Motorola Introduces Upgraded Moto E13 Model - Sakshi
Sakshi News home page

Moto E13: బడ్జెట్‌ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్‌ఫోన్‌: స్పెషాల్టీ ఏంటంటే?

Published Mon, Aug 14 2023 5:08 PM | Last Updated on Mon, Aug 14 2023 8:08 PM

Motorola introduces upgraded moto e13 model - Sakshi

Motorola Launched 'moto e13' మోటరోలా సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది.  మోటో ఈ13 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది.  8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌లో తీసుకొచ్చింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఆగస్టు 16 నుండి ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లు బడ్జెట్‌ ధరలో లభించ నుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ అనే మూడు రంగుల్లో రూ. 8,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ  తెలిపింది. అద్భుతమైన టెక్నాలజీ, పెర్‌ఫామెన్స్‌తో దీన్ని  తీసుకొచ్చినట్టు తెలిపింది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ లోని ఏఐ పవర్డ్‌  కెమెరా "ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్‌తో పర్ఫెక్ట్ షాట్‌ను తీయడంతోపాటు, ఫేస్ బ్యూటీ , పోర్ట్రెయిట్ మోడ్ మీ ఫోటోలను స్వయంచాలకంగా మెరుగుపరుస్తాయని స్మార్ట్‌ఫోన్ మేకర్‌ వెల్లడించింది.

మోటో ఈ13 స్పెసిఫికేషన్స్‌
6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
ప్రీమియం యాక్రిలిక్ గ్లాస్ (PMMA) బాడీ
Dolby Atmos ఆడియో
13 ఎంపీ ఏఐ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement