సాక్షి, ముంబై: బడ్జెట్ ఫోన్ల సంస్థ నోకియా మరోసారి తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అతి తక్కువ ధరలో నోకియా సీ 22 ఫోన్‌నుభారత మార్కెట్లోలాంచ్ చేసింది. మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్‌తో భారత దేశంలో విడుదల చేస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ గురువారం ప్రకటించింది. (BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్ )
దీని ధర రూ. 7999 గా నిర్ణయించింది. చార్‌కోల్, సాండ్, పర్పుల్ కలర్స్ లభ్యం. 4జీబీ ర్యామ్ 2 జీబీ వర్చువల్ స్టోరేజ్, 4జీబీ (2GB + 2GB RAM), 6జీబీ(4GB + 2GB వర్చువల్ RAM) 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లభించ నుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఏడాది రిప్లేస్‌మెంట్ గ్యారంటీతోపాటుఅందిస్తున్న నోకియా సీ 22 ఈ రోజు నుంచే( మే 11) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇంకా IP52గా రేట్ బ్యాటరీ సేవర్ ఫీచర్ , స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ: కేవలం రూ. 5వేలకే)
నోకియా సీ-సిరీస్ నమ్మదగిన, సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో కస్టమర్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదని హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో తెలిపారు.
నోకియా సీ22 ఫీచర్లు
6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్
13 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 mAh బ్యాటరీ
Introducing the all-new Nokia C22 comes with 4GB RAM + 2GB virtual RAM, 13MP dual rear camera, 1 year replacement guarantee and 3-day battery life to make you #LiveUntamed.
— Nokia Mobile India (@NokiamobileIN) May 11, 2023
Buy now: https://t.co/tKvqK84hWj#NokiaC22 pic.twitter.com/gVNg4kA7ki
Comments
Please login to add a commentAdd a comment