యూఎస్‌లోని ఐదేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్టు గురై కుప్పకూలింది. దాదాపు 20 సెకన్లపాటు గుండె ఆగిపోయింది. అయితే ఆ బాలుడి బతుకుతాడో లేదో అన్న తీవ్ర ఉత్కంఠ రేగింది. ఈక్రమంలో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం మూడు వేర్వేరు ఆస్పత్రలు తరలించారు. అయితే ఆ బాలుడి అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపటడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఈ ఉత్కంఠభరితమైన ఘటన యూఎస్‌లోని థీమ్ పార్క్ వాల్డ్ డిస్నీ వరల్డ్‌లో చోటు చేసుకుంది. ఐదేళ్ల ఎర్నెస్టో టాగ్లే అనే చిన్నారి రోలర్‌కోస్టర్‌ను రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతని వెనుక కూర్చొన్న ఆమెకు అతడి పల్స్‌లో ఏదో తేడా ఉన్నట్లు గమనించింది. వెంటనే ఛాతీపై తట్టడం వంటి సీఆర్‌పీ పనులు చేసింది అతడి తల్లి క్రిస్టీనా. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ముగిసిన వెంటనే తన కొడుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది.
ఆమె వెంట ఒక నర్సు, ఈఎంటీ మెషిన్‌ని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎర్నెస్టో దాదాపు 20 సెకన్ల పాటు శ్వాస పీలచ్చుకోవడం లేదు అంటే.. గుండె ఆగిపోయింది. దీంతో వాళ్లు గుండె మళ్లీ సక్రమంగా కొట్టుకునేలా ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్(ఈఎంటీ)ను అందించి హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆ బాలుడిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు కాటెకోలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (సీపీవీటీ)తో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది.
ఇది అరుదైన గుండె పరిస్థితి. దీని కారణంగా సదరు రోగికి తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం లేదా లయ తప్పడం జరుగుతుంటుంది. ప్రాణాంతకమైన ఈ అరిథ్మియాలో వచ్చే ఆకస్మిక కార్డియాక్ అరెస్టుని నివారించేలా ఒక పరికరాన్ని అతడి ఛాతీలో ఉంచారు. అయితే అన్ని నిమిషాలపాటు శ్వాస ఆగిపోయిన టైంలో అతడి గుండె, మెదడు దెబ్బతినకుండా వైద్యులు రక్షించడం విశేషం.
ఈ భయానక ఘటన నుంచి తన కొడుకు ఓ యోధుడిలా తిరిగొచ్చడాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. అంతేగాదు తన కుమారుడిని కాపాడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "ఆ చిన్నారి శక్తి అజేయం, భయానక పరిస్థితిని నుంచి బయటపడ్డ అద్భుత వ్యక్తి". అని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..? రెండింటికి సంబంధం ఏంటీ..?)
Comments
Please login to add a commentAdd a comment