నోకియా 2.3 ఆవిష్కరణ | HMD Global Launches Nokia 2 Point 3 Bets Big On Indian Market | Sakshi
Sakshi News home page

నోకియా 2.3 ఆవిష్కరణ

Published Sat, Dec 7 2019 5:19 AM | Last Updated on Sat, Dec 7 2019 5:19 AM

HMD Global Launches Nokia 2 Point 3 Bets Big On Indian Market - Sakshi

కైరో/ఈజిప్టు: ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ ఫోన్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌.. నోకియా 2.3 పేరిట అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదలచేసింది. దీని ధర 109 యూరోలు కాగా, భారత్‌లో రూ. 8,600 వరకు ఉండే అవకాశం ఉంది. 6.2 అంగుళాల డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు అధునాతన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రణవ్‌ ష్రాఫ్‌ అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement