HMD Global
-
నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర
సాక్షి, ముంబై: బడ్జెట్ ఫోన్ల సంస్థ నోకియా మరోసారి తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అతి తక్కువ ధరలో నోకియా సీ 22 ఫోన్నుభారత మార్కెట్లోలాంచ్ చేసింది. మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్‌తో భారత దేశంలో విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్ గురువారం ప్రకటించింది. (BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్ ) దీని ధర రూ. 7999 గా నిర్ణయించింది. చార్కోల్, సాండ్, పర్పుల్ కలర్స్ లభ్యం. 4జీబీ ర్యామ్ 2 జీబీ వర్చువల్ స్టోరేజ్, 4జీబీ (2GB + 2GB RAM), 6జీబీ(4GB + 2GB వర్చువల్ RAM) 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లభించ నుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఏడాది రిప్లేస్మెంట్ గ్యారంటీతోపాటుఅందిస్తున్న నోకియా సీ 22 ఈ రోజు నుంచే( మే 11) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇంకా IP52గా రేట్ బ్యాటరీ సేవర్ ఫీచర్ , స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ: కేవలం రూ. 5వేలకే) నోకియా సీ-సిరీస్ నమ్మదగిన, సరసమైన స్మార్ట్ఫోన్లను అందించడంలో కస్టమర్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదని హెచ్ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో తెలిపారు. నోకియా సీ22 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ డిస్ప్లే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ 13 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 mAh బ్యాటరీ Introducing the all-new Nokia C22 comes with 4GB RAM + 2GB virtual RAM, 13MP dual rear camera, 1 year replacement guarantee and 3-day battery life to make you #LiveUntamed. Buy now: https://t.co/tKvqK84hWj#NokiaC22 pic.twitter.com/gVNg4kA7ki — Nokia Mobile India (@NokiamobileIN) May 11, 2023 -
నోకియా సీ12 ప్రో: అల్ట్రా-ఎఫర్డబుల్ స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) లాంచ్ అయింది. పలు కీలక ఫీచర్లతో, అందుబాటులో ధరలోఈ మొబైల్‌ను తీసు కొచ్చింది. నోకియా సీ12 లాంచ్ చేసిన వారం రోజుకే ప్రో వెర్షన్‌ను తీసుకు రావడం విశేషం.ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్‌తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లున్నాయి. నోకియా సీ 12 ప్రో ధర భారతదేశంలో నోకియా సీ 12 ప్రో ధర బేస్ 2జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 చార్కోల్, డార్క్ క్యాన్ కలర్స్‌లో లభ్యం. ఇది నేరుగా నోకియా ఇండియా, ఇతర ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్స్ 6.3-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) 8 ఎంపీ రియర్ కెమెరా విత్ LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 mAh బ్యాటరీ -
Nokia C12: నోకియా మరో బడ్జెట్ ఫోన్ లాంచ్, ధర చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై:నోకియా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. సీ సిరీస్‌లో భాగంగా సీ-12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను రూ. 5,999గా నిర్ణయించింది. నోకియా సీ 12 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.3అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ ర్యామ్ స్ట్రీమ్లైన్డ్ OS 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 12 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ఫో 3000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ మార్చి 17 నుండి ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. డార్క్ సియాన్, చార్కోల్ , లైట్ మింట్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. పెరుగుతున్న సైబర్ థ్రెట్ నేపథ్యంలో వినియోగదారులకు తమ సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు కనీసం రెండు సంవత్సరాల సాధారణ భద్రతా నవీకరణలను అందిస్తున్నమాని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ఇం(డియా & మెనా) సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు. Introducing the all new Nokia C12, with Octa core processor, 4GB RAM, Night and Portrait mode on front and rear cameras, and the trust of Nokia phones. Get your hands on Nokia C12 to be #FullOnConfident pic.twitter.com/sSmmIKDf1f — Nokia Mobile India (@NokiamobileIN) March 13, 2023 -
నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, మీరే రిపేర్ చేసుకోవచ్చు!
సాక్షి, ముంబై: నోకియా అద్భుతమైన ఫోన్‌ను పరిచయం చేసింది. రిపేరబుల్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసింది.రీసైకిల్ చేసుకునేలా ప్లాస్టిక్ బ్యాక్ కవర్, బ్యాటరీ మార్చుకునే అవకాశంతో తీసుకొస్తోంది. ఐఫిక్స్ట్ భాగస్వామ్యంతో టూల్స్, రిపేర్ గైడ్‌తో సహా అందిస్తోంది. తద్వారా యూజర్ ఫోన్ వెనుక కవర్, బ్యాటరీ, స్క్రీన్ ఛార్జింగ్ పోర్ట్‌ను రిపేర్ చేసుకోవచ్చు. డిస్ప్లే పాడైపోయినా, ఛార్జింగ్ పోర్ట్ వంగిపోయినా, లేదా బ్యాటరీ పాడైపోయినా, సరసమైన ధరల్లో సొంతంగా యూజర్లే మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. రిపేర్ గైడ్ సాయంతో ఇంట్లోనే మరమ్మతులు చేయడానికి రూపొందించిన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇది అని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ22 పేరుతో శనివారం బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు ముందు లాంచ్ చేసింది. జీ22లో ఆటో క్లీనప్ అని పిలువబడే ఆప్టిమైజేషన్ అసిస్టెంట్‌ను కూడా జోడించింది. నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ ప్రొఫెషనల్ రిపేర్ ఆప్షన్లతో పాటు ఫిక్సిట్ ద్వారా ఐదేళ్లపాటు "క్విక్ ఫిక్స్" రిపేర్ గైడ్స్, ఇతర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచుతుందని HMD గ్లోబల్ ప్రొడక్షన్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ అన్నారు. ఇందులోని బిగ్ బ్యాటరీ లైఫ్ మూడు రోజులట. Get to know the #NokiaG22 in just 30 seconds 👇 🔗 https://t.co/GSmtdWysKO pic.twitter.com/25adVyFTpD — Nokia Mobile (@NokiaMobile) February 25, 2023 మార్చి 8నుంచి యూకే లోసేల్స్ మొదలు. నోకియా జీ 22 ధర సుమారు రూ.15 వేలు (179.19 డాలర్లు) నోకియా జీ 22 ఫీచర్లు 6.53 అంగుళాల స్క్రీన్ ఆండ్రాయిడ్ 12 128జీబీ స్టోరేజ్ 50+2+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్ 5,050mAh క్విక్ఫిక్స్ రిపేరబుల్ బ్యాటరీ మరో రెండు ఫోన్లు కూడా ఒకటి కాదు రెండుకాదు మూడు అంటూ నోకియా జీ22, సీ32, సీ 2 ఫోన్లను ట్విటర్లో షేర్ చేసింది. HMD గ్లోబల్ పత్రికా ప్రకటన ప్రకారం నోకియా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. నోకియా సీ 32 6.5-అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 50+2 ఎంపీ రియర్ కెమెరా 5,000mAh బ్యాటరీ10 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చార్కోల్, ఆటం గ్రీన్ , బీచ్ పింక్ కలర్స్‌లో లభ్యం 2 జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర £129.99 వద్ద ప్రారంభం (సుమారు రూ.13 వేలు) నోకియా సీ22 6.5-అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 గో 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ 10W ఛార్జింగ్ సపోర్ట్ 2 జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధర £109.99 (సుమారు రూ. 11 వేలు) Say hello to not one, not two, but three new devices 🤩 👉 Nokia G22 👉 Nokia C32 👉 Nokia C22 pic.twitter.com/z2TpCZJVvZ — Nokia Mobile (@NokiaMobile) February 25, 2023 -
నోకియా ఎక్స్30 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర విని షాక్ అవ్వకండి!
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ 30 4జీ’ పేరుతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్, ప్రకటించింది. దీని ధర రూ. 48999. నోకియా అధికారిక వెబ్సైట్లో ఫిబ్రవరి 20 అందుబాటులో ఉంటుంది. నోకియా ఎక్స్ 30 4జీ ఫీచర్లు 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ Android 12, 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీజీ స్టోరేజ్ 50+13ఎంపిడ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,200ఎంఏహెచ్ బ్యాటరీ లాంచ్ ఆఫర్లు నోకియా వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు ఉచిత నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ విలువ రూ. 2,799 రూ. 2,999 33వాట్స్ ఛార్జర్ విలువ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ. 4000 తగ్గింపు -
నోకియా ఫ్లిప్ ఫోన్, అతి తక్కువ ధరలో
సాక్షి,ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా క్లామ్‌షెల్ డిజైన్‌తో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 2780 ఫ్లిప్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. క్వాల్కం పప్రాసెసర్, ఎఫ్ఎం రేడియో, వాట్సాప్,వైఫై సపోర్ట్‌తో, ఎరుపు, నీలం రెండు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లలో అందుబాటులో ఉన్న నోకియా 2780 ఫ్లిప్ ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంటుందా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక ధర విషయానికి వస్తే అమెరికాలో దీని ధర డాలర్లు. 89.99. ఇండియాలో సుమారు రూ. 7,400గా ఉండొచ్చని అంచనా. కాగా ఎంట్రీ-లెవల్ వినియోగదారులే లక్ష్యంగా బడ్జెట్‌ధరల్లో ఈ సిరీస్‌లో నోకియా 2660 ఫ్లిప్, నోకియా 2760లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నోకియా 2780 ప్లిప్ స్పెసిఫికేషన్స్ 1.77 అంగుళాల TFT స్క్రీన్ 2.7అంగుళాల TFT స్క్రీన్ క్వాల్కం 215 చిప్ సెట్ క్వాడ్ కోర్ సీపీయూ T9 కీబోర్డ్ డిజైన్ 5 ఎంపీ రియర్ కెమెరా విత్ ఫిక్స్డ్ ఫోకస్, LED ఫ్లాష్ 4జీబీ ర్యామ్, 512 ఎంబీ స్టోరేజ్ 1450 ఎంఏహెచ్ రిమూవల్ బ్యాటరీ -
నోకియా సంచలన నిర్ణయం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు స్వస్తి పలికేందుకు నోకియా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌ను నోకియా లాంచ్ చేసే ఆస్కారం లేదు. బడ్జెట్ ఫోన్లపై మొగ్గు..! నోకియా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను లేటుగా స్వీకరించినా..స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలోకి తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యింది. కాగా తాజాగా పలు దిగ్గజ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి నిలిపివేసేందుకు నోకియా సిద్దమైంది. వీటి బదులుగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఎక్కువగా దృష్టి సారించనుంది. ఇటీవల బార్సిలోనాలో ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022)లో బడ్జెట్ రేంజ్ Nokia C సిరీస్ ఫోన్స్‌ను ప్రకటించింది. దీంతో నోకియా నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌కు స్వస్తి పలకనున్నట్లుగా నిరూపితమైంది. హెచ్ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ... 800 డాలర్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్స్ తయారుచేయడం కష్టంతో కూడుకుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీటి సేల్స్ కూడా ఆశించిన మేర లేవని ఆడం వెల్లడించారు. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. బడ్జెట్ రేంజ్లో స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేస్తూ..5జీ సెగ్మెంట్లో గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...! -
ఐఫోన్లకే కాదు..ఇకపై నోకియా స్మార్ట్‌ఫోన్స్‌పై కూడా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ తన ఉత్పత్తులకు అందించే యాపిల్‌కేర్+ తరహాలో స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రోటక్షన్ ప్లాన్స్‌ను, వారంటీ ప్రొగ్రామ్‌ను నోకియా కూడా ప్రారంభించింది. దీంతో ఆయా నోకియా ఉత్పత్తులపై యూజర్లకు మరింత భద్రత లభించనుంది. మరింత భద్రంగా మీ స్మార్ట్‌ఫోన్స్..! నోకియా ఉత్పత్తులపై యాపిల్‌కేర్+ తరహాలో కొత్త ప్లాన్స్‌ను హెచ్ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది. అందుకోసం డివైజ్ మేనెజ్మెంట్ ప్లాట్‌ఫాం సర్విఫైతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా నోకియా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వారంటీ పొడగింపు, స్క్రీన్ ప్రోటెక్షన్ లభించనున్నాయి. ఈ సెఫ్టీ ప్రణాళికలను భారత్, USలోని నోకియా ఫోన్ వినియోగదారుల కోసం ఈ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. . ధరలు ఇలా..! హెచ్ఎండీ గ్లోబర్ తీసుకొచ్చిన సరికొత్త ప్రోటెక్షన్ ప్లాన్‌ను స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన 30 రోజుల్లో ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అమెరికాలో 12 నెలల పొడిగించిన వారంటీ ప్లాన్ ధర దాదాపు రూ. 750గా ఉండగా, భారత్‌లో రూ. 349 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్లాన్స్ నిర్ణీత సమయం వరకు వర్తించనున్నాయి. హెచ్ఎండీ ప్రతిపాదించిన ఈ ప్లాన్స్‌ను భారత్‌లో Servify వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా పొందవచ్చును. అయితే ఆయా హ్యాండ్సెట్ ప్రకారం ప్రొటక్షన్ ప్లాన్ల ధరలు ఉంటాయి. ఈ ప్రోటక్షన్ ప్లాన్‌లో భాగంగా నోకియా స్మార్ట్‌ఫోన్స్ ప్రమాదవశాత్తు కింద పడితే, లిక్విడ్ డ్యామేజ్ వారంటీ గడువు ముగిసిన తర్వాత ఏర్పడే బ్రేక్ డౌన్స్ వంటి వాటికి కవరేజీ వస్తోంది. వారికి మాత్రమే..! ఇటీవల కొనుగోలుచేసిన నోకియా స్మార్ట్‌ఫోన్స్‌పై మాత్రమే ఈ ప్రొటక్షన్ ప్లాన్ అందుబాటులో ఉండనుంది. ఫోన్ కొనుగోలుచేసిన 30 రోజులలోపు ఈ ప్రొటక్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి అర్హులు. ఈ మొత్తం ప్రక్రియకు 7 నుంచి 12 రోజుల సమయం పడుతుందని HMD పేర్కొంది. చదవండి: తక్కువ ధరలో వన్‌ప్లస్ నుంచి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్..! ఫీచర్స్ లీక్..! -
బాప్రే! ఇది నోకియా ‘బాహుబలి’
ఒకప్పుడు మొబైల్ ఫోన్ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్‌ని మార్కెట్లోకి తేనుంది. పూర్వ వైభవం కోసం ఒకప్పుడు ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్‌ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఫీచర్లతో ఎస్ఆర్ 20 మొబైల్‌ని నోకియా మార్కెట్లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ మొబైల్‌కి ఐపీ 68 సర్టిఫికేట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 480 ఇంటర్నల్ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్ అయ్యింది. స్నాప్‌డ్రాగన్ 480 చిప్సెట్ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్ఈడీ ఫ్లాష్‌లను ఇచ్చింది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. ప్రస్తుతం మార్కెట్లో 4కే డిస్ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్హెచ్డీ డిస్‌ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్’ పని చేసేలా డిజైన్ చేసింది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై ఈ మొబైల్ ఫోన్ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్‌కు సపోర్ట్‌గా 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్‌ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్ ప్రింట్ స్కానర్‌ని ఫోన్ డిస్పై వైపు కాకుండా పవర్ బటన్ ఉండే వైపున ఏర్పాటు చేసింది. ఆగస్టు 24న నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ని ఆగస్టు 24 మార్కెట్లో అమ్మకానికి రానుంది,. మొబైల్ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్‌కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని నోకియా తెలిపింది. -
నోకియా లవర్స్ కి గుడ్ న్యూస్
ఒకప్పుడు ఫీచర్ ఫోన్ల విభాగంలో టాప్ కంపెనీగా పేరొందిన నోకియా సంస్థ నుంచి ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు రానున్నాయి. గతంలో మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది నోకియా. కానీ తర్వాత మార్కెట్ లో పోటీ దృష్ట్యా తిరోగమనాన్ని చూసింది. నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన చివరి మినీ ల్యాప్‌టాప్ నోకియా బుక్లెట్ 3జీ ఇది 2009లో వచ్చింది. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నోకియా బ్రాండ్‌తో హెచ్ఎండి గ్లోబల్ సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్లో గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దింతో మన దేశంలో తిరిగి అధికారికంగా ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, నోకియా ల్యాప్‌టాప్‌లు ఒకే సిరీస్ కింద తొమ్మిది వేర్వేరు మోడళ్లలో రానున్నాయి. ఈ మోడళ్లు వచ్చేసి NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL41S, NKi310UL42S, NKi310UL82S, NKi310UL85S. ఈ ల్యాప్‌టాప్‌లకు సర్టిఫికేషన్ ఇచ్చినట్టు BIS వెబ్సైట్లో కనిపిస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచాన్ని నోకియా వెల్లడించలేదు. త్వరలోనే ఈ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయని నోకియామోబ్ వెబ్సైట్ తెలిపింది. ఇందులో ఐ5 ప్రాసెసర్‌తో ఐదు ల్యాప్‌టాప్ మోడళ్లను, i3 చిప్సెట్తో నాలుగు మోడళ్లను రూపొందించనట్లు అంచనా. ఈ పేర్లలో యుఎల్‌కు ముందు 10వ సంఖ్య ఉన్నందున ఈ ల్యాప్‌టాప్‌లు విండోస్ 10తో నడవనున్నాయి. మోడల్ నంబర్లలో మొదటి రెండు అక్షరాలైన ఎన్ కేలు- నోకియా బ్రాండ్‌ను సూచిస్తున్నాయి. తరువాతి అక్షరాలైన ఐ5, ఐ3లు ప్రాసెసర్‌ను సూచిస్తున్నాయి. బిఐఎస్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం నోకియా ల్యాప్‌టాప్‌లను చైనా కంపెనీ అయిన టోంగ్‌ఫాంగ్ లిమిటెడ్ తయారు చేసింది. నోకియా ఈ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేయడంపై అధికారిక ప్రకటన చేయలేదు. -
నోకియా 5.3 విక్రయాలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఇటీవల నోకియా ఆవిష్కరించిన బడ్జెట్ ఫోన్ ‘‘నోకియా 5.3’’ అమ్మకాలు సెప్టెంబర్ 1న ప్రారంభమైనట్లు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైస్ చైర్మన్ సన్మీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎఐతో శక్తివంతమైన క్వాడ్ కెమెరాను అందిచడంతో పాటు, స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై పనిచేసే తొలి నోకియా ఫోన్ ఇది. ఈ పండుగ సీజన్లో నోకియా అభిమానులు దీన్ని సొంతం చేసుకునేందుకు సుముఖత చూపుతారని విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు. అమెజాన్, నోకియా.కామ్/ఫోన్ వెబ్సైట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ రూ.13,999గానూ, 6జీబీ ర్యామ్/ 64జీబీ వేరియంట్ ధర రూ.15,499గానూ ఉన్నాయి. జియో సబ్స్క్రైబర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.4వేల విలువైన ప్రయోజనాలను రూ.349 ప్లాన్లపై పొందగలరు. అలాగే రూ.2వేల క్యాష్ బ్యాంక్, రూ.2వేల విలువైన వోచర్లను జియో అందిస్తుంది. (నోకియా దూకుడు : నాలుగు స్మార్ట్ఫోన్లు) -
నోకియా దూకుడు : నాలుగు స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లో నాలుగు కొత్త నోకియా స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, రెండు ఫీచర్ ఫోన్లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది. నోకియా 5.3 ఫీచర్లు 6.55-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్సెట్ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్ 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ధర 4 జీబీ ర్యామ్ బేస్ వేరియంట్‌కు రూ .13,999 6 జీబీ ర్యామ్ మోడల్‌కు రూ .15,499. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లు రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 2,000 రూపాయల క్యాష్‌బ్యాక్ , 2,000 రూపాయల విలువైన వోచర్లు ఉన్నాయి. నోకియా సీ 3 ఫీచర్లు 5.99అంగుళాల డిస్ప్లే 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 2 జీబీ/3 జీబీ ర్యామ్, 16 జీబీ/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3.5 మిమీ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో 3040 ఎంఏహెచ్ బ్యాటరీ ధర సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ చెయిన్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. 2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర 7,499 రూపాయలు 3 జీబీ / 32 జీబీ వేరియంట్ 8,999 రూపాయలు ఒక సంవత్సరం రీప్లేస్ మెంట్ గ్యారంటీ అందిస్తోంది. -
మళ్లీ మార్కెట్లోకి నోకియా 5310
హైదరాబాద్: హెచ్ఎమ్డీ గ్లోబల్ సంస్థ తాజాగా నోకియా5310 ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 2007లో నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ పేరుతో వచ్చిన ఫీచర్ ఫోన్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి అందిస్తున్నామని హెచ్ఎమ్డీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ. 3,399 అని తెలిపారు. ఈ ఫోన్లో ఇన్‌బిల్ట్ ఎమ్పీ 3 ప్లేయర్, వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, వెనక వైపు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన వీజీఏ కెమెరా. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 16 ఎమ్బీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. ఈ నెల 23 నుంచి నోకియా ఇండియా ఆన్లైన్, అమెజాన్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెల 23 నుంచి రిటైల్ స్టోర్స్‌లో లభ్యం కానున్నది. -
నోకియా ఫీచర్ ఫోన్ : సరికొత్తగా నేడే
సాక్షి, ముంబై: ప్రముఖమొబైల్ తయారీ దారు నోకియా మరోసారి తన క్లాసిక్ ఫీచర్ ఫోన్‌తో వినియోగదారును ఆకర్షించనుంది. నోకియా 5310 (2020) ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా సరికొత్తగా నేడు (మంగళవారం) లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో ఆవిష్కరించనున్న కొత్త నోకియా 5310 ధర తెలియాలంటే లాంచింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫీచర్లపై అంచనాలు: కొత్త నోకియా 5310 ఫీచర్ ఫోన్ 2007 వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది. 2.4అంగుళాల స్క్రీన్ , డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఎఫ్ఎం రేడియో, ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంబీ ర్యామ్, 32 జీబీ దాకా ఎక్స్ పాండబుల్ మెమరీ, వీజీఏ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
నోకియా 2.3 ఆవిష్కరణ
కైరో/ఈజిప్టు: ఫిన్లాండ్కు చెందిన నోకియా బ్రాండ్ ఫోన్స్ విక్రయ సంస్థ హెచ్ఎమ్డీ గ్లోబల్.. నోకియా 2.3 పేరిట అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదలచేసింది. దీని ధర 109 యూరోలు కాగా, భారత్‌లో రూ. 8,600 వరకు ఉండే అవకాశం ఉంది. 6.2 అంగుళాల డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు అధునాతన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్ జనరల్ మేనేజర్ ప్రణవ్ ష్రాఫ్ అన్నారు. -
నోకియా 6.2పై రూ.10వేల ఎక్స్చేంజ్ ఆఫర్
సాక్షి, ముంబై: నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఎ టెక్ ఫెయిర్‌లో మొదట హెచ్ఎండి గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో నోకియా 6.2 పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫుల్-హెచ్డి + డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. భారతదేశంలో నోకియా 6.2 ధర 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999. అమెజాన్‌లో నోకియా 6.2 (సిరామిక్ బ్లాక్ వెర్షన్ ) అమ్మకాలు మొదలయ్యాయి. ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 2,000 రూపాయలు క్యాష్‌బ్యాక్. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే 10,100 వరకు ఆఫర్‌ను అందిస్తోంది. నోకియా 6.2 ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్-హెచ్డి + డిస్ప్లే ఆండ్రాయిడ్ 9 పై ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 సాక్ 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 16+ 5 + 8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 2.2 లాంచ్..పరిమిత కాల ధరలు
నోకియా సంస్థ నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా 2.1 కి సక్సెసర్‌గా బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది షావోమి రెడ్మి 7కి గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. వాటర్‌డ్రాప్ నాచ్, ఏఐ ఆధారిత రియర్, సెల్ఫీ కెమెరాలు ప్రధాన ఆకర్షణ. నోకియా 2.2 ఫీచర్లు 5.71 అంగుళాల డిస్ప్లే 720×1520 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ పై 9.0 13ఎంపీ రియర్ కెమెరా 5 ఏంపీ సెల్ఫీ కెమరా 3000 ఎంఏహచ్ బ్యాటరీ లాంచింగ్ ఆఫర్: నోకియా 2.2 కొనుగోలు చేసిన జియో వినియోగదారులకు 2,200 క్యాష్‌బ్యాక్‌తోపాటు, 100 జీబీ డాటా ఉచితం. ప్లిప్‌కార్ట్, నోకియా తదితర ఈ స్టోర్ల ద్వారా జూన్ 11 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ప్రీబుకింగ్స్ నోకియా ఈ స్టోర్ల ద్వారా నేటి నుంచే ప్రారంభం. ధరలు 2జీబీ ర్యామ్ /16జీబీ స్టోరేజ్‌ధర రూ. 6,999 3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999 ఈ ధరలు పరిమిత కాలానికి మాత్రమే పరిమితం. జూన్ 30 తరువాత నోకియా 2.2 ధరలు ఇలా ఉండనున్నాయి. 2జీబీ ర్యామ్ /16జీబీ స్టోరేజ్‌ధర రూ. 7,699 3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,699 -
నోకియా 6.2 కమింగ్ సూన్
నోకియా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. నోకియా 6.2 పేరుతోహెచ్‌ఎండీ గ్లోబల్ జూన్ 6న మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఈ మేరకు నోకియా ఒక టీజర్‌ను వదిలింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, తదితర పూర్తి వివరాలను అందించనప్పటికీ జూన్ 6వ తేదీన ఒక ఈవెంట్లో ఒక గ్లోబల్ ఇటలీ, ఇండియా మార్కెట్లలో) లాంచ్ ఉండబోతోందని తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20200గా ఉండవచ్చని అంచనా. ఫీచర్లపై వివిధ అంచనాలు ఇలా ఉన్నాయి. #GetAhead with a sleek design & customizability. Stay tuned! 👉 06 June 2019 pic.twitter.com/hBUVc1BpGa — Nokia Mobile (@NokiaMobile) June 1, 2019 నోకియా 6.2 ఫీచర్లు 6.39 అంగుళాల ఫుడ్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9పై 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48+8+5 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్పీ కెమెరా 3500బ్యాటరీ See things in a new light on 06 June 2019. 😎 Stay tuned to #GetAhead in life. pic.twitter.com/Jy01t9Zyp5 — Nokia Mobile (@NokiaMobile) May 30, 2019 -
స్మార్ట్ ఫీచర్స్, బడ్జెట్ ధర : నోకియా రెండు స్మార్ట్ఫోన్లు
మొబైల్స్ తయారీదారు నోకియా హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. మే 7న కొత్త నోకియా 4.2, నోకియా 3.2 పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ధర వివరాలను అధికారికంగారీవీల్ చేయనప్పటికీ బడ్జెట్ ధరలోనే వీటిని అందుబాటులోకి తేనుందని సమాచారం. నోకియా 3.1కి కొనసాగింపుగా 3.2, నోకియా 4 సిరీస్‌లో 4.2ను తీసుకొస్తోంది. నోకియా 4.2 ఫీచర్లు 5.71 ఇంచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0 పై 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 13+ 2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 3.2 ఫీచర్లు 6.26 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 429 2/3 జీబీ ర్యామ్,16/32 జీబీ స్టోరేజ్ 13 ఎంపి రియర్ కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ All your answers are a tap away. 4 days before you can #DoItAll Stay tuned! pic.twitter.com/r4Jwsxj744 — Nokia Mobile India (@NokiamobileIN) May 3, 2019 -
5 కెమెరాల నోకియా ఫోన్ వచ్చేస్తోంది!
ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదరు చూస్తున్న నోకియా పెంటా కెమెరా నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ అతి త్వరలోనే భారత మార్కెట్లో రిలీజ్ కానుంది. హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా అదిరిపోయే ఫోన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదు రియర్ కెమెరాలతో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్టు గతంలోనే నోకియా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న 5 ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి బ్యూరో ఆప్ బిజినెస్స్టాండర్డ్ (బీఐఎస్) సర్టిఫికెట్‌ను పొందినట్టుత తెలుస్తోంది. ఇక ఫీచర్ల విషయంలో అంచనాలు ఇలా ఉన్నాయి. నోకియా 9ఫ్యూర్ వ్యూ ఫీచర్లు 6 అంగుళాల క్యూహెచ్డీ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12 ఎంపీ పెంటా రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4150 ఎంఏహెచ్ బ్యాటరీ 2019 ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో పరిచయం చేసిన నోకియా 9 ప్యూర్ వ్యూ ధర దాదాపు రూ.50 వేలుగా ఉండవచ్చని అంచనా. -
అద్భుత ఫీచర్లతో నోకియా ఎక్స్ 71
అద్భుత ఫీచర్లతో నోకియా సంస్థ మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా బ్రాండ్‌పై పలు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరిస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ మంగళవారం తైవాన్‌లో జరిగిన కార్యక్రమంలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హోల్ పంచ్ డిస్ప్లేతో తొలి స్మార్ట్‌ఫోన్ కాగా, రియర్ ట్రిపుల్ కెమెరా ముఖ్యంగా 48 ఎంపీ భారీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దీని ధరను 11,900 తైవాన్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 26700. అక్కడి ఏప్రిల్ 30నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. అయితే, భారత్‌లో నోకియా ఎక్స్ 71 స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేసేదీ కంపెనీ స్పష్టం చేయలేదు. నోకియా ఎక్స్71 ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0 స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ వరకూ విస్తరించుకునేఅవకాశం 48+5+8 రియర్ ట్రిపుల్ కెమెరాలు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోకి షాక్ : నోకియా ఫీచర్ ఫోన్
హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా మరో ఫీచర్ ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019లో విడుదల చేసింది. నోకియా 210 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్‌ను బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉంచింది. 2జీ సపోర్టు, డ్యుయల్ సిమ్ సదుపాయం ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఫేస్బుక్ తోపాటు రెగ్యులర్ స్నేక్ గేమ్‌ను కూడా ఇందులో పొందుపర్చింది. చార్కోల్, రెడ్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ మొబైల్ ధర సుమారు రూ.2,500. వచ్చే వారం ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. నోకియా 210 ఫీచర్లు 2.4 ఇంచుల డిస్ ప్లే 2జీబీ ర్యామ్,16 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ వీజీఏ రియర్ కెమెరా విత్ ఫ్లాష్ ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ 1020 ఎంఏహెచ్ బ్యాటరీ 20 రోజుల స్టాండ్ బై టైం, మైక్రో యూఎస్బీ పోర్టు తదితర ఫీచర్లు నోకియా 210 సొంతం. అయితే భారత్ మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. -
నోకియా 5.1ప్లస్.. ఎయిర్టెల్ ఆఫర్
సాక్షి, ముంబై : హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 5.1 ప్లస్ మోడల్లో అధిక ర్యామ్, స్టోరేజీతో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు 3జీబీ ర్యామ్, 32 జీబీ రామ్ మోడల్ మాత్రమే ఉండేది. తాజాగా 4జీబీ/64జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లను కూడా తీసుకొచ్చింది. ‘నోకియా 5.1 ప్లస్‌ను యూజర్లు ఎంతో అభిమానిస్తున్నారు. దీనికి అనుకూలంగా వారు ఎన్నో వేదికల్లో రేటింగ్ కూడా ఇస్తున్నారు. కనుక అధిక సామర్థ్యంతో కూడిన రకాలను తీసుకొచ్చినట్టు’ హెచ్ఎండీ గ్లోబల్ దేశీయ అధిపతి అజేయ్ మెహతా తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్రాయిడ్ వన్ తదితర బెస్ట్ ఫీచర్లతో మంచి పనితీరుతో ఉంటుందన్నారు. బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, నోకియా స్టోర్లలోఈ స్మార్ట్ఫోన్లు లభ్యం. మరోవైపు ఎయిర్టెల్ వినియోగదారులకు రూ.2వేల క్యాష్‌బ్యాక్‌తోపాటు 240 జీబీ అదనపు డేటా కూడా లభించనుంది. నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు 5.8 అంగుళాలా నాచ్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్ 720×1520 పిక్సెల్స్ రిజల్యూషన్ 13+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 3060 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6జీ/64జీబీ మోడల్ ధర రూ.16,499 4జీబీ/64జీబీ వెర్షన్ ధర రూ.14,499 -
నోకియా నుంచి మరో ఫోన్
హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా 106 మోడల్ ఫీచర్ ఫోన్‌ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి బ్యాటరీ లైఫ్, చూడ్డా నికి సింపుల్‌గా, మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 17.7 గంటల టాక్‌టైమ్, 21 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రో యూఎస్బీ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. డార్క్ గ్రే రంగులో లభించే ఈ ఫోన్ ధర రూ.1,299. -
ప్రపంచంలో ఏడు కెమెరాలతో తొలి స్మార్ట్‌ఫోన్