మృత్యువు ఒడిలోకి వెళ్లి కూడా బతికి వస్తే వాట్ ఏ మిరాకిల్ అనుకుంటాం. మన కళ్లను మనమే నమ్మలేని కఠిన నిజం గందరగోళానికి గురి చేసేలా మన కళ్లముందు మెదిలాడుతుంది. ఆ క్షణం మన ఆనందానికి అవధులుండవు. అలాంటి ఓ అద్భుత ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.
యూఎస్‌లోని టీనా అనే ఓ మహిళ కార్డియాక్ అరెస్టుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. ఓ వైపు శరీరం నీలం రంగులోకి మారిపోతుంది కూడా. ఇంతలో ఆమె భర్త ఆమెను బతికించేలా చేస్తున్న సీపీఆర్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంబులైన్స్‌ని పిలిపించి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. అంతేగాదు ఆస్పత్రికి వెళ్లే మార్గంలో సైతం ఆమెను బతికించేలా ఆక్సిజజన్ అందించి గుండె పనిచేశాల చేసే ప్రథమ చికిత్సల్లో వేటికి ఆమె స్పందించలేదు. చివరికి ఆస్పత్రిలో వైద్యుల సైతం ఆమె చనిపోయిందని డిసైడ్ అయ్యారు.
ఆల్‌మోస్ట్ ఓ శవం మాదిరి నిర్జీవంగా పడి ఉంది టీనా. దీంతో వైద్యులు చివరి ప్రయత్నంగా డీఫిబ్రిలేటర్‌తో షాక్ ఇద్దాం అని డిసైడ్ అయ్యి ఇస్తే..ఏదో నిద్రలో మెల్కోన్నట్లు కళ్లు తెరించింది. ఆ హఠాత్పరిణామానికి వైద్యులు సైతం సభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అసలు చలనం లేకుండా శవంలా పడి ఉంది. స్పదించదని తెలిసే జస్ట్ అలా కరెంట్ షాక్ ఇచ్చామని చెబుతున్నారు వైద్యులు. ఐతే కళ్లు తెరిచి చూసింది గానీ ఏం మాట్లాడలేకపోయింది. ఈ తంతంగమంతా చూస్తున్న ఆమె సభ్యులు కూడా విస్తుపోయారు. నిజంగా ఆమె బతికిందా దెయ్యమా? అన్నంత టెన్షన్‌గా చూశారు ఆమెను.
ఆమె ఏం మాట్లాడలేదని వైద్యుల కుటుంబంసభ్యులకు చెప్పడంతో అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఆమెకు ఒక పుస్తకం, పెన్ను ఇచ్చి నీకు ఏం జరిగిందో లేక గుర్తున్నది అందులో రాయమని సూచించారు. చనిపోయి బతికావని తెలుసా అని వైద్యులు అడగగా..ఔను! ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉన్నట్లు అనిపించిందని ఎంత ప్రయత్రించినా మేల్కొలేకపోతున్నట్లు తెలిసిందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా జరిగినప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్‌కి అందక మెదడులో బ్లీడింగ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల బతకదని తేల్చి చెప్పాం అన్నారు. ఆమె బతికినా బ్రెయిన్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో పరీక్షలు చేసినా వాటి తాలుకా గాయాలు ఏం కనిపించకపోవడం వైద్యులను మరింత ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెను మరో నాలుగు రోజులు పూర్తి అబ్జర్వేషన్‌లో ఉంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
(చదవండి: ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!)
Comments
Please login to add a commentAdd a comment