రస్తుతం పరిచయ ఆఫర్‌గా ప్రస్తుతం రూ. 7,999గా కొనుగోలు చేయవచ్చు. ఇది క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ , ఆక్వా బ్లూ రంగులలో లభ్యం. రెడ్మి ఏ2+ స్పెసిఫికేషన్స్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ LCD డిస్ప్లే 1600 x 720 పిక్సెల్స్‌రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 8మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , QVGA కెమెరాతో AI-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 5,000mAh బ్యాటరీ -
చైనాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..ఏకంగా 6.5 కోట్ల మందికిపైగా..
కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్‌లో అదికాస్త గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాను నిరోధించే వ్యాక్సిన్ల నిల్వను పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. అలాగే ఈ కొత్త వేరియంట్‌ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్లను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ చైనీస్ ఎపిడెమియాలజిస్ట్ ఝాంగ్ నాన్షాన్ తెలిపారు. అలాగే వృద్ధులు జనాభాలో మరణాల పెరుగుదలను నివారించడానికి శక్తిమంతమైన టీకా బూస్టర్ తోపాటు యాంటీ వైరల్ మందులను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక బీజింగ్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..గత నెలలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఏప్రిల్ చివరి వారంకల్లా మరింత ప్రబలంగా కేసులు నమోదవ్వడం ప్రారంభమైంది. ఇదిలా ఉండగా, గత ఏడాదిలో శీతకాలంలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసినప్పటి నుంచి అనూహ్యంగా కేసులు నమోదవ్వడమే గాక దేశంలో దాదాపు 85% మంది అనారోగ్యం బారినపడిన సంగతి తెలిసిందే. కాగా యూనివర్సిటీ హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ మాత్రం ప్రస్తుత వేవ్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటమే గాక మరణాలు కూడా తక్కువగానే నమోదవ్వుతాయని చెబుతున్నారు. ఇది తేలికపాటి వేవ్‌గానే పరిగణిస్తున్నాం, కానీ ఈ మహమ్మారీ ఇప్పటికీ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించడం బాధకరమని ఎపిడెమియాలజిస్ట్ అన్నారు. (చదవండి: ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్) -
ఎలుకలు కరోనా వేరియంట్‌ని వ్యాప్తి చేస్తాయ్! అధ్యయనంలో వెల్లడి
గత రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడి యథాస్థితికి వస్తోంది. ఐతే అసలు ఈ వైరస్ ఎలా వచ్చింది అనే దానిపై ఇప్పటికే శాస్తవేత్తలు పలు ఆసక్తికర పరిశోధనలు చేస్తునే ఉన్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా ఈ పరిశోధనలు చేయమని ప్రోత్సహించడమే గాక తద్వారా భవిష్యత్తులో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా బయటపడొచ్చు అని సూచించింది. అందులో భాగంగానే చేసిన పరిశోధనల్లో ఎలుకలు కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయగలవని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు పరిశోధకులు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎలుకలు మూడు రకాల కోవిడ్ వేరియంట్లకు లోనైనట్లు పేర్కోన్నారు. ఈ విషయాన్ని అమెరికన్ సోసైటీ ఫర్ మైక్రోబయాలజీ ఓపెన్ యాక్సెస్ జర్నల్ వెల్లడించింది. పరిశోధనల్లో ఎలుకలకు సార్క్ కోవిడ్2, ఆల్ఫా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అందుకోసం మురుగునీటి ప్రదేశాలు ఉన్న ప్రాంతాల నుంచి సేకరించిన ఎలకలను బంధించి పరిశోధనలు నిర్వహించారు. ఆ పరిశోధనల్లో సుమారు 79 ఎలుకల్లో దాదాపు 13 ఎలుకలకు సార్స్ కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో యూఎస్ ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ఈ ఎలుకలు అంటువ్యాధులను వ్యాప్తి చేయగలవని తమ అధ్యయనంలో తేలిందని డాక్టర్ హెన్రీ వాన్ చెప్పారు. అలాగే ఈ పరిశోధనలు.. ఎలుకల్లో కరోనా ఎలా పరిణామం చెందుతుంది, అది మానువులకు ప్రమాదం కలిగించేలా రూపాంతరం చెందే అవకాశం ఉందా? అనేదాని గురించి తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని చెప్పారు. ఎలుకలకు వచ్చిన కరోనా మహమ్మారి మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మానవులను ప్రభావితం చేసిన ఈ కరోనా మహమ్మారి విషయంలో జంతువులు కూడా కీలక పాత్ర పోషిస్తాయనే దానిపై అధ్యయనం చేయడం ద్వారా మానవులతోపాటు జంతువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలమని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, జంతువుల నుంచి మానవులకు కరోనా సంక్రమించడం అత్యంత అరుదని సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. కరోనాకు కారణమైన సార్స్ కోవిడ్2 ప్రజలకు వ్యాప్తి చేయడంలో జంతువులు ముఖ్యపాత్ర పోషిస్తాయనేందుకు సరైన ఆధారాలు మాత్రం లేవని సీడీసి వెల్లడించింది. కానీ ఈ మహమ్మారి సోకిన క్షీరద జంతువులతో సంబంధం ఉన్న ప్రజలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు వెల్లడించాయని సీడీసీ తన వెబ్సెట్లో పేర్కొంది. ఇంతకుముందు హాంకాంగ్, బెల్జియంలో ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో కరోనా వైరస్ బారిన పడినట్లు కనుగొన్నారు శాస్తవేత్తలు. కానీ కరోనా వేరియంట్‌కి సంబంధించిన అధ్యయనాల్లో మాత్రం పూర్తి స్ధాయిలో స్పష్టత రావాల్సి ఉంది. అలాగే పిల్లులు, కుక్కలు, ప్రైమేట్స్, హిప్పోలు, జింకలు, యాంటియేటర్లు వంటి వాటికి కరోనా సోకినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి కూడా! (చదవండి: వరదలతో అతలాకుతలమైన కాలిఫోర్నియా..ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్) -
భారత్‌లోకి చైనా వేరియంట్ ఎంట్రీ.. అప్పుడే మూడు కేసులు..
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కారణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా ఆ వేరియంట్ భారత్‌కూ వ్యాపించటం కలకలం సృష్టిస్తోంది. చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో మరో కేసు వెలుగు చూసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వేరియంట్‌పై వివరాలు వెల్లడించారు నిపుణులు. బీఎఫ్7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ వ్యాప్తిలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్లపై నిఘా పెట్టడం చాలా కీలకమని పేర్కొన్నారు. చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగటం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవటం వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. బీఎఫ్.7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రజల్లోని రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి ఉప రకం. దీనికి ఒకరి నుంచి ఒకరికి సోకే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ బీఎఫ్7 వేరియంట్‌ను అమెరికా, యూకే, ఐరోపా దేశాల్లోనూ గుర్తించారు. విమానాశ్రయాల్లో హైఅలర్ట్.. చైనా సహా విదేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోకి వచ్చే వారికి రాండమ్‌గా కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల కోసం ఉన్న మార్గదర్శకాలు యథాతథంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన -
'బీఏ5 వేరియంట్' కలవరం.. మూడు డోసులు తీసుకున్నా ఇన్ఫెక్షన్
కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త రూపంలో మానవాళిని భయపెడుతోంది ఈ మహమ్మారి. కొద్ది రోజులుగా భారత్‌తో పాటు పలు దేశాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌పై విస్తుపోయే విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల, గతంలో వైరస్ బారినపడి కోలుకోవటం వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తిని సైతం ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.5 హరిస్తోందని తేల్చారు. వారాల వ్యవధిలోనే మళ్లీ సోకుతోందని వెల్లడించారు. బీఏ.4తో పాటు బీఏ.5 వేరియంట్ కారణంగానే భారత్, అమెరికా, యూకే, ఇటలీ, చైనాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని అంచనాకు వచ్చారు. కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్ ప్రమాదకరంగా మారుతోంది. సులభంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతోంది. 'ఈ వేరియంట్ ఎందుకు ప్రమాదకరంగా మారుతోందంటే.. గతంలో వచ్చిన ఇమ్యూనిటీని ఎదుర్కొని సులభంగా శరీరంలోకి ప్రవేశించటమే. 2020లో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్ బీఏ1 వేరియంట్ బారినపడి కోలుకోగా వచ్చిన రోగనిరోధక శక్తి సైతం ఎలాంటి రక్షణ కల్పించదు' అని తెలిపారు కాలిఫోర్నియా యూనివర్సిటిలో పని చేస్తున్న అంటువ్యాధులు నిపుణులు బ్లూమ్‌బెర్గ్. ఇటీవల సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక సైతం బీఏ5 వేరియంట్‌పై హెచ్చరించింది. మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్ మళ్లీ సోకుతున్నట్లు పేర్కొంది. రోగనిరోధక శక్తిని రహస్యంగా ఎదురుకునే వేరియంట్‌గా అభివర్ణించారు లండన్‌లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు. గతంలోని వేరియంట్ల కంటే ప్రమాదకరమని, ఈ వేరియంట్‌ను ఇమ్యూన్ వ్యవస్థ గుర్తించలేకపోతోందని వెల్లడించారు. ఇదీ చదవండి: 'సూపర్ మూన్'గా జాబిల్లి.. మరో రెండ్రోజుల్లోనే.. -
Corona: భారత్‌లో కరోనా.. ఊరట ఇచ్చే విషయం
దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించి ఊరట ఇచ్చే విషయం చెప్పింది కేంద్ర పరిధిలోని ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కాన్సోర్టియమ్). స్వల్పంగా కేసులు పెరుగుతూ పోతున్న వేళ.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే మిగతా దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో కరోనా వైరస్‌కు సంబంధించి చాలా తక్కువ రీకాంబినెంట్ వేరియెంట్లు వెలుగుచూశాయని ప్రకటించింది. అంతేకాదు.. ఈ రీకాంబినెట్ వేరియెంట్లు.. వైరస్ తీవ్రవ్యాప్తికి కారణం కాలేదని, అలాగే ఆస్పత్రుల్లో చేరిన కేసులు.. తీవ్రస్థాయిలో ఇన్ఫెక్షన్కు గురైన పేషెంట్లపైనా ప్రభావం చూపలేదని ఇన్సాకాగ్ తన నివేదికలో పేర్కొంది. తాజాగా ఢిల్లీలో కరోనా వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియెంట్ బీఏ.2.12.1 కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ తరుణంలో వేరియెంట్ల తీవ్రతపై ఆందోళన నెలకొనగా.. తగు జాగ్రత్తలు తీసుకుంటే మరోవేవ్ నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులతో పాటు కేంద్రం కూడా చెబుతోంది. రీకాంబినెంట్ అంటే.. వైరస్ యొక్క రెండు విభిన్న వైవిధ్యాల నుండి జన్యు పదార్ధాల కలయిక ద్వారా సృష్టించబడిన వైవిధ్యం. అయితే భారత్‌లో కరోనా వైరస్‌కు సంబంధించి చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే రీకాంబినెట్ వేరియెంట్లు బయటపడ్డాయి. వాటి ప్రభావం కూడా తక్కువేనని ఇప్పుడు ప్రకటించింది ఇన్సాకాగ్. యూఎస్, యూకే సహా చాలా చోట్ల వేరియెంట్లు వెల్లువలా వచ్చాయి. కానీ, ఇంత జనాభా ఉన్న భారత్‌లో మాత్రం ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమని నిపుణులు అంటున్నారు. కేంద్ర విభాగమైన ఇన్సాకాగ్.. దేశంలో కరోనా తీరు తెన్నులు పరిశీలించడంతో పాటు వ్యాప్తి, వేరియెంట్ల మీదా పరిశోధనలు చేస్తుంది. ఏప్రిల్ 8వ తేదీ వరకు(ముందు మూడు నెలల వ్యవధిలో) వచ్చిన శాంపిల్స్ నుంచి రెండున్నర లక్షల దాకా శాంపిల్స్‌పై జెనెటిక్ సీక్వెన్స్ చేసి ఈ నివేదిక రూపొందించింది ఇన్సాకాగ్. ఇందులో ఒమిక్రాన్, డెల్టా, ఆల్ఫా, బీ.1.617.1, బీ.1.617.3, ఏవై సిరీస్, బేటా, గామా.. కేసులు ఉన్నాయి. చదవండి: భయం కరోనా కోసం కాదు.. వేరే ఉంది! -
జూన్‌లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని, దీనికి భయపడాల్సిన అవసరంలేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మొదటి వేవ్ నుంచి పరిశీలిస్తే నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో కరోనా వేవ్‌లు వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, ఫోర్త్ వేవ్ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. గాంధీఆస్పత్రిలో 14 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. నెల రోజులుగా గాంధీలో కోవిడ్ అడ్మిషన్, కోవిడ్ డెత్ ఒక్కటి కూడా జరగలేదన్నారు. గాంధీలో డైట్ కమిటీ సమావేశం... సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో రోగులకు ఆహారం అందించే డైట్ క్యాంటిన్ నిర్వహణ, పనితీరు మరింత మెరుగు పర్చేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సెమినార్ హాలులో డైట్ కమిటీ సమావేశం నిర్వహించారు. (క్లిక్: గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన) -
ఏ నూనె వాడుతున్నారు.. ఏ నీళ్లు తాగుతున్నారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వేరియంట్లతో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) శాస్త్రవేతలు మారుమూల గ్రామాల్లో అధ్యయనం మొదలుపెట్టారు. గ్రామీణులపై అది ఏవిధంగా ప్రభావం చూపుతోందనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి అలవాట్లు, జీవనశైలి గురించి పరిశీలనలు జరుపుతున్నారు. ‘ఏ వంట నూనె వాడుతున్నారు. బోరు నీరు తాగుతున్నారా. భోజనంలో చిరుధాన్యాలు, పండ్లు ఏమైనా తీసుకుంటున్నారా. రోజులో ఎన్నిగంటలు వ్యవసాయ పని చేస్తున్నారు. వారంపాటు చేను పనికి వెళ్లకపోతే ఆరోగ్యం ఎలా ఉంటోంది.. ఇలాంటి ప్రశ్నలను ప్రజలకు సంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్) ప్రతినిధులతో కలసి సంగారెడ్డి జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ ప్రశ్నావళిలో 40కిపైగా ప్రశ్నలు, ఉపప్రశ్నలున్నాయి. ఒక్క కేసూ నమోదుకాని గ్రామాల్లో.. ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదుకాని గ్రామాలు, అత్యధికంగా కోవిడ్ వచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఐసీఎంఆర్ ఈ సర్వే చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీరాబాద్ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కరస్‌గుత్తి పీహెచ్సీ పరిధిలో ఉండే ఈ మారుమూల గ్రామంలో ఐసీఎంఆర్ బృందం సర్వే చేసిందని స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గణపతిరావు తెలిపారు. మరోవైపు అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాక్స్‌నగర్ పీహెచ్సీ పరిధిలో కూడా ఈ సర్వే చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచీ వివరాల సేకరణ.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి జీవనశైలి ఎలా ఉందనే కోణంలోనూ శాస్త్రవేత్తలు వివరాలు రాబట్టారు. వ్యాక్సిన్ వేసుకోనివారు, కేవలం ఒక్క డోసు మాత్రమే వేసుకున్న వారు, రెండోడోసు వేసుకున్నవారు, బూస్టర్ డోసు కూడా వేసుకున్నవారు.. ఇలా వివిధ పారామీటర్లలో ప్రజలను ఎంపిక చేసుకుని వివరాలు సేకరించారు. రక్త నమూనాలూ సేకరణ సర్వే సందర్భంగా ఐసీఎంఆర్ బృందం సంబంధిత వ్యక్తుల నుంచి 3 ఎం.ఎల్. చొప్పున రక్తనమూనాలను తీసుకుంటోంది. ఒక్కో గ్రామంలో సుమారు 20 నుంచి 40 మందిని సర్వే చేసి వివరాలను రాబడుతోంది. సర్వేలో భాగంగా స్త్రీలు, పురుషుల నుంచి వివరాలు రాబడుతోంది. ఇదీ ఉద్దేశం.. కోవిడ్–19 సంక్రమణ, వ్యాప్తిని నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఈ వైరస్ నియంత్రణ, రానున్న రోజుల్లో మార్గదర్శకాల జారీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సర్వే చేస్తున్నవారికి ఉద్దేశాన్ని వివరిస్తూ కరపత్రాలను కూడా అందజేస్తున్నారు. -
టాలీవుడ్లో కొత్త వేరియంట్...!
ఇదేంటండీ బాబూ... వేరియంట్ వెరీ గుడ్డా? వేరియంట్ ఎలా అవుతుంది గుడ్డు.. వెరీ బ్యాడు అనే కదా మీ సందేహం. కరోనా వేరియేషన్స్‌లో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్... ఈ వేరియంట్లు బ్యాడే. కానీ... హీరోలు రకరకాల వేరియేషన్లలో కనిపిస్తే ఆ వేరియంట్ గుడ్డే కదా. అభిమానులకు పండగే కదా. ఇక ఒకే సినిమాలో పలు వేరియేషన్లలో కనిపించనున్న హీరోలెవరో చూసేద్దాం... కెరీర్లో ఎన్నోసార్లు డిఫరెంట్ గెటప్స్ ఉన్న పాత్రలు చేశారు చిరంజీవి. ఇప్పుడు ఒకటి కాదు రెండు మూడు సినిమాల్లో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నారు. విడుదలకు రెడీ అయిన ‘ఆచార్య’లో కామన్ మేన్‌గా, నక్సలైట్‌గా రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తారు చిరంజీవి. ‘ఆచార్య’ ట్రైలర్లో దీన్ని మనం గమనించవచ్చు. అలాగే ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) లోనూ చిరంజీవి డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలిసింది. ఇక ‘ఆచార్య’లో కీలక పాత్ర చేసిన రామ్‌చరణ్ ఈ చిత్రంలో తండ్రిలా రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. రామ్‌చరణ్ చేసిన మరో చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ హీరోగా నటించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ప్రధానంగా ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలోఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో తాను మూడు గెటప్స్‌లో కనిపించనున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో రామ్‌చరణే స్వయంగా చెప్పారు. పోలీసాఫీసర్, అల్లూరి సీతారామరాజు గెటప్స్‌తో పాటు మరో లుక్‌లో చరణ్ కనిపించనున్నారు. ఇదే చిత్రంలో ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిసింది. అందులో ఒకటి యంగ్ భీమ్ కాగా, అదే పాత్ర ఓల్డ్ వేరియేషన్ ఒకటి అని సమాచారం. కీలక సన్నివేశాల్లో టోపీ ధరించిన వేరియేషన్ ఒకటి. ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో మాత్రమే కాదు... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా చరణ్ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారే పాత్రలో చరణ్ కనిపిస్తారని తెలిసింది. ఇక ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రవితేజ. అయితే సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రావణాసుర’లో పది గెటప్స్‌లో కనిపిస్తారు. అలాగే ‘ఖిలాడి’ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’, సెప్టెంబరు 30న ‘రావణాసుర’ చిత్రాలు థియేటర్స్‌కు రానున్నాయి. ప్రస్తుతం ‘రావణాసుర’కి సంబంధించిన నైట్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. యంగ్ హీరో నాగచైతన్య లేటెస్ట్ ఫిల్మ్ ‘థాంక్యూ’. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కుమార్‌తో నాగచైతన్య చేస్తున్న చిత్రం ఇది. ఇందులో తాను మూడు గెటప్స్‌లో కనిపించనున్నట్లు నాగచైతన్య ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఓ వ్యక్తి జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అటు అమిర్ ఖాన్ హీరోగా చేసిన ‘లాల్‌సింగ్ చద్దా’లో కీ రోల్ చేసిన నాగచైతన్యను ఆ సినిమాలో రెండు గెటప్స్‌లో చూడొచ్చు. ఒకటి ఆర్మీ ఆఫీసర్ కాగా, మరొకటి జనరల్ గెటప్. ఇక కొన్ని నెలల క్రితం నితిన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తానని నితిన్ ఓ సందర్భంలో తెలిపారు. ఇంకోవైపు డిఫరెంట్ సినిమాలతో దూసుకెళ్తోన్న సత్యదేవ్ చేసిన తాజా చిత్రం ‘గుర్తుందా... శీతాకాలం’. ఇందులో స్టూడెంట్‌గా, ఉద్యోగిగా, ఇంకో వేరియేషన్... ఇలా మూడు డిఫరెంట్ గెటప్స్‌లో సత్యదేవ్ కనిపిస్తారు. నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక ‘దసరా’ చిత్రంలో నాని, ‘ది వారియర్’లో రామ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు కొందరు సీనియర్ అండ్ యంగ్ హీరోలు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి మేకోవర్ అవుతున్నారు. ఇలా పలు వేరియంట్స్ (రూపాంతరాలు) ఉన్న పాత్రల్లో హీరోలు కనబడితే... ఆడియన్స్ ‘వేరియంట్ వెరీ గుడ్డు’ అనకుండా ఉండగలరా! -
కరోనా కొత్త వేరియంట్..
-
వణికిస్తున్న కరోనా రూపాలు: ఆల్ఫా .. డెల్టా .. తర్వాత!
సాక్షి, హైదరాబాద్: ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా.. ఇవి ఇప్పటివరకు ప్రాచుర్యం పొందిన కరోనా రూపాంతరితాలు. వీటిలో డెల్టా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే స్థాయికి చేరుకుంది. ఒకవైపు భారత్‌లో మూడోసారి కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతుండగా.. అమెరికాలో కూడా దీని కారణంగా నమోదవుతున్న కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒకే ఒక్క నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టాను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీవోఐ) స్థాయి (జాగురుకతతో వ్యవహరించాల్సిన స్థాయి) నుంచి వేరియంట్ఆఫ్ కన్సర్న్ (వీవోసీ) స్థాయి (ఆందోళన కలిగించే స్థాయి)కి చేర్చేసింది. ఒకరకంగా రెండో ప్రమాద హెచ్చరిక అన్నమాట. అదృష్టవశాత్తూ ఇంతకంటే తీవ్రమైన లక్షణాలు కలిగించే, టీకాలకు లొంగని కొత్త రూపాంతరితమేదీ ఇంతవరకు బయటపడలేదు. కానీ డెల్టా ఒక హెచ్చరిక మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని రూపాంతరితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెల్టా తొలి మజిలీయే.. ఒకవైపు డెల్టా రూపాంతరితం వేగంగా విస్తరిస్తూంటే, ఇంకోవైపు చాలా దేశాల్లో కోవిడ్ నిబంధనల సడలింపు కూడా అంతే వేగంగా జరిగిపోతోంది. అయితే ఈ విషయంలో మరికొంత జాగురుకతతో వ్యవహరిస్తే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. వైరస్ పరిణామ క్రమంలో డెల్టా తొలి మజిలీ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేసులు పెరిగిపోతుండటం, నిబంధనల సడలింపులు, టీకా వేగం తగ్గుతుండటం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసిన మోడలింగ్ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితులు కొత్త రూపాంతరితాలు మరిన్ని పుట్టుకొచ్చేందుకు అనువైనవన్నది వీరి తాజా అంచనా. అమెరికాలో ఆరు వారాల వ్యవధిలో డెల్టా కారణంగా వచ్చిన కేసులు పది శాతం నుంచి ఏకంగా 83 శాతానికి పెరిగిపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. టీకాలు వేసుకున్న వారిపైనా.. కోవిడ్ నుంచి రక్షణకు తయారు చేసుకున్న టీకాలు ఇప్పటివరకు మెరుగైన రక్షణ కల్పిస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో కొన్నిచోట్ల టీకాలు వేసుకున్న వారికీ వైరస్ సోకుతుండటం ఎక్కువ అవుతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ, ఫైజర్, మోడెర్నా వంటి పలు కంపెనీలు సిద్ధం చేసిన వ్యాక్సిన్లు డెల్టాను సైతం సమర్థంగా అడ్డుకోగలవని ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోందంటే.. వైరస్ కొద్దోగొప్పో బలపడుతున్నట్లుగానే పరిగణించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్‌లో లక్ష్యానికి దూరంగా.. ఈ ఏడాది చివరికల్లా అర్హులైన దేశ జనాభా మొత్తానికీ వ్యాక్సిన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 16వ తేదీ టీకా కార్యక్రమం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం 47.2 కోట్ల మందికి టీకాలిచ్చారు. ఇందులో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య కేవలం 10.40 కోట్లు మాత్రమే. అంటే జనాభాలో కోవిడ్ నుంచి పూర్తిస్థాయి రక్షణ పొందిన వారు కేవలం 7.6 శాతం మంది మాత్రమే. జూలై నుంచి మొదలుపెట్టి డిసెంబర్ వరకు టీకాలు బాగా అందుబాటులో ఉంటాయని, రోజుకు కోటిమందికి టీకాలివ్వాలన్న లక్ష్యాన్ని అందుకోగలమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముందుగా అంచనా వేసినట్లు భారత్ బయోటెక్ తన ఉత్పత్తి లక్ష్యాలను అందుకోలేకపోవడం వల్ల టీకా కార్యక్రమం మందగించిందని, జాతీయ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. చదవండి: థర్డ్‌వేవ్: పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు? ప్రపంచ వ్యాప్తంగానూ ఇంతే.. ప్రపంచవ్యాప్తంగానూ టీకా కార్యక్రమం ఏమంత గొప్పగా సాగడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో సగం జనాభా పూర్తిస్థాయిలో టీకాలు పొందింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇది 35 శాతంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో 60 శాతానికిపైబడి ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే మళ్లీ కోవిడ్ నిబంధనలు విధించాల్సిన పరిస్థితి రావచ్చునన్న హెచ్చరికలు అక్కడ వినపడుతున్నాయి. ఇక పేదదేశాల్లో చాలా తక్కువమంది టీకాలు వేయించుకున్నట్లు తెలుస్తోంది. అయినా.. వారి కంటే 25 రెట్లు తక్కువే ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆసుపత్రి పాలయ్యేందుకు, తీవ్రమైన లక్షణాలు ఎదుర్కొనేందుకు ఉన్న అవకాశాలు టీకాలు వేయించుకోని వారి కంటే 25 రెట్లు తక్కువ. అయితే ఈ రక్షణ ఎంతమందికి కల్పించామన్న అంశంపై కొత్త రూపాంతరితాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. జనాభాలో కనీసంఅరవై శాతం మందికి టీకాలిస్తేనే కొత్తవి పుట్టుకొచ్చే అవకాశాలు తగ్గుతాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఒకటి చెబుతోంది. వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ వ్యాధి వ్యాప్తి, లక్షణాల తీవ్రత, గుర్తింపు, చికిత్సలకు లొంగకపోవడం వంటి అనేక అంశాలను ప్రభావితం చేయగల జన్యుపరమైన మార్పులు ఉన్న రూపాంతరితాలను వీవోఐలుగా పరిగణిస్తారు. టీకా లేదా గతంలో సోకిన వైరస్ల కారణంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీల ప్రభావం కొంచెం తక్కువగా ఉండే రూపాంతరితం. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగేందుకు కారణమనేందుకు సాక్ష్యాలున్నా ఈ కోవకే చెందుతుంది. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉండి.. ఆసుపత్రి బారిన పడేవారి సంఖ్య, మరణాలు ఎక్కువవుతాయన్న అంచనాలు ఉన్న రూపాంతరితాలను వీవోసీలుగా పరిగణిస్తారు. టీకా లేదా గతంలో సోకిన వైరస్ల కారణంగా పుట్టిన యాంటీబాడీల ప్రభావం చాలా తక్కువగా ఉన్న రూపాంతరితాలు కూడా ఈ కోవకి చెందుతాయి. వైరస్ నియంత్రణకు ఇస్తున్న చికిత్స తక్కువ ఫలితాలు ఇస్తున్నా.. వైరస్‌ను గుర్తించే పరీక్షలు విఫలమవుతున్నా దాన్ని ప్రమాదకరమైన రూపాంతరితంగా గుర్తిస్తారు. వేరియంట్ ఆఫ్ హై కాన్సీక్వెన్స్ విపరీత పరిణామాలకు తావివ్వగల రూపాంతరితాలను వేరియంట్ ఆఫ్ హై కాన్సీక్వెన్స్ అని పిలుస్తారు. అదృష్టవశాత్తూ కోవిడ్–19 కారక వైరస్లలో ఇప్పటివరకు ఇలాంటిది ఒకటి కూడా లేదు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్కు ఉన్న లక్షణాలు అన్నీ ఉండి.. అదనంగా ఆసుపత్రులపై విపరీతమైన భారం మోపగల అవకాశం ఉన్న రూపాంతరితాలు ఈ కోవకు చెందుతాయి. అంతేకాకుండా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం చేస్తున్న ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉన్నా, టీకా సామర్థ్యం గణనీయంగా తగ్గినా, టీకాలేసుకున్నా ఎక్కువమందికి వ్యాధి సోకినా, టీకా వేసుకున్నా తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించినా దాన్ని విపరీత పరిణామాలకు అవకాశమున్న రూపాంతరితంగా గుర్తిస్తారు. ఇలాంటి రూపాంతరితాలను గుర్తిస్తే... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ విషయాన్ని నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 4 వీవోఐ, 4 వీవోసీ ఏడాదిన్నర కాలంలో కోవిడ్ కొన్ని వేల రూపాల్లోకి మారి ఉంటుంది. వీటిల్లో అత్యధికం పెద్దగా అపాయం లేనివే. ఒకవేళ ప్రమాదం ఉందని అనుకుంటే.. దాని తీవ్రత, లక్షణాలను బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్న రెండు వర్గాలుగా విభజిస్తుంది. తాజాగా అమెరికా ఇంకో అడుగు ముందుకేసి వేరియంట్ ఆఫ్ హై కాన్సీక్వెన్స్ (వీవోహెచ్సీ) (విపరీత పరిణామాలకు కారణమయ్యేది) అని ఇంకో వర్గాన్ని జోడించింది. అయితే తొలి రెండు వర్గాల రూపాంతరితాలకు మాత్రమే గ్రీకు అక్షరమాలలోని అక్షరాలు ఆల్ఫా, బీటా, గామా వంటి పేర్లను కేటాయిస్తారు. తొలిసారి వైరస్‌ను గుర్తించిన దేశం పేరుతో పిలవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ ఈ ఏర్పాటు చేసింది. గ్రీకు అక్షరమాలలో మొత్తం 24 అక్షరాలు ఉంటే.. ఇప్పటివరకు 11 రూపాంతరితాలకు పేర్లు పెట్టారు. వీటిల్లో నాలుగు వీవోఐ కాగా.. నాలుగు వీవోసీ ఉన్నాయి. ఎప్సిలాన్, జెటా, తీటా పేర్లు కొంత కాలం క్రితం మూడు వేరియంట్లకు కేటాయించినప్పటికీ, ప్రమాదం తక్కువని తరువాత స్పష్టమైంది. ఈ లెక్కన ఇంకో పదమూడు పేర్లు కొత్త రూపాంతరితాలకు పెట్టేందుకు అవకాశం ఉందన్నమాట. పేరు శాస్త్రీయ నామం తొలిసారి గుర్తించింది డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు ఈటా బి.1.525 డిసెంబర్ 2020, పలుదేశాల్లో 17, మార్చి 2021 అయోటా బి.1.526 నవంబర్ 2020, అమెరికాలో 24, మార్చి 2021 కప్పా బి.1.617.1 అక్టోబర్ 2020, భారత్‌లో 04, ఏప్రిల్ 2021 ల్యామ్డా సి.37 డిసెంబర్ 2020, పెరులో 14, జూన్ 2021 -
డెల్టా వేరియంట్‌పై షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూడో వేవ్ ముంచుకొస్తోందన్న ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ‘డెల్టా వేరియంట్’ పై తాజా నివేదిక మరింత ఆందోళన పుట్టిస్తోంది. ఇది ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని, అత్యంత ప్రమాదకరమైన చికెన్‌పాక్స్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని యూఎస్ హెల్త్ అథారిటీని ఉటంకిస్తూ అక్కడి మీడియా నివేదించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇంకా ప్రచురితం కాని డేటా ప్రకారం భారతదేశంలో ముందుగా గుర్తించిన డెల్టా వేరియంట్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలను ప్రచురించాయి. డెల్టా సోకిన వ్యక్తిలో వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది. దీనిపై శుక్రవారం సీడీసి అదనపు డేటాను ఏజెన్సీ ప్రచురిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయం కూడా దీన్ని అడ్డుకోలేదని, మరింత విధ్వంసకరంగా విజృంభించే ప్రమాదముందని సీడీసీ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, వారి ముక్కు, గొంతులో ఎంత వైరస్ ఉంటుందో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైరల్ లోడ్ ఉంటుందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ పీ వాలెన్స్కీ వెల్లడించారు. వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువనీ, మెర్స్, సార్స్, ఎబోలా, కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్‌తో చాలా తీవ్రమైన ముప్పు అని వస్తున్న డేటాతో ఆందోళన రేపుతోందని, దీనిపై తక్షణమే గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందుకే అందరూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఇతరులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వాలెన్స్కీ చెప్పారు. కాగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారితో వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు తాజాగా తేలింది. దీంతో అందరూ మాస్క్ ధరించాలని సీడీసీ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. టీకా వైరస్ తీవ్రతను 90 శాతం అడ్డుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌మిషన్‌ను నివారించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు అని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇతర కేసులతో పోలిస్తే వైరల్ లోడ్ అధికంగా ఉందనీ, ఆల్ఫా వేరియంట్ సోకినవారు గాలిలోకి వదిలే లోడ్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుదలయ్యే వైరల్ లోడ్ పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ అంచనా వేసింది. -
వైరస్లందు... ఈ వేరియంట్లు వేరయా!
మాంచి లంక పుగాకు చుట్ట వెలిగించి ఆబగా పొగ లాగి గాల్లోకి వదిలాడు గిరీశం. పేపర్ చదూతోంటే గోపాత్రుడు వచ్చాడు. యామివోయ్ మై డియర్ గోపాత్రుడూ ఏంటి అలా డల్‌గా ఉన్నావ్ అని ఆరా తీశాడు. ఏం లేదు గురువుగారూ... ఈ కరోనా ఏంటో వేరియంట్లు ఏంటో చాలా భయంగా ఉంది అన్నాడు. వాటికి భయపడాల్సింది లేదోయ్. అని భరోసా ఇచ్చాడు గిరీశం. మన దేశంలో ఏ వేరియంట్లు ఉన్నాయ్ గురువు గారూ అని అడిగాడు గోపాత్రుడు. ఎల్లో వేరియంట్... కాంగ్రెస్ వేరియంట్ బాగా తిరిగేస్తున్నాయిరా మన దేశంలో అన్నాడు గిరీశం. గోపాత్రుడు వెర్రిమొగం వేశాడు. అవేం వేరి యంట్లు గురువుగారూ అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇవి పొలిటికల్ వేరియంట్లు లే. అని.. గోపాత్రుడు అర్థం కానట్లు చూడ్డంతో వివరించడం మొదలు పెట్టాడు గిరీశం. ఎల్లో వేరియంట్ అంటే టీడీపీ వేరియంట్ అన్న మాట. చాలా వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ ఇది. డెల్టా వేరియంట్ ఏ శరీరంలోకి అయినా ఎలా చొచ్చు కుపోతుందో.. ఎల్లో వేరియంట్ అలా ఏ పార్టీలోనైనా చొరబడిపోతుందన్నమాట. మోస్ట్ డేంజరస్ వేరి యంట్ ఇది. అన్నాడు గిరీశం. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు గురువు గారూ అన్నాడు గోపాత్రుడు. వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా... ఇపుడు 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది కదా. అధికారానికి దూరంగా ఉంటే నా శిష్యుడు చంద్ర బాబు నాయుడికి నిద్ర పట్టదు కదా, అంచేత అధికారంలో ఉన్న బీజేపీలోకి తనకు నమ్మకస్తులైన నలుగురు రాజ్యసభ సభ్యులను పంపేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌లోనూ మన మనిషి ఉంటే బాగుంటుందని రేవంత్ రెడ్డిని పంపేశారు. మరో నేత రమణను అధికారంలో ఉన్న టీఆర్ఎస్లోకి పంపారు. వీళ్లంతా ఎల్లో వేరియంట్లలో మ్యుటేషన్ చెందిన వారే. టీడీపీ లాగే కాంగ్రెస్ నుండి కూడా ఇలాగే చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేశారు. వారంతా కాంగ్రెస్ వేరియంట్లు. అయితే కాంగ్రెస్ నుండి వేరే పార్టీల్లో చేరిన వాళ్లు ప్రమాదకారులు కారు. టీడీపీ నుండి వెళ్లిన ఎల్లో వేరియంట్లు మాత్రం ఏ పార్టీలో చేరినా అక్కడ పదవులు పొంది పనులు చేయించుకుంటూనే టీడీపీ అజెండాను భుజాలకెత్తుకుంటారు. చంద్రబాబుకు మేలుచేసే విధంగానే మాట్లాడతారు. కాంగ్రెస్‌కూ ఎల్లో వేరియంట్లకూ ఉన్న తేడా అదే అన్నాడు గిరీశం. ఎల్లో వేరియంట్లను చంద్రబాబే ఇతర పార్టీల్లోకి చొప్పించారు. అని వివరించాడు గిరీశం. మరయితే చంద్రబాబు మీ శిష్యుడన్నారేంటి? అని అడిగాడు గోపాత్రుడు. అవును నా లాంటి వందమంది కలిస్తే ఓ చంద్రబాబు. ఒక విధంగా నన్ను చూసి అతను ఇన్‌సై్పర్ అయినా.. గురువును మించిన శిష్యుడన్నమాట. నేను పూటకో అభిప్రాయం మారిస్తే చంద్రబాబు నిముషానికి అరవై అభిప్రాయలు మార్చగలరు. మన వారసుడే అనుకో అని గిరీశం తెగ పొగిడేశాడు. సరిగ్గా అప్పుడే వీధి తలుపు ఎవరో కొడితే.. గోపాత్రుడు వెళ్లి చూసి వచ్చి మీ కోసం ఆయన వచ్చారు అన్నాడు. ఎవర్రా అని గిరీశం ఆత్రంగా అడిగాడు. అదే.. మీ శిష్యుడు చంద్రబాబునాయుడు వచ్చారు మీతో మాట్లాడాలట అన్నాడు గోపాత్రుడు. చంద్రబాబు పేరు వినగానే గిరీశానికి ముచ్చెమటలు పట్టాయి. నేను లేనని చెప్పు అన్నాడు. గోపాత్రుడు అలాగే అని చెప్పి చంద్రబాబును పంపేశాడు. అదేంటి గురువుగారూ మీరు భయపడ్డం మొదటిసారి చూస్తున్నాను అన్నాడు. ఇందాకే చెప్పాను కదా. చంద్రబాబు చాలా డేంజరస్. నేను చెప్పిన ఫిలాసఫీని కాపీ కొట్టేసి అందరూ నన్ను మర్చిపోయేలా చేశాడు. ఇప్పుడు చాలా మందికి గిరీశం అంటే తెలీదు. కారణం నా ప్లేస్‌ని ఇమేజ్‌ని చంద్రబాబు కొట్టేశాడు. ఇపుడు ఇంట్లోకి రానిస్తే ఇంకేం చేస్తాడో అని హడలి చచ్చా అన్నాడు గిరీశం. గిరీశం గారు నాకు గురువైతే.. చంద్రబాబు నాయుడు జగద్గురువు అన్నమాట అనుకున్నాడు గోపాత్రుడు మనసులో. - సి.ఎన్.ఎస్. యాజులు -
వేరియంట్లు ఏవైనా జాగ్రత్తలు అవే..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌కు సంబంధించిన వేరియంట్లు చాలా వస్తున్నాయి.. అంతరించి పోతున్నాయి.. కానీ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు జాగ్రత్తలు మారవని కర్నూలు జనరల్ ఆస్పత్రి వైరాలజిస్ట్ డాక్టర్ రోజారాణి వెల్లడించారు. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మాస్కు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఈ జాగ్రత్తలే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు శాశ్వత పరిష్కార మార్గాలని చెప్పారు. మన రాష్ట్రంలో మొదటి వేవ్, రెండో వేవ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వేరియంట్లు వచ్చాయని, కొన్ని అంతరించి పోయాయన్నారు. ప్రస్తుతం తెరమీదకొచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకంగా తేలిందన్నారు. మొదటి వేవ్‌లో శరీరంలోకి ప్రవేశించిన వైరస్ బాగా అభివృద్ధి చెందడానికి 14 రోజుల సమయం తీసుకునేదని, అదే సెకండ్ వేవ్‌కు వచ్చేసరికి మూడు, నాలుగు రోజులు పడుతోందన్నారు. ఇప్పటివరకు మాస్కులు అవసరం లేదని ప్రకటించిన దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్లతో మళ్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నాయన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ అనగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గడప దాటగానే విధిగా మాస్కు ధరించాలన్న ఆలోచన మంచి ఫలితాలనిస్తుందన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ రక్షణనిస్తుందని, అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ వేయలేదు కాబట్టి వారిపట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. వివిధ వేరియంట్లను గుర్తించడం, వాటి ప్రభావ శీలతను లెక్కించడానికి జినోమిక్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ రోజారాణి పేర్కొన్నారు. -
ముంబైలో లెవల్ 3 ఆంక్షలు విధింపు
-
ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ కలకలం
-
సుబ్బారావ్, ప్యారేలాల్.. ఈ వైరస్లు ఎందుకు లేవు
హైదరాబాద్ : విచిత్రమైన వ్యాఖ్యలకు విపరీతమైన చేష్టలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. తన ప్రశ్నలు, ప్రవర్తన మనకు నచ్చకపోయినా ... అందులో లాజిక్ మనల్ని ఏదో మూలన ఆలోచింప చేస్తుంది. తాజాగా కరోనా వేరియంట్లపై సెటైరిక్‌గా ట్వీట్ వదిలాడు వర్మ. వైరస్ వేరియంట్లకు ఎవరికీ అర్థం కాకుండా గుర్తుంచుకోవడం కష్టం అయ్యేలా Bi7172, Nk4421, K9472 ,AV415లాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారు ?వైరస్ వేరియంట్లకు కూడా ప్యారేలాల్, చింటూ, జాన్ డేవిడ్, సుబ్బారావు ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టడం లేదంటూ సైంటిస్టులను ప్రశ్నించాడు. కొద్ది మంది వర్మ ప్రశ్నకు సైంటిఫిక్ సమాధానాలు ఇవ్వగా మరికొందరు ఈ ఐటమ్ తెలివి తేటలతోనే సినిమాలు తీస్తున్నావంటూ వర్మపై సెటైర్లు వేశారు. చాలా మంది నవ్వుకున్నారు. చదవండి : కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు! Hey Scientists,instead of boggling our minds with impossible to remember names like Bi7172, Nk4421, K9472 ,AV415 etc ,Why can’t you name them Pyarelal, Chintu, John David , ,Subba Rao etc ???😳😳😳 — Ram Gopal Varma (@RGVzoomin) June 24, 2021 -
డెల్టా వేరియంట్ విజృంభణ
-
‘వ్యాక్సిన్ల మధ్య విరామం ఎక్కువైతే ముప్పే’
వాషింగ్టన్: కరోనా టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదముందని అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇదే జరిగిందని చెప్పారు. కాగా షెడ్యూల్ ప్రకారం టీకా వేయాలని సూచించారు. గత నెలలో భారత ప్రభుత్వం టీకాల మధ్య విరామ సమయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకరులు దీనిపై అడిగిన ప్రశ్నకు డాక్టర్ ఫౌసీ ఈ విధంగా స్పందించారు. ఇక అమెరికాలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ బలంగా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వీలైనంత త్వరగా టీకా వేయాలని ఫౌచీ సూచించారు. వ్యాక్సిన్ల మోతాదుల మధ్య అనువైన విరామం సమయం.. ఫైజర్‌కు మూడు వారాలు, మోడర్నాకు నాలుగు వారాలుగా తెలిపారు. విరామ సమయం పొడగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడే అవకాశాలు ఎక్కువని వెల్లడించారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ బలంగా ఉందని గుర్తు చేశారు. టీకాలు వేసిన దేశాల్లో వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. కొవిడ్‌తో పోరాడేందుకు టీకాలు కీలకమని, ఎవరైనా ఇంతకు ముందు వైరస్ బారినపడినప్పటికీ టీకాలు వేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా థర్డ్, మరిన్ని వేవ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్ కీలకమని వివరించారు.ఇటీవల భారత్‌లో కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు పెంచిన ప్రభుత్వం ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది. అంతకు ముందు మార్చి నెలలో అయితే 28 రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా? -
డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా?
లండన్: భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల ప్రభావాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని యూకే హెల్త్ నిపుణుల నివేదిక వెల్లడించింది. యూకేలో ఈ వేరియంట్ వేగంగా పెరుగుతోందని, ఇతర వేరియంట్ల కన్నా తొందరగా వ్యాపిస్తోందని తెలిపింది.ఢి ల్లీలో కేసులు ఉధృతికి ఈ వేరియంటే కారణంగా వీరి అధ్యయనం తేల్చింది. ఇమ్యూనిటే ఎలివేషన్ లక్షణాలతో ఉన్న ఈ డెల్టా వేరియంట్ ఏప్రిల్‌లో 60 శాతం కేసులకు కారణమైందని తెలిపింది. డెల్టా వేరియంట్ అమెరికా,యూకెతో సహా కనీసం 60 దేశాలలో ఉందని కోవిడ్ -19 జెనోమిక్స్ యుకే కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్ షరోన్ పీకాక్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ హెల్త్ ఈవెంట్లో పేర్కొన్నారు. ఆల్ఫా వేరియంట్, బీ1.117 కంటే 50 శాతం ఇది ఎక్కువ వ్యాప్తిచెందుతుందని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సీఎస్ఐఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నిపుణులు వెల్లడించారు. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ ప్రభావాన్ని బాగా తగ్గిస్తున్నదని, ముఖ్యంగా ఒక డోసు తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం బాగానే ఉంటోందని, కానీ కాలానుగుణంగా ప్రభావం తగ్గుదల ఆల్ఫా కన్నా ఎక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుతం యూకేలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ వల్ల కరోనా ఉధృతి చాలా వరకు అదుపులో ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషనే ఉత్తమమార్గమని యూకే హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. చదవండి : టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి American Embassy: టీకా తప్పనిసరి కాదు