తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు.. | Post Surgery US Mans Colon Falls Out Of Body After Forceful Sneeze, Know What Happened Later | Sakshi
Sakshi News home page

తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..

Published Sun, Jun 9 2024 1:19 PM | Last Updated on Sun, Jun 9 2024 6:02 PM

US Mans Colon Falls Out Of Body After Forceful Sneeze

తుమ్ములు కొందరికి చిన్నగా వస్తే..మరికొందరికి పెద్దగా వస్తాయి. పెద్ద సౌండ్‌తో ఫోర్స్‌గా వచ్చే తుమ్ములతో చెవులు మూసుకుపోయినట్లు ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేగానీ ఏకంగా పొట్ట చీల్చుకుని ప్రేగులు రావడం చూశారా..?. ఔను ఓ వ్యక్తికి పెద్దగా ఫోర్స్‌గా తుమ్ము వచ్చింది. ఆ ఫోర్స్‌కి ఏకంగా పొట్లలోని ప్రేగులు బయటకొచ్చాయట. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..ఫ్లోరిడాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి రెస్టారెంట్‌ వెళ్లాడు. అక్కడ బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తుండగా హఠాత్తుగా పెద్ద తుమ్ము వచ్చింది. ఆ తర్వాత కొద్దిపాటి దగ్గు కూడా వచ్చింది. అంతే కొద్దిసేపటికి పొత్తి కడుపు భాగమంతా రక్తంతో తడిచిపోయి, నొప్పితే విలవిలలాడిపోయాడు. ఏం జరిగిందని భార్య పరిశీలించి చూస్తే అతని పొట్ట భాగం నుంచి పెద్ద ప్రేగులు పోడుచుకుని వచ్చినట్లుగా బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన అతడి భార్య వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేయడంతో.. వాళ్లు వెంటనే బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. 

వైద్యుల సైతం అతడి కేసుని చూసి షాక్‌కి గురయ్యారు. ఇది అత్యంత అరుదైన కేసు అని అన్నారు. అయితే ఈ ఘటనలో బాధితుడు అదృష్టవశాత్తు పెద్ద మొత్తంలో రక్తాన్ని కోల్పోలేదని చెప్పారు. వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి పెద్ద ప్రేగును జాగ్రత్తగా ఉదరకుహరంలోకి చేర్చారు. పొత్తికడుపు ఎనిమిది కుట్లు వేశామని, తెరుచుకునే అవకాశమే లేదని తెలిపారు. అసలు ఇలా ఎందుకు జరిగిందంటే..? సదరు వ్యక్తి గత కొంతకాలం ప్రొస్టేట్‌ కేన్సర్‌తో బాధపడ్డాడని అన్నారు. ఇటీవలే ఉదర శస్త్ర చికిత్స చేయించుకోవడంతో, ఇలా జరిగిందని వైద్యులు వివరించారు. వామ్మో..పొట్టకు సర్జరీ చేయించుకున్నవాళ్లు తుమ్ము, దగ్గు వంటివి రాకుండా జాగ్రతపడటం మేలు కదా..లేదంటే అంతే పరిస్థితి.

(చదవండి: బ్యాడ్‌ లాంగ్వేజ్‌ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement