కొత్త రకం ఇన్నోవా, ఫార్చునర్ | Toyota launches new Innova starting Rs 15.8 lakh | Sakshi
Sakshi News home page

కొత్త రకం ఇన్నోవా, ఫార్చునర్

Jan 6 2015 1:27 AM | Updated on Sep 2 2017 7:15 PM

కొత్త రకం ఇన్నోవా, ఫార్చునర్

కొత్త రకం ఇన్నోవా, ఫార్చునర్

టయోటా కంపెనీ ఇన్నోవా మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: టయోటా కంపెనీ ఇన్నోవా మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త ఇన్నోవా వేరియంట్ ధరలు రూ.10.51 లక్షల నుంచి రూ.15.80 లక్షల(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)రేంజ్‌లో ఉన్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్,మార్కెటింగ్) ఎన్.రాజా తెలిపారు. ‘ఇన్నోవా మోడల్‌ను తెచ్చి పదేళ్లయింది. ఈ పదేళ్లుగా ఇన్నోవా విజయయాత్ర కొనసాగుతోంది.

కొత్త రకాన్ని తేవటమనేది అనుకోకుండా జరిగింది. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) ఫార్చునర్(4ఇంటూ4 ఆటోమేటిక్)లో కూడా కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చాం’ అని రాజా వివరించారు. ఈ ఎస్‌యూవీ ధర రూ.24.17 లక్షల నుంచి రూ.26.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు కార్లు భారత ఆటోమొబైల్ చరిత్రలో ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయని పేర్కొన్నారు. తమ అన్ని మోడళ్లలో ఫ్రంట్ ఎస్‌ఆర్‌ఎస్ ఎయిర్‌బ్యాగ్స్‌ను అందిస్తున్నామని, ఇలా అందిస్తున్న తొలి కంపెనీ తమదేనని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement