కోవిడ్-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో అదరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునేలోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేను ఉన్నానంటూ కన్నెర్రజేస్తోంది. ఇప్పటివరకు ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి రకరకాల సబ్‌వేరియంట్‌లుగా రూపాంతరం చెంది కలవరపెడుతూనే ఉంది.
ఇప్పుడు మళ్లీ ఎక్స్‌ఈసీ అనే కొత్త వేరియంట్ రూపంలో దూసుకొస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసుని జర్మన్‌లో గుర్తించారు. అలా ఇది యూకే, యూఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఇది యూరప్‌లో వేగంగా విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లో కూడా ఈ వైరస్ వృద్ధి తీవ్రంగా ఉందని వెల్లడించారు.
ఈ ఎక్స్‌ఈసీ కోవిడ్ వేరియంట్‌ని ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ హైబ్రిడ్ కేఎస్ 1.1, కేపీ, 3.3గా చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా, లండన్‌లోని జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ.. ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎక్స్‌ఈసీ తొందరగా వ్యాప్తి చెందదని, అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు. శీతకాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషనల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ..ఈ వేరియంట్ ఉధృతి ఇప్పుడే ప్రారంభమయ్యింది.
ఇది తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు. ఈ ఎక్స్‌ఈసీ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వంశానికి చెందిన ఉపవేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్‌ల, బూస్టర్ డోస్‌లతో అదుపు చేయగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందర్నీ పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎక్స్‌ఈసీ లక్షణాలు..
జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత ఛార్జ్ చేస్తాడంటే..?)
Comments
Please login to add a commentAdd a comment