sneeze
-
తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..
తుమ్ములు కొందరికి చిన్నగా వస్తే..మరికొందరికి పెద్దగా వస్తాయి. పెద్ద సౌండ్‌తో ఫోర్స్‌గా వచ్చే తుమ్ములతో చెవులు మూసుకుపోయినట్లు ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేగానీ ఏకంగా పొట్ట చీల్చుకుని ప్రేగులు రావడం చూశారా..?. ఔను ఓ వ్యక్తికి పెద్దగా ఫోర్స్‌గా తుమ్ము వచ్చింది. ఆ ఫోర్స్‌కి ఏకంగా పొట్లలోని ప్రేగులు బయటకొచ్చాయట. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్లోరిడాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి రెస్టారెంట్ వెళ్లాడు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా హఠాత్తుగా పెద్ద తుమ్ము వచ్చింది. ఆ తర్వాత కొద్దిపాటి దగ్గు కూడా వచ్చింది. అంతే కొద్దిసేపటికి పొత్తి కడుపు భాగమంతా రక్తంతో తడిచిపోయి, నొప్పితే విలవిలలాడిపోయాడు. ఏం జరిగిందని భార్య పరిశీలించి చూస్తే అతని పొట్ట భాగం నుంచి పెద్ద ప్రేగులు పోడుచుకుని వచ్చినట్లుగా బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన అతడి భార్య వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేయడంతో.. వాళ్లు వెంటనే బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సైతం అతడి కేసుని చూసి షాక్‌కి గురయ్యారు. ఇది అత్యంత అరుదైన కేసు అని అన్నారు. అయితే ఈ ఘటనలో బాధితుడు అదృష్టవశాత్తు పెద్ద మొత్తంలో రక్తాన్ని కోల్పోలేదని చెప్పారు. వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి పెద్ద ప్రేగును జాగ్రత్తగా ఉదరకుహరంలోకి చేర్చారు. పొత్తికడుపు ఎనిమిది కుట్లు వేశామని, తెరుచుకునే అవకాశమే లేదని తెలిపారు. అసలు ఇలా ఎందుకు జరిగిందంటే..? సదరు వ్యక్తి గత కొంతకాలం ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధపడ్డాడని అన్నారు. ఇటీవలే ఉదర శస్త్ర చికిత్స చేయించుకోవడంతో, ఇలా జరిగిందని వైద్యులు వివరించారు. వామ్మో..పొట్టకు సర్జరీ చేయించుకున్నవాళ్లు తుమ్ము, దగ్గు వంటివి రాకుండా జాగ్రతపడటం మేలు కదా..లేదంటే అంతే పరిస్థితి.(చదవండి: బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు
తుమ్ములు రావడం సర్వసాధారణం. కొంతమంది త్ముమ్మడానికి సిగ్గుపడి ఆపుకుంటుంటారు. మీటింగ్ సమయంలో లేదా ఏదైనా సీరియస్ కార్యక్రమంలో చాలామంది తుమ్ము వస్తున్నా ఏదోలా ఆపేస్తారు. ఇలా ఆపడం వల్ల ఒక్కొసారి ప్రాణాంతకం అవుతుంది. ముక్కు నరాలు చిట్లడం వంటివి జరగుతాయి కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చేసి ఏకంగా గొంతునే కోల్పోయాడు. అసలు తమ్మును ఆపొచ్చా! ఆపితే ఇక అంతేనా!..దాని గురించే ఈ కథనం. 34 ఏళ్ల బ్రిటీష్ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మేందుకు సిగ్గుపడి నాసికా రంధ్రాలను గట్టిగా అదిమి, నోటిని కూడా మూసేశాడు. దీంతో ఒక్కసారిగా ముక్కు లేదా నోటి నుంచి గాలి వెళ్లే మార్గం లేక గాలి బుడగల రూపంలో ఛాతిపై ఒత్తిడి చూపడంతో మెడ చుట్టు ఉన్న నరాలు పొంగి పగలిపోయే స్థితికి వచ్చేశాయి. ఆ తర్వాత గొంతులో రంధ్రం ఏర్పడి ఇక మింగే అవకాశం లేకుండా పోయింది. ఇక నెమ్మది నెమ్మదిగా స్వరాన్ని కూడా కోల్పోయాడు. గొంతులో రంధ్రం ఎలా ఏర్పడిందంటే.. గొంతులో ఉండే ఫారింక్స్ అంత సులభంగా చీలిపోదు. పదేపదే వాంతులు, దగ్గు లేదా బాహ్య గాయం కారణంగా మాత్రమే చీలీపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి విషయంలో గాలి బయటకు వెళ్లే మార్గం లేక గాలి బుడగలు అతని ఛాతీలోని కణజాలం, కండరాలలో స్థిరపడటం ప్రారంభించాయి. దీంతో మెడ అంతటా పాపింగ్, పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు వైద్యులు. ఇది తమకే చాలా షాకింగ్ అనిపించిందన్నారు. గొంతులోని పక్కటెముక నొప్పితో పాటు అతని గొంతు ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం అతనికి ఫీడింగ్ ట్యూబ్ ఏర్పాటు చేశామని, దాని సాయంతో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. యాంటీబయోటిక్స్ మందులతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడని అన్నారు వైద్యులు. Em caso raro, homem rompe garganta e tem dificuldade para falar após segurar espirro https://t.co/KyYpmX91A0 #G1 pic.twitter.com/7h9ApBJUvW — g1 (@g1) January 16, 2018 అసలు ఎందుకు తుమ్ము వస్తుందంటే.. ధూళి, పుప్పొడి, పోగ వంటి ఇతరత్ర కణాలు నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చికాకు కలిగించడంతో తుమ్ము రావడం జరుగుతుంది. ముక్కులోని డెస్ట్ క్లియర్ చేసేందుకు శరీర ధర్మంగా వచ్చేదే ఈ తుమ్ము అని వైద్యులు చెబుతున్నారు. ఇది ముక్కుకి బాక్టీరియా, బగ్‌ల దాడి నుంచి రక్షణ ఇచ్చే ఒక సాధనం లాంటిది. మనం తుమ్మగానే కొద్దిపాటి తేమతో కూడిని గాలి బయటకు బలంగా వస్తుంది. దీని వల్ల గాల్లోకి సూక్ష్మ జీవులు ఈజీగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగానే ఫ్లూ వంటి కొన్ని రకాల అంటువ్యాధులు ఈజీగా వ్యాప్తి చెందుతాయి. అందుకే కాస్త చేయి అడ్డుపెట్టుకుని తుమ్మండి అని చెబుతుంటారు. అదేపనిగా వచ్చే తుమ్ములతో చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని రకాల సీజన్లలో మరి ఎక్కువగా ఉంటుంది. గట్టిగా తుమ్మితే ఒక్కొసారి ముక్కు నుంచి రక్తం కారడం కూడా జరగుతుంది. చాలావరకు తుమ్ములు ఆందోళన కలిగించేవి కాకపోయిన తుమ్మును ఆపుకోకుండా ఉంటేనే మంచిదంటున్నారు వైద్యులు. తుమ్ము అనేది మానవ శరీర ధర్మం. గనుక పదిమందిలో తుమ్మేందుకు సిగ్గుపడి, లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవద్దు అని అంటున్నారు వైద్యులు. ఇది అందరికీ కామన్ కాబట్టి లేనిపోని రిస్క్‌లు కొని తెచ్చుకోకండి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: కడుపులో కణితి.. ఇలాంటివి ప్రాణాంతకమా? కాదా?) -
దగ్గు రాకపోయినా దగ్గితే పనిష్మెంట్
లండన్: ఇప్పట్లో కోవిడ్ దశ ముగిసే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఎన్నాళ్లని లాక్డౌన్ అంటూ భయంతో బతుకు వెళ్లదీయడం అని ఒక్కొక్కటిగా అన్నిరకాల కార్యకలాపాలను తెరుచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అందులో భాగంగానే బడులకు కూడాఆ పచ్చజెండా ఊపుతున్నారు. దీంతో యునైటెడ్ కింగ్డమ్లో నిన్నటి నుంచే స్కూళ్లు పున: ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా తూర్పు ససెక్స్‌లోని ఆర్క్ అలెక్జాండ్ర అకాడమీ కరోనా వైరస్ రెడ్ లైన్స్ పేరిట ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. "విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా దగ్గకూడదు, తుమ్మకూడదు. కరోనా గురించి ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయరాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీస దూరం ఉండాల్సిందే. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ఈ ఆంక్షలను ఉల్లంఘించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారిని స్కూలు నుంచి ఇంటికి పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దగ్గు రాకపోయినా సరే దగ్గుతూ నటించినా, కరోనా మీద కుళ్లు జోకులు వేసినా వారిపై చర్యలు తప్పవు. కఠినంగా అనిపిస్తోన్న ఈ నిబంధనలను పిల్లలు అలవాటు చేసుకుంటారో, లేదా రూల్స్ అతిక్రమించి పనిష్మెంట్ తీసుకుంటారో! కాగా వీటితో పాటు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను కూడా విద్యార్థులు పాటించాల్సిందే. ఫేస్ మాస్క్ ధరించడం, ఒకరికి మరొకరికి మధ్య భౌతికదూరం పాటించడం వంటివి తప్పనిసరి. (చదవండి: ‘టీసీ’ లేకున్నా అడ్మిషన్..) -
లాక్డౌన్ ఉల్లంఘన.. నటుడిపై తుమ్మిన వ్యక్తి!
ప్రముఖ హిందీ కమెడియన్ వీర్ దాస్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వీర్ దాస్‌పై ఓ సామాన్యుడు తుమ్మాడు అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలను వీర్ దాస్ ఖండించాడు. కాకపోతే సదరు వ్యక్తి తనను వేధించాడని.. బెదిరింపులకు దిగాడని తెలిపాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వీర్ దాస్. ఈ వీడియోలో ఓ పెద్ద వయసు వ్యక్తి వీర్‌ను తిడుతూ.. బెదిరిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతడి మీద తుమ్మడానికి కూడా ప్రయత్నిస్తాడు. తర్వాత కనీసం ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటించమని వీర్ దాస్‌ను కోరడం వీడియోలో చూడవచ్చు.(‘ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’) Lockdown Neighbour. I was giving my friend Kavi who lives three houses down from me some dinner. We were waiting for it to get cooked 15 feet away from each-other. Me on my doorstep, him out. This happened. 🤦🏻♀️ pic.twitter.com/YKgErSxqBC — Vir Das (@thevirdas) May 24, 2020 అనంతరం వీర్‌దాస్ దీని గురించి మాట్లాడుతూ.. ‘తాజాగా మా అపార్ట్మెంట్లో ఓ రోజు సాయంత్రం చిన్న సిటప్ ఏర్పాటు చేశాం. అందరికి అక్కడే భోజనం ఏర్పాట్లు చేశాం. ప్రతి ఒక్కరం 15 అడుగుల దూరంలో కూర్చున్నాం. అందరం సామాజిక దూరం పాటించాము. నేను సిగరెట్ తాగడానికి కిందకు వచ్చాను. ఆ తర్వాత 5 నిమిషాలకు వీడియోలో ఉన్న సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి నేను ఉంటున్న అపార్ట్మెంట్లోనే మొదటి అంతస్తులో ఉంటున్నాడు. అతను ఆ ఇంటి యజమాని కాదు. మా యజమాని నేను ఉంటున్న ఇంటిని వారసత్వంగా పొందాడు. నేను కూర్చున్న స్థలం, నా ఇల్లు ఏది అతని సొంతం కాదు. అన్నింటికి మించి ఓ వృద్ధుడు నా మీద తుమ్ముతాడని నేను అనుకోవడం లేదు’ అన్నాడు. (బాలీవుడ్‌ను వదలని కరోనా..) వీర్‌దాస్ మాట్లాడుతూ.. ‘కానీ మీడియాలో వస్తున్న వార్తలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మొదట్లో వీటిని నేను పట్టించుకోలేదు. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీ లాక్డౌన్ ఎలా ఉంది’ అంటూ వీర్ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు కామెంట్ చేశారు. జాగ్రత్తగా ఉండమంటూ వీర్‌కు సలహా ఇచ్చారు. -
ఒక టీస్పూన్ లాలాజలంలో ఎంత వైరసో తెలుసా?
అంటుకుంటే వదలదు...అక్షరాలా.. యాభై వేల కోట్లు! కోవిడ్ బాధితుడి ఒక టీస్పూన్ లాలాజలంలో ఉండే కరోనా వైరస్ల సంఖ్య ఇది. ఒక్క దగ్గు లేదా తుమ్ము చాలు.. ఈ వేల కోట్ల వైరస్లలో కొన్ని తుంపర్లతో కలిసి పరిసరాల్లోకి చేరిపోయేందుకు.. ఆ క్షణంలో ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నా సరే.. కొంచెం అటుఇటుగా 32,456 వైరస్లు నోరు, గొంతు పైపొరల్లోకి చేరిపోతాయి. ఆ సెకను నుంచి శరీరంలో వైరస్లు ఇబ్బడిముబ్బడి కావడం మొదలవుతుంది. ఆ తరువాత ఒక్కో దశలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే..కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఇంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటున్నాయో ఇట్టే అర్థమైపోతుంది. సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) బాధితుడు ఒక్కసారి తుమ్మినా, దగ్గినా కోటానుకోట్ల వైరస్లు పరిసరాల్లోని ఉపరితలాలపై చేరిపోతాయి. చేతిని అడ్డం పెట్టుకుని ఉంటే ఆ చేతులతో తాకిన ప్రతిచోటా వైరస్ ఉండిపోతుంది. ఉపరితలాన్ని బట్టి ఈ వైరస్ రెండు గంటల నుంచి మూడు రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఇటీవలే అమెరికాలో జరిగిన పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. అంటే.. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా.. మనుషులకు మీటర్ ఎడంగానే ఉంటున్నా కొంచెం కష్టమైనా సరే.. బలవంతంగా చేతులను ముఖానికి తాకకుండా జాగ్రత్త పడుతున్నా కూడా వైరస్ బారిన పడే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయన్నమాట. ఒక్కసారి ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తరువాత వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది? ఎంత చేటు తెస్తుందన్నది చూస్తే... (కరోనా వ్యాప్తి: మాస్క్.. మాఫియా..!) తుమ్మినా... దగ్గినా..మాట్లాడినా డేంజరే... కరోనా వైరస్ బాధితుడు ఒక్క మాట మాట్లాడితే చాలు.. అతడి గొంతు నుంచి పైకి వచ్చే గాలి ద్వారా వైరస్‌లతో కూడిన చిన్నచిన్న తుంపరలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని వైరస్లు ఇతరులు తినే ఆహారంపై చేరిపోవచ్చు. మరికొన్ని వేళ్లమధ్యలో ఉండిపోవచ్చు. మరికొన్ని ముక్కు ద్వారా సైనస్‌లోకి చేరి మళ్లీ గొంతులో స్థిరపడిపోవచ్చు. ఈ దశలో ఒక్క షేక్‌హ్యాండ్ ఇచ్చినా సరే.. అవతలి వ్యక్తి చేతులపై కనీసం 43,654 వైరస్లు పోగుపడతాయని, షేక్‌హ్యాండ్ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 3,12,405కు చేరుతుందని అంచనా. ఇప్పుడు గొంతులో మిగిలిపోయిన వైరస్ల సంగతి చూద్దాం. కొన్ని వైరస్లు లాలాజలపు చుక్కలతో కలిసి ఊపిరితిత్తుల్లోని ఒక కొమ్మపై చేరిపోతాయి. వెచ్చగా, తడిగా ఉండే కణజాలంపై ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ వైరస్లు ఎంత సూక్ష్మస్థాయిలో ఉంటాయంటే.. మన వెంట్రుకను ఫుట్‌బాల్ మైదానం అంత సైజుకు పెంచితే వైరస్ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే ఉండేంత! (జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?) -
పొలం పనికి ఎండ దెబ్బ!
ఎండలు పెరుగుతున్నా పొలం పనులు చేసుకోవడం తప్పదు. ఏటేటా ఎండలు పెరుగుతున్నాయి. అలా.. ఎండ దెబ్బ బెడద ఏటేటా పెరుగుతూనే ఉంది గానీ తగ్గడం లేదు. ఎండనకా వాననకా కాయకష్టం చేసే రైతులు, రైతు కూలీలు, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఎర్రని ఎండల్లోనూ భద్రంగా ఉండాలంటే.. అప్రమత్తత అవసరం. ఎండ దెబ్బకు చెమట చిందుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం బరువు తగ్గుతుంది.. పనిసామర్థ్యమూ తగ్గుతుంది... ప్రాణానికే ముప్పొస్తుంది. ఈ ముప్పు మహిళా రైతులకు మరింత ఎక్కువని ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) హెచ్చరిస్తోంది.. తస్మాత్ జాగ్రత్త! ప్రపంచవ్యాప్తంగా శ్రామికుల సంఖ్యలో 31.8 శాతం మంది వ్యవసాయంలోనే పనిచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఎండ దెబ్బకు గురవుతున్నారు.వేసవి ఎండలో పనులు చేసే మనుషులు చెమట ద్వారా బయటకు పోతున్న నీటికి తగినంత నీటిని తాగాలి. లేకపోతే దేహంలో నీటి కొరత ఏర్పడుతుంది.. ఆ మేరకు ఆ మనిషి పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చెమట వల్ల దేహం బరువులో 3% వరకు నీటిని కోల్పోతే ఆ ప్రభావం శ్రామికుని పని సామర్థ్యంపై అంతగా ఉండదు. 4% తగ్గితే.. ఆ వ్యక్తి శారీరక శ్రమ చేసే సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఎండ తీవ్రత, గాలిలో వేడి–తేమ తదితర పరిస్థితులను, శ్రమ తీవ్రతను బట్టి ఎండలో పనిచేసే ఒకరికి రోజుకు 2 నుంచి 15 లీటర్ల వరకు నీరు అవసరమవుతుందని అంచనా. ► మనిషి దేహంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అంతర్గతంగా దేహక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఎండలో పనిచేసే వారికి ఎంత ఎక్కువ చెమట పడితే.. ఎండను తట్టుకునే శక్తి అంతగా పెరుగుతుంది. సాధారణంగా మహిళలకు పురుషులకన్నా తక్కువ చెమట పడుతుంది. వృద్ధులు, పిల్లల పరిస్థితి కూడా అంతే. కాబట్టి, వీరికి వడ దెబ్బ ప్రమాదం ఎక్కువ. ► ఎక్కువ వేడి వాతావరణంలో వరుసగా చాలా గంటల పాటు పనిచేస్తున్న మనిషి దేహంలో నీరు తగ్గిపోయి.. చెమట పట్టటం తగ్గినప్పుడు.. దేహం లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి పెరుగుతుంది. అప్పుడే వడ/ఎండ దెబ్బ తగులుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వారిని చల్లని ప్రాంతానికి తరలించడం, తగిన వైద్య సహాయం అందించగలిగితే ప్రాణానికి ముప్పు తప్పుతుంది. ► సాధారణ వ్యక్తి ఆహారం ద్వారా రోజుకు 8–14 గ్రాముల ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఎండలో పనిచేసే అలవాటు అంతగా లేని వ్యక్తి ప్రతి లీటరు చెమటతోపాటు 4 గ్రాముల ఉప్పును కోల్పోతారు. కాబట్టి, ఎండలో ఎక్కువ గంటల పాటు పొలం పనులు చేసే వారు ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ► మనిషికి చెమట వల్ల దేహం బరువులో 2% మేరకు నీటిని కోల్పోతే మానసిక స్థితిలో మార్పు వస్తుంది.. పని చేయాలన్న ఆసక్తితో పాటు.. పని సామర్థ్యమూ తగ్గుతుంది. ► చెమట ద్వారా కోల్పోయే బరువు సాధారణ (3%)స్థితిలో ఉన్నప్పటికీ.. మోస్తరు ఎండలోనూ పని సామర్థ్యం 80% తగ్గుతుంది. అయితే, చెమట ద్వారా కోల్పోయే నీటిని, లవణాలను తగినంతగా తీసుకునే మనిషి పని సామర్థ్యం తీవ్రమైన ఎండలో కూడా 55% మాత్రమే తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ► వేడి నుంచి రక్షణ కల్పించడంలో దుస్తులు కీలకపాత్ర పోషిస్తాయి. ఎండాకాలంలో వ్యవసాయ, అటవీ పనులు చేసే మనుషులు తగినంతగా శరీరాన్ని కప్పి ఉంచే పల్చటి నూలు వస్త్రాలు వేసుకోవడం ఉత్తమం. లేత రంగు దుస్తులు ఎండను తిరగ్గొట్టడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. తల గుడ్డ చుట్టుకోవాలి లేదా అంచు పెద్దగా ఉండే టోపీ పెట్టుకోవాలి. ► విశ్రాంతిగా ఉన్న మనిషి శరీరం నుంచి రోజుకు సుమారు 400–700 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనితోపాటు 150–200 గ్రాముల నీరు శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అయితే, సమశీతల పరిస్థితుల్లో శారీరక శ్రమ చేసే మనిషి దేహం నుంచి ప్రతి గంటకూ 600 గ్రాముల చొప్పున నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ► సాధారణంగా పురుషుల శరీర ఆకారం పెద్దగా ఉంటుంది. అంటే, దేహాన్ని కదిలించడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, తద్వారా వారి దేహంలో ఎక్కువ వేడి పుడుతుంది. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల శరీరంపై స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. అయితే, పురుషుల స్వేదగ్రంధి నుంచి అధికమొత్తంలో చెమట వెలువడుతుంది. ► ఎండలో పనిచేసే గర్భవతులకు ఇబ్బందులు మరీ ఎక్కువ. నెలలు నిండని బిడ్డను ప్రసవించడం వంటి సమస్యలు రావచ్చు. ► పెద్దల కన్నా పిల్లలకు స్వేద గ్రంధుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక వేడి నుంచి పిల్లలకు ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ► వృద్ధుల దేహంపైన ఉండే స్వేద గ్రంధులు తక్కువ మొత్తంలో చెమటను స్రవిస్తాయి. అధిక వేడి వల్ల వృద్ధుల హృదయ స్పందనలు, రక్తప్రసరణ నెమ్మదించవచ్చు. అందువల్ల వారికి వేడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. ► మధుమేహం, ఊబకాయం ఉన్న వ్యక్తులు అధిక వేడి వల్ల అనారోగ్యం పాలుకావడానికి ఆస్కారం ఉంది. ► ఎండలో పనిచేసే అలవాటు లేని వారు.. 7–9 రోజుల పాటు తక్కువ శారీరక శ్రమ ఉంటే పనులను రోజూ కొద్ది గంటల పాటు చేస్తూ.. అలవాటు చేసుకోవాలి. సాధారణంగా శారీరక శ్రమ చేయటం అలవాటున్న వారు.. అంతకుముందు శారీరక శ్రమ అంతగా అలవాటు లేనివారికన్నా ఎక్కువ చెమటను విడుదల చేయగలగడం వల్ల త్వరగా వేడి వాతావరణానికి అలవాటు పడగలుగుతారు. వేడి వాతావరణంలో పనిచేయడానికి అలవాటు పడిన వారికి గంటకు వెయ్యి గ్రాముల నీటిని వెలుపలికి పంపేంత చెమట పడుతుంది. ► అలవాటు లేకుండా కొత్తగా ఎండలో పనులు చేయడం ప్రారంభించిన వారు తమకు తెలిసినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల ఎండదెబ్బకు గురవుతూ ఉంటారని సర్వేలలో తేలింది. ► ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడంలో రైతు కూలీలకు తగిన తాగునీటి సదుపాయం కల్పించాలి. తాగునీరు ఒక మోస్తరు చల్లగా(15–20 డిగ్రీల సెంటీగ్రేడ్) ఉంటే చాలు. నీరు కొద్ది కొద్దిగా తరచూ తాగడం మంచిది. అవకాశాన్ని బట్టి అంబలి, మజ్జిగ తాగొచ్చు. టీ, కాఫీ, మద్యం తాగకూడదు. ఎండలో పనిచేసే పిల్లలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. రైతులు, వ్యవసాయ క్షేత్రాల మేనేజర్లు, సూపర్వైజర్లు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే.. వ్యవసాయ కార్మికుల పని సామర్థ్యం తగ్గకుండా పని బాగా జరగడంతోపాటు.. వారూ అనారోగ్యం పాలవకుండా ఉంటారు.పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. ► పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. -
నమ్మకం: ‘తుమ్ము’ అపశకునమా!
జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో తుమ్ము గురించిన ఓ విచిత్రమైన నమ్మకం ఉంది. ఒక వ్యక్తి వాతావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు రెండో వ్యక్తి కనుక తుమ్మితే... వాతావరణం సరిగ్గా లేదని, ఏవైనా ఉపద్రవాలు కూడా సంభవించవచ్చని నమ్ముతారు. ఇంత వింత ఎలా ఏర్పడిందనే దానికి నిదర్శనాలు లేవు! జలుబు చేస్తే తుమ్ములొస్తాయి. ఇది చిన్న అనారోగ్య సూచన. దుమ్ము రేగి నాసికను తాకినా తుమ్ములొస్తాయి. ఇది ఓ క్రియకు ప్రతిస్పందన. అలాంటి తుమ్ముకీ మనిషి అదృష్టానికీ సంబంధం ఏమిటి? మనిషనేవాడికి తుమ్ములు రాక మానవు. మరి అత్యంత సహజమైన ఈ ప్రక్రియ చుట్టూ అసహజమైన నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి నమ్మకాలా? మూఢనమ్మకాలా? బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఠక్కున ఆగిపోతారు కొందరు. కాసేపు ఆగి, మంచినీళ్లు తాగి కానీ కదలరు. అదేమిటంటే అపశకునం అంటారు. నిర్లక్ష్యం చేస్తే అదృష్టం టాటా చెప్పి వెళ్లిపోతుందని, దురదృష్టం దర్జాగా వచ్చి తిష్ట వేస్తుందని అంటారు. కొందరైతే ప్రాణాపాయం ఏర్పడుతుందని కూడా భయపడుతుంటారు. ఓ చిన్న తుమ్ముకి ఇన్ని జరుగుతాయా అంటే సమాధానం చెప్పరు. కానీ కచ్చితంగా ఏదో జరుగుతుందని మాత్రం నమ్ముతారు. ఆ నమ్మకంలో నిజమెంత? హిందూ మతస్తుల్లో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మడం మంచిది కాదు అనే నమ్మకం బలంగా ఉంది. అనారోగ్యం వల్ల వచ్చే తుమ్ములను ఎవరూ పట్టించుకోరు. కానీ బయటకు బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే మాత్రం కంగారు పడిపోతారు. అపశకునమంటూ భయపడి పోతారు. అలాగే గడపకు అవతల ఒక కాలు, ఇవతల ఒక కాలు ఉన్నప్పుడు తుమ్మితే ఆయుక్షీణమంటారు. అయితే... ఇలా ఎందుకు అంటారు అన్నదానికి సశాస్త్రీయమైన ఆధారాలను మాత్రం ఎవరూ చూపించలేక పోతున్నారు. అలాగే బైబిల్ ప్రకారం దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి, అతడి నాసికా రంధ్రాల్లో జీవ వాయువును ఊది ప్రాణం పోశాడు. దీన్ని బట్టి యూదుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. జీవం ఎలా అయితే ముక్కుద్వారా శరీరంలో ప్రవేశించిందో, అలాగే బయటకు పోతుందని వాళ్లు నమ్మేవారు. తుమ్మినప్పుడు వేగంగా బయటకు పోయే గాలితో పాటు శరీరంలోని జీవం బయటకు పోతుందని, అంటే ఆ వ్యక్తి చావుకు దగ్గరైనట్లేనని ఓ నమ్మకం వారిలో ప్రబలింది. ఈ నమ్మకం నుంచే, ఎవరైనా తుమ్మినప్పుడు ‘గీసుంథైత్’ అనడం మొదలైంది. అంటే ‘మంచి ఆరోగ్యం కలుగును గాక’ అని అర్థం. మనవాళ్లు కూడా ‘చిరంజీవ’ అంటారు కదా... అలా అన్నమాట! అయితే ఎలా వచ్చిందో కానీ... ఈ నమ్మకం మధ్యలోకి దెయ్యం వచ్చి చేరింది తరువాతి కాలంలో. తుమ్ముతో మనిషి ఆత్మ బయటకు పోతుందని, తద్వారా దురాత్మ (ప్రేతాత్మ?) వచ్చి శరీరంలో తిష్ట వేస్తుందని అనుకోవడం మొదలయ్యింది. అందుకే ఎవరైనా తుమ్మితే ‘గాడ్ బ్లెస్ యూ’ అనేవారు. నీ శరీరంలో దెయ్యం చేరకుండా దేవుడు నిన్ను కాపాడతాడు అని చెప్పడమే ఆ దీవెన వెనుక ఉద్దేశం. ఈ నమ్మకం ఎంత బలంగా స్థిరపడిపోయిందంటే... చాలా దేశాల వారు ఎవరైనా వ్యక్తి తుమ్మితే, అతడి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసేవారట. దేవుడికి మొక్కులు మొక్కుకుని, బలులు కూడా ఇచ్చేవారట. అయితే ఇదంతా నాగరికత తెలియని కాలంలోజరిగింది. కొన్నేళ్ల తరువాత జర్మన్లతో పాటు మరికొన్ని దేశాల వారు కూడా ఇది కేవలం ఓ మూఢ నమ్మకమంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తుమ్ము కేవలం ఆరోగ్యానికి సంబంధించినదేనని, తుమ్మితే హెల్త్ చెకప్ చేయించుకోవాలే తప్ప అనవసరమైన భయాలకు పోకూడదని వివరించారు. అప్పట్నుంచి ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తుమ్ముని అపశకునంగా కాక, శారీరకంగా జరిగే అతి సాధారణ ప్రక్రియగా చూడటం మొదలైంది. కాలం గడిచేకొద్దీ తుమ్ము చుట్టూ ఉన్న అపనమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా వరకూ తొలగిపోయాయి. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ఈ నమ్మకం సజీవంగానే ఉంది!