రియల్‌మి ఏ2+ కొత్త వేరియంట్‌: ధర చూస్తే ఇంప్రెస్‌ అవుతారు! | Redmi A2+ 128GB storage variant launched in India: Check price, specifications - Sakshi
Sakshi News home page

రియల్‌మి ఏ2+ కొత్త వేరియంట్‌: ధర చూస్తే ఇంప్రెస్‌ అవుతారు!

Published Wed, Aug 23 2023 8:34 PM | Last Updated on Thu, Aug 24 2023 11:14 AM

RedmiA2 plus128GB Storage Launched check Price and Specifications - Sakshi

Redmi A2+ 128GB Storage చైనా స్మార్ట్‌ఫోన్‌  మేకర్‌ రెడ్‌మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌ను  లాంచ్‌ చేసింది. రెడ్‌మి ఏ2+లో కొత్త ర్యామ్‌,  స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో  ఆవిష్కరించింది.  ఇది  ఈ ఏడాది మార్చిలో  లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇపుడు 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌కాన్ఫిగరేషన్‌లో తీసుకొచ్చింది. MediaTek Helio G36 SoC , 5,000mAH బ్యాటరీ,మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో లాంచ్‌అయింది.  ఇది గరిష్టంగా 32 రోజుల స్టాండ్‌బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ  పేర్కొంది.

ధర, ఆఫర్‌
4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌రెడ్‌మి ఏ2+ వేరియంట్ ధర  ఎంఐడాట్‌కామ్‌లో రూ.8,499గా ఉంది.  అయితే  ప్రస్తుతం పరిచయ ఆఫర్‌గా   ప్రస్తుతం రూ. 7,999గా కొనుగోలు చేయవచ్చు.  ఇది  క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ , ఆక్వా బ్లూ రంగులలో లభ్యం. 

రెడ్‌మి ఏ2+ స్పెసిఫికేషన్స్‌ 
 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల HD+  LCD డిస్‌ప్లే
1600 x 720 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 13
8మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , QVGA కెమెరాతో AI-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా 
5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 
5,000mAh బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement