సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) లాంచ్ అయింది. పలు కీలక ఫీచర్లతో, అందుబాటులో ధరలోఈ మొబైల్‌ను తీసు కొచ్చింది. నోకియా సీ12 లాంచ్ చేసిన వారం రోజుకే ప్రో వెర్షన్‌ను తీసుకు రావడం విశేషం.ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్‌తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లున్నాయి.
నోకియా సీ 12 ప్రో ధర
భారతదేశంలో నోకియా సీ 12 ప్రో ధర బేస్ 2జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 చార్‌కోల్, డార్క్ క్యాన్ కలర్స్‌లో లభ్యం. ఇది నేరుగా నోకియా ఇండియా, ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు
నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్స్
6.3-అంగుళాల HD+ LCD ప్యానెల్
ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)
8 ఎంపీ రియర్ కెమెరా విత్ LED ఫ్లాష్
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,000 mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment